Pages

Wednesday, 23 October 2013

ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరో మీకు తెలుసా ( కోటి అనగా సమూహము )

ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరో మీకు తెల్సా
అయితే వారి పేర్ల్లు వరుసక్రమంలో రాసుకోండి.
దేవతల వైద్యులైన అశ్వనీదేవతలు ఇద్దరు. అష్టవసు వులైన ధరుడు, ధృవుడ, సోముడు, ఆహుడు, అనిలుడు, అగ్ని,ప్రత్యూషుడు, ప్రభానుడు (భీష్ముడు) ఏకాదశ రుద్రులైన ఆజుడు, ఏక పాదుడు, అహిరభద్న్యుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, త్వష్ట,రుద్రుడు. ద్వాదశ ఆదిత్యులు దాత, మిత్రుడు, ఆర్యముడు, శక్యుడు, వరుణుడు, అంశుమంతుడు, వివస్యంతుడు, భంగుడు, పూషుడు, సవిత, త్యష్ట, మహావిష్ణువు ఇలా ముపైమూడు మంది దేవతలూ ఒక్కొరూ ఒక్కోకోటిగా
మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.