Pages

Sunday, 29 September 2013

ప్రసాదం అనగా ఏమి?ఆరాత్రికం (ఆరతి) ఎందుకు?




ప్రసాదం: పూజలలో అభిషేకింపబడిన, 

నివేదింపబడినవన్నీ తుదకు ప్రసాదంగా 

పంచిపెట్టబడతాయి. ప్రసాదం మన దేహాలను 

పవిత్రీకరిస్తుందని విశ్వాసం. అదేకాక ప్రసాదం అనే 

సంస్కౄత పదానికి అనుగ్రహం అని అర్థం. అందుచేత 

ప్రసాదం పుచ్చుకోవడం భగవంతుని అనుగ్రహం 

పొందడమవుతుంది.

ఆరాత్రికం (ఆరతి): ధూపం, దీపం ఇత్యాదులను దైవ 


సమక్షంలో చూపించే క్రియ ఇది. ఈ సమయంలో 

విగ్రహంలో దైవం ఉనికి విశిష్టంగా అభివ్యక్తీకరణ 

చేసుకుంటుందని భక్తుల విశ్వాసం. సామన్యంగా ఆరతి 

సమయంలో గంట, శంఖం వంటి వాటిద్వారా నాదం 

వెలువరింప చేస్తారు. అందువల్ల ఆ వేళలో మనస్సు 

ఏకాగ్రమై దైవచింతనకు దోహదం చేస్తోంది.

‘హారతి ఇతి హారతీ – దౄష్టిదోషాన్ని హరించేది హారతి. 


అందుకే దాన్ని నీరాజనం అని కూడా అంటారు. 

దేవుడిపైన దర్శించాడానికి వచ్చిన ఎంతోమంది దౄష్టి 

పడుతుంది. ఆ దౄష్టి దోషం తొలగడానికి అర్చకులు 

హారతి ఇచ్చి, భక్తులందరికీ చూపెడతారు. అప్పుడు 

అక్కడ ఉన్న భక్తులందరూ ఆ హారతికి దణ్ణం 

పెట్టుకోవాలి 

భక్తిగా. చిన్నపిల్లలకు, శుభ కార్యాల్లోనూ హారతితో 

దిష్టితీసి పెరట్లో ఓ మూల పడేస్తారు. అలాగే దేవుడికి 

మంగళం కలగాలని హారతి ఇచ్చి, శ్లోకాలు చదివి, ఆ 

హారతిని ఒక పక్కన పెడతారు. ఇది సరైన పద్ధతి.