Pages

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

సూత ఉవాచ

అథ తే సమ్పరేతానాం స్వానాముదకమిచ్ఛతామ్
దాతుం సకృష్ణా గఙ్గాయాం పురస్కృత్య యయుః స్త్రియః

ఎవరెవరు తర్పణ జలాన్ని కోరుతున్నారో వారందరికీ తర్పణం ఇచ్చారు. (12వ రోజున జలం ఇవ్వాలి - దశ ఇంద్రియాలు మనసు బుధ్ధి వాటి స్థానం చేరాయి, 16వ రోజు  - 10ఇంద్రియములు 5 భూతములు మనసు వాటిస్థానం చేరుతాయి. 29వ రోజు - వీటియొక్క ప్రవృత్తి నివృత్తి మార్గాలు 32 వీటిలో గుణత్రయం యొక్క విముక్తి అయ్యింది కాబట్టి 29 వ రోజు. 45వ రోజు - గుణత్రయమూ తాపత్రయం 15 * 3 = 45. 59 వ రోజు వీటికి ధర్మార్ధ కామాలు అనే పురుషార్ద బంధాలను తొలగించినప్పుడు 45 +14 = 59 వ రోజు ).
(పితృదేవతలకు 12 రోజులలోపు గంగా జలాన్ని ఇవ్వాలి. ఆ జలం వల్ల తాపత్రయాలు నిర్మూలింపబడతాయి. మనసుకుండే సంస్కారం శరీరంపొయినా ఉంటుంది. భూవాతావరణంలో ఆ మనసు ఉంటే దాన్ని ప్రేత అంటారు. పితృలోకానికి వెళ్తే దాన్ని పితృదేవతలూ అంటారు. వైకుంఠానికి వెళ్తే ముక్తాత్మ అంటాం.
ఏ ఇంటికివెళ్ళినా మనం మారనట్లు ఏ శరీరానికి వెళ్ళినా మన మన్సులో ఉండే సంస్కారాలను బట్టి మన అలవాట్లు ఉంటాయి.)
ఆడవారిని ముందుబెట్టుకుని తర్ప

తే నినీయోదకం సర్వే విలప్య చ భృశం పునః
ఆప్లుతా హరిపాదాబ్జరజఃపూతసరిజ్జలే

తే నినీయోదకం సర్వే - వారు ఉదకాన్ని ఇచ్చి, విలపించి పరమాత్మ పాదం నుంచి పుట్టిన గంగా నదిలో మునిగారు

తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజమ్
గాన్ధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాం చ మాధవః

ఇరువైపులా చాల మంది చనిపోయారు. కురుపాండవులను ఓదార్చాడనికి అక్కడ ఉన్న కృష్ణుడు ఓదార్చాడు.

సాన్త్వయామాస మునిభిర్హతబన్ధూఞ్శుచార్పితాన్
భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియామ్

కృష్ణుడే కాకుండా అక్కడున్న ఋషులు కూడా ఓదార్చారు. ప్రాణులలో కాలం యొక్క గమనాన్ని (భూతేషు కాలస్య గతిం) మనం ఎమి చేసీ మార్చలేము. 

సాధయిత్వాజాతశత్రోః స్వం రాజ్యం కితవైర్హృతమ్
ఘాతయిత్వాసతో రాజ్ఞః కచస్పర్శక్షతాయుషః

కపటవైరుల చేత అపహరించబడిన రాజ్యాన్ని ధర్మరాజుకు ఇచ్చాడు. సిగను ముట్టుకోవడంవల్ల తరిగిన ఆయుష్యు కలిగిన వాళ్ళను (కచస్పర్శక్షతాయుషః) చంపించాడు. పతివ్రత కేశములు చక్రంకంటే శూలం కంటే యమ వరుణ పాశంకంటే మహా వేగములు. స్త్రీకేశముల వలన భర్తయొక్క క్షేమం పెరుగుతుంది. ఒక్క సారి జుట్టు ముడివేసుకోకపోవడం వల్ల దితికి ఒక్కడు పుట్టాల్సింది 49 మరుత్తులు పుట్టారు (ఇంద్రుడు గర్భంలో ఉన్నవాడిని 7 సార్లు నరికి. మళ్ళి ఒక్కక్కరిని మళ్ళీ ఏడు  సార్లు నరికాడు)

యాజయిత్వాశ్వమేధైస్తం త్రిభిరుత్తమకల్పకైః
తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాతనోత్

అత్యుత్తములైన మూడు అశ్వమేధములు చేయించాడు. ఇంద్రునికీర్తితో సమానంగా కీర్తిని వ్యాపింపచేసాడు.

