Pages

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

సూత ఉవాచ
ఇతి భీతః ప్రజాద్రోహాత్సర్వధర్మవివిత్సయా
తతో వినశనం ప్రాగాద్యత్ర దేవవ్రతోऽపతత్

ఎంతో మందికి ద్రోహం చేసాను నా పాపాన్ని తొలగించుకోలెనని భయపడుతున్న ధర్మరాజు దేవవ్రతుడు (బీష్ముడు) పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు.

తదా తే భ్రాతరః సర్వే సదశ్వైః స్వర్ణభూషితైః
అన్వగచ్ఛన్రథైర్విప్రా వ్యాసధౌమ్యాదయస్తథా

వ్యాసుడు దౌమ్యుడు (పురోహితుడు) అర్జునితో కూడిన కృష్ణుడు అక్కడికి వచ్చి,

భగవానపి విప్రర్షే రథేన సధనఞ్జయః
స తైర్వ్యరోచత నృపః కువేర ఇవ గుహ్యకైః
దృష్ట్వా నిపతితం భూమౌ దివశ్చ్యుతమివామరమ్
ప్రణేముః పాణ్డవా భీష్మం సానుగాః సహ చక్రిణా
తత్ర బ్రహ్మర్షయః సర్వే దేవర్షయశ్చ సత్తమ
రాజర్షయశ్చ తత్రాసన్ద్రష్టుం భరతపుఙ్గవమ్
పర్వతో నారదో ధౌమ్యో భగవాన్బాదరాయణః
బృహదశ్వో భరద్వాజః సశిష్యో రేణుకాసుతః
వసిష్ఠ ఇన్ద్రప్రమదస్త్రితో గృత్సమదోऽసితః
కక్షీవాన్గౌతమోऽత్రిశ్చ కౌశికోऽథ సుదర్శనః
అన్యే చ మునయో బ్రహ్మన్బ్రహ్మరాతాదయోऽమలాః
శిష్యైరుపేతా ఆజగ్ముః కశ్యపాఙ్గిరసాదయః

అందరూ బీష్మునికి నమస్కరిచారు
వారే కాకుండా బ్రహ్మర్షులు దేవర్షులు కూడా వచ్చారు (పరశురాముడు అత్రి మొదలైన వారందరూ  )

తాన్సమేతాన్మహాభాగానుపలభ్య వసూత్తమః
పూజయామాస ధర్మజ్ఞో దేశకాలవిభాగవిత్

తనకు ఎలాంటి శక్తీ లేకున్నా దేశమూ కాలమూ తెలిసినవాడు.  ఆయనను పూజించారు

కృష్ణం చ తత్ప్రభావజ్ఞ ఆసీనం జగదీశ్వరమ్
హృదిస్థం పూజయామాస మాయయోపాత్తవిగ్రహమ్

కృష్ణుడి ప్రభావం బీష్ముడికి తెలుసు. అలాంటి కృష్ణుడు ఒక పక్కగా కూర్చున్నాడు. ఇతన్ని పూజించడానికి అఖిల భూతాంతర్యామి అయిన స్వామిని పూజించి. బయట ఉన్న ఆకారం కేవలం యోగమాయతో ధర్మరక్షణకు తీసుకున్న ఆకారం.

పాణ్డుపుత్రానుపాసీనాన్ప్రశ్రయప్రేమసఙ్గతాన్
అభ్యాచష్టానురాగాశ్రైరన్ధీభూతేన చక్షుషా

వినయంతోనూ ప్రేమతోను కలవడానికి వచ్చిన పాండవులని చూచి

అహో కష్టమహోऽన్యాయ్యం యద్యూయం ధర్మనన్దనాః
జీవితుం నార్హథ క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాః

ధర్మస్వరూపులు మీరు ఇన్ని కష్టాలతో బ్రతికారు. విప్రధర్మాన్ని, కృష్ణపరమాత్మను ఆశ్రయించారు. అయినా కష్టాలు పడ్డారు

సంస్థితేऽతిరథే పాణ్డౌ పృథా బాలప్రజా వధూః
యుష్మత్కృతే బహూన్క్లేశాన్ప్రాప్తా తోకవతీ ముహుః3

సంస్థితేऽతిరథే పాణ్డౌ - మీరు చిన్న వాళ్ళుగానే ఉన్నప్పుడు పాండుమహరాజు స్వర్గానికి వెళ్ళాడు. మిమ్ములను పెంచడానికి మీ తల్లి కుంతి ఎన్ని కష్టాలో పడింది.

సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియమ్
సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలిః

ఈ కష్టాలన్ని కాలం వల్ల వచ్చినవి. మబ్బులెలా గాలి ఆధీనంలో ఉంటాయో సకల లోక పాలకులు కూడా ఆ కాలం వశంలో నే ఉంటారు

యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః
కృష్ణోऽస్త్రీ గాణ్డివం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్

ఇదంతా కాలాధీనమండానికి మీరే ఉదాహరణం: ధర్మసుతుడైన రాజు, గదాపాణి అయిన భీముడు, గాండీవం పట్టుకున్న అర్జునుడు, కృష్ణుడు మిత్రుడు. ఇన్ని వుండికూడా అన్నీ ఆపదలే.

న హ్యస్య కర్హిచిద్రాజన్పుమాన్వేద విధిత్సితమ్
యద్విజిజ్ఞాసయా యుక్తా ముహ్యన్తి కవయోऽపి హి

ఈయన ఎమి చెయ్యాలనుకుంటాడో ఎవరికీ తెలీదు.
పరమాత్మ చెయ్యదలచుకున్నది తెలుసుకుందామని ప్రయతించినవారందరూ జ్ఞ్యానులతో సహా మోహంలో మునిగిపోయారు

తస్మాదిదం దైవతన్త్రం వ్యవస్య భరతర్షభ
తస్యానువిహితోऽనాథా నాథ పాహి ప్రజాః ప్రభో

కాబట్టి ఇదంతా దైవతంత్రమని తెలుసుకో మనచేతిలో ఎమీ లేదు
అలాంటి పరమాత్మ ఇచ్చిన అవకాశాన్ని తీసుకో. అనాధులకి నాధుడివి అవ్వు, ప్రజలను పరిపాలించు

ఏష వై భగవాన్సాక్షాదాద్యో నారాయణః పుమాన్
మోహయన్మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు

ఈ కృష్ణుడు నారాయణుడు ఆదిపురుషుడు. సకలలోకాలను తన మాయతో మోహింపచేస్తూ యాదవ వంశంలో సంచరిస్తున్నాడు కానీ ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే

అస్యానుభావం భగవాన్వేద గుహ్యతమం శివః
దేవర్షిర్నారదః సాక్షాద్భగవాన్కపిలో నృప

ఈయన మాహత్మ్యం పరమశివునికి కొంత అర్థమవుతుంది, నారదునికి కొంత, కపిలునికి కొంత అర్థమవుతుంది.

యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమమ్
అకరోః సచివం దూతం సౌహృదాదథ సారథిమ్

మేనమామ కొడుకు మాకు మిత్రుడు సారధిగా మంత్రిగా దూతగా ఏర్పాటుచేసుకున్నావు

సర్వాత్మనః సమదృశో హ్యద్వయస్యానహఙ్కృతేః
తత్కృతం మతివైషమ్యం నిరవద్యస్య న క్వచిత్

కృష్ణుడు మావాడని నీకు ఉన్నది కానీ ఆయన సర్వాత్మన  - అందరికీ ఆత్మ. అందరినీ సమానంగా చూసేవాడు ఎందుకంటే అద్వయస్య - ఆయనకు ద్వయమే లేదు. అలాంటివాడికి, ఏదీ అంటని వాడికి (నిరవద్య) మీ మీద ప్రేమా వారిమీద ద్వేషం ఉండదు.

తథాప్యేకాన్తభక్తేషు పశ్య భూపానుకమ్పితమ్
యన్మేऽసూంస్త్యజతః సాక్షాత్కృష్ణో దర్శనమాగతః

తనను నమ్మిన వారి మీద స్వామికి ఎంత దయో చూడు. మరికొద్దిసేపట్లో ప్రాణాలను విడవబోతున్న నాకు సాక్షత్ కృష్ణుడు దర్శనమిచ్చాడు.

