Pages

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం యేడవ అధ్యాయం

శౌనక ఉవాచ

నిర్గతే నారదే సూత భగవాన్బాదరాయణః
శ్రుతవాంస్తదభిప్రేతం తతః కిమకరోద్విభుః

నారదభగవానుడు వెళ్ళిన తరువాత ఆయన చెప్పినది విన్న వ్యాసుడు ఏమి చేసాడు

సూత ఉవాచ
బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమః పశ్చిమే తటే
శమ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధనః

సరస్వతీ నదికి బ్రహ్మనది అని పేరు. ఆ నదికి పశ్చిమతీరంలో శమ్యాప్రాస అని ఆశ్రమం.

తస్మిన్స్వ ఆశ్రమే వ్యాసో బదరీషణ్డమణ్డితే
ఆసీనోऽప ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనః స్వయమ్

ఆ ఆశ్రమంలో బదరీ వృక్షాలు (రేగు చెట్లు) ఎక్కువ. (అలాగే బృందావనం, బృంద అంటే పల్లేరు). తన ఆశ్రమంలో ఆచమనం చేసి (ఉపస్పృశ్య ) ప్రాణాయమం చేసాడు (ప్రణిదధ్యౌ ).

భక్తియోగేన మనసి సమ్యక్ప్రణిహితేऽమలే
అపశ్యత్పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయమ్

పరిశుధ్ధమైన మనసు పరమాత్మ యందు లగ్నంచేసి. లగ్నం చెయ్యగానే పరమాత్మ సాక్షాత్కారం కలిగింది (అపశ్యత్పురుషం ). పరమాత్మనే కాకుండా ఆయన మాయను కూడ సాక్షాత్కరించుకున్నాడు

యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకమ్
పరోऽపి మనుతేऽనర్థం తత్కృతం చాభిపద్యతే

యేమాయచేత మోహింపబడతాడో (అనాత్మని ఆత్మ అనుకోవడం) ఆ మాయ చేత నేనే ప్రకృతి అనుకుంటాడు. దానితో అనర్ధాన్ని పొందుతాడు.

అనర్థోపశమం సాక్షాద్భక్తియోగమధోక్షజే
లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతసంహితామ్

అజ్ఞ్యానంవల్ల (లోకస్యాజానతో ) ప్రకృతిసమ్మోహంవల్ల కలిగే అన్ర్ధాలనుంచి ఉపశమింపచేసేది పరమాత్మ యందు భక్తి యోగం. అందుకు భాగవతం వ్రాశాడు

యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే
భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపహా

అది వింటే కృష్ణునియందు భక్తి కలుగుతుంది, అది శోక మోహ భయాపహం. శారీరిక బాధ శోకం మానసిక బాధ దుఖం. ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకోవడం మోహం. శోకమునూ మోహమునూ భయమునూ తొలగించగలదు ఆ భాక్తి

స సంహితాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజమ్
శుకమధ్యాపయామాస నివృత్తినిరతం మునిః

భాగవతమనే సాత్వత సమ్హితలో ఉన్న విషయాలను కూర్చి పుత్రుడైన శుకునికి వినిపించాడు. ఆ శుకుడు నివృత్తియందు ఆసక్తి ఉన్నవాడు.

శౌనక ఉవాచ
స వై నివృత్తినిరతః సర్వత్రోపేక్షకో మునిః
కస్య వా బృహతీమేతామాత్మారామః సమభ్యసత్

నివృత్తి మార్గం లో ఉండి ప్రాపంచకమైన వాటిని ఉపేక్షించి పరమాత్మ గుణాలను మననం చేసే శుకుడు ఉన్నవాటిలోకల్లా పెద్దదైన (బృహతీ) గ్రంధాన్ని సహజంగానే భక్తి ఉన్న శుకయోగీంద్రుడు యే ప్రయోజనం ఆశించి విన్నాడు

సూత ఉవాచ
ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రన్థా అప్యురుక్రమే
కుర్వన్త్యహైతుకీం భక్తిమిత్థమ్భూతగుణో హరిః