ఆమన్త్ర్య పాణ్డుపుత్రాంశ్చ శైనేయోద్ధవసంయుతః
ద్వైపాయనాదిభిర్విప్రైః పూజితైః ప్రతిపూజితః

ఉద్దవ సాత్యకులతో కలిసి వెళ్ళడానికి పాండుపుత్రులను కోరి. వ్యాస పరాశరులు మొదలైన మహర్షులు మొదలీవారిని కృష్ణుడు మొదటపూజించాడు తరువాత కృషున్ని వారు పూజైంచారు (పూజితైః ప్రతిపూజితః)

గన్తుం కృతమతిర్బ్రహ్మన్ద్వారకాం రథమాస్థితః
ఉపలేభేऽభిధావన్తీముత్తరాం భయవిహ్వలామ్

రధం ఎక్కుదామని అనుకుంటున్న సమయంలో భయవిహ్వలై వచ్చింది

ఉత్తరోవాచ
పాహి పాహి మహాయోగిన్దేవదేవ జగత్పతే
నాన్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరమ్

ఒకరినొకరు చంపుకుంటున్న ఈ లోకంలో నీ కన్నా వేరే రక్షకులు లేరు

అభిద్రవతి మామీశ శరస్తప్తాయసో విభో
కామం దహతు మాం నాథ మా మే గర్భో నిపాత్యతామ్

బాగా కాల్చిన ఉక్కులాంటి ఈ  బాణం నా మీదకు వస్తోంది. నేను ప్రార్ధించేది నా గర్భం కొరకు

సూత ఉవాచ
ఉపధార్య వచస్తస్యా భగవాన్భక్తవత్సలః
అపాణ్డవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత

అపాణ్డవమనే అస్త్రాన్ని అశ్వధ్ధామ ప్రయోగించాడని తెలుసుకున్నడు (అబుధ్యత)

తర్హ్యేవాథ మునిశ్రేష్ఠ పాణ్డవాః పఞ్చ సాయకాన్
ఆత్మనోऽభిముఖాన్దీప్తానాలక్ష్యాస్త్రాణ్యుపాదదుః

అదే సమయంలో మరో అయిదు బాణాలు పాండవులవైపు వెళ్ళాయి

వ్యసనం వీక్ష్య తత్తేషామనన్యవిషయాత్మనామ్
సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాద్విభుః

తనయందు తప్ప మరి ఎవ్వరిమీద మనసుపెట్టని వారి ఆపద చూసి తన అస్త్రమైన సుదర్శనాన్ని పంపించాడు.

అన్తఃస్థః సర్వభూతానామాత్మా యోగేశ్వరో హరిః
స్వమాయయావృణోద్గర్భం వైరాట్యాః కురుతన్తవే

సర్వభూత అంతర్యామి ఐన పరమాత్మ విరాటరాజు కుమార్తె గర్బస్థ శిశువుని కాపాడటానికి కురువంశాన్ని కాపాడటానికి తానే వెళ్ళాడు

యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్త్వమోఘం చాప్రతిక్రియమ్
వైష్ణవం తేజ ఆసాద్య సమశామ్యద్భృగూద్వహ

అమోఘమైన ప్రతిక్రియ లేని బ్రహ్మాస్త్రం వైష్ణవతేజస్సుని చూసి చల్లారిపొయింది.

మా మంస్థా హ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయే ఞ్చ్యుతే
య ఇదం మాయయా దేవ్యా సృజత్యవతి హన్త్యజః

సర్వాశ్చర్యమయమైన స్వామి సృష్టి స్థితిలయాలను యోగమాయతో చేస్తాడు

బ్రహ్మతేజోవినిర్ముక్తైరాత్మజైః సహ కృష్ణయా
ప్రయాణాభిముఖం కృష్ణమిదమాహ పృథా సతీ

బ్రహ్మతేజస్సుతోటి  వస్తున్న అస్త్రాన్నుంచి రాక్షించిన కృష్ణునితో కుంతి ఇలా అంది

కున్త్యువాచ
నమస్యే పురుషం త్వాద్యమీశ్వరం ప్రకృతేః పరమ్
అలక్ష్యం సర్వభూతానామన్తర్బహిరవస్థితమ్

