Followers

Saturday, 5 October 2013

మీ చర్మం మృదువుగా ఉండాలంటే


మీ చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి. రోజు రాత్ర నిద్రకు ఉపక్రమించేందుకు ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది.

అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి.

Popular Posts