సాంసారిక విషయములయందు వాసనలేనివారైనా , ఆత్మారాములు (ఆత్మ యందు పరమాత్మను సాక్షాత్కరించుకొన్నావారు) అయిన, మునులైన భాగవత కధలు భగవత్గుణానువర్ణానికి విఘాతం కాదు. పరమాత్మ యందు వారు అహైతుకీ భక్తి కలిగి ఉంటారు. అత్యంత వాత్సల్యపూరితమైన అవతారాన్ని ఇక్కడ చెప్పారు

హరేర్గుణాక్షిప్తమతిర్భగవాన్బాదరాయణిః
అధ్యగాన్మహదాఖ్యానం నిత్యం విష్ణుజనప్రియః

పరమాత్మయందే పరమాత్మ గుణములచేత ఆకర్షింపబడే మనసు గలవాడు కాబట్టి ఈ పెద్ద కదను తండ్రివద్ద నేర్చుకున్నాడు(అధ్యగాన్మహదాఖ్యానం ). వేదవేదాంతములకన్నా విశిష్టమైనది భాగవతం - భాగవతోత్తముల గుణవర్ణన ఇందులో ఉంది కాబట్టి దీన్ని వినడానికి శుకుడు ముందుకొచ్చాడు

పరీక్షితోऽథ రాజర్షేర్జన్మకర్మవిలాపనమ్
సంస్థాం చ పాణ్డుపుత్రాణాం వక్ష్యే కృష్ణకథోదయమ్

కృష్ణకథోదయమ్ - కృష్ణ పరమాత్మ కధను వృధ్ధిపొందించే పాండుపుత్రుల జీవనం వారి కీర్తిని (సంస్థాం చ పాణ్డుపుత్రాణాం), పరీక్షిత్తు పుట్టుక అతను చేసే పనులు(కర్మ) ఆయన మోక్షం(విలాపనమ్). ఇవన్నీ కృష్ణుని కధలో అంతర్లీనంగా ఉన్నాయి.

యదా మృధే కౌరవసృఞ్జయానాం వీరేష్వథో వీరగతిం గతేషు
వృకోదరావిద్ధగదాభిమర్శ భగ్నోరుదణ్డే ధృతరాష్ట్రపుత్రే

భారతంలో కౌరవ పాండవులు వారి వీరులు మరణించినప్పుడు మిగిలిన ధుర్యోధనున్ని భీముడు గధతో ఊరు భాగం బద్దలుకోట్టాడు

భర్తుః ప్రియం ద్రౌణిరితి స్మ పశ్యన్కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి
ఉపాహరద్విప్రియమేవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయన్తి

తనస్వామి అయిన దుర్యోధనునికి ఇది ప్రియం కలిగిస్తుందని ద్రోణ పుత్రుడు, ద్రౌపతి పుత్రులని వారు నిద్రించుచుండగా సంహరించాడు. ఈ పని వల్ల ఎవరికీ ప్రీతి కలగనిది (ఉపాహరద్విప్రియమేవ ).

మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా
తదారుదద్వాష్పకలాకులాక్షీ తాం సాన్త్వయన్నాహ కిరీటమాలీ

అశ్వధ్ధామ తన ప్రభువుకి న్యాయం చేస్తున్నట్లు తలచి ఉపపాండవులని నిద్రపోతుండగా సంహరించాడని విన్న ద్రౌపతి విలపించి. ఆ ద్రౌపతిని అర్జనుడు ఓదార్చాడు. (కొన్ని వేల మంది రజులు వారి కిరీటాలని అర్జునిని పాదం ముందు ఉంచడంవల్ల ఈయంకు కిరీటిమాలి అని పేరు)

తదా శుచస్తే ప్రమృజామి భద్రే యద్బ్రహ్మబన్ధోః శిర ఆతతాయినః
గాణ్డీవముక్తైర్విశిఖైరుపాహరే త్వాక్రమ్య యత్స్నాస్యసి దగ్ధపుత్రా