భక్త్యావేశ్య మనో యస్మిన్వాచా యన్నామ కీర్తయన్
త్యజన్కలేవరం యోగీ ముచ్యతే కామకర్మభిః

ఎలాంటి మహానుభావున్ని భక్తి నిండిన మనసుతో ధ్యానిస్తూ శరీరాన్ని విడిచిపెట్టీయోగి  మోక్షానికి పోతారో అటువంటి పరమాత్మ నా ఎదురుగా వచ్చాడు.

స దేవదేవో భగవాన్ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహమ్
ప్రసన్నహాసారుణలోచనోల్లసన్ముఖామ్బుజో ధ్యానపథశ్చతుర్భుజః

అటువంటి పరమాత్మ నేను శరీరం విడిచిపెట్టే దాక ఇక్కడే ఉండి ఎదురుచూచుగాక
ప్రసన్నమైన చిరునావు, దయ, విశాలనేత్రాలు, ఆ నేత్రాలతో ప్రకాశించే అందమైన ముఖపద్మములు కలిగి నా ధ్యాన పధంలో చతుర్భుజుడుగా ఉన్నాడు. కనులతో కూడా ఆనందంగా చూచే అదృష్టాన్ని కలిగించనీ


సూత ఉవాచ
యుధిష్ఠిరస్తదాకర్ణ్య శయానం శరపఞ్జరే
అపృచ్ఛద్వివిధాన్ధర్మానృషీణాం చానుశృణ్వతామ్

ఋషులందరూ వింటుండగా అన్ని ధర్మాలను అడిగాడు. (ఇవే ఒకటి శాంతి పర్వం ఇంకోటి అనుశాసన పర్వం - 29000 శ్లోకాలు. కథకు యెటువంటి సంభందమూ లేక కేవలం ధర్మాల గురించే వుంది. ఆపధర్మాలు రాజ స్త్రీ మిత్ర మోక్ష ధర్మాలు శాంతి పర్వం, వేద పురాణ ఆత్మ దేహ స్వరూప ధర్మాలు అనుశాసనిక పర్వంలో. దేహసంబంధం లేనప్పుడు ఆత్మ ఎలా విహరిస్తుంది. దేహం వచ్చిన తరువాత మనసుకి బుధ్ధికి దోషం అంటకుండా సంచరించే విధానం. అన్ని ధర్మాలు ఆపద లేనప్పుడు. ఆపద వచ్చినపుడు మార్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ ధర్మాలు ధర్మరాజు చేత అడిగించి చెప్పాడు. శరీరానికి బాధ కలిగితే కష్టం కాదు, ఆత్మకి ఇబ్బంది కలిగితే అది కష్టం. )

పురుషస్వభావవిహితాన్యథావర్ణం యథాశ్రమమ్
వైరాగ్యరాగోపాధిభ్యామామ్నాతోభయలక్షణాన్

దానధర్మాన్రాజధర్మాన్మోక్షధర్మాన్విభాగశః
స్త్రీధర్మాన్భగవద్ధర్మాన్సమాసవ్యాసయోగతః

ఇలా ధర్మ విభాగం చేసి చెప్పాడు. కొన్ని సంక్షేపంగా కొన్ని విస్తృతంగా చెప్పాడు

ధర్మార్థకామమోక్షాంశ్చ సహోపాయాన్యథా మునే
నానాఖ్యానేతిహాసేషు వర్ణయామాస తత్త్వవిత్

ధర్మార్థ కామమోక్షాలను పొందటానికి ఉపాయలని చెప్పాడు.
ధర్మాలని ధర్మాలగానే కాకుండా కథా దుష్టాంతంతో చెప్పాడు
ఉదాహరణకు సులబా జనక సంవాదం

ధర్మం ప్రవదతస్తస్య స కాలః ప్రత్యుపస్థితః
యో యోగినశ్ఛన్దమృత్యోర్వాఞ్ఛితస్తూత్తరాయణః

