Pages

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం మూడవ అధ్యాయం

సూత ఉవాచ

జగృహే పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః
సమ్భూతం షోడశకలమాదౌ లోకసిసృక్షయా

యస్యామ్భసి శయానస్య యోగనిద్రాం వితన్వతః
నాభిహ్రదామ్బుజాదాసీద్బ్రహ్మా విశ్వసృజాం పతిః

యస్యావయవసంస్థానైః కల్పితో లోకవిస్తరః
తద్వై భగవతో రూపం విశుద్ధం సత్త్వమూర్జితమ్

పశ్యన్త్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననాద్భుతమ్
సహస్రమూర్ధశ్రవణాక్షినాసికం సహస్రమౌల్యమ్బరకుణ్డలోల్లసత్

అదబ్ర చక్షుషా: ఇది దోషంలేని కంటితో చూస్తారు. ఈయననే అనిరుధ్ధ తత్వం అంటారు. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుధ్ధ్ సంకర్షణ. అనిరుధ్ధ తత్వమే అన్ని అవతారాలకీ మూలం. నిధానం భీజం అవ్యయం.

ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయమ్
యస్యాంశాంశేన సృజ్యన్తే దేవతిర్యఙ్నరాదయః

దేవతలూ మానవులు దానవులు అందరూ ఈ అనిరుధ్ధునిలో సహస్రాశం.

స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః
చచార దుశ్చరం బ్రహ్మా బ్రహ్మచర్యమఖణ్డితమ్

మొదటిసృష్టి సనకాదులు. వారు పుట్టగానే 5 యేళ్ళ పిల్లల ఆకారంతో ఉన్న
అరు. కాని పెద్దవారనుకునే వారందరికన్న ముందు పుట్టినవారు. వీరే మొదటి సృష్టి. బ్రహ్మచర్యంతోటి ఇతరులెవ్వరూ ఉపాసించలేని పరమాత్మను వారు ఉపాసించారు

ప్రతీ అవతారానికి ఒక ప్రయోజనం ఉంది. సనకాదుల అవతారం పరిపూర్ణమైన విరక్తిని బ్రహ్మచర్యాన్ని ఆచరించి చూపారు. వయసు కాలం సౌకర్యం మనసు బుధ్ధి పెరిగినా వాటి వికారాలను పడకుండా ఉండటానికి పరబ్రహ్మ ఉపాసనే మార్గమని చూపారు

ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీమ్
ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః

రెండొవది వరాహం. వరాహం అంటే : వర + అహం. అహం అంటే రొజు. వర అంటే మంచి... నీటిలోంచి భూమిని తీసినరొజు కాబట్టి అది మంచి రోజు. మనువు సృష్టి జరిగితే వచ్చిన వారెక్కడ ఉండాలి అని అడిగితే ఆలోచించిన బ్రహ్మగారికి తుమ్ము వచ్చి ఆ తుమ్ములోంచి ఒక చిన్న వరాహం ఉద్భవించింది.  ఈ వరాహం అంటే మంచి రోజు అని అర్థం. వరాహానికే సూకరం అని కూడా పేరు. సూకరానికి మూలం సుకరం. అలాంటి అతి దుష్కరమైన పనిని సుకరం చేసాడు కాబట్టి సుకరం అని పేరు. భూమి వచ్చిన తరువాత భూమిమీద మొదలు రాలినవి యజ్ఞ్య వరాహ మూర్తి రోమాలు. అవే ధర్భాలు (కుశములు). యజ్ఞ్యం పితృశార్దం ఎలా చెయ్యాలో నేర్పిన అవతారం.
స్వామి హిరణ్యాక్షున్ని వధించాడు. హిరణ్యమంటే బంగారం. అక్షములు అంటే ఇంద్రియములు. బంగారానికి మారు పేరు వ్యామోహం. హిరణ్యాక్షుడు ఇంద్రియవ్యామోహానికి ప్రతీక. పితృదేవరాధన యజ్ఞ్యములు చెయ్యకపోవడానికి ఇంద్రియ వ్యామోహమే కారణం. భగవదారాధనను కూడ ఇంద్రియవ్యామోహం మింగేస్తుంది.