బ్రహ్మబంధువు అంటే బ్రహామణుడిలాంటివాడు. అలాంటివాడి శిరస్సుని తీసుకొస్తాను. నిప్పు పెట్టినవాడు విషం పెట్టినవాడు భార్యను అపహరించినవాడు ఆయుధంతో కొట్టడానికి వచ్చినవాడు రాజ్యాన్ని అపహరించినవాడు ప్రాణం తీసేవారు -  ఈ ఆరుపనుల్లో ఎది చేసినా వాడిని ఆతతాయి అంటారు. మీరు దహనసంస్కారాలు చేసి స్నానం చేసేలోపు తీసుకుని వస్తాను

ఇతి ప్రియాం వల్గువిచిత్రజల్పైః స సాన్త్వయిత్వాచ్యుతమిత్రసూతః
అన్వాద్రవద్దంశిత ఉగ్రధన్వా కపిధ్వజో గురుపుత్రం రథేన

అచ్యుతమిత్రసూతః - కృష్ణుడు అర్జునికి సారధిమాత్రమే కాదు మిత్రుడుకూడా. అర్జునికి ఉన్న ఒక ధైర్యం కృష్ణుడైతే రెండొవది కపి ద్వజం. ఆయన గుఱ్ఱాలు అగ్ని ఇచ్చినవి.  అర్జునుడు అశ్వధ్ధామ వెంట పడ్డాడు (అన్వాద్రవత్) కవచమూ (దంశిత) ఆయుధము తీసుకుని

తమాపతన్తం స విలక్ష్య దూరాత్కుమారహోద్విగ్నమనా రథేన
పరాద్రవత్ప్రాణపరీప్సురుర్వ్యాం యావద్గమం రుద్రభయాద్యథా కః

ఉద్విగ్నమనసుతో అశ్వధ్ధామ అర్జునిని చూసి పరిగెత్తాడు. శంకరున్ని చూసి పరుగెత్తిన దక్షునిలాగ. (క: అంటే దక్షప్రజాపతి)

యదాశరణమాత్మానమైక్షత శ్రాన్తవాజినమ్
అస్త్రం బ్రహ్మశిరో మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజః

గుఱ్ఱములు అలసిపోయేదాక పరుగెత్తి, ఇంక పారిపోలేనప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఆచమనం చేసి ప్రయోగించాడు.

అథోపస్పృశ్య సలిలం సన్దధే తత్సమాహితః
అజానన్నపి సంహారం ప్రాణకృచ్ఛ్ర ఉపస్థితే

అశ్వధ్ధామకి బ్రహ్మాస్త్రప్రయోగం మాత్రమే తెలుసు ఉపసంహారం తెలీదంప్పటికీ ప్రాణాపాయంవచ్చింది కాబట్టి ప్రయోగించాడు.

తతః ప్రాదుష్కృతం తేజః ప్రచణ్డం సర్వతో దిశమ్
ప్రాణాపదమభిప్రేక్ష్య విష్ణుం జిష్ణురువాచ హ

అది ప్రచండవేగంతో వస్తున్నప్పుడు  ప్రాణానికే ప్రమాదం యేర్పడింది

అర్జున ఉవాచ
కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామభయఙ్కర
త్వమేకో దహ్యమానానామపవర్గోऽసి సంసృతేః
త్వమాద్యః పురుషః సాక్షాదీశ్వరః ప్రకృతేః పరః
మాయాం వ్యుదస్య చిచ్ఛక్త్యా కైవల్యే స్థిత ఆత్మని

సంసారం నుంచి జనాలని రక్షిచగలవాడివి నీవు
నీవే ఆది పురుషుడివి ఈ
స ఏవ జీవలోకస్య మాయామోహితచేతసః
విధత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాదిలక్షణమ్

ధర్మ జ్ఞ్యాన వైరాగ్యాలంటే ఎమిటో భోధించడానికి అందరినీ నీ మాయతో కాపాడుతున్నావు.

