Pages

Friday, 17 January 2014

పిడికెడు అటుకులతో సంతుష్టుడైన కృష్ణుడు!

     

 'ఉంది', 'లేదు'... ఇవి రెండూ చదవటానికి చిన్న పదాలైనా ఇవి జీవితాలపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మనిషి జీవితంలో సుఖసంతోషాలకు, వేదన రోదనలకు 'ఉంది', 'లేదు' అనే భావనలో కారణం. ఉందనుకుంటే తృప్తి, ఆపై జీవితంలోని బాదరబందీల నుంచి విముక్తి. లేదనుకుంటే అసంతృప్తి. చివరికి కలిగేది జీవితంపై విరక్తి. నిజానికి 'ఉంది', 'లేదు' అనేవి మనం సృష్టించుకున్న భావనలే. జీవితంలో సుఖ దు:ఖాలు, కలిమిలేములు వచ్చిపోతుం టాయి. అదో చక్రం. జీవితం పొడవునా అవి పలక రిస్తూనే ఉంటాయి. ఏవీ శాశ్వతంగా ఉండిపోవు. కొందరు తగినంత ఉండి, ఏ లోటూ లేకున్నా 'ఇంకా కావాలి...సరిపోదు' అని చింతిస్తారు. ఉండి కూడా లేదనుకుని బాధపడ తారు. లేదు.. లేదనుకుంటే చివరికి లేకుండానే పోతుంది. ఉన్నదెంతైనా సాటి వారితో పంచుకుంటేనే అందం, ఆనందం. హేమాడ్‌ పంత్‌కు బాబా
చెప్పినట్లే, కృష్ణుడు సుదా మునికి ఈ విష యంలో నిదర్శనం చూపాడు.
కృష్ణుడు, బలరాముడు, సుదాముడు
సాందీపుని శిష్యులు. గురువు సాందీపుడు ముగ్గురినీ అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని రమ్మని పంపారు. సాందీపుని సతీమణి ఆకలి వేస్తే ముగ్గురూ తినండని చెప్పి శనగలు మూటకట్టి సుధా మునికి ఇచ్చింది. కృష్ణ, బలరామ, సుధా ములు అడవిలో తిరుగుతూ అలసిపోయారు.
''నాకు దాహంగా ఉంది. నీళ్లు కావాలి'' అని కృష్ణుడు అడిగాడు.
''ఉత్త కడుపుతో నీళ్లు తాగకూడదు. కొద్దిసేపాగు'' సుదాముడు అన్నాడే కానీ, తన వద్ద శనగలు ఉన్నాయన్న విషయం చెప్పలేదు. వాటిని కృష్ణునికి ఇవ్వలేదు. అలసటతో కృష్ణుడు సుధాముని తొడపై తల పెట్టుకొని నిద్రలోకి జారిపోయాడు.
ఇదే అదనుగా సుధాముడు మూట విప్పి ఒక్కొక్క శనగ నోట్లో వేసుకుని పటపటలాడించ సాగాడు. ఆ శబ్దానికి కృష్ణుడు మేల్కొన్నాడు.
సుదామా! ఏదో తింటున్నట్టున్నావు? ఏమిటి శబ్దం వస్తున్నది?'' అని అడిగాడు.
''తిండా? పాడా? చలికి శరీరం వణుకుతుంది. పళ్లు పటపట లాడుతున్నాయి. ఈ మాయదారి చలి వల్ల విష్ణుసహస్ర నామాలు
కూడా సరిగా పలకలేకపోతున్నాను కృష్ణా'' అని కపటం ఒలక బోశాడు. సర్వజ్ఞుడైన కృష్ణునికి రహస్యం ఏముంది? అంతా కని పెట్టాడు.
అప్పడిలా చెప్పాడు.
''సుదామా! నేనో కలగన్నాను. అందులో ఒకడు పదార్థాలు తిన్నాడు. ఏం తింటున్నావని అడిగితే, తినటానికి ఏముంది మన్ను? అన్నాడు. ఇదీ కల. అయినా సుదామా! నాకివ్వ కుండా నువ్వేమీ తినవని తెలుసు. నాకొచ్చిన కల ప్రభావం వల్లే ఏం తింటు న్నానని అడిగాను'' అన్నాడు.
కృష్ణుని సర్వాంతర్యామిత్వం కానీ, సాక్షాతూ భగవంతుడే అని కాని తెలిసి ఉంటే సుదాముడు అలా చేసి ఉండేవాడు కాదు. ఏమైతేనేం? సుధా ముడు తానుచేసిన పనికి జీవితంలో సగ భాగం బాధలు పడ్డాడు. కృష్ణుని ప్రియ మిత్రుడై ఉండీ దుర్బర దారిద్య్రాన్ని అనుభవించాడు. ప్రార బ్ధం తీరే వరకు కర్మ అనుభవించక తప్పదు కదా! చివరకు సుదాముని భార్య కాయకష్టం చేసి సంపాదించి కానుకగా ఇచ్చిన పిడికెడు అటు కులతో కృష్ణుడు సంతుష్టుడయ్యాడు.
అందుకు ప్రతిగా బంగారు పట్టణాన్నే ఆ దంపతు లకు కానుకగా ఇచ్చాడు. మన దగ్గర ఉన్నదాంతోనే సర్దుకోవటం ఒక పద్ధతి. దానినే ఇతరులతో పంచు కోవటం జీవితంలో ఆనందానికి దారి తీస్తుంది.
ఇక ఏది తింటున్నా దానిని ముందుగా భగ వంతునికి అర్పించుట, ఆ తర్వాత తినటం ఉత్తమో త్తమం. తమ వద్ద ఉన్నది ఇతరులకు పెట్టకుండా దాచుకుని అర్పించుట, ఆ తర్వాత తినటం ఉత్తమో త్తమం. తమ వద్ద ఉన్నది ఇతరులకు పెట్టకుండా దాచుకుని తినే వారు, తమ వద్ద ఉండి కూడా లేదని బాధపడేవారు ఈ అధ్యాయాన్ని నిత్యం గుర్తుంచు కోవాలి.