తృతీయమృషిసర్గం వై దేవర్షిత్వముపేత్య సః
తన్త్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః

తృతీయం దేవర్షి సృష్టి. నారదుడు పాంచరాత్ర ప్రవర్తకుడు.దానికే సాత్వత తంత్రమని పేరు. అఖిల జ్ఞ్యానములకు, ధర్మాలకు యోగాలకి మూలం ఈ పాంచరాత్ర తంత్రం. భగవదారాధనను ఎల చెయ్యాలి. దేవాలయాల్లో ఇంట్లో ఒంట్లో ఉన్న మూర్తిని ఎలా ఆరాధించాలో చెప్పిన అవతారం. అర్చకుడు సృష్టిన్యాసం స్థితిన్యాసం లయన్యాసం చేస్తారు. తరువాత పరమాత్మ శిరస్సు నుండి పాదముల వరకూ న్యాసం చేసుకోవాలి. భగవంతుని ఆరాధించే వారు వారే భగవంతుడు కావాలి. అందుకే కృష్ణ పరమాత్మకు కుబ్జకు పుట్టిన ఉప్శ్లోకుడు నారదుని నుంచి పాంచరాత్రం నేర్చుకుని పాంచరాత్రసమ్హిత వ్రాశాడు.

తుర్యే ధర్మకలాసర్గే నరనారాయణావృషీ
భూత్వాత్మోపశమోపేతమకరోద్దుశ్చరం తపః

ధర్ముడనే ప్రజాపతికి దక్షుని కుమార్తే మూర్తికి కలిగిన వారు నర నారాయణులు. వీరు తపస్సు ఎలా చెయ్యాలో గురు శుశ్రూష ఎల చెయ్యాలో నేర్పారు. సహస్రకవచుడనే రాక్షసున్ని వధించారు. ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు యుధ్ధం చేస్తూ ఒక్కోకవచాన్ని తొలగించి వాడిని సమ్హరించారు. నిరంతరం ఆత్మకు కవచంగా ఉండేదే శరీరం. కోరికలే కవచాలు. ఒకరు నరుడుగా (గురువుగా) నారాయణుడుగా (పరమాత్మగా) అవతరించారు. అలాగే మనం కూడా గురువుని పరమాత్మని సేవించాలి.

పఞ్చమః కపిలో నామ సిద్ధేశః కాలవిప్లుతమ్
ప్రోవాచాసురయే సాఙ్ఖ్యం తత్త్వగ్రామవినిర్ణయమ్

అయిదవ అవతారమైన కపిలావతారం. తల్లి అయిన దేవహూతికి సాంఖ్య శాస్త్రముని భోధించాడు. ఈయన పరమ సిధ్దుడు

షష్ఠమత్రేరపత్యత్వం వృతః ప్రాప్తోऽనసూయయా
ఆన్వీక్షికీమలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్

అనసూయాత్రులకు సంభవించిన ఆరవ అవతారం దత్తుడు మూడు అంశలతో ముగ్గురు పుత్రులు జన్మించారు. ఈయన అలర్క మహర్షికి పరమవేదాంత తత్వాన్ని భోధించారు. పరశురామునికి కార్తవీర్యార్జునికి కూడా దత్తుడే గురువు. (కార్తవీర్యార్జుడు సహస్రబాహువు. ఆయన రాజ్యంలో ఇళ్ళకు ప్రజలు తలుపులు పెట్టుకోలేదు. ఆయన స్మరణతో పోయిన వస్తువు దొరుకుతుంది, మన ఎదురుగా వచ్చిన కౄర మృగం కూడా వెనుదిరుగుతుంది. ఆయన కోరిక ప్రకారం పరశురాముడిగా వచ్చి ఈయనని సమ్హరిస్తాడు)
దత్తుడు యోగనిధి. ధ్యానయోగాన్ని బాగా ప్రచారంచేసి అది అయోగ్యులకు అందకుండా ఉండేందుకు ఆయన సురాపానం చేస్తున్నట్లుగా అయోగ్యులకు కనపడతారు. పరశురామునికి కూడా ఇలాగే దర్శనమిచ్చారు మొదట. యోగమును అనర్హులకు అందచెయ్యకూడదు అది ఆయుధాలని అందరికీ అమ్మినట్లు. యెంతో మందికి తత్వం చెప్పిన అవతారం దత్తాత్రేయావతారం