నీవు ఆది పురుషుడివి, అందరినీ శాసించే వాడివి, ఇంత చేసి ఎవ్వడికీ కనపడవు (అలక్ష్యం) ఐనా లోపలా బయటా ఉంటావు, ప్రకృతికంటే అవతల ఉన్నావు

మాయాజవనికాచ్ఛన్నమజ్ఞాధోక్షజమవ్యయమ్
న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా

ఎందుకు కనపడవంటే మాయా యవనికా అనే తెర ఉంటుంది. అజ్ఞ్య అధోక్షజం - జ్ఞ్యానంలేనివారి ఇంద్రియములను కిందగా జేసేవాడు. ఇంత ఉండి కూడా కనపడవు ఎందుకంటే విషయం తెలీనివాడు నటున్ని నటుడిగానే గుర్తుపట్టి వారి నిజమైన రూపాన్ని మర్చిపోయినట్లుగా. మనం ఆ పాత్ర గురించి మాట్లాడతాం గాని ఆ వ్యక్తిగురించి మాటాడటం. పాత్రని చూసి నటున్ని చూడకపోవడం మూఢదృశా

తథా పరమహంసానాం మునీనామమలాత్మనామ్
భక్తియోగవిధానార్థం కథం పశ్యేమ హి స్త్రియః

నీవు ఉన్నది పరమహంసుల (సన్యాసులు  - సత్ న్యాస - తమవన్నీ పరమాత్మలో ఉంచినవారు. ప్రపంచంలో ఉన్న మురికిని వేరుచేసి చూస్తారు కాబట్టి వారు హంసలు). అలాంటివారికి కనపడే నీవు మాకు కనపడ్డావు. మాకు అర్థం కావు

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనన్దనాయ చ
నన్దగోపకుమారాయ గోవిన్దాయ నమో నమః

నీవు వసుదేవ దేవకులకు పుట్టావు. వసుదేవుడు (వసు - ధనం దేవ - భగవంతుడు) జ్ఞ్యానం, దేవకి అంటే భక్తి. జ్ఞ్యానభక్తులకే అందేవాడివి. జగత్తు పరమాత్మ వశంలో ఉంటుంది పరమాత్మ మంత్రలో వశమై ఉంటాడు. ఆ మంత్రం గురువు అధీనంలో ఉంటుంది. జ్ఞ్యానముండి ఆవిర్భవించిన నీవు నందగోపుడి కుమారుడివి (నందగోపుడు అంటే - మనని ఆనందింపచేస్తాడు, అరిష్టములనుండి దాచిపెడతాడు. అలాగే దుష్టులకు పరమాత్మ అందకుండా కాపాడేవాడివి నీవు. అందుకే గురువు పేరు నందగోపుడివి ). నీవు గోవిందుడివి - వాక్కులకి అందేవాడివి.

నమః పఙ్కజనాభాయ నమః పఙ్కజమాలినే
నమః పఙ్కజనేత్రాయ నమస్తే పఙ్కజాఙ్ఘ్రయే

కల్పములలో వరాహ పద్మ కల్పాలు ఉన్నాయి. పద్మకోశమంటే అనంతభువనకోశం. పద్మం ప్రపంచమునకు నమూనా. భువనకోశం అంటారు . కోశమంటే మధ్య ఉన్న పుప్పొడి. అదే పద్మానికి రేకులకి మూలస్తంభం. ఇలా విశ్వమంతా నాభిలో దాచుకున్న వాడు పంకజ నాభాయ, ప్రపంచం రజోరాగాత్మకం. తమస్సు రజస్సు కలిస్తే బురద. పంకజం అంటే బురదలోంచి పుట్టిన జీవులు. జీవులన్నీ హారముగా వేసుకున్నవాడు. అలా వేసుకుని వారి దోషములు హరించే వాడు. పంకజ మాలిని అంటే దోషభోగ్యుడు.

