Pages

Saturday, 28 September 2013

మామిడి (ఆమ్ర) లో ఔషధవిలువలు



పిందె... కషాయరసం (వగరు), కాయ... ఆమ్లరసం (పులుపు), పండు... మధురరసం (తీపి) దీని బెరడు, ఆకులు, పువ్వులను... కషాయంలా కాచి తాగితే కఫం తగ్గుతుంది. గొంతులో మంటను పోగొడుతుంది. విరేచనాలు తగ్గుతాయి చక్కగా పక్వమైన పండు హృద్యం, వృష్యం(శుక్రవర్థకం). చర్మకాంతికరం, బల్యం, వాతహరం మృదువిరేచనం మామిడి ఒరుగులు (ఎండబెట్టి తయారుచేస్తారు) మలబంధాన్ని పోగొడతాయి మామిడితాండ్ర (ఆమ్రావర్తం) రుచిని కలిగిస్తుంది. దప్పికను (తృష్ణ), వాంతులను తగ్గిస్తుంది. పుష్టికరం జీడి (ఆమ్రబీజం) ని ఎండబెట్టి పొడిచేసి సేవిస్తే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట (అమ్లపిత్తము) తగ్గుతాయి. స్త్రీలలో తెల్లబట్ట (శ్వేతప్రదర) వికారం పోతుంది ఆమ్రపల్లవం (లేతమామిడిచిగురు) కషాయం సేవిస్తే స్వరభంగం, వమనం, అతిసారం తగ్గుతాయి ఆమ్రపత్రాల (పెద్ద లేక లేత ఆకులు) కు సూక్ష్మాంగక్రిములను ఆకర్షించి, నశింపచేసే గుణం ఉంది. పూర్తిగా పక్వం కాని పండు వల్ల అజీర్ణం, మలబంధం వంటి వికారాలు కలుగుతాయి.