Pages

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన (9 వ భాగము )


ఓం శ్రీ గణేశాయ నమః 
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ ప్రామ్బికాయై నమః

వైడూర్య మణి చే నిర్మితమైనట్టి ,అద్భుతముగు శోభల తో ఉన్న పరాకారము దాటాక ,ఇంద్ర నీల మణి ప్రాకారము వస్తుంది . పది యోజనాల వరకు ఉన్నట్టి ఈ ప్రాకారము అతి ఉత్తమ ప్రాకారము . నీల వర్ణ కాంతి ప్రభలతో పరాకాశించే ఈ ప్రాకారము తేజోమయ ప్రభలు చెప్పతరము కానిది . ఇక్కడి వాపి, కూప , తటాకములు ,అన్ని ఇంద్ర నీలము తో నిర్మితమైనవి .

ఇక్కడ అనేక యోజనాల వరకు విస్తృతముగా ఉన్నట్టి ఒక కమలము ఉన్నది
. పరమ ప్రకాశమానముగా ఉన్నది . ఈ కమలము , పదహారు వరుసల కలిగి ఉన్నది . కమలము పదహారు పొరలతో విచ్చుకున్నదా అన్నట్లు , , ఒక చక్రము పదహారు చక్రాల సమన్వయము తో పదహారు చక్రాలు ఉన్నావా ?అన్నట్లు ఉన్నది , పదహారు ,వరుస క్రమాలు కలిగిన ఈ కమలము లొ, అధిదేవతలు నివసించుటకు , తగిన చోటు ఉంది .

ఈ స్థానాలు , అన్ని విధాల సమృద్ధి ని కలిగి , ఇక్కడి శక్తుల పేర్లు ఇలా ఉన్నాయి , కరాలి ,వికరాలి , ఉమా , సరస్వతీ , శ్రీ , దుర్గా , ఉషా , లక్ష్మి , శృతి , స్మృ తి , ధృతి ,శ్రద్ధా , మతి ,మేధా , కాంతి , ఆర్యా , వీరు అందరు నీల మేఘము వలే ప్రకాశిస్తుంటారు . ఒకే లాగా కనపడే ఈ దేవతలు తమ చేతుల్లో , డ్హాలు , కత్తి ,పట్టుకొని యుద్ధము చేయవలె నన్న కాంక్ష తో నిలబడతారు . వీరంతా శ్రీ దేవి సేనానిలు ,

ప్రతి ఒక్క బ్రహ్మoడము లో ఉన్నట్టి ఈ దేవతలు బ్రహ్మాండాన్ని క్షుబ్దము చేయగల సామర్థ్యము కలిగినట్టి వారు . అనేక స్థానాలలో వీరు విహరిస్తుంటారు . సహస్ర ఫణాలు కలిగినట్టి శేష నాగు సహితము వీరి పరాక్రమము ను వర్ణించ లేడు .
ఓం శ్రీ మాత్రే నమః