'నవం నూతనం రాత్రం జ్ఞానం యస్మాత్తం నవ రాత్ర:'
అని పండితుల వాక్కు. రాత్రి అనే పదానికి జ్ఞానమనే అర్థాన్ని సూచిస్తున్నాయి. నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు. రాత్రిని తిథిగా స్వీకరించాలి. 'నవాహోవై సంవత్సర ప్రతిమా' అనే వాక్యం వలన నవరాత్ర కర్మ సంవత్సర కాలానికి ప్రతిరూపమని తెలుస్తోంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమినాడు నవరాత్ర ఆరాధనలు మొదలవుతాయి. ఈ నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వల్ల సమస్త పాపాలు, బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాల ద్వార విదితమవుతుంది.
''యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా| నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:''
అని సమస్త ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉండేదేవికి నమస్కరించింది మార్కండేయ పురాణం. శివుడు సైతం శక్తి సంపన్నుడైనప్పుడే ఆయనకు పరమేశ్వరత్వం సిద్ధిస్తుంది. శక్తి లేకుంటే ఏ ప్రాణీ కదలలేదు.
దుష్టరాక్షసులను సంహ రించడానికి ఆ పరాశక్తి పలురూపాల్లో అవతారిస్తు ఉంటుంది. ఆ జగన్మాతను దుర్గభవాని, రుద్రాణి వంటి అనేక నామాలతో భక్తులు కీర్తిస్తుంటారు.
ఈ నవ రాత్రుల పూజ వలన ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్దిధ పురుషార్థ ఫలాలు ప్రాప్తి స్తాయి. భక్తుల రోగ, శోక, సంతాప, భయాలను ఈ దుర్గాదేవి నశింప చేస్తుంది. ఈ నవరాత్రులలో నవదుర్గా రూపాల్లోని మహాలక్ష్మి, మహాసర స్వతీ, మహాకాళికలను రాధించడం వల్ల మహాలక్ష్మి అష్టైశ్యరాలు ప్రసాదిస్తే, మహాసరస్వతిగా విద్యాబుద్దులను అనుగ్రహి స్తుంది. మహాకాళిగా దుర్గగా పూజించడం వల్ల శతృభయం తొలగి విజయం సిద్ధిస్తుంది.
'ప్రథమా శైలపుత్రీ, ద్వితీయా బ్రహ్మచారిణీ, తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్థకే, పంచమా స్కందమాతేతి, షష్టాకాత్యాయనీ తచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమాసిద్ది దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తతా:''
కవర్ స్టోరీఅని మార్కండేయ పురాణం పేర్కొన్నది. సకల దేవతా శక్తులకు మూలధారిణి, సకల మంత్ర అధిదేవత, ఓంకార స్వరూపిణి, సృష్టిలోని పలు ప్రాణులకు మాతృమూర్తియైన శక్తికి ప్రతి రూపంగా దుర్గాదేవిని ఆరాధించడం అనాదిగా మన ఆచారం.
ఈ రూపాలకే 'నవ దుర్గలు' అని పేరు. దుర్గాదేవి తొలి స్వరూపంలో శైలపుత్రిగా, మలి రోజు బ్రహ్మ చారిణి స్వరూపంగా, తృతీయ స్వరూపంగా చంద్ర ఘంటాదేవి, చతుర్థ స్వరూపంగా కుష్మాండా దేవిగా, పంచమ రూపం స్కందమాత, షష్టి స్వరూపం కాత్యాయనిదేవి, సప్తమ రూపం కాళరాత్రీ, అష్టమ రూపంగా మహాగౌరి, దుర్గాదేవి నవమ స్వరూపంలో ప్రసిద్ది చెందింది.
''ఏతస్యా దపరం కించిత్ వ్రతం నాన్తి ధరాతలే
నవరాత్రాభిరం వైశ్య పావనం సుఖదం తధా
ఆనందం మోక్షదం చైవ సుఖ సంతాన వర్థనమ్
శత్రు నాశకరం కామం నవ రాత్ర వ్రతం సదా''
కవర్ స్టోరీఅంటూ నవరాత్ర మహిమను పురాణాలు కొని యాడాయి. ఈ నవ రాత్రులలో ఒక్కొక్క నాడు ఒక్కొక్క శక్తిని పూజించడం వలన, నవ శక్తులతో, నవదుర్గులతో కూడియుండటం వలన నవరాత్రుల య్యాయని శివుడు పార్వతి దేవితో చెప్పినట్లు శక్తి
సంగమ తంత్రం ద్వారా తెలుస్తోంది.