తతః సప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోऽభ్యజాయత
స యామాద్యైః సురగణైరపాత్స్వాయమ్భువాన్తరమ్

స్వాయంభువ మన్వంతారాని దక్షిణ యజ్ఞ్యుల రూపంలో వీరు పరిపాలించారు. ప్రతీ మన్వంతరంలోను మనువు మనుపుత్రులు ఇంద్రుడు దేవతలూ సప్తఋషులు పరమాత్మ అవతారమూ ఉంటుంది. ఈ ఆరు ప్రతీ మన్వంతరంలోనూ ఉండాలి. స్వాయంభువ మన్వంతరంలో పరమాత్మ అవతారం యజ్ఞ్య. ఆకుతికి రుచికి పుట్టాడు. యామాద్యైః సురగణై - ఆ మన్వంతరంలో దేవతలకు యాములు అని పేరు. ఇంద్రుడిపేరు యామ, ఆ మన్వంతరంలో

అష్టమే మేరుదేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః
దర్శయన్వర్త్మ ధీరాణాం సర్వాశ్రమనమస్కృతమ్

నాభి అనే ప్రజాపతికి మేరు దేవితో కలిగినవాడు ఋషభుడు. ఈయన యోగమును ప్రవర్తింపచేసినవాడు. ఈయన నడవడి అర్థంచేసుకోని వాళ్ళకు అనాచారమే ఆచారంగా మారే ప్రామాదం ఉంది. భరతునికి రాజ్యపట్టభిషేకం చేసి వానప్రస్తాశ్రమమాని వెళ్ళి ఆజగరంగా కొన్నాళ్ళు కొన్నాళ్ళు రక్తవస్త్రం కొన్నాళ్ళు కౌపీనంతో శికతో కొన్నాళ్ళూ లేకుండా కొన్నాళ్ళు, యే ఒక్క దానిమీద ఆదరంతో కాకుండా ఆయన దేహ యాత్ర కొనసాగించారు. నేనునాది అన్న భావలతో సంభందంలేకుండా ప్రవర్తించాడు. సర్వశ్రేష్ట: అయం ఋషభ.

ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః
దుగ్ధేమామోషధీర్విప్రాస్తేనాయం స ఉశత్తమః

పార్ధ: అంటే పృధు చక్రవర్తి. ఈయన పరిపాలించడంవల్ల భూమికి పృధ్వి అని పేరువచ్చింది. భూమిలో ఎత్తుపల్లాలు సవరించి, నీళ్ళు నిలవ ఉండటానికి కొన్నిచోట్ల పల్లంగా ఉంచాడు. ఈయన భూమినుంచి ఔషధులను పిండాడు. ఉశత్తమ: అంటే లోపల ఉండేదాన్ని బయటకు తెచ్చినవాడు

రూపం స జగృహే మాత్స్యం చాక్షుషోదధిసమ్ప్లవే
నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుమ్

మత్స్యముగా అవతరించి సత్యవ్రతునికి మత్స్యపురాణాన్ని భోధించారు.

సురాసురాణాముదధిం మథ్నతాం మన్దరాచలమ్
దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః

ధాన్వన్తరం ద్వాదశమం త్రయోదశమమేవ చ
అపాయయత్సురానన్యాన్మోహిన్యా మోహయన్స్త్రియా

క్షీరసాగరమధనంలో మూడూవతారాలున్నాయి. అమృతాన్ని తీసుకొచ్చిన ధన్వంతరి, కూర్మం, మోహిని. అమృతాన్ని ఎలా సేవించాలో చెప్పాడు ధన్వంతరి. అమృతాన్ని దొంగిలించాలనుకున్న రాక్షసుల

చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేన్ద్రమూర్జితమ్
దదార కరజైరూరావేరకాం కటకృద్యథా

