Pages

Saturday, 5 October 2013

గుండె జబ్బులను నివారించే మిరపకాయలు


చాలామంది తమ ఆహారంలో మిరపకాయ వస్తే వెంటనే దానిని కారమని తీసేస్తుంటారు. కాని అదే మిరపకాయ మీ ఆరోగ్యానికి లాభదాయకం అంటే తింటారు కదూ... నిజమేనండి. మనం నిత్యం తీసుకునే ఆహారంలో మిరప కాయలు వస్తే వాటిని తీసి పడేయకండి.

తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ప్రతి రోజూ మిరపకాయ తింటుంటే గుండెజబ్బులు, మధుమేహ వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియాకు చెందిన తాస్మానియా విశ్వవిద్యాలయం తెలిపింది. పరిశోధనలకు నేతౄఎత్వం వహించిన డాక్టర్‌. కిరణ్‌ అహుజా మాట్లాడుతూ... మిరపకాయలు తీసుకోవడం వలన మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు రావని తేలిందన్నారు. ఇందులో క్యాప్సైసిన్‌ మరియు డీహైడ్రోక్యాప్సైసిన్‌లుండటం వలన బ్లడ్‌ షుగర్‌ లేదా గ్లూకోజ్‌ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిని స్థిరంగా ఉంచి ధమనుల గోడలలో పేరుకుపోయి ఉన్న కొవ్వును ఇది తొలగిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టి ఉంటే కూడా దానిని నివారించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.