Pages

Sunday, 29 September 2013

మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు. ఎందుకు?

తీర్థం

మనం ఆలయానికి స్వామి దర్శనానికై వెళ్లినప్పుడు, పురోహితులు ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్ష్యకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం’ అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు. రాకూడని కాలంలో మృత్యువుతో సమానమైన బాధ రాకుండా ఉండేందుకై, సమస్త వ్యాదుల నివారణకు, సమస్త పాపాలనుండి బయట పడటానికి, పరమేశ్వరుని పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని అర్థం. స్వామికి పంచామృతాలతో స్నానాన్ని చేయించగా వచ్చిన తీర్థం కాబట్టి, ఓ విధమైన ఔషధ శక్తిని పొందిన దీనిని నీరు అని పిలువకుండా ‘తీర్థం’ అని అన్నారు. ఈ తీర్థంలో పవిత్ర మంత్ర శక్తి ఉంటుంది. అది మనకు శుభం కలిగిస్తుంది.