Pages

Monday, 23 September 2013

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. వాటితో జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు

french braid hairstyles
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. వాటితో జుట్టుక నిగారింపు ఇవ్వొచ్చు. చుండ్రు, జుట్టురాలడం తగ్గించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
- ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకుపొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది.

- చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి కప్పు, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టీ, కప్పు పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడడమే కాదు, చుండ్రు బాధ నుంచి దూరమవ్వచ్చు.

- మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి ఒక్కొక్క కప్పు తీసుకొని దాంట్లో అరకప్పు శనగపిండిని కలపాలి. దాన్ని మాడకు పట్టించాలి. 20నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని పెట్టుకునే ముందు తలకు నూనె పెట్టుకోవాలి.

- ముందు తలకు నూనె పెట్టుకొని మర్దనా చేయాలి. ఇప్పుడు అవిసె ఆకులు రెండు కప్పులు, గోరింటాకు కప్పు, ఉసిరిపొడి అరకప్పు వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇది వేడిని దూరం చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది.

- గోరింటాకు పొడిలో ఒక స్పూన్ లవంగాలపొడి, కప్పు డికాషన్, కోడిగుడ్డు, కొంచెం పెరుగు, ఒక స్పూన్ ఆముదం నూనె కలిపి తలకు పెట్టుకోవాలి. 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఆ తర్వాత నూనె రాసి మర్దనా చేసుకోవాలి. దీనివల్ల తెల్ల జుట్టు మంచి రంగు వస్తుంది. అంతేకాదు, జుట్టు రాలకుండా ఉంటుంది.