Pages

Saturday, 5 October 2013

మంచి సంగీతంతో ఆరోగ్యం...గాఢనిద్ర



మంచి సంగీతం, విషాద గీతాలు కాదండోయ్‌... హుషారెత్తించే సంగీతం వింటుంటే మీలోని మానసిక ఒత్తిడి చాలా రకు దూరమవుతుంది. సంగీతం వింటే శరీరంలో సంతోషానికి సంబంధించిన రసాయనం సిరోటిన్‌ శాతం పెరుగుతుందంటున్నారు వైద్యులు. 

శరీరంలో ట్రాయిటోఫన్‌ రసాయనం కూడా ఉంటుంది. ఇది సంగీతం వినడం ద్వారా శరీరంలోని ఒత్తిడి దూరమై మంచి నిద్ర వస్తుంది. సంగీతం వినడంతో మీ శరీరంలోని కొన్ని జబ్బులు ఉదాహరణకు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు శరీరంలో నొప్పి ఏదైనా ఉంటే సంగీతం నివారణోపాయంగా పని చేస్తుంది. 
సాయంత్రం మీ పనులు ముగించుకుని కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీలో ఉన్న అలసటను తొలగించికునేందుకు ఈవెనింగ్‌ రాగాన్ని వినండి. సంగీతం వినడం మనోరంజకమైన కార్యక్రమంతోపాటు మీరు ఒంటరిగా ఉన్నారనే భావన మరియు శరీరంలోని ఒత్తిడి కూడా తగ్గుతుంది. 
మ్యూజిక్‌ థెరపీ ఉపయోగించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌, కాల్‌ సెంటర్‌లలో పని చేసే ఉద్యోగులతోపాటు మీడియాకు చెందిన ఉద్యోగులు మ్యూజిక్‌ థెరపీని ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో తెలిసింది. 
అతి తక్కువ సమయంలో పనిని పూర్తి చేయడం, తమకిచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయడంతో శారీరకపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తమ పనిలో పోటీ పెరగడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి సమయంలో కోపం త్వరగా వస్తుంటుంది. దీనికి విరుగుడుగా మనిషి సంగీతం వింటుంటే ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 
మానసికపరమైన ఒత్తిడితో ఎవ్వరుకూడా జీవించాలని అనుకోరు. కాని ఇంట్లోని పలు సమస్యలతో ఒత్తిడి రావచ్చు. అదే కార్యాలయంలోని పనుల కారణంగా ఒత్తిడి పెరిగే సూచనలున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. 
ప్రస్తుతం చాలామంది అతి చిన్న వయసులోనే ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడి నుంచి ఉపశమ నం పొందేందుకుగాను తమ వద్దకు వచ్చి మ్యూజి క్‌ థెరపీని కొనసాగిస్తున్నారని ఓ సంస్థ తెలిపింది.