Pages

Tuesday, 22 October 2013

కుల గోత్రాల పరమార్ధం .

కుల గోత్రాలు  ఆ కులం  గుణాలను లక్షణాలను ,అనువంశిక శరీర మానసిక ధర్మాలను నిర్నయిస్తాయి .


కులానికి  ఒక నిర్దిష్టమైన జన్యు సంపద ఉంటుంది ., అలాగే గోత్రానికి  ,ఇంటి పేరుని బట్టి  ఒక ప్రత్యేక మైన జన్యు సంపద ఉంటుంది .

అందుకే మన పూ ర్వీకులు , మను ధర్మ శాస్త్ర వేత్తలు ,ఋషులు, కుల గోత్రాలకు  అంతగా ప్రాముఖ్యతనిచ్చారు .

ఒక జాతి లేదా వంశ  సంపదలో జన్యు సంపద అతి ముఖ్య మైనది . ఆ జన్యువులు కల్తీ కాకుండా ఎ న్నో

నియమాలు  ,కట్టు బాట్లు పెట్టి  వర్న వ్యవస్థ ఏర్పర చారు .

జీవ వైవిధ్యం , జీవ సంపద రక్షణ , వ్యాధులు లేని ఆరోగ్య మైన  మనిషి జాతి ప్రవర్ధనం , ప్రకృతిని కాపాడు కోవాలనే

దీక్ష  - ఇవీ కుల గోత్రాల పరమార్ధం . జన్యు వారసత్వాన్ని కాపాడు కోవటం అతి ముఖ్యమైన విధి .

తర్వాత కాలంలో కుల వ్యవస్థ ర క రకాల వెర్రి తలలేసి మానవుల మధ్య చిచ్చు పెట్టే  ఆయుధంగా మారింది .

మనుషులను గుంపులుగా విడదీస్తుంది .కులం కత్తి  లాంటిది .

మంచికీ , చెడుకి ఎలాగైనా వాడుకొనే శక్తి కులానికి ఉంది .

 కులాన్ని మారనాయుధంగా వాడు కొంటే  ఎన్ని అనర్ధాలు  కలుగుతాయో మనందరికీ తెలుసు .

అలాగని  కుల వ్యవస్థను  విడనాడినా ప్రయోజనం శూ న్యం .

మనిషులను విడ దీయటానికి  మతమో , వర్గమో ఎదో ఒకటి మనిషి ఎన్నుకొంటాడు .