Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన ( 8 వ భాగము )



ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ పరామ్బికాయై నమః
వజ్ర ప్రాకారము తరువా వచ్చేది ,వైడూర్య మణి చే నిర్మింపబడిన ప్రాకారము . గోపురాలు అందమైన ద్వారాలచే నిర్మింపబడిన ప్రాకారము ,పది యోజనాల ఎత్తు ఉంది . ఇక్కడి బావులు , చెరువులు ప్రాకారములు , తలుపులు , చెట్లు , భూమి , సందులు రాజమార్గములు , సరస్సులు ,నదులు ,ఇసక , మొత్తము వైడూర్య మణుల చే నిర్మింపబడి ఉంది .
వ్యాసుల వారు జన్మేజేయుని తో ఇలా చెపుతున్నారు , “రాజన్ , ఇక్కడ బ్రాహ్మీ దేవతల సముదాయము ఉంటుంది . “ఈ దేవతలు తమ గణాలచే కూడి ఉంటారు . ఎంతో శోభను కలగాచేస్తూ ప్రకాశిస్తూ ఉంటారు . ప్రాతి ఒక్క బ్రహ్మాండ మాతృకల సమిష్టి రూపమే అని చెపుతారు .
బ్రాహ్మీ ,మాహేశ్వరీ ,కౌమారీ ,వైష్ణవీ ,వారాహీ ,ఇంద్రాణీ ,మరియు చాముండా .ఎనమిదవ మాతృకా మహాలక్ష్మి . వీరి రూపాలు అచ్చంగా బ్రహ్మా, విష్ణు , మహేశ్వరుల వలే ఉంటాయి .
నాలుగు ప్రాకారాలలో అమ్మవారి వాహానాలు , ఎంతో ముచ్చటగా ముస్తాబు అయ్యి ఇటు అటు తిరుగుతుంటాయి . ఇ ట్టి వాహనాలు కోట్ల కొద్ది ఉన్నయి . అవి ముగ్ధ మనోహర శోభను కలుగ చేస్తున్నాయి . ఈ విమానాలనుండి పెద్ద ధ్వని వస్తుంటుంది . అందులు ఎన్నో రకముల వాద్యాలు ఉన్నాయి .
om sree maatre namaha