ప్రతి ఒక్కరూ శాంతిగా ,సుకంగా ,సంతోషంగా ఉండాలను కొంటారు . కోరికలు తీరినప్పుదే ఇవన్నీ కలుగుతాయనీ
భావిస్తారు . కానీ ,కోరిక మరో కోరికకు ఆజ్యం పోస్తుందని ,ఇది నిరంతర దాహమని మరచిపోతారు . సంతోష మనేది
బయట లేదు, మన మనస్సులోనే ఉందనే అనుభవం మనిషికి కలగాలంటే వివేకంతో కూడిన వైరాగ్యం
అంకురించాలి . సాక్షీ భావం అలవాటు అవ్వాలి . అప్పుడే ఎలాంటి సంఘటన ఎదురైనా మనిషి భయ పడడు .
నిరాశలో కూరుకుపోడు .అలాగే సంతోషాలకు పొంగి పోడు .
వివేకంతో కూడిన వైరాగ్యం , సాక్షీ భావం నిరంతరం మనలో నిలిచి ఉండే విధంగా మనం చేసే సాధనాలలో అతి
ముఖ్య మైనది ధ్యానం .
ధ్యానమంటే ఏమిటి ? దేని పై ధ్యానం చేయాలి ?ఏకాగ్రత , ధ్యానం రెండూ ఒక్కటేనా ?
రోజూ కాసేపు చేసి వదిలేసేది ధ్యానమా ? ధ్యానంలో మనస్సు నెమ్మది స్తు న్దా ? మెదడు లో ఆలోచనలు పూర్తిగా
తగ్గి చిత్త వృత్తులు కూ డ అణగి పోతాయా ? ధ్యానానికి , నిద్రకు తేడా ఏమిటి ? మానసిక స్థాయిని బట్టి ధ్యానాన్ని
రక రకాలుగా చేయ వచ్చా ? ధ్యానంలో అంతర్లీనంగా ఉండే సూత్రమ్ ఏమిటి ?
మనిషి ధ్యానం చేయడానికే పుట్టాడా ? ధ్యానమంటే అది ఒక పనా ?లేదా అది ఒక జీవన విధానమా ?
ఇవన్నీ మీరూ ఆలోచించండి .మీ అభిప్రాయాలు పంచుకోండి .
ఎందు కంటే , ధ్యానం గురించి ఎంత చెప్పినా ప్రయోజనం శూ న్యం .అది ఎవరికీ వారు అనుభూతి చెంద వలసిన
క్రియ .కాబట్టి ధ్యానాన్ని మొదలు పెట్టండి . మీ మీ అనుభవాలు ధ్యానులందరితో పంచు కోండి .
దేవుణ్ణి తెలుసుకోవటం వేరు , దేవుణ్ణి గురించి తెలుసుకోవటం వేరు .
అలాగే ధ్యానాన్ని గురించి తెలుసుకోవటం కాక , ధ్యానాన్ని అనుభూతి చెందండి .