ఈశ్వరస్యచ సౌహార్దం , య్దృచ్చా సుకృతం (పరమాత్మ సంకల్పంతో పుణ్యం) ,విష్ణో: కటాక్ష:, అద్వేష: (పరమాత్మ భక్తులయను వైముఖ్యం పోతుంది ), అనుకూలయం (భక్తుల యందు), సాత్వికై: సంభాషణం (పరమాత్మ భక్తులతో సంభాషణం )
షడ్ యేతాని ఆచార్య ప్రాప్య హేతవ: ఈ ఆరు ఆచార్యుడు ప్రాప్తిస్తున్నాడనడానికి సంకేతాలు
జీవూల్యందు నిరంతరమూ కట్టక్షం ప్రసరించే వాడు గనుక పంకజ నేత్రాయ. కటాక్షించి ఆయన చేర్చుకునేది ఆయన పాదాలవద్దకే కనుక పంకజాంఘ్రియే

ఈ స్తోత్రాన్ని కలిపితే సృష్టి స్థితి సమ్హారం వస్తుంది

యథా హృషీకేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధాతిచిరం శుచార్పితా
విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్

హృషీకానాం ఈశ: ఇంద్రియ అధిష్టానములైన దేవతలను శాసించేవాడు,  దుర్మార్గుడైన కంసునిచేత చెరసాలలో బంధింపబడిన నీ తల్లి దేవకిని దు:ఖము నుండి విడిపించావు. ఆమెనే కాదు నన్ను కూడా కాపాడావు. నన్నే కాకుండా నా పుత్రులని కూడా కాపాడావు. మాటిమాటికీ వస్తున్న ఆపదల సమూహమ్నుండి నన్ను దేవకినీ కాపాడావు


విషాన్మహాగ్నేః పురుషాదదర్శనాదసత్సభాయా వనవాసకృచ్ఛ్రతః
మృధే మృధేऽనేకమహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేऽభిరక్షితాః

మొదలు విషంవలన, తరువాత అగ్ని వలన, హిడింబాసురుడు వంటి రాక్షసుల నుండి, దుర్మార్గుల సభనుండి, వనవాసములోను, ప్రతీయుధ్ధంలోనూ, అనేక మహారధులు

విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో
భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్

ఎప్పుడూ మాటిమాటికీ అన్నివేళలా మాకు ఆపదలే రాని
అవి మాకు వస్తేనే మోక్షముని ప్రసాదించే నీ దర్శనం వస్తుంది.

జన్మైశ్వర్యశ్రుతశ్రీభిరేధమానమదః పుమాన్
నైవార్హత్యభిధాతుం వై త్వామకిఞ్చనగోచరమ్

జన్మ అయిశ్వర్య(శాసించగల వంశంలో పుట్టడం) విద్య సంపద - అనే నాలుగు మదాలలో యే ఒక్కటి ఉన్నా నిన్ను జ్ఞ్యాపకంచేసుకోలేము. ఈ మదం పెరిగితే నీ పేరే పలకలేడు

నమోऽకిఞ్చనవిత్తాయ నివృత్తగుణవృత్తయే
ఆత్మారామాయ శాన్తాయ కైవల్యపతయే నమః

అకించనవిత్తం - ఏ కోరికా లేని వారికి ఆయన ధనం..
నివృత్త గుణ వృత్తయే: పరమాత ప్రకృతిజీవునికంటే విలక్షణుడు. (జీవులు బధ్ధ ముక్త నిత్యం. సంసారంలో ఉండేవారు, సంసారన్ని దాటి స్వమిని చేరిన వారు, ఎల్లప్పుడు స్వామి దగ్గరే ఉండేవారు - వీరందరికన్నా పరమాత్మ విలక్షణుడు). వృత్తులంటే కామక్రోధాదులు గుణవృత్తులు (సత్వ రజో తమ గుణవృత్తులు). ఈ గుణవృత్తులులేని వాడు పరమాత్మ.
కైవల్య అధిపతి అనడం వల్ల అనడం వల్ల నిత్య సూరులకంటే విలక్షణుడు
శాంతాయ అనడం వలన - ముక్తులకంటే విలక్షణుడు
ఆత్మా రామాయ - బద్దులకంటే విలక్షణుడు
నివృత్తగుణవృత్తయే - ప్రకృతి కంటే విలక్షణుడు
సర్వ వైల్క్ష్యంతో బాటు సౌలభ్యం ఉన్నవాడు.

