Pages

Sunday, 29 September 2013

గ్రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ-నవగ్రహ ప్రదిక్షిణ

గ్రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ 

నవగ్రహ ప్రదక్షిణలు. వీటివల్ల ఉత్పన్నమయ్యే దైవికశక్తి మనిషిని కాపాడుతుంటుంది. నిర్దిష్టమైన 

పధ్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుంది.
చాలామంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను తాకి నమస్కారాలు అర్పిస్తుంటారు. వీలైనంతవరకూ 

వాటిని తాకకుండానే ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

నవగ్రహాల మధ్య తేజస్వి ఐన సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు. సూర్యుని ముందు శుక్రుడు 

కూడా తూర్పుముఖముగా ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కుజుడు దక్షిణాభిముకంగా ఉంటాడు.

శుక్రునికి కుడివైపు పడమర ముఖంగా చంద్రుడు ఉండగా, ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా 

ఉంటాడు. సూర్యునికి వెనుకవైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శనికి 

ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపు కేతువు దక్షిణాభిముఖంగానూ, ఒకరిని 

ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ప్రశస్తమైన ప్రతిష్ట.

సూర్యునిచూస్తూ లోనికి ప్రవేశించి ఎడమ వైపునుండి (చంద్రునివైపు నుండి)  కుడి ప్రక్కకు తొమ్మిది 

ప్రదక్షణలు చెయ్యడం శ్రేష్టం. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడి వైపు నుండి ఎడమవైపునకు 

(అనగా బుధుడి వైపు నుండి) రాహువునూ కేతువునూ స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా వరుసగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, కుజుడిని, బుధుడిని, బృహస్పతిని, శుక్రుడిని, శని 

మహాత్ముని, రాహువును, కేతువును, స్మరిస్తూ ఒక్కక ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వీపు చూపకుండా 

వెనుకకు రావాలి.

గ్రహదోషాల నుండి తప్పుకోవడానికి నవగ్రహప్రదక్షిణ కంటే ఉత్తమమయిన మార్గం లేదన్నది స్పష్టం