తథాయం చావతారస్తే భువో భారజిహీర్షయా
స్వానాం చానన్యభావానామనుధ్యానాయ చాసకృత్

నీ ఈ అవతారం భూభరాన్ని తొలగించడానికి. నిన్ను ధ్యానం చేసేవాళ్ళను కాపాడేవాడివి నీవు

కిమిదం స్విత్కుతో వేతి దేవదేవ న వేద్మ్యహమ్
సర్వతో ముఖమాయాతి తేజః పరమదారుణమ్

పరమభయంకరంగా అన్ని దిక్కులను ఆక్రమించి వస్తున్న ఈ తేజస్సునుంచి నన్నున్ నువ్వే కాపాడాలి

శ్రీభగవానువాచ
వేత్థేదం ద్రోణపుత్రస్య బ్రాహ్మమస్త్రం ప్రదర్శితమ్
నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే

న హ్యస్యాన్యతమం కిఞ్చిదస్త్రం ప్రత్యవకర్శనమ్
జహ్యస్త్రతేజ ఉన్నద్ధమస్త్రజ్ఞో హ్యస్త్రతేజసా

బ్రహ్మాస్త్రాన్ని ఇంకో అస్త్రంతో తిప్పి పంపలేము, నీవు కూడా బ్రహ్మాస్త్రాని ప్రయోగించు

సూత ఉవాచ
శ్రుత్వా భగవతా ప్రోక్తం ఫాల్గునః పరవీరహా
స్పృష్ట్వాపస్తం పరిక్రమ్య బ్రాహ్మం బ్రాహ్మాస్త్రం సన్దధే

సంహత్యాన్యోన్యముభయోస్తేజసీ శరసంవృతే
ఆవృత్య రోదసీ ఖం చ వవృధాతేऽర్కవహ్నివత్

దృష్ట్వాస్త్రతేజస్తు తయోస్త్రీల్లోకాన్ప్రదహన్మహత్
దహ్యమానాః ప్రజాః సర్వాః సాంవర్తకమమంసత

ప్రజోపద్రవమాలక్ష్య లోకవ్యతికరం చ తమ్
మతం చ వాసుదేవస్య సఞ్జహారార్జునో ద్వయమ్

కృష్ణుడి అభిప్రాయం తెలుసుకిని అర్జనుడు రెండు అస్త్రాలని ఉపసమ్హరించాడు

తత ఆసాద్య తరసా దారుణం గౌతమీసుతమ్
బబన్ధామర్షతామ్రాక్షః పశుం రశనయా యథా

అశ్వధ్ధామను కట్టి తీసుకుపోతున్నాడు అర్జనుడు

శిబిరాయ నినీషన్తం రజ్జ్వా బద్ధ్వా రిపుం బలాత్
ప్రాహార్జునం ప్రకుపితో భగవానమ్బుజేక్షణః

కోపముతో శ్రీకృష్ణుడు అర్జనుడి ప్రతిజ్ఞ్య గుర్తుచేసాడు

మైనం పార్థార్హసి త్రాతుం బ్రహ్మబన్ధుమిమం జహి
యోऽసావనాగసః సుప్తానవధీన్నిశి బాలకాన్

వీడు బ్రాహ్మణుడు కాడు బ్రహ్మబంధువు. తప్పు చెయ్యని, రాత్రిపూట పడుకున్నవాళ్ళను, చిన్న పిల్లలను చంపాడు - ఈ నాలుగూ తప్పే.

మత్తం ప్రమత్తమున్మత్తం సుప్తం బాలం స్త్రియం జడమ్
ప్రపన్నం విరథం భీతం న రిపుం హన్తి ధర్మవిత్

ధర్మం తెలిసినవాడు మద్య్పానం సేవించినవాడిని, ధనం మొదలైన వాటివల్ల ఉన్న మదం ప్రమత్తం, పిచ్చివాడిని, పడుకున్నవాడిని, పిల్లవాడిని, స్త్రీని, శరణమన్నవాడిని, రధంలేని వాడిని, భయపడినవాడిని సంహరించకూడదు

స్వప్రాణాన్యః పరప్రాణైః ప్రపుష్ణాత్యఘృణః ఖలః
తద్వధస్తస్య హి శ్రేయో యద్దోషాద్యాత్యధః పుమాన్

ఇతరుల ప్రాణాలు తీసి వాడి ప్రాణాలు నిలుపుకోవాలనుకునేవాడు అఘేణ: - దయలేనివాడు, చెడ్డవాడు
అలాంటివాన్ని చమపడం వాడికే మేలు. వాడుచేసిన తప్పుల వలన వాడు నరకానికి పోతాడు

ప్రతిశ్రుతం చ భవతా పాఞ్చాల్యై శృణ్వతో మమ
ఆహరిష్యే శిరస్తస్య యస్తే మానిని పుత్రహా

నా ముందరే ద్రౌపతికి ప్రతిజ్ఞ్య చేసావు కదా.

