Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన ( 7 వ భాగము )


ఓం శ్రీ గణేశాయ నమః ,
ఓం శ్రీ గురుభ్యో నమః ,
ఓం పరామ్బికాయై నమః 

గోమేద ప్రాకారము దాటాక , వజ్రాల ప్రాకారము కలదు . ఇందులో అన్ని వ్జరాలచే నిర్మించిన ద్వారాలు ప్రాకారాలు ఉన్నవి , తలుపులు గొలుసుల చే కట్ట బడి ఉంది , కొత్త వృక్షాలు ఈ ప్రాకారానికి శోభను కలుగ చేస్తాయి .

ఇక్కడి పక్షులు , లతలు , వృక్షాలు , ఇక్కడి భూమి , బంగళాలు , సందులు , రాజమార్గాలు అన్ని వజ్రము వాలే , ప్రకాశిస్తూ ఉంటాయి అందులో నుండి ప్రసరించే కాంతి పరి పరి విధాలుగా ,మెరుస్తూ శోభిల్లుతున్నది .

ఒక్కొక్క పరిచారిక సుందర మైన రూపము వర్ణించ రానిది , కించిత్తు అబిమాన గర్వము తోనణి కిసలాడగా ,సేవకొరకు తమ చేతుల్లో ఉన్నట్టి సామగ్రి పట్టుకొని , విశేషమైన ఆనందముతో నిల్చున్న తీరు (అమ్మ సేవా భాగ్యము )పొంది గర్వ పడే వారు , లక్షల కొద్ది దాసీ మణులు ఉంటారు

. కొందరు పాదాలు వోత్తి తే మరి కొందరు చిత్ర లేఖనము చేస్తూ , ఆభూష్ ణా లు పెడుతూ, కొందరు శిరోజాలు సవరిస్తూ , ఏంతో మంది , అమ్మమీద ప్రేమ తో భక్తీ తో సేవలు చేస్తుంటారు

. వీరిని శివ దూతికలు అని అంటారు . వీరి పేర్లు అనంగ రూపా , అనంగ మదన ,సుందరి , మదనాతురా , భువన వేగా , భువన పాలిక , సర్వ శిశిరా, అనంగ వేదాం, అనంగ మేఖల . వీరి సంపూర్ణ శరీర ఛాయా విద్యుత్తు లాగ మేరుస్తుంటుంది . నడుము కు చక్కని వొడ్డానము , చిన్న చిన్నమువ్వ లతో నిర్మితమై ఉన్నది .

కా ళ్ళకు మువ్వలు , నడవగా నూపూర్ శబ్దాలు వినటానికి ఇంపుగా ఉంటాయి . వీరు శర వేగముతో ,బయటకు లోపలికి దూసుకో వస్తు పోతుంటారు . చేతిలో
ఓక బెత్తం తీసుకొని తిరుగుతుంటారు . వీరికి ఉత్తమ కోటి వాహనములు , కలిగి ఉంటారు . వీరు అన్ని కార్యములు చక్కగా నిర్వర్తించే నేర్పును కలిగి ఇంటారు . ఈ విధముగా ఈ అందమైన క్షేత్ర ము ఈ దూతికల నివాస స్థానము .
om sree maatre namaha