మన్యే త్వాం కాలమీశానమనాదినిధనం విభుమ్
సమం చరన్తం సర్వత్ర భూతానాం యన్మిథః కలిః

ఒక చెట్టు ఒక్కో కాలంలో ఒక్కోలాగ ఉంటుంది. ప్రకృతిలో వికారం కలిగించేది కాలం. ఒకే చెట్టుకు ఉన్న పిందె కాయ పండు అనే మార్పులు కాలం వల్ల వస్తాయి. అన్ని వికారాలకి కాలం మూలం. నీవు ఆ కాల స్వరూపుడివి. నీమీద ఆ కాల ప్రభావం ఉండదు ఎందుకంటే నీవే కాలం. విభుం - అంటే సర్వ వ్యాపి. అనాదినిధనం - ఆద్యంతములు లేనిది కాలం (పరమాత్మకు జీవాత్మకు ప్రకృతికి ఆది అంతము ఉండదు). సమం చరన్తం సర్వత్ర - కాలం అందరి విషయంలో సమానంగా వ్యవహరించినట్లు పరమాత్మ కూడా అలాగే అందరిలో సమానంగా సంచరిస్తాడు. అందరికీ ఆధారమవుతూ కూడా తనలో ఎలాంటి మార్పు కలగడానికి అవకాశం లేనిది కాలం. అన్నివికారాలకి యేది మూలమో అది కూడా నీలో ఎలాంటివికారాలని కలగచెయ్యలేదు. అందరిలో సమంగా ఉంటావు. నీవు ఉన్న వారిలో కలిగే భావాలతో నీకు సంబంధంలేదు.

పరస్పరం ఒకరిని చూచి ఒకరు వధించుకుంటున్నారంటే దానితో నీకు సంబంధంలేదు. ప్రకృతిలో జీవులలో కలిగే ఎలాంటి భావాలకు పరమాత్మ బాధ్యుడు కాడు, అయిన మనలో కలిగించే ప్రవృత్తులకు కారణం ఆయనే. కానీ అవి ఏమీ ఆయనకు అంటవు.

న వేద కశ్చిద్భగవంశ్చికీర్షితం తవేహమానస్య నృణాం విడమ్బనమ్
న యస్య కశ్చిద్దయితోऽస్తి కర్హిచిద్ద్వేష్యశ్చ యస్మిన్విషమా మతిర్నృణామ్

మానవులతో నీవుండి నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో ఎవర్రికీ తెలీదు. పూతన తృణావర్తుడు మొదలైన రాక్షసులని వధించి వారికి మోక్షాన్ని ఇచ్చావు. నువ్వేమనుకుంటున్నావో ఎమిచేస్తావో ఎవరికీ తెలీదు.
నీకు ఒక మిత్రుడు లేదా శత్రువు అని ఎవరూలేరు. కానీ నీవంటే ఎవరికీ పడదు.

జన్మ కర్మ చ విశ్వాత్మన్నజస్యాకర్తురాత్మనః
తిర్యఙ్నౄషిషు యాదఃసు తదత్యన్తవిడమ్బనమ్

ఎమీ చెయ్యని నీవు అన్ని కర్మలూ చేస్తున్నవు. యే జన్మా లేని నీవు జన్మించావు
పుట్టుకలేని నీవు తిర్యక్ గా నరునిగా యాదసుగా (నీటిలో ఉండేవి మత్స్య కూర్మ వరాహ). ఋషిగా పుట్టావు. ఇదంతా నీకు ఆట (విడంబనం)

గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావద్యా తే దశాశ్రుకలిలాఞ్జనసమ్భ్రమాక్షమ్
వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్బిభేతి


నీవు నీ ఇంట్లో వెన్న దొంగతనం చేసావు. కట్టడానికి తాడు పట్టుకువచ్చిన తల్లిని చూచి కపటపు కన్నీరు కారుస్తున్న నీవు, నోరు దగ్గరకు తీసుకుని (వక్త్రం నినీయ) ఉన్నప్పుడు భయానికే భయమేసింది.

కేచిదాహురజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే
యదోః ప్రియస్యాన్వవాయే మలయస్యేవ చన్దనమ్

పుట్టుకలేని నీవు ఎందుకుపుట్టావో ఎవరికీ తెలీదు. నీ భక్తుల కీర్తి పెంచుకోవాలని పుట్టావని కొంతమంది నీ కీర్తి పెంచుకోవాలని పుట్టావని కొంతమంది, యగువంశాన్ని ఉద్దరించడానికి పుట్టావని కొంతమంది అంటారు

అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోऽభ్యగాత్
అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషామ్

మరికొందరు దేవకీ వసుదేవులు తపస్సు చేస్తే వారికోరిక తీర్చడానికి పుట్టావు అని కొంతమంది రాక్షసులను సంహరించడానికని అంటారు

భారావతారణాయాన్యే భువో నావ ఇవోదధౌ
సీదన్త్యా భూరిభారేణ జాతో హ్యాత్మభువార్థితః

భూభారాన్ని తగ్గించడానికి అని కొంతమంది అన్నారు. బ్రహ్మగారి ప్రార్థన మీద భూభారాన్ని తగ్గించడానికి వచ్చావని కొంతమంది అంటారు

భవేऽస్మిన్క్లిశ్యమానానామవిద్యాకామకర్మభిః
శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన

అవిద్యచేతా కోరికచేతా పనులచేతా ఈ ప్రపంచములో బాధపడుతున్నవారు నీ కీర్తిని విని పాడుకొనడానికి నీవు పుట్టావు. నీ కథలు చదువుటకు చెప్పుటకు వినుటకు నీవు పుట్టావు అని కొందరంటారు. వినదగినవి స్మరణ చెయడానికి తగినవి అయిన కర్మలు చేసావు (సామాన్యులు చెప్పుకోవడానికి పామరులు కూడా యే పనులు తలుచుకుంటారో ఆపనులు చేసావు - పండితులు నీ మహిమను తలుచుకుంటారు పామరులు నీ అల్లరిని తలుచుకుంటారు)

శృణ్వన్తి గాయన్తి గృణన్త్యభీక్ష్ణశః స్మరన్తి నన్దన్తి తవేహితం జనాః
త ఏవ పశ్యన్త్యచిరేణ తావకం భవప్రవాహోపరమం పదామ్బుజమ్

నీ గురించి ఎవరు వింటారో పాడతారో అంటారో వారు సంసారప్రవాహాన్ని తగ్గించే నీ పాదపద్మాలు చేరతారు. కొందరు నీ చేష్టలను నీ సంకల్పాన్ని తలుచుకుంటారు. వారు నీ పాదపద్మాలను తలుచుకుని సంసారాన్ని దాటుతారు (భవప్రవాహోపరమం )

అప్యద్య నస్త్వం స్వకృతేహిత ప్రభో జిహాససి స్విత్సుహృదోऽనుజీవినః
యేషాం న చాన్యద్భవతః పదామ్బుజాత్పరాయణం రాజసు యోజితాంహసామ్

నీవు చేసినది నీకే అర్థమవుతుంది మాకు కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఇక్కడ ఉన్న నీవాళ్ళను వదిలి వెళ్తున్నట్లు ఉంది. వీరందరికి నీ పాదములు తప్ప వేరే దిక్కులేదు. వీరు రాజులని చంపిన పాపముగలవారు (రాజసు యోజితాంహసామ్).

కే వయం నామరూపాభ్యాం యదుభిః సహ పాణ్డవాః
భవతోऽదర్శనం యర్హి హృషీకాణామివేశితుః

నీవులేకుంటే మాకు పేరే లేదు. పాండవులు యాదవులు నువ్వు ఉండబట్టే ఈ పేరు. మనసులేకుంటే ఇంద్రియములు ఎలా నిర్వీర్యములో నీవులేని యాదవపాండవులు కూడా వ్యర్థమే

నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర
త్వత్పదైరఙ్కితా భాతి స్వలక్షణవిలక్షితైః

నీవులేకుంటే ఈ భూమి గతి ఏమిటి. ఈ సామ్రాజ్యం అంతా నీ పాద గుర్తులే.

ఇమే జనపదాః స్వృద్ధాః సుపక్వౌషధివీరుధః
వనాద్రినద్యుదన్వన్తో హ్యేధన్తే తవ వీక్షితైః

ఇక్కడి చెట్లు వనాలు నీ దృష్టితో పెరుగుతాయి. మేము నిన్ను చూసేట్లు చూడు.

అథ విశ్వేశ విశ్వాత్మన్విశ్వమూర్తే స్వకేషు మే
స్నేహపాశమిమం ఛిన్ధి దృఢం పాణ్డుషు వృష్ణిషు

ఆ చూపువలన పాండవులమీద యాదవుల మీద మమకారం తగ్గేలా చూడు
నా బుధ్ధి నీ యందే అనన్యంగా ఉండాలి.