ఇలా చెప్తుండగా ఆ కాలం వచ్చింది. ఉత్తరాయణ కాలాన్ని కోరుకున్నాడు. ఆ కాలం వచ్చింది

తదోపసంహృత్య గిరః సహస్రణీర్విముక్తసఙ్గం మన ఆదిపూరుషే
కృష్ణే లసత్పీతపటే చతుర్భుజే పురః స్థితేऽమీలితదృగ్వ్యధారయత్

అంతవరకూ మాట్లాడిన వేల వేల మాటలను ఉపసంహరించి మనసులో కోరికలనూ దూరం చేసి
పట్టుపీతాంబరలాను కట్టుకున్న, చతుర్భుజుడైన ఆదిపురుషుడైన కృష్ణున్ని కనులు తెరిచి అతన్నే చూస్తూ, బుధ్ధి మనసు ఆయనలో లీనం చేసి
(ఇక్కడ బంగారమంటే వ్యామోహం, అలాంటి బంగరంతో చేసిన పీతంబరాన్ని కట్టుకున్నాడు, బంగారం వ్యామోహానికి సంకేతం. మనకు ప్రకృతిమీద ఉన్న వ్యామోహాన్ని తొలగించడానికి ఆ పీతంబరం )

విశుద్ధయా ధారణయా హతాశుభస్తదీక్షయైవాశు గతాయుధశ్రమః
నివృత్తసర్వేన్ద్రియవృత్తివిభ్రమస్తుష్టావ జన్యం విసృజఞ్జనార్దనమ్
 పరమాత్మలోనే మనసుబుధ్ధి దారణ చేసి పాపాలు తొలగించుకొని. ఇంతవరు కనుబొమ్మలనుంచి బొటనవేలి వరకూ ఉన్న బాణాల బాధ తొలగింది
సర్వేంద్రియ వృత్తులు అన్నీ తమ తమ పనులను మానేసి, సకల ప్రపంచ సృష్టి వికారమునకు కారణమైన జనార్థనున్ని (సకాలంలో మృత్యువిచ్చి బంధాలను తొలగించి కాపాడే వాన్ని ) స్తుతిస్తూ

శ్రీభీష్మ ఉవాచ
ఇతి మతిరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వతపుఙ్గవే విభూమ్ని
స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవప్రవాహః

సంసారికి విషయభోగంలో ఉన్నమనకి పరమాత్మ యందు మనసు లగ్నం అవ్వాలంటే ప్రాపంచిక విషయాలమీద అన్నిరకములు ఆశలు వీడిన బుధ్ధి పరమాత్మ ఏర్పరచాలి.ఆ బుధ్ధి పరమాత్మ ఏరపర్చినదే. ఆ భగవానుడే సాత్వతపుంగవుడు - జ్ఞ్యానులలో శ్రేష్టుడు. జ్ఞ్యానులందరికీ ఆశ్రయము. విభూమ్ని - ప్రపంచంలో అందరికంటే శ్రేష్టుడు సర్వ వ్యాపకుడు. ప్రతీ అణువులో ఉన్నాడు కాబట్టి విభూమ్ని. స్వసుఖముపగతే  - ఇన్ని చోట్లా ఉండి ఇన్ని మార్పులు చేస్తూ కూడా ఆయన ఆత్మా రాముడు. ఎవరివలనా తాను కొత్తగా అనందం పొందవలసిన పని లేని వాడు.
క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి - అంతర్యామిగా ఉన్నవాడు మన ముందు ఎందుకు కనపడుతున్నాడు. స్వామి కాస్త విహరించడానికి వచ్చాడు.
యద్భవప్రవాహః - ఆ పరమాత్మ యొక్క సంకల్పమే ఈ అఖండమైన సంసార ప్రభావం.
అటువంటి పరమాత్మ యందు నా మనసు ఆశలేని బుధ్ధి లగ్నమై ఉండుగాక

త్రిభువనకమనం తమాలవర్ణం రవికరగౌరవరామ్బరం దధానే
వపురలకకులావృతాననాబ్జం విజయసఖే రతిరస్తు మేऽనవద్యా