తదసౌ వధ్యతాం పాప ఆతతాయ్యాత్మబన్ధుహా
భర్తుశ్చ విప్రియం వీర కృతవాన్కులపాంసనః

ఆత్మబంధువుని చంపినవాడు ఆతతాయి. మనకి కీడు చేసాడు వాడి స్వామికి కూడా కీడే చేసాడు.

సూత ఉవాచ
ఏవం పరీక్షతా ధర్మం పార్థః కృష్ణేన చోదితః
నైచ్ఛద్ధన్తుం గురుసుతం యద్యప్యాత్మహనం మహా

ఇదంతా అర్జనుని గుణాన్ని పరీక్షించడానికి అడిగాడు కృష్ణుడు.
తనను చంపినవాడు (తన అంటే తన పుత్రులని) అయిన గురుపుత్రుని చంపలేదు

అథోపేత్య స్వశిబిరం గోవిన్దప్రియసారథిః
న్యవేదయత్తం ప్రియాయై శోచన్త్యా ఆత్మజాన్హతాన్

కట్టెసి ద్రౌపతికి వివరించాడు జరిగింది

తథాహృతం పశువత్పాశబద్ధమవాఙ్ముఖం కర్మజుగుప్సితేన
నిరీక్ష్య కృష్ణాపకృతం గురోః సుతం వామస్వభావా కృపయా ననామ చ

తథాహృతం - అలా పట్టుకొచ్చిన (చెప్పరాని చెయ్యరాని ఊహించని విధంగా పట్టుకొచ్చి అని అర్థం)
అవాఙ్ముఖం - తలదించుకుని ఉన్న అశ్వధ్ధామను చూచి ఉత్తమ స్వభావురాలు కాబట్టి (వామస్వభావా ) దయతో తలవంచి నమస్కారం చేసింది (ననామ )

ఉవాచ చాసహన్త్యస్య బన్ధనానయనం సతీ
ముచ్యతాం ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురుః

కట్లు విప్పండి విప్పండి (ముచ్యతాం ), ఇతను గురువు (ద్రోణుడు లేడు కాబట్టి)

సరహస్యో ధనుర్వేదః సవిసర్గోపసంయమః
అస్త్రగ్రామశ్చ భవతా శిక్షితో యదనుగ్రహాత్
స ఏష భగవాన్ద్రోణః ప్రజారూపేణ వర్తతే
తస్యాత్మనోऽర్ధం పత్న్యాస్తే నాన్వగాద్వీరసూః కృపీ

మీరు ఎవరి దగ్గరనుంచి అస్త్రాలు నేర్చుకున్నారో ఆ ద్రోనుడే ఈ రూపంతో ఉన్నాడు. ద్రోణునిలో సగమైన కృపి (తస్యాత్మనోऽర్ధం ) ఈ పుత్రున్ని చూసుకుని భర్తతో సహగమనం మానుకుంది

తద్ధర్మజ్ఞ మహాభాగ భవద్భిర్గౌరవం కులమ్
వృజినం నార్హతి ప్రాప్తుం పూజ్యం వన్ద్యమభీక్ష్ణశః

ధర్మజ్ఞ్యులైన మీరు ద్రోణుని వంశాన్ని గౌరవించాలి. ఈయనను సేవించాలి శిక్షించకూడదు

మా రోదీదస్య జననీ గౌతమీ పతిదేవతా
యథాహం మృతవత్సార్తా రోదిమ్యశ్రుముఖీ ముహుః

భర్తని దైవంగా చూస్కునే వీరి తల్లి నేను ఇప్పుడు ఏడుస్తున్నట్లు ఏడవకూడదు.

యైః కోపితం బ్రహ్మకులం రాజన్యైరజితాత్మభిః
తత్కులం ప్రదహత్యాశు సానుబన్ధం శుచార్పితమ్

బ్రాహ్మణుని వారి వంశాన్ని కోపింపజేసిన రాజకులం ఉండదు.