కశ్యపం అంటే పరుపు. పరుపు భోగానికి సంకేతం. దాన్ని పరమాత్మ చేతులతో చీలచాడు. చేతులతో అంటే కర్మలతో. ఉత్తమకర్మాలాచరించినపుడే భోగవ్యామోహం పోతుంది.
హిరణ్యకశిపుడు భోగవ్యామోహం హిరణ్యాక్షుడు ఇంద్రియవ్యామోహం. ఈ రెండిటినీ కర్మల వలన కలిగిన సంస్కారంతో తొలగించుకోవాలి. ఉత్తమకాలం వచ్చినప్పుడు ఇంద్రియవ్యామోహం ఉత్తమ కర్మలతో భోగవ్యామోహం పోతుంది

పఞ్చదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః
పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రిపిష్టపమ్

స్వర్గం ఇంద్రునికి ఇవ్వడానికి వామనావతారం వచ్చింది. త్రివిష్టపం. తిర్కరణముల (కాయ వాచ మనస) చేత చేసిన కర్మలవలన పుణ్యాన్ని అనుభవించే స్తానానికి త్రివిష్టపం అని పేరు. అనుభవించేప్పుడు నాది నేను అనే భావన లేనంతకాలం ఆ అనుభవం మన దగ్గర ఉంటుంది

స్వర్గం ఇంద్రునికి ఇవ్వడానికి వామనావతారం వచ్చింది. త్రివిష్టపం. తిర్కరణముల (కాయ వాచ మనస) చేత చేసిన కర్మలవలన పుణ్యాన్ని అనుభవించే స్తానానికి త్రివిష్టపం అని పేరు. అనుభవించేప్పుడు నాది నేను అనే భావన లేనంతకాలం ఆ అనుభవం మన దగ్గర ఉంటుంది. వామనావతారం ధర్మసూక్ష్మాన్ని భోదించే అవతారం.

బలికి పరమాత్మ ఇచ్చిన రసాతలం నైమిత్తిక ప్రళయంలో కూడా ఉంటుంది. బ్రహ్మగారికి నూరు సంవత్సరాలు వచ్చేవరకూ ఆ లోకం ఉంటుంది.

అవతారే షోడశమే పశ్యన్బ్రహ్మద్రుహో నృపాన్
త్రిఃసప్తకృత్వః కుపితో నిఃక్షత్రామకరోన్మహీమ్

భూమిమీద ఉండే క్షత్రియులని సమ్హరించి ధర్మాన్ని నెలకొల్పడానికి పరశురామావతారం.

తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్
చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోऽల్పమేధసః

కలియుగమ్రాబోతోంది అని బుధ్ధి తగ్గటాన్ని చూసి వేదాలని పురాణాలని విభాగం చేసి లఘువుగా అందించారు.

నరదేవత్వమాపన్నః సురకార్యచికీర్షయా
సముద్రనిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరమ్

శ్రీ రామచంద్రుడు నరుడుగా వచ్చి సముద్రాన్ని నిగ్రహించి వారధి యేర్పాటు చేసి దుష్టులని శిక్షించాడు. కృష్ణావతారంలో అగ్నిని నిగ్రహించాడు.

ఏకోనవింశే వింశతిమే వృష్ణిషు ప్రాప్య జన్మనీ
రామకృష్ణావితి భువో భగవానహరద్భరమ్

బలరామకృష్ణులుగా వృష్ణి వంశంలో పుట్టి పరమాత్మ  భూమి భారాన్ని హరించాడు.

తతః కలౌ సమ్ప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్
బుద్ధో నామ్నాఞ్జనసుతః కీకటేషు భవిష్యతి

బుద్ధుడు అవతారం కాదని చాలా మంది చెప్తారు. ఆయన కూడా అవతారమే. రాక్షసులను మోహింపచేయడానికి వచ్చిన అవతారం. యజ్ఞ్య యాగాదులని ఆచరిస్తూ పరస్త్రీలని పరధనాన్ని హరిస్తూ ఉన్నవారిచేత యజ్ఞ్య యాగాదులని మాంపించాలని, అవన్నీ ధర్మంకాదని వార్ని నమ్మించి అవన్నీ వృధా అని వారిచేత ధర్మాన్ని మాంపించడానికి అధర్మాని ఆచరింపచేసి నశింపచెయ్యడానికి బుధ్ధుడు అవతరించాడు

అథాసౌ యుగసన్ధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు
జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః

దస్యుప్రాయేషు రాజసు: రాజులందరూ దొంగలైనప్పుడు దొంగలలాగ వ్యవహరించినప్పుడు భూభారన్ని తొలగించడానికి వచ్చే అవతారం కల్కి

అవతారా హ్యసఙ్ఖ్యేయా హరేః సత్త్వనిధేర్ద్విజాః
యథావిదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః

పరమాత్మ అవతారాలు అసంఖ్యేయం. జగత్తుని పరిపాలించడం ఆయన విధికాబట్టి అవతారాన్ని స్వీకరిస్తాడు. మహాసముద్రమ్నుంచి కాలువలు (కుల్యా:) తీస్తే ఎన్నీవుతాయో అలాంటివి ఆయన అవతారాలు

ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః
కలాః సర్వే హరేరేవ సప్రజాపతయః స్మృతాః

ఋషులు మనువులు దేవతలు ప్రజాపతులు ఇలా భూభారన్ని తొలగించడానికి ఉన్న పరమాత్మ రూపం అంతా పరమాత్మ అంశ.

ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్స్వయమ్
ఇన్ద్రారివ్యాకులం లోకం మృడయన్తి యుగే యుగే

ఈ అవతారాలన్నీ అంశావతారాలు. కానీ కృషుడు సాక్షాత్ భగవంతుడే. అనిరుధ్ధుడే కృష్ణుడుగా వచ్చాడు. అన్ని నామాలకంటే కృష్ణనామం ఎంతో మధురం. రాక్షసులచేత కలత పడిన ధర్మాన్ని ప్రాణులని రక్షించడానికి భగవంతుండు అవతరిస్తాడు

జన్మ గుహ్యం భగవతో య ఏతత్ప్రయతో నరః
సాయం ప్రాతర్గృణన్భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే

ఈ మూడవ అధ్యాయాయాన్ని, పరమాత్మ అతిరహస్యమైన జన్మని రోజూ సాయం ప్రాత: కాలంలో నోటితో కీర్తిస్తూ(గృణన్) భక్తితో చదువుకుంటే అసలు జీవితంలో ఆపదలే రావు.

ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః
మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని

అసలుస్వామ్య్ అరూపం. జ్ఞ్యాన స్వరూపుడు. అవతారాలు ఆయన్ రూపాలుగా భావించాలి
ఇవన్నీ మాయగుణాలతో యేర్పరచిన రూపాలే గాని అసలు రూపం నిరాకారం నిర్గుణం

యథా నభసి మేఘౌఘో రేణుర్వా పార్థివోऽనిలే
ఏవం ద్రష్టరి దృశ్యత్వమారోపితమబుద్ధిభిః

పరమాత్మ గుణం/రూపం ఉన్నవాడా లేనివాడా? మేఘములు ఆకాశంలో ఉన్నాయి. భూమి ఉన్నదే ఆకాశంలో. పెద్దగాలికి వచ్చే దుమ్ము భూమియొక్క రేణువులే. కాని ఆ దుమ్ముని గాలికి ఆపాదిస్తున్నాం. ఆ దుమ్ముకి గాలి ఆధారం అనుకుంటాం. నిరాకారమైన గాలిలో ఎమీ ఉండదు. గాలి కేవలం విడదీస్తుంది. అలాగే ఆకాశం అంటే శూన్యం. మబ్బులు ఉంటే అది ఆకాశం కాదు. చూచేవాడెప్పుడూ చూడబడే వాడుకాడు. పరమాత్మ ద్రష్ట. ప్రపంచం దృశ్యం. ఆత్మ ద్రష్ట శరీరం దృష్యం. చూడబడెది చూచేది కాదు. చూచేది చూడబడే వాడు కాడు. ఇది బుధ్ధిలేని వాళ్ళు ఆరోపించేది.

