Pages

Saturday, 5 October 2013

అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుంటే...



అనాసపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు.. పైనాపిల్‌లో అందచందాలను ఇనుమడింపచేసే శక్తి ఉందని బ్యూటీషన్లు అంటున్నారు. అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్దన చేసుకుంటే మఖ చర్మం కోమలంగా మారుతుంది. బిగుతుగా తయారవుతుంది. అనాసపండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. నల్ల మచ్చలను కూడా నివారిస్తాయి.క్యారెట్‌ రసం, అనాసరసం సమపాళ్ళలో తీసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం ప్రకాశవంతమవుతుంది. అనాస ఫేస్‌ ప్యాక్‌గా కూడా వాడవచ్చు. బాదం పప్పుల పొడికి, ఒక స్పూన్‌ పాలు, ఒక స్పూన్‌ అనాస పండు రసం కలిపి తయారు చేసుకున్న ముద్దను ఫేస్‌ ప్యాక్‌గా పెట్టుకుని అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశాన్ని సంతరించుకుంటుం