Pages

Wednesday, 9 October 2013

విటమిన్ 'డి' తక్కువైతే..


Picture
    శరీరంలో విటమిన్ 'డి' తక్కువైతే వచ్చే నష్టాలు అన్నీఇన్నీ కావు. దీన్ని పెంచుకోవడానికి.. పాలు తాగడం, సప్లిమెంట్లు తీసుకోవడం, ఉదయపు ఎండ పడేలా చూసుకోవడం అందరూ చేసే పనే! 

              ఇవే కాకుండా మరికొన్ని రకాల తిండి వల్ల కూడా 'డి' విటమిన్‌ను పెంచుకోవచ్చు.
రెండ్రోజులకు ఒకసారి చేప తింటే మంచిది. సాల్మన్, టునా వంటి చేపల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ చేపలు మనకు దొరక్కపోయినా ఫర్వాలేదు. సాధారణ చేపల్ని తిన్నా ఈ ఫలితం లభిస్తుంది.
పుట్టగొడుగులతో కూడా 'డి'ని పొందవచ్చు.
ఆరంజ్‌జ్యూస్‌లోనూ ఈ రకమైన విటమిన్ దొరుకుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.
అందరికీ అందుబాటులో ఉండే గుడ్డు కూడా ఇందుకు ఉపకరిస్తుంది.
మాంసం తీసుకునేవాళ్లయితే.. లివర్ తింటే మంచిది.