Pages

Monday, 13 January 2014

కృష్ణనామ మహత్యం



కృష్ణనామ మహత్యం :-
సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.
మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః 
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ // 
కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.  

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //
కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే 
ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు.