Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన ( 6 వ భాగము )


మణి ద్వీప వర్ణన (పార్ట్ 6)
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం పరామ్బికాయై నమః 

పద్మ రాగ ప్రాకారము అయ్యాక , గోమేద రత్న ప్రాకారము వస్తుంది . ఇది పది యోజనాలవరకు ఉన్నది . బంగారు కాంతుల మధ్య మందార పూలవలె మెరుస్తూ కాంతు ల ప్రసారము జరుగుతున్నది , గోమెద ప్రాకారాలవలె స్తంభాలు , రత్నజతటి త ముగా ఉన్నట్టి స్తంభాలు మెరుపులతో ఉన్నాయి , అలాగే చెట్లు వృక్షాలు బంగారు వన్నెల తో మధ్యన ఎరుపుమందారాలవలె మెరుస్తూ , శోభను కలుగ చేస్తున్నాయి .

ఇక్కడి బావులు , పక్షులు, స్తంభాలు , సరోవరాలు అన్ని గోమెద మణి చే నిర్మింప బడినవి . గోమేదము నుండి మందార పూల వలే వచ్చే కాంతి ,ఈ రెండిటి కి పరస్పర ముగా , చక్కని కలియికగా భాసిస్తున్నది . అందులో నుండి అరుణ కాంతుల శోభ వర్ణించ టానికి మాటలే అందవు .

వీటి మధ్యన 32 ప్రసిద్ధ శక్తులు నివసిస్తాయి . ఈ శక్తులు అన్ని విధాల అస్త్రాలతో విభూషితలుగా ఉన్నారు . ఈ దేవతా శక్తులు నలు వైపులా ఉంటాయి . ఈ గోమేద ప్ర్రాకారములో శక్తులు చూడటానికి భయంకరముగా కనపడతాయి . యుద్ధము కొరకు ,”సింగారించుకొని” నిలబడతాయి . ఈ లోకము లోని పురుషులు ఈ దేవతలను నిత్యమూ పూజిస్తుంటారు . క్రోధముతో నున్నట్టి ఈ దేవతల కనులు ఎర్రగా ఉంటాయి . “కొట్టండి , జీర్నించుకోండి , గుచ్చి చంపండి , భస్మము చేయండి అని నిరంతరమూ ఉచ్చరిస్తుంటారు .
ఒక్కొక్క మహా శక్తికి పదేసి అక్షుహినీ సేనలు ఉన్నాయి ఇందులోని ఒక్కోక్క శక్తికి , లక్ష బ్రహ్మాo డా లను సంహరించే శక్తి ఉన్నది . ఈ లాంటి విభూతిల సమైక్య శక్తిని అసలు అంచనా వేయగలమా ?వీరి రథాలు వాహన్నలు ఆన్చాన్న కట్టలేము . జగదంబ శక్తుల యుద్ధ సంబంధిత అస్త్రాలు శాస్త్రాలు అన్ని ఇక్కడ ఉన్నాయి . ఇవన్ని భగవతి యొక్క అంతరంగిణి సైన్యాలు . పాప నాశము చేయు పేర్లు వినండి . విధ్యా ,హ్రీ , పుష్టి ప్రఘ్య ,సినీవాలి , కుహూ ,రుద్రా, వీర్యా , ప్రభా , ఆనందా , పోషిణి , ఋద్ధిదా ,కాలరాత్రి , మహారాత్రి , భద్రకాళి , కపర్దిని , వికృతి ,దండిని , మున్డి ని , సెందు ఖండా , శిఖండిని,నిశుమ్భ శుమ్భ మథని , మహిషాసుర మర్దిని , ఇంద్రాణి , రుద్రాణి , శంకరార్ధ శరీరిణి , నారీ , నారాయణీ , త్రిశూలిని , పాలిని అంబికా , హ్లాదిని . ఈ దేవతలు కుపితులైతే బ్రహ్మాండాన్ని వెంటనే భస్మము చేయు శక్తి ఉన్నవారు . వీరికి ఎక్కడ పరాజయమే లేదు .
om sree maatre namaha