Pages

Monday, 23 September 2013

మృదువైన పెదాలకోసం

lips-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaశీతాకాలంలో చర్మ సంరక్షణ జాగ్రత్తలు సరేసరి.. మొహంలో సున్నితభాగాలైన పెదాలు, కళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపల్సి ఉంటుంది. ఈకాలంలో పెదాలు తొందరగా పొడిబారతాయి. ఎన్ని లోషన్స్ రాసినా కొద్దిసేపటికే పొడిబారిపోతాయి. మరి ఈ చలికాలంలో మీ పెదాలు నునుపుగా మెరిసిపోతూ ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్న సలహాలు చూద్దాం. 


-పెదాలలో నూనెక్షిగంధులు లేకపోవడం వల్ల తొందరగా చిట్లిపోవడం, పొడిబారడం జరుగుతుంది. తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి.
-ప్రతిరోజూ పడుకునేముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి.
-ఎప్పుడూ పెదాలను పొడిగా వదిలేయకుండా, నాణ్యత కలిగిన లిప్ లోషన్ తీసుకుని తరచూ పెదాలకు అపె్లై చేయాలి.
-పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
- బ్లాక్ టీ బ్యాగ్‌ను గోరు నీటిలో ముంచి రెండు మూడు నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది.
- ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని నీళ్లు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.
- నడుం భాగాన పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.

ఉపయోగాలు :
4 సూర్యభేదన ప్రాణాయమం వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది.
4 శరీరంలో వేడి పెరుగుతుంది.
4 చంద్రభేదన ప్రాణాయామం వలన మెదడు శాంతిస్తుంది.
4 శరీరము చల్లబడుతుంది.

జాగ్రత్తలు: 
4 హైబీపీ ఉన్నవారు, గుండెజబ్బులు ఉన్నవారు సూర్యభేదన ప్రాణాయమం చేయకూడదు.
Other News