Pages

Wednesday, 9 October 2013

రోజూ ఉదయం లేస్తూనే అర లీటరు తక్కువ కాకుండా నీరు తాగాలి


మంచినీరంటే స్వచ్ఛమైన నీరు. దీనికి రంగు, రుచి, వాసన వుండదు. నీళ్లను బాగా మరిగించి, చల్లార్చి, వడబోసి తాగడం మంచిది. వీలుంటే జీరో బ్యాక్టీరియా వంటి ఫిల్టరులోవేసి తాగితే ఇంకా మంచిది. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగితే మంచిది. ఎండాకాలంలో 4 నుండి 5 లీటర్లు తాగాలి. శీతాకాలంలో స్వేదగ్రంథుల ద్వారా నీరు ఎక్కువగా బయటికి విసర్జితమవదు. ఎండాకాలంలో స్వేదగ్రంథుల ద్వార ఎక్కువ నీరు విసర్జించబడుతుంది. అందుకే ఎండాకాలంలో నీరు ఎక్కువగా తాగాలి. రోజూ ఉదయం లేస్తూనే అర లీటరు తక్కువ కాకుండా నీరు తాగాలి. ప్రతీ జీవకణం బాగా తనపని నిర్వర్తించాలంటే నీరు ముఖ్యం. దీంతో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అంటే దానిలో ముఖ్య పోషక పదార్థాలు అన్ని అవయవాలకు చేరాలంటే, ఆక్సిజన్‌ అన్నిటికీ సరఫరాకావాలంటే, రక్తం పల్చగా, సరిగా ప్రవహించాలంటే నీరు ముఖ్యం. మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి చర్మంలోని స్వేదగ్రంథులు సరిగ్గా పనిచేసేందుకు చర్మం నిగనిగలాడాలంటే, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా అరికట్టడానికి నీరు ముఖ్యం.
ఉదయం లేవగానే తప్పకుండా  నీరు త్రాగడం ద్వారా జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలను ఎక్కువ మొత్తంలో కిడ్నీలు శుద్ధిచేస్తాయి.
అంతేకాదు లావుగా ఉన్నామని బాధపడేవారు ఎక్కువగా నీటిని తీసుకుంటే నీరు క్రొవ్వును కరిగిస్తుంది. 
నీరు సరిగా త్రాగని వారు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారప దార్థాలను త్వరగా జీర్ణించుకోలేరు. 
మామూలుగా కన్నా ఎక్కువ బరువున్నవారు ప్రతి పది కిలోలకు ఒక గ్లాసు ఎక్కువ నీరు త్రాగాలి. 
మన కండరాలను పటిష్టం చేయడంలో, చర్మం నిగారింపులో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. 
ప్రతి మనిషి రోజుకు సగటున 8-10 గ్లాసుల మంచినీరు త్రాగాలి. 
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా కనీసం రోజుకు 2- 3 లీటర్లు నీటిని త్రాగించాలి. 
నీరు ఎక్కువగా త్రాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడం, తద్వారా ఆయుష్షు పెరగడం తథ్యం.
ఆయుష్షును పెంచేది కనుకే నీటిని అమృతం అన్నారేమో. 
అందుకే మీరు డాక్టర్‌ సలహా ప్రకారం రోజూ ఎక్కువ నీటిని త్రాగడం అలవాటు చేసుకోండి.ఎక్కడైనా బయటికేళ్లేటప్పుడు ఒక బాటిల్‌లో నీరు తీసుకెళ్లడం మాత్రం మరువకండి.బయట లభించే నీటిని సాధ్యమైనంత వరకూ తీసుకోవడం తగ్గించండి. నీరు బాగా త్రాగితే మీ ఆరోగ్యం మరింత బాగుంటుందని గుర్తుంచుకొండి.
శరీరానికి అవసరం లేని ఉప్పును కరిగించి దాన్ని కిడ్నీల ద్వారా నీటి రూపంలో బయటికి పంపాలన్నా ఎక్కువ నీరు త్రాగడమే ఉత్తమం. అవసరం కూడా.