Pages

Saturday, 26 October 2013

తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వెైభవ ఆలయాలలో ‘పళని’ ప్రముఖమైం ది.



తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వెైభవ ఆలయాలలో ‘పళని’ ప్రముఖమైం ది. ఈ పుణ్య నామానికి ఒక ఆసక్తికరమైన పు రాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భం లో తన ఇరువురు ప్రియ పుత్రులెైన గణేశుని, కుమారస్వామిని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వా రికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తా రు. వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతా డు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసి న వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వ రూపులెైన తన తల్లిదండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రద క్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగు తాడు. అది చూసి శివ దేవుడు జాలిపడి ‘అన్న య్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం - ని’ నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు’ అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వెైభవమైన ‘పళని’ రూపుదిద్దుకుంది. అది కుమారస్వామిని విశిష్ట నివాస క్షేత్రమయింది!

ప్రకృతి శోభతో విలసిల్లే మురుగన్‌ ఆలయం...

పళనిలోని మురుగన్‌ ఆలయం సహజ సిద్దమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పం డుగెైన కొండపెై నిర్మితమైంది!. దీనిని ‘మురు గన్‌ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్‌ రోప్‌ - వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయ బడింది. సాధారణంగా భక్తులు ముందు గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు. మెట్లన్నీ ఎక్కి కొండపెై భాగం చేరగానే చు ట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శన మిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముం దుకు వెలితే వరవేల్‌ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్థంబాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులుగావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.

గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమార స్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రము ఖుడెైన భోగార్‌ పర్వవేక్షణంలో రూపొందింప బడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపు రూప విగ్రహమని చెబుతారు.దీనిని ‘నవ పా షాణం’ అనే విశేషమైన శిలనుమలచి తయా రు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలి కా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటా రు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహం లోని సునిశితమైన మూలికా పదార్థం క్రియా శీలమై ఒక విధమైన వాయువులను వెలు వరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధుల కు సంబంధించిన దోషాలు హరిం చుకుపోతా యని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు.