Pages

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం రెండో అధ్యాయం రెండవ అధ్యాయం



శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం రెండో అధ్యాయం
రెండవ అధ్యాయం

శౌనకాది ఋషులు సూతున్ని ఆరు ప్రశ్నలు అడిగారు ఆరు అన్నదాని షడూర్ములు (జననం మరణం క్షుత్ పిపాస మోహం శొకం), షడ్భావ వికారాలు (పుట్టుట ఉనికి పెరుగుట తరుగుట మారుట నశించ్హుట పుట్టినవాటికి తప్పకుండా ఉండేవి), అరిషడ్వర్గాలు (కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు) 
ఇవన్నీ కలిపితే పద్దెనిమిది. మహాభారతం అంతా పద్దెనిమిదే. ప్రపంచమంతా యే పద్దెనిమిది చుట్టు ఉన్నదో ఆ పద్దెనిమిదే భారతం. 
వ్యాస ఉవాచ
ఇతి సమ్ప్రశ్నసంహృష్టో విప్రాణాం రౌమహర్శణిః
ప్రతిపూజ్య వచస్తేశాం ప్రవక్తుముపచక్రమే

రోమహర్షణుడి పుత్రుడు సూతుడు. చకాగా అడిగీనందు వల్ల బాగా సంతోషించినా సూతుడు వారు పలికిన ఆ మాటలను మన్నించి బాగా చెప్పడానికి (ప్రవక్తుం) మొదలుపెట్టాడు
గురుస్మరణ పూర్వకాన్ని ప్రవచనం అంటారు. గురువుని స్మరించి మాట్లాడుట 
అందుకే సూతుడు కూడా తన గురువుగారిని గానం చేస్తున్నాడు. పరీక్షిత్తునికి సూతుడు చెప్తున్నప్పుడు వచ్చి విన్న వాళ్ళలో ఈ సూతుడుకూడా ఉన్నాడు
సూత ఉవాచ
యం ప్రవ్రజన్తమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ
పుత్రేతి తన్మయతయా తరవోऽభినేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోऽస్మి

యం ప్రవ్రజన్తమనుపేతమపేతకృత్యం: శుకుని ప్రత్యేకత అనుపేతం. యే ఒక్కడి దగ్గరకీ ఆయన విద్యకోసం వెళ్ళలేదు. అనుపేతం అనే దానికి ఉపనయనం అవ్వకుండా అని కూడా ఉంది అర్థం. కాని అది పూర్తిగా నిజం కాదు. శుకుడు పుట్టగానే శంకరుడు వచ్చి యజ్ఞ్యోపవీతం వేసారు. శుకునికి తండ్రే గురువు. కానీ ఆయన ఎవ్వరినీ ఆశ్రయించలేదు. అందుకే అనుపేతం. అనుపేతంగానే ప్రవ్రజంతం. యే ఉపదేశంలేకుండానే సన్యాసం తీసుకున్నాడు. ఎందుకంటే అపేతకృత్యం. ఈయన చెయ్యవలసిన పనులేమీ లేవు. శుకుడు కృతకృత్యుడు - చెయ్యవలసినవేమీ లేని వాడు
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ: పుతృఎతి తన్యమతయా: వ్యాసుడు పుత్రుడని విరహంతో పిలవగా
అన్నిప్రాణుల హృదయంలోకి వెళ్ళగలవాడైన ఆయంకి నమస్కరిస్తున్నను
ఇక్కడ అభినేదు: అని మునిం అంటున్నాడు. ప్రతిద్వనించాడు బదులిచ్చాడు అయినా మౌనంగా ఉన్నాడు. 
యః స్వానుభావమఖిలశ్రుతిసారమేకమధ్యాత్మదీపమతితితీర్షతాం తమోऽన్ధమ్
సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనామ్

గురువు ఎలాంటి వారంటే - స్వానుభావం అంటే తన ప్రభావన్ జ్ఞ్యానం విధానం ఇలాంటి వాటిని 'అఖిల శ్రుతి సారం'. పరమాత్మ స్వరూపం అఖిల శ్రుతిసారం. తమోగుణంతో సంసారాన్ని దాటలేనివారికి ఇది ఆధ్యాత్మ దీపం. అతి తితీర్షతాం - కటిక చీకటిని దాటలేని వారికి. అలాంటి సంసారులకు దయతో రహస్యమైన పురాణం. ఇది రహస్యమైన పురాణం ఎందుకంటే ధర్మమును ధర్మంగానే ఆచరించాలని చెప్పే పురాణం. ఇది ధర్మం గబట్టి  ఆచరించమని చెప్పే పురాణం. అటువంటి వ్యాససూనుడైన శుకునికి నమస్కరిస్తున్నాను. 

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

భారతానికి జయం అనే పేరు. అంతే కాదు పురాణ సరాన్ని జయం అంటారు. జయ అంటే 18. పది ఇందిర్యములతో అష్టప్రకృతిని గెలుచుట. 

మునయః సాధు పృష్టోऽహం భవద్భిర్లోకమఙ్గలమ్
యత్కృతః కృష్ణసమ్ప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి

శిష్యులు మంచి మాట లోకమంగళమైన మాట అడిగారని, యే ప్రశ్నతో భగవానుడు సంతోషితాడో అది అడిగారని సూతుడు ...

స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే
అహైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి

జీవుడికి ఉత్తమధర్మమేదంటే దేనివల్ల పరమాత్మ మీద భక్తి కలుగుతుందో అది ఉత్తమ ధర్మం. పరమాత్మ మీద భక్తి కలగడమే అది కూడా అహైతుకీ భక్తి, కారణంలేని భక్తి కావాలి. అది అప్రతిహతంగా ఉండాలి. దేనివల్ల అది కలుగుంతుందో అది ధర్మం. దాని వల్ల ఆత్మ ప్రసన్నమవుతుంది. ఆత్మ హాయిగా ఉంటుంది. 

వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్

పరమాత్మ యందు భక్తి కలిగితే ఎమవుతుంది? అది వైరాగ్యాన్ని కలిగిస్తుంది. జ్ఞ్యానం కూడా కలుగుతుంది. అది ప్రయోజనం కాంక్షించని జ్ఞ్యానం. స్వరూపవిరోధి వుప్పాయ విరోధి ఫలవిఋఓధి అని విరోధి త్రయం. నేను స్వతంత్రున్ని అనుకోవడం స్వరూపవైరోధి.నన్ను ఎవరో కాపడతారనేది ఉపాయ విరోధి. మోక్షాన్ని చేరడంవల్ల మనకి ఆనందం కలుగుతుంది అనేది ఫలవిరోధి. అహమన్నం - మనం అన్నం వంటి వారం. మనల్ని భుజిచేది పరమాత్మ. ఇలాంటి విరోదులు తొలగడమే అహైతుకీ జ్ఞ్యానం

ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః
నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్

ఒకవేళ ఆచరించిన ధర్మం పరమాత్మకోసం కాకుంటే భక్తిని కలిగించడానికి కాకుంటే దానివల్ల ఆయసమే తప్ప ఏమి లేదు. నిజంగా ధర్మం ఆచరిస్తే భగవంతుని కధ వినాలి అనిపించే కోరిక కలగలేదంటే యెన్ని ధర్మాలు ఆచరించినా ఫలం లేదు

ధర్మస్య హ్యాపవర్గ్యస్య నార్థోऽర్థాయోపకల్పతే
నార్థస్య ధర్మైకాన్తస్య కామో లాభాయ హి స్మృతః

ధర్మానికి ఎప్పుడూ అర్థం ప్రయోజనం కాదు. ఎందూంటే అర్థం శాశ్వతం కాదు. మోక్షం ప్రాసిదించే ధర్మానికి అర్థం ప్రయోజనం కాదు. ధర్మము నశించంది శాశ్వతమైనది. నశించని ధర్మానికి నశించే అర్థం ఫలితం కాదు. ధర్మం వల్ల అర్థం వచ్చినా ధర్మం అర్థం కొరకు కాదు. ధర్మం మోక్షం కొరకు. ధనము లభించింది అంటే అది ధర్మాచరణ కొరకే. అర్థం కలిగేది దిగులు లేకుండా ధర్మాన్ని ఆచరించడానికి. యే వ్యవస్థ అయిన ధర్మాచరణకే. ధర్మం మోక్షం కోసమే. 

కామస్య నేన్ద్రియప్రీతిర్లాభో జీవేత యావతా
జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః

ఇంద్రియప్రీతి కామానికి ప్రయోజనంకాదు. బ్రతికున్నంతకాలం అనుభవించినా తృప్తి కలగదు. నిజముగా తృప్తి కలిగితే సంసారం ఇంతకాలం ఉండదు. మనమాచరించే కర్మతో జీవునికి తత్వం తెలుసుకోవాలనే భావం కలగదు. దేన్ని ఆచరించుటవలన్ తత్వజిజ్ఞ్యాస కలుగుతుందో అది కర్మ. అంతవరకూ అవి కర్మలు గావు. జీవాత్మ పరమాత్మ తత్వాన్ని తెలుకోవాలని కోరిక కలిగించంత కాలం అది ధర్మమూ కాదు. ఆచరించేవాటిలో నేను నాది అనేది విడిచిపెట్టడమే ధర్మము. 

వదన్తి తత్తత్త్వవిదస్తత్త్వం యజ్జ్ఞానమద్వయమ్
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే

మరి తత్వం అని దేన్ని అంటారు. రెండుగా లేని జ్ఞ్యానాన్ని అంటారు. యేకమేవాయ అద్వితీయం బ్రహ్మా. పరమాత్మ ఒక్కడే. ఆయనను పొందడమే స్వరూపం. దానికి కవల్సిన ధర్మాన్ని అచరించుటే ధర్మము. ఆయానను సేవించడమే ధర్మము, సేవించడం మీద కామం, సేవించడానికే అర్థం. ఆ పరమాత్మనే బ్రహ్మ అని భగవనుడని పరమాత్మ అని అంటారు. పరమాత్మ ఒక్కడు అని తెలుసుకోవడమే తత్వం. ఆ జ్ఞ్యానం కలిగితేనే అది ధర్మం

తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా
పశ్యన్త్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా

ఇది అందరికీ కలగదు. మునులకి కలుగుతుంది. మునులంటే నిరంతరం భగవంతున్ని స్మరణ చేస్తుండేవాళ్ళు. పరమాత్మను మననం చెయ్యడానికి ఉండే సాధన మౌనం... జ్ఞ్యానవైరాగ్యములు కూడుకున్న భక్తితోనే పరమాత్మని చేరవగలము. మునులు ఆత్మలోనే ఉన్న పరమాత్మని చూస్తారు. 

అతః పుమ్భిర్ద్విజశ్రేష్ఠా వర్ణాశ్రమవిభాగశః
స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణమ్

వర్ణవిభాగానుకూలంగా ఆశ్రమవిభాగలకనుకూలంగా చెప్పబడిన ధర్మాలను ఆచరించాలి. చక్కగా ఆచరించిన ధర్మం యొక్క సిధ్ధి ఎమిటంటే హరితోషణం - పరమాత్మ సంతోషం. 
తస్మాదేకేన మనసా భగవాన్సాత్వతాం పతిః
శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా

యేకాగ్రమైన మనసుతో పరమాత్మ గురించే వినాలి, కీర్తించాలి, ధ్యానించాలి, పూజించాలి. 
యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రన్థినిబన్ధనమ్
ఛిన్దన్తి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారతిమ్

అలా చేస్తే అహంకారం మమకారం అనే కర్మ గ్రంధిని జ్ఞ్యానులు ఛేదిస్తారు. ఇటువంటి పరమాత్మ కధలయందు ప్రీతి కలగని వారెవరు?
శుశ్రూషోః శ్రద్దధానస్య వాసుదేవకథారుచిః
స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థనిషేవణాత్ 

మహానుభావులని సేవించాలనే కోరిక కలగడంవల్ల, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల లాభం వాసుదేవుని కధ మీద రుచి పుడుతుంది. 
మన మన్సుల్లో పరమాత్మ కధలపై ప్రీతి కలగాడానికి మార్గం ఎమిటి? పర్మాత్మ కధలు వినాలి అని బుధ్ధి పుట్టలి అన్నా కొన్ని పాపాలు పోవాలి. పాపాలలో కూడా మూడురకాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రకృతిమీద ప్రీతి. అది సంసారం తప్ప మరి దేన్నీ చూడనివ్వదు. ఇంకోరకమైన పాపం - సంసారమ్మీద ప్రీతి ఉన్న్నా అప్పుడప్పుడు గుడికి వెల్దాం అనిపిస్తుంది. మూడవది రెండవది పుణ్యతీర్థాలను సేవించాలి అనే బుధ్ధి కలగడం. దాని వల్ల పెద్దలని సేవించాలి అనే బుధ్ధి కలుగుతుంది.

శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః
హృద్యన్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్

తనకధలను వింటున్నటివంటి వారి హృదయంలో ప్రవేశిస్తాడు పరమాత్మ. మహానుభావులచేత గానం చెయ్యబడే వాడు, మహానుభావులచేత శ్రవణం చెయ్యబడతాడు తన కథ వినేవారి హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న పాపాలను యేరిపారేస్తాడు. ఎందుకంటే ఆయన సుహృత్ సతాం కనుక. అంటే మన ఇంటికి వచ్చి మనైంటిని శుభ్ర పరుస్తాడు. 
నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవతసేవయా
భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ 

నిత్యం భాగవతసేవ చెయ్యడంవల్ల పరమాత్మ పాపలను తొలగిస్తాడు. ఉత్తములచేత కీర్తిచబడె పరమాత్మ మీద నిష్ట తో కూడిన భక్తి కలుగుతుంది
తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే
చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి

అది కలగగానే మనసులో ఉన్న గుణాల్లో రజస్తమో భావలు - కామలోభాలు - పరమాత్మ అనుగ్రహంవల్ల ఈ భావలతో మురికిపడదు. ఇవి తొలగిన తరువాత మన్సౌ సత్వంలో ఉంటుంది. 

ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తియోగతః
భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసఙ్గస్య జాయతే

అప్పుడు ప్రశాంతమైన మనసు కలిగితుంటాడు పరమాత్మ భక్తి కలగడంవల్ల. అలాంటివారికి, సామసారిక విషయములయందు సంగం వదిలినవాడికి పరమాత్మ తత్వం అంటే యెమిటో తెలుస్తుంది

భిద్యతే హృదయగ్రన్థిశ్ఛిద్యన్తే సర్వసంశయాః
క్షీయన్తే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే

సంసారనికి మనకీ వేసిన ముడి - ప్రకృతిసంబంధం. ఎంతకాలం నేను నాది అంటూ ఉంటామో శరీరమే ఆత్మ అనుకోవడం హృదయగ్రంధి. అది ఉన్నంతవరకూ నీటిల్లో బుడగల్లాగ పుట్టేది మరణం కోసమే. ఆ హృదయానికి ఉన్న ముడి చేదించబడుతుంది అంటే అహంకారం పోతుంది.  ఎప్పుడైతే సంశయాలు పోయాయో అప్పుడు చెయ్యవలసిన కర్మలేవీ ఉండవు. చేసిన కర్మలన్నీ తొలగాలంటే సందేహాలు తొలగాలి. సందేహాలు తొలగాలంటే అహంకారం తొలగాలి. ఇదంతా ఎప్పుడు తొలుగుతుంది అంటే ఆత్మ రూపుడైన పరమాత్మ సాక్షత్కారం కలిగిన నాడు. అప్పుడు అహంకారం తొలుగుతుంది. దానివల్ల సంశయాలు పోతాయి. వాటివల్ల కర్మ నశిస్తుంది, అప్పుడు హృదయగ్రంధి చేధింపబడుతుంది

అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా
వాసుదేవే భగవతి కుర్వన్త్యాత్మప్రసాదనీమ్

కవి అంటే ఇక్కడ జ్ఞ్యానులు. వారందరూ పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటారు. ఎలంటి భక్తి పరిపూర్ణమైన ఆనందంతో భక్తి కలిగి ఉంటారు. భక్తి కలిగి ఉండటమే మనసును ప్రసన్నంగా ఉంచుతుంది -ఆత్మప్రసాదిని. 

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్యుక్తః పరమపురుష ఏక ఇహాస్య ధత్తే
స్థిత్యాదయే హరివిరిఞ్చిహరేతి సంజ్ఞాః శ్రేయాంసి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః

ఎవరిమీద భక్తి కలగాలి? ప్రకృతి ఏర్పడింది అంటే దానిలో గుణాలుంటాయి. ఆ గుణాలను పరమాత్మ స్వీకరించి ఆయా గుణాల కార్యాలను చేస్తారు. యే పని చేస్తున్నప్పుడు ఆ గుణం తీసుకుంటాడు. ఆగుణాలతో కూడి ఉన్న పరమాత్మ ఒక్కడే. ఆయనే మూడు గుణాలతో మూడు కర్మలను చేస్తున్నడు. 
'శ్రేయాంసి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః' మనమిప్పుడు ఎవరిని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. మనం యే రూపమున్న స్వామిని సేవిద్దాం? మన శ్రేయస్సు సాత్వీకమైన ఆరాధన్ చేస్తేనే. 

పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః
తమసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనమ్

యెలాగైతే భూమినుంచి కట్టే కట్టే నించి పొగ పొగ నుంచి మంట వస్తాయో పరమాత్మ తత్వము నుండే ప్రకృతివస్తుది. దానినుంచే ముగ్గురు మూర్తులు వస్తారు. త్రయీమయి అంటే వేదం. ఇలాంటి అగ్ని హోత్రం పొగ నుంచే వస్తుంది. ఆ అగ్ని కట్టె నుంచి వస్తుంది

భేజిరే మునయోऽథాగ్రే భగవన్తమధోక్షజమ్
సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పన్తే యేऽను తానిహ

ఇంతకు ముందు మునులు ఎవరిని సేవించారో ఆ అధోక్షజుడుని సేవించు. ఇంద్రియాలను వాటివల్ల పుట్టిన వ్యాపారలను తగ్గించే వాడు అధోక్షజుడు. విశుద్దమైన సత్వగుణం క్షేమాని కల్పిస్తుంది. అది అనుసరించేవారు కూడా క్షేమంగా ఉంటారు

ముముక్షవో ఘోరరూపాన్హిత్వా భూతపతీనథ
నారాయణకలాః శాన్తా భజన్తి హ్యనసూయవః

మోక్షమ్యందు కోరిక ఉన్నవారు శ్రీమన్నారయణున్ని సేవించాలి. అసూయలేకుండా సేవించాలి. అసూయ అంటే ఇతరదేవతా నిందలేకుండా సేవించాలి. 

రజస్తమఃప్రకృతయః సమశీలా భజన్తి వై
పితృభూతప్రజేశాదీన్శ్రియైశ్వర్యప్రజేప్సవః

వారిమనస్సులో ఎలాంటి భావముంటే అలాంటివారిని సేవిస్తాం. ఇతరదేవతలని ఎందుకు ఆరాదిస్తారు: పితృదేవతలని భూతపతిని ప్రజాపతిని - సంపదను శాసకత్వం సంతానాన్ని కావలంటే వారిని ఆరాధిస్తారు

వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః
వాసుదేవపరా యోగ వాసుదేవపరాః క్రియాః
వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః
వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః

అన్నివేదాలు, యాగాలు, యజ్ఞ్యాలు, క్రియలు, మనకి కలిగే జ్ఞ్యానం, తపస్సు, ఆచరించే ధర్మం, మనకి లభించే దిక్కు గతి కూడా వాసుదేవపరమే

స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మమాయయా
సదసద్రూపయా చాసౌ గుణమయాగుణో విభుః

