Pages

Saturday, 26 October 2013

అయ్యప్ప దీక్ష అంటే ఎమిటి?


నిశ్చలమైన (చంచలము కానట్టి) మనస్సుతో సంకల్పిచడాన్ని దీక్ష అంటారు. మనస్సును, వాక్కును, శరీరమును త్రికరణ సుద్దిగా నడిపింపజేస్తానని స్పంకల్పించి, ఇంధ్రియాలను చెడు కర్మల నుండి మరల్చి సత్కర్మలలొ వినియోగించుటకు ఫ్రతిగ్న చెసుకొనుటను దీక్ష అంటారు.

అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అనే మహవ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించుటను దీక్ష అంటారని పతంజలి మహార్షి తన "యాగసూత్రల"లొ పేర్కొన్నారు.

మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసిన పనే సంపూర్ణం గా ఉంటుంది. మనో వాక్కాయక కర్మలు అంటే అవే.
మనసు ఒకటి చెప్తే వాక్కు ఒకరకం గా సూచిస్తుంటే శరీరం ఇంకో రకం గా పని చేస్తే అది వన్నెకెక్కదు. అటువంటి పని చెయ్యటం కంటే మానటం మంచిది.

మహావ్రతాలు:

1) అహింస: అంటే మనోవాక్కాయ కర్మలచే హింస చేయకుండా యుండుట

2) సత్యం: అంటే కపటము లేకుండా భగవంతుని యందు నిజమైన భక్తిని కలిగియుండుట.

3) ఆస్థేయము: అంటే అవలంబించేందుకు తగినది.

4)  బ్రహ్మచర్యము: అంటే భగవంతుని గూర్చి త్రికరణశుద్ధిగా చేసే పవిత్ర కార్యము.

5) అపరిగ్రహము: అంటే తన భోగసాదనలకై ధనాదులను, ఇతరుల నుండి పుచ్చుకోకుండా ఉండుట.

ఈ 5 వ్రతాలను త్రికరణశుద్దిగా ఆచరించుటను "దీక్ష" అంటారు.