అతః పరం యదవ్యక్తమవ్యూఢగుణబృంహితమ్
అదృష్టాశ్రుతవస్తుత్వాత్స జీవో యత్పునర్భవః

మరి జీవత్మ ఎవరు: ఎవరైతే మళ్ళి మళ్ళి పుడతారో అదే జీవాత్మ. అది అవ్యక్తం . అవ్యక్తంలోకి జీవుడూ వస్తాడు పరమాత్మ వస్తాడు. కానీ మనం కర్మ బద్దులం. పరమాత్మ రావడానికి కూడా మన కర్మే కారణం. అది ఆయననే రప్పిస్తుంది. పోవడానికి మాత్రం ఆయనకు ఇష్టం కారణం మనకు కర్మ కారణం. గుణములన్ని కలిస్తేనే ప్రకృతి. జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు గుణములచే యేర్పరచబడ్డాయి. జీవుడు మాటిమాటికి పుడుతుంటాడు. యేది అవ్యక్తంగా ప్రకృతిగా కనపడుతుందో అదే తాను అనుకుంటాడు.
విడిగా ఉన్న గుణాలు ఒకటిగా చేరి మళ్ళి విడిగా చేస్తాడు అదే సృష్టి. విరుధ్ధమైన రెండు తత్వాలు కలిస్తేనే సృష్టి. సమానాంశలు పెడితే ప్రళయం.

యత్రేమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిదా
అవిద్యయాత్మని కృతే ఇతి తద్బ్రహ్మదర్శనమ్

జ్ఞ్యానికి ఈ రెండు రూపలు ఒకటే. ఉనికీ లేదు లేమీ లేదు. ఉనికిలేదు అంటే లేమిలేనట్లైనా అయ్యి ఉండాలి. లేమిలేదు అంటే ఉనికిలేకుండా ఉండాలి. మరి ఇదేంటి. ఎప్పుడూ కనపడనిదానిని లేమి అంటాం. ఎప్పుడూ కనపడని దానినుండే కనపడేవన్నీ పుట్టాయి. అంటే మన బుధ్ధిచేత ఇంద్రియాలచేత మనస్సుచేత మన ఊహకు అందని ఒక పదార్ధం. రూపంలేనిదల్లా లేదని అనగలమా? రూపంలేని వాయువు వలన రూపం ఉన్న అగ్ని వచ్చిన్. కనపడని ప్రతీది లేదనడం కనపడే ప్రతీది ఉన్నది అనడం తప్పు. ఉంటే ఎపూడూ ఉండాలి. లేకుంటే ఎప్పుడూ లేదు. పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. ఆకారంలేదు కాబట్టి లేదనడం తప్పు. ఆకారంలేకుండా ఉండి ఆకారమున్న వాటి సృష్టికి మూఅలం అయినవాడు ఉన్నవాడా లేనివాడా?
అవిద్యతో మాయతో మన ఆత్మతో ఇవన్నీ కలిపిస్తున్నాము.

యద్యేషోపరతా దేవీ మాయా వైశారదీ మతిః
సమ్పన్న ఏవేతి విదుర్మహిమ్ని స్వే మహీయతే

ఎప్పుడైతే యోగమాయ తొలగిపోతుందో (ఉపరత:) అప్పుడు జ్ఞ్యానం కలుగుతుంది. విశ్రాద: కలపడాన్ని ఇచ్చేది సమూహాత్మక జ్ఞ్యానన్ని ఇచ్చేది శారద. భేదంలో అభేధాన్ని చూపుతుంది శారద. శారదా అంటే జ్ఞ్యాన స్వరూపం. విడిగా ఉన్నదానిలో ఐక్యతని చూపుతుంది. శరీరాలు వేరైన శరీరాల్లో ఉండే ఆత్మతత్వం ఒక్కటే. ఎవరు యే శరీరంలోకి వచ్చాడో ఆ గుణం వస్తుంది. ఆ శరీరంతో చేసే పనిని శరీరికి కల్పిస్తాం మాయతో. ఈ మాయ తొలగిపోతే అప్పుడు మనం ఉన్నవాళ్ళం. పరమాత్మ ఉన్నడనితెలిస్తే మనం ఉన్నవాళ్ళం అవుతాం. పుట్టుకలేని పరమాత్మ ఇన్ని తీరులుగా పుట్టాడు.