సూత ఉవాచ
ధర్మ్యం న్యాయ్యం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్
రాజా ధర్మసుతో రాజ్ఞ్యాఃప్రత్యనన్దద్వచో ద్విజాః

ద్రౌపతి మాట్లాడిన మాట ధర్మబద్దం (గురువుని చంపకూడదనడం) న్యాయబద్దం (బ్రాహ్మణుని చంపకూడదని) దయతో పాపలేకుండా సమంగా మాట్లాడిన ద్రౌపతిని ధర్మరాజు ప్రశంసించాడు

నకులః సహదేవశ్చ యుయుధానో ధనఞ్జయః
భగవాన్దేవకీపుత్రో యే చాన్యే యాశ్చ యోషితః
తత్రాహామర్షితో భీమస్తస్య శ్రేయాన్వధః స్మృతః
న భర్తుర్నాత్మనశ్చార్థే యోऽహన్సుప్తాన్శిశూన్వృథా

అనదరూ ద్రౌపతిని మెచ్చుకున్నరు. భీముడు మాత్రం ఆవేశంతో మాట్లాడాడు. అశ్వధ్ధామ పని వల్ల ఎవరికీ మంచి జరగలేదు

నిశమ్య భీమగదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజః
ఆలోక్య వదనం సఖ్యురిదమాహ హసన్నివ

భీమ ద్రౌపతుల మాటలు విన్న కృష్ణుడు కాస్త చిరునవ్వుతో చూస్తూ

శ్రీభగవానువాచ
బ్రహ్మబన్ధుర్న హన్తవ్య ఆతతాయీ వధార్హణః
మయైవోభయమామ్నాతం పరిపాహ్యనుశాసనమ్

అర్జునా ధర్మం తప్పకుండా వ్యవహరించు. బ్రాహ్మణున్ని చంపకూడదు, ఆతతాయిని చంపితీరాలి. ఈ రెండూ నేనే చెప్పాను. నా అజ్ఞ్యను పరిపాలించు

కురు ప్రతిశ్రుతం సత్యం యత్తత్సాన్త్వయతా ప్రియామ్
ప్రియం చ భీమసేనస్య పాఞ్చాల్యా మహ్యమేవ చ

నీ ప్రతిజ్ఞ్య సత్యం చెయ్యి, నా శాసనాన్ని సత్యం చేయి. భీమునికి ద్రౌపతికి నాకూ కూడా ప్రియం కలిగించేలా చేయి.

సూత ఉవాచ
అర్జునః సహసాజ్ఞాయ హరేర్హార్దమథాసినా
మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహమూర్ధజమ్

కృష్ణుడిలో భావాన్ని అర్థం చేసుకుని కత్తి తీసుకుని అశ్వధ్ధామ జుట్టులో ఉన్న ంఅణిని తీసుకునాడు

విముచ్య రశనాబద్ధం బాలహత్యాహతప్రభమ్
తేజసా మణినా హీనం శిబిరాన్నిరయాపయత్
వపనం ద్రవిణాదానం స్థానాన్నిర్యాపణం తథా
ఏష హి బ్రహ్మబన్ధూనాం వధో నాన్యోऽస్తి దైహికః

అది తీసుకుని తేజోవిహీనమైన మణి విహీనమైన అశ్వధ్ధామను వెళ్ళమన్నాడు. బ్రాహ్మణ వధ అంటే గుండు చెయించడం, ధనాన్ని తీసుకోవడం, బహిష్కారం చెయ్యడం ఈ మూడు బ్రహ్మణుడికి విధించే శిక్షలు- మరణశిక్షతో సమానం.

పుత్రశోకాతురాః సర్వే పాణ్డవాః సహ కృష్ణయా
స్వానాం మృతానాం యత్కృత్యం చక్రుర్నిర్హరణాదికమ్

అలా అశ్వధ్ధామ వెళ్ళాక పుత్రులకి అంత్యక్రియలు చేసి లాంచనంగా విలపించి దానాదికాలౌ చేసుకున్నారు (చక్రుర్నిర్హరణాదికమ్).