త్వయి మేऽనన్యవిషయా మతిర్మధుపతేऽసకృత్
రతిముద్వహతాదద్ధా గఙ్గేవౌఘముదన్వతి

అన్ని మధువులకూ నీవే పతివి కాబట్టి మా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు. గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రంలో కలుస్తుంది,  , మా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా చివరకూ నిన్నే కలిసేట్లు చూడు
 ఇతరములని తాకని బుధ్ధి మరొకవైపు వెళ్ళకుండా నీయందే ఉండాలి.

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభావనిధ్రుగ్రాజన్యవంశదహనానపవర్గవీర్య
గోవిన్ద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిలగురో భగవన్నమస్తే

అపరిమితానందస్వరూపా (కృష్ణా ) (భారతంలో అయిదుగురు కృష్ణులు వున్నారు : వ్యాసుడు అర్జున శుక విధురుడు కృష్ణుడు  - ఐదుగురు కృష్ణరాయబారానికి కలిసారు ), కృష్ణ సఖా - అర్జుని సఖుడా. వృష్ణి - (కార్తవీర్యార్జుని తండ్రి హైహైయ మహారాజు.  హైహైయుని మహారాజు తండ్రి వీతిహోత్రుడు. వీతిహోత్రుడి తమ్ముడు వృష్ణి. కార్తవీర్యార్జుని చిన్న తాతగారు వృష్ణి. కార్తవీర్యార్జుని  ఒక కొడుకు నందుడు. అతని కుమార్డు స్థితికంటుడు. అతని కుమార్డు ఆహూకుడు. అతని కుమార్డు శూరసేనుడు. అతని కుమార్డు వసుదేవుడు. అతని కుమార్డు కృష్ణుడు. వృష్ణి ఆరవతరం)
పరమాత్మ యదువంశాన్ని ఉద్దరించడానికి రెండుకారణాలు. యదువుకి యయాతి శాపం వల్ల వచ్చిన మురికి పోగొట్టాలి. హైహైయునికి కార్తవీర్యార్జునికి బ్రాహ్మణ శాపం ఉంది (జమదగ్ని - పరశురాముడు), ఈ దోషాన్ని పోగొట్టాలి. ఈ రెంటివల్ల కలిగిన కళంకాన్ని పోగొట్టాలి. కృష్ణుడు యే రాజ్యానికి రాజు కాడు. 
శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభా - ఇది మనకు పరిత్రాణాయ సాధూనాం అన్న దానికి అన్వయం
అవనిధ్రుగ్రాజన్యవంశదహనా -  భూమికి ద్రోహం చేసే (అవనిధ్ర్క్) రాజూ వంశాలను దహించినవాడా.
అనపవర్గవీర్య - మోక్షము కోరనీ, సంసరాం మేదే దృష్టి ఉన్న వారి బుధ్ధిని మార్చడానికి కావల్సిన పరాక్రమం గలవాడా.
గోవిన్ద - ఆవులనీ పరిపాలించే వాడు వేదాలను, రాజులను, ధర్మాలను పరిపాలించే వాడు. గోశబ్దానికి ఆవులని, స్వర్గమును అందిచేవాడు, శరమును అనుసంధానం చేసేవాడు, వేదాములనుకాపాడే వాడు వజ్రమును ప్రసాదించేవాడు, కిరణాలను ఇచ్చేవాడు, నేత్రములు ఇచ్చేవాడు, వర్షమూ ఇచ్చేవాడు, జ్ఞ్యానమూ ఇచ్చేవాడు. ఇవన్నీ గోశబ్దానికి అర్థాలే
గోద్విజసురార్తిహరావతార - గోబ్రాహ్మణదేవతలకూ ఎవరు బాధ కలిగిస్తారో వారిని కలుపులాగ తీయడానికి అవతరించినవాడా
యోగేశ్వరాఖిలగురో భగవన్నమస్తే- యోగులందరికీ ఈశ్వరుడు, గురువులందరికీ మొదటి గురువు, జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సనే ఆరు గుణములు గల మహానుభావా నీకు నమస్కారం

సూత ఉవాచ
పృథయేత్థం కలపదైః పరిణూతాఖిలోదయః
మన్దం జహాస వైకుణ్ఠో మోహయన్నివ మాయయా

ఈ రీతిగా కుంతి పరమాత్మ సకల వైభవాన్ని స్తోత్రం చేస్తే (పరిణూతాఖిలోదయః) పెదవి విప్పీ విప్పంట్లుగా మోహం చేసేట్టుగా చిన్నగా నవ్వాడు . 