ఏవం చ జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ
వర్ణయన్తి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతేః

పుట్టుకలేని స్వామికి ఇన్నిపుట్టుకలు కర్తగాని స్వామికి ఇన్ని కార్యములు. ఇలాంటివాటిని జ్ఞ్యానులు వర్ణిస్తారు. మనకున్న మోహాన్ని తొలగించడానికి మనం భావించే రూపంతో వచ్చి మనం చేసే కర్మలు చేసి. మన కర్తృత్వాన్ని తొలగించడానికి ఆయన కర్మలు చేస్తున్నాడు. మనకు పుట్టుకలేకుండా చెయ్యడానికి ఆయన జన్మ స్వీకరిస్తున్నాడు. మనం ఏమీ చెయని వాళ్ళం అని తెలుసుకోవాలంటే ఆయనే అన్నీ చేస్తున్నాడని తెలుసుకోవాలి. మనకి జ్ఞ్యానం కలిగించడానికి మోక్షమివ్వడానికి వస్తాడు.

స వా ఇదం విశ్వమమోఘలీలః సృజత్యవత్యత్తి న సజ్జతేऽస్మిన్
భూతేషు చాన్తర్హిత ఆత్మతన్త్రః షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశః

పరమాత్మని తెలుసుకోవాలంటే లేనిదాంట్లో ఉన్నదాన్ని చూడాలి. జ్ఞ్యాన విషయాన్ని చూచుట అంటాం (ఉదా రుచి చూచుట).
పరమాత్మ సృష్టించడానికి ఆయన లీల (ఆట) కావాలి, కానీ ఆయన ఆ ఆటని ఆకాంక్షతో ఆడడు. ఈ జగత్తుని ఆయనే సృష్టించి రక్షించి కాపాడతాడు. మనం ఎక్కడ కూర్చున్న గంధంతో వచ్చే వాయువు వస్తుంది. వాసన చూసిన తరువాత సువాసనను దుర్వాసననూ మన ఇష్టంలేకుండానే గ్రహిస్తాం, మన ఇష్టం పని చెయ్యనప్పుడు మనకి తెలియకుండా మన ఇచ్చలేకుండా వచ్చే దానిమీద మనసు ఎందుకుపెడతాం. మనసు  పెట్టనివాడు పరమాత్మ. శబ్ద స్పర్ష రూప రస గంధం బుధ్ధి - ఈ ఆరింటిని, వీటిద్వారావచ్చే విషయాలని,మనచేతిలో లేని విషయాల్ని మనసు లగ్నం చెయ్యకుండా ఇచ్చినా దన్ని ఇచ్చినట్లు స్వీకరిస్తే జ్ఞ్యాని. దానిలో ఇష్టాద్వేషాలు లేకుండా స్వీకరించాలి

న చాస్య కశ్చిన్నిపుణేన ధాతురవైతి జన్తుః కుమనీష ఊతీః
నామాని రూపాణి మనోవచోభిః సన్తన్వతో నటచర్యామివాజ్ఞః

ఈ పరమాత్మ లీలలు ఎలా ఉంటాయో కుమనీషులు (చెడ్డ బుధ్ధి కలవాడు) తెలుస్కోజాలడు
అస్య ఊతీ: ఈ దుష్టబుధ్ది కలవాడు తార్కిక బుధ్ధితో పరమాత్మ లీలలల్ను తెలుసుకోలేడు. నాటకంలో నటుడికి యే రూపముందో, నటుడిని కాకుండా ఆ పాత్రగురించి చెప్తాడు, నటించేవారి నామ రూప్పలను మాటలను గ్రహించాడని అనుకుంటాడు.

స వేద ధాతుః పదవీం పరస్య దురన్తవీర్యస్య రథాఙ్గపాణేః
యోऽమాయయా సన్తతయానువృత్త్యా భజేత తత్పాదసరోజగన్ధమ్

పరమాత్మ ఒక్కొక్క ఆయ్ధానికి ఒక్కొక్క ప్రాముఖ్యముంది. పరమాత్మ రధాంగపాణి. ఆయన చక్రం జ్ఞ్యానానికి ప్రతీక. దురన్తవీర్యస్య - ఆయన ప్రతాపం ఎవరికీ తెలీదు.  పరమాత్మ మాయను ఎవరు సంతతమూ స్వచ్చమైన కపటమైన భక్తి కలిగి ఉంటారో వారు తెలుస్కుంటారు. అందుకే భోజనంచేసేప్పుడు ప్రతీ ముద్దకీ ఒక్కో నామం చెప్పి తీసుకోవాలి. ద్వాదశ నామాలతో (కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూధన, త్రివిక్రమ, వామన, ష్ర్రిధర, హృషికేష, పద్మనాభ, దామోధర)పన్నేండు ముద్దలు తినాలి.) అంటే సంతత అన్వృత్తి కావాలి. అప్పుడు పరమాత్మ మాయను దాటవచ్చు.