అటువంటి పరమాత్మ ప్రళయమవ్వగానే ఆత్మమాయతో ప్రపంచాన్ని సృష్టించారు. ఆ మాయ సత్ అసత్ రూపం. ప్రళయకాలంలో ఉన్నది లేదు అన్న వ్యవహారమే లేదు. ఉండేది ఎప్పుడూ ఉంది కాని ప్రళయంలో చూసే వాడే లేడు చెప్పేవాడే లేడు. అందుకే సత్ అసత్ లేదు. పరమాత్మ మాయ సత్ అసత్ రూపం. ఉన్నట్టూ లేనట్టు కనపడేది. 'నేను చెప్పినదే సిద్ధాంతం'అని ఎవ్వరూ చెప్పలేరు. ఇది పరమాత్మ మాయ. ఈ మాయ గుణమయి. కాని పరమాత్మకి గుణముండదు. గుణం కలిగిన మాయ చేత యే గుణములు లేని పరమాత్మ సృష్టిస్తాడు. 

తయా విలసితేష్వేషు గుణేషు గుణవానివ
అన్తఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృమ్భితః

మాయా ప్రభావం వలన మూడు గుణాలు వ్యాపిస్తాయి... ఆ గుణాలలో స్వామి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించి తన విజ్ఞ్యానంతో విజృంభించి ఆ గుణములు పరమాత్మకే ఉన్నాయా అనిపిస్తాడు. కాని ఆయన విజృంభించేది ప్రకాశించేది ఆయాన విజ్ఞ్యానంతోనే. జ్ఞ్యానం ఉన్నచోట మాయ పనిచెయ్యదు.
పరమాత్మ మాయచేత విజృంభించిన గుణత్రయములో గుణములులేని తాను ప్రవేశించి తన విజ్ఞ్యానంతో సర్వత్ర వ్యాపించి సృష్టికార్యం జరిపి వేరే వారికి పరమాత్మే గుణవంతుడూ అనిపిస్తాడు. తను మాత్రం నిర్గుణుడుగా విజ్ఞ్యానమయుడుగా ఉంటాడు. 

యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు
నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్

నిప్పు కట్టెలలో (దారుషు) ఉంటుంది. యే కట్టెలోనైనా ఒకటే నిప్పు. కానిప్రతీ కట్టెలో విడివిడిగా కనపడుతుంది. తనకు కారణమైన కట్టెలలో విడివిడిగా కనపడే అగ్నిలాగ అన్ని ప్రాణులలో ఉండే పరమాత్మ చాలా మందిలా అనిపిస్తాడు (నానేవ భాతి) 

అసౌ గుణమయైర్భావైర్భూతసూక్ష్మేన్ద్రియాత్మభిః
స్వనిర్మితేషు నిర్విష్టో భుఙ్క్తే భూతేషు తద్గుణాన్

పంచ్భూతములు పంచజ్ఞ్యానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు అన్నీ ప్రకృతినుంచే పుట్టాయి. గుణమయములైన భావాలతో ఉన్న వీటిలోకి ప్రవేశించి యే గుణమూ కోరికా వికారం లేని వాడు అన్నిటినీ అనుభవిస్తున్నట్లు కనపడతాడు.

భావయత్యేష సత్త్వేన లోకాన్వై లోకభావనః
లీలావతారానురతో దేవతిర్యఙ్నరాదిషు

ఈ పరమాత్మే అన్ని లోకాలను సృష్టిస్తాడు రక్షిస్తాడు సమ్హరిస్తాడు. ఈయన భూతభావన్ - అన్నిలోకాలను నిలిపేవాడు. తానే ఆయా గుణములతో చేరి తన లీలగా పరమాత్మ అనేక అవతారాలు స్వీకరిస్తాడు. ఆయా గుణాలని స్వీకరించినట్లు కంపిస్తాడు. పరమాత్మ దేవతలుగా పశుపక్షాదులుగా మనుషులుగా అవతరిస్తాడు. ప్రతీ ప్రాణిలో తానే ఉంటాడు అన్నీ తానే అనుభవిస్తున్నట్లు కనిపిస్తాడు.