తాం బాఢమిత్యుపామన్త్ర్య ప్రవిశ్య గజసాహ్వయమ్
స్త్రియశ్చ స్వపురం యాస్యన్ప్రేమ్ణా రాజ్ఞా నివారితః

పాండవుల అభ్యర్థం మేరకు కృష్ణుడు అక్కడే కొన్నాళ్ళు ఉన్నాడు

వ్యాసాద్యైరీశ్వరేహాజ్ఞైః కృష్ణేనాద్భుతకర్మణా
ప్రబోధితోऽపీతిహాసైర్నాబుధ్యత శుచార్పితః

ఋషులందరూ బోధించినా, కృష్ణపరమాత్మ బోధించినా కూడా ధర్మ రాజు తెలుసుకోలేకపోయాడు, ధుఖవశుడయ్యాడు (ఢుఖానికి అర్పించుకున్నాడు - శుచార్పితః)

ఆహ రాజా ధర్మసుతశ్చిన్తయన్సుహృదాం వధమ్
ప్రాకృతేనాత్మనా విప్రాః స్నేహమోహవశం గతః

ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా వారు చెప్పినమాటలు వింటూ కూడా తన మిత్రుల బంధువుల వధ గురించే ఆలోచిస్తూ, స్నేహంతో మోహంతో పామరమనసుతో బ్రాహ్మణులతో

అహో మే పశ్యతాజ్ఞానం హృది రూఢం దురాత్మనః
పారక్యస్యైవ దేహస్య బహ్వ్యో మేऽక్షౌహిణీర్హతాః

నాలో ఉన్న ఈ పాపాన్ని మీరు చూచార. 18 అక్షౌహిణీలసైన్యాన్ని పరుల సొమ్ముకావలసిన శరీరంకోసం (పారక్యస్యైవ - ప్రపంచంలో ఎవరి శరీరం తమ కోసం కాదు, పుట్టేది బ్రతికేదీ చనిపోయేదీ ఏది మన కోసం కాదు. ఎవరికీ దేనికీ లొంగకుండా అనుకున్నది అనుకున్నట్లు నిక్కచ్చిగా ఎవరూ చెయ్యలేరు  )

బాలద్విజసుహృన్మిత్ర పితృభ్రాతృగురుద్రుహః
న మే స్యాన్నిరయాన్మోక్షో హ్యపి వర్షాయుతాయుతైః

అన్నిరకాల వారికి ద్రోహమ తప్ప ఏమీ చెయ్యలేదు
పదివేల వేల కోట్ల సంవత్సరాలు గడిచినా నాకు స్వర్గం రాదు

నైనో రాజ్ఞః ప్రజాభర్తుర్ధర్మయుద్ధే వధో ద్విషామ్
ఇతి మే న తు బోధాయ కల్పతే శాసనం వచః

ధర్మయుద్ధం చెయ్యడం రాజుకు దోషంకాదని మీరు చెప్తున్నా నా మనసుకు సంతృప్తిని ఇచ్చుట లేదు.

స్త్రీణాం మద్ధతబన్ధూనాం ద్రోహో యోऽసావిహోత్థితః
కర్మభిర్గృహమేధీయైర్నాహం కల్పో వ్యపోహితుమ్

నావలన చంపబడిన బంధువులని వారి విలాపాన్ని చూస్తుంటే నేను ఎంతమందికి ద్రోహంచేసాను. దానికి పరిష్కారం ఏది. గృహస్తాశ్రమంలో పనులుచేస్తూ ఆ పాపాన్ని నేను పోగొట్టుకోలేను,

యథా పఙ్కేన పఙ్కామ్భః సురయా వా సురాకృతమ్
భూతహత్యాం తథైవైకాం న యజ్ఞైర్మార్ష్టుమర్హతి

బురదను బురదతో కడగలేనట్లు మద్య పాత్రను మద్యపాత్రతో శుధ్ధిచేసుకోలేనట్లు, ప్రాణిహత్యను మరొకప్రాణి హత్యతో (యజ్ఞ్యంతో ) పోగొట్టుకోవచ్చా?