అథేహ ధన్యా భగవన్త ఇత్థం యద్వాసుదేవేऽఖిలలోకనాథే
కుర్వన్తి సర్వాత్మకమాత్మభావం న యత్ర భూయః పరివర్త ఉగ్రః

సూతుడు శౌనకులతో - మీరంతా ధన్యులు. ఆయనకు ఆత్మార్పణం చేస్తున్నరు, అన్ని భావములూ ఆయనయందు ఉంచుట వలన మీరు ధన్యులు. దీని వల్ల భయంకరమైన జనన మరణ సంసార చక్రం (పరివర్త) రాదు.

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్
ఉత్తమశ్లోకచరితం చకార భగవానృషిః

మీ ప్రశ్నలు నా సమాధానాలు కలిపితే భాగవతం. ఆయన ధ్యానం, అవతారాలు  లీలలు అన్నీ కలిపి భాగవతం అంటారు. కృష్ణపరమాత్మ తన తేజస్సును భాగవతంలో నిక్షేపం చేసాడు. ఈ భాగవతమే వేదం. ఈ పరమాత్మ చరిత్రని ఋషులు లోకక్షేమం కోసం అందించారు

నిఃశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్
తదిదం గ్రాహయామాససుతమాత్మవతాం వరమ్

అన్ని శుభాలకు ఇది నిలయం. సకలలోకశ్రేయస్సుకు అందించిన భాగవతం జ్ఞ్యానులలో శ్రేష్టుడైన శుకునికి వ్యాసుడు పాఠంగా చెప్పాడు.

సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతమ్
స తు సంశ్రావయామాసమహారాజం పరీక్షితమ్

దీనికన్నా ముందు యేమేమి ఉన్నాయో (వేద ఇతిహాస ) వాటి సారానికి సారం ఈ భాగవతం. ఇది సారానికే సారం.  శుకుడు పరీక్షిత్తునికి చెప్పాడు.

ప్రాయోపవిష్టం గఙ్గాయాం పరీతం పరమర్షిభిః
కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ

పరీక్షిత్తు గంగాతీరంలో ప్రాయోపవేశానికి కూర్చున్నాడు . ఆహారం అన్ని వికారాలకి మూలం. ఆ ఆహరాన్ని వదిలేసి ప్రాయోపవేశం చేశాడు. కృష్ణుని అవతార పరిసమాప్తితో ధర్మ జ్ఞ్యానాలు కూడా పోయాయి

కలౌ నష్టదృశామేష పురాణార్కోऽధునోదితః
తత్ర కీర్తయతో విప్రా విప్రర్షేర్భూరితేజసః

కలి ఆగమనంతో జ్ఞ్యానం పోయింది (నష్ట దృశా). భాగవతమనే సూర్యుడు ఇప్పుడు వచ్చాడు (అధునా ఉదిత:).

అహం చాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్
సోऽహం వః శ్రావయిష్యామి యథాధీతం యథామతి

శుకుడు పరీక్షిత్తుకి చెబుతుంటే అక్కడ నేను కూడా ఉన్నాను. అక్కడే ఉన్నాను కాబట్టి ఆయన అనుగ్రహంతో పొందాను. విన్నదాన్ని విన్నట్టు మళ్ళీ చెప్పాలంటే గుర్వనుగ్రహం గుర్వాదేశం ఉండాలి. నేను ఆయన నుంచి ఇదంతా పొందాను. గురువు వినయశీలుడు కాకపోతే శిష్యులు అహంకారపూరితులవుతారు. అందుకే యథాధీతం యథామతి : అంటే నా గుర్వనుగ్రహంతో నా బుధ్ధికి తోచినంత మీకు చెప్తాను.