Pages

Tuesday, 22 October 2013

శాంతంగా ఉందాం . సంతోషం గా ఉందాం .


ప్రతి ఒక్కరూ శాంతిగా ,సుకంగా ,సంతోషంగా ఉండాలను కొంటారు . కోరికలు తీరినప్పుదే ఇవన్నీ కలుగుతాయనీ


 భావిస్తారు . కానీ ,కోరిక మరో కోరికకు ఆజ్యం పోస్తుందని ,ఇది నిరంతర దాహమని మరచిపోతారు . సంతోష మనేది

బయట లేదు, మన మనస్సులోనే ఉందనే అనుభవం మనిషికి కలగాలంటే వివేకంతో కూడిన వైరాగ్యం

అంకురించాలి . సాక్షీ భావం అలవాటు అవ్వాలి . అప్పుడే ఎలాంటి సంఘటన ఎదురైనా మనిషి భయ పడడు .

నిరాశలో కూరుకుపోడు .అలాగే సంతోషాలకు  పొంగి పోడు .

వివేకంతో కూడిన వైరాగ్యం ,  సాక్షీ భావం నిరంతరం మనలో నిలిచి ఉండే విధంగా  మనం చేసే సాధనాలలో అతి

ముఖ్య   మైనది ధ్యానం .

ధ్యానమంటే ఏమిటి ? దేని పై ధ్యానం చేయాలి ?ఏకాగ్రత , ధ్యానం రెండూ ఒక్కటేనా ?

రోజూ కాసేపు చేసి వదిలేసేది ధ్యానమా ? ధ్యానంలో మనస్సు నెమ్మది స్తు న్దా ? మెదడు లో ఆలోచనలు పూర్తిగా

తగ్గి చిత్త  వృత్తులు కూ డ  అణగి పోతాయా ? ధ్యానానికి , నిద్రకు తేడా ఏమిటి ? మానసిక స్థాయిని బట్టి ధ్యానాన్ని

రక రకాలుగా చేయ వచ్చా ? ధ్యానంలో అంతర్లీనంగా ఉండే సూత్రమ్ ఏమిటి ?

మనిషి ధ్యానం చేయడానికే పుట్టాడా ? ధ్యానమంటే అది ఒక పనా ?లేదా అది ఒక జీవన విధానమా ?

ఇవన్నీ మీరూ ఆలోచించండి .మీ అభిప్రాయాలు పంచుకోండి .

ఎందు కంటే , ధ్యానం గురించి ఎంత చెప్పినా ప్రయోజనం శూ న్యం .అది ఎవరికీ వారు అనుభూతి చెంద వలసిన

క్రియ .కాబట్టి ధ్యానాన్ని మొదలు పెట్టండి . మీ మీ అనుభవాలు ధ్యానులందరితో పంచు కోండి .

దేవుణ్ణి  తెలుసుకోవటం  వేరు , దేవుణ్ణి గురించి   తెలుసుకోవటం వేరు .

అలాగే ధ్యానాన్ని గురించి తెలుసుకోవటం కాక ,  ధ్యానాన్ని అనుభూతి చెందండి .