త్రిభువనకమనం తమాలవర్ణం - త్రిభువనాలవారికి కోరికలు రేకెత్తించే వాడు. నల్లని వర్ణం కలవాడు.
మనకి కావలసింది నిరంతరమూ మన మనసు పరమాత్మయందు లగ్నమయి ఉండాలి.
రవికరగౌరవరామ్బరం  - పరమాత్మ వస్త్రం బంగారు వర్ణం. సూర్యకిరణములవంటి రంగు కల వస్త్రం
దధానే
వపు: అలక కులావృతా ఆననాబ్జం - ముంగురులంతా ఆవరించిన ముఖముగల కృష్ణుని యందు నా మనసు ఉండని

యుధి తురగరజోవిధూమ్రవిష్వక్కచలులితశ్రమవార్యలఙ్కృతాస్యే
మమ నిశితశరైర్విభిద్యమాన త్వచి విలసత్కవచేऽస్తు కృష్ణ ఆత్మా

గుఱ్ఱముల డెక్కలదుమ్ము స్వామి మొహం మీద పడి పడినదుమ్ము చెమటకి (శ్రమవారి) తగలడంతో ఇంక మనోహరంగా కనిపించి
అదే సమయంలో భీష్ముడు చాలా అస్త్రాలు వేశాడు. ణెను వేసిన తీస్ఖణమైన బాణములతో కవచము పోయి చీలిన శరీరంకలవాడై

సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్బలయో రథం నివేశ్య
స్థితవతి పరసైనికాయురక్ష్ణా హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు

మిత్రునియొక్క (అర్జుని) మాటలు విని రెండు సైన్యముల మధ్య నిలిపి నీ కంటితో వారందరి ఆయుష్షుని హరించిన్ పార్థుని సఖుని యందు నా మనసు  ఉండని
ఇక్కడ భక్త జన వాత్సల్యాన్ని చెప్పాడు

వ్యవహితపృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా
కుమతిమహరదాత్మవిద్యయా యశ్చరణరతిః పరమస్య తస్య మేऽస్తు

దూరముగా ఉన్న సైన్య సమూహాన్ని చూసి దోషబుధ్ధితోటి తనవారిని చంపడానికి విముఖుడైన అర్జునుని దోష బుధ్ధిని ఆత్మ విద్యతో తొలగించావు అలాంటి పరమాత్మ పాద పద్మముల యందు నాకు ప్రీతి కలగనీ

స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థః
ధృతరథచరణోऽభ్యయాచ్చలద్గుర్హరిరివ హన్తుమిభం గతోత్తరీయః

నీ ప్రతిజ్ఞ్యను కూడా వదిలిపెట్టి (స్వనిగమమపహాయ ) (
అప్పుడప్పుడు కృష్ణున్ని కొట్టే బీష్ముడు ఆరోజు పూర్తిగా అర్జనున్నే కొట్టాడు. విల్లు తీసేఅవకాశంకూడా లేకుండా అర్జనుడు ఉన్నప్పుడూ) నా ప్రతిజ్ఞ్య నిజం చెయ్యడానికి రథం నుంచి దూకి రధ చక్రాన్ని తీసుకుని వస్తుంటే (అందరూ  భయపడ్డారు బీష్ముడు తప్ప) ఏనుగును చంపడానికి సిమ్హం వస్తున్నట్లుగా ఈ దేహాన్ని చంపడానికి భూమి అదిరేంత (అభ్యయాత్ చలత్ గుహు:, )ఆవేశంతో వస్తుంటే ఉత్తరీయం జారిపోతుంటే(పైనున్న పచ్చని పటముజార).
 అభ్యగాత్ చలత్ గుహు అన్నదానికి సకలలోకాలు కంపించేట్టు అని కూడా అర్థం వస్తుంది.

బీమ్ష్మాచార్యుని ఈ స్తుతి ద్వయమంత్రం అని ఉక్తి
గతోత్తరీయః అభ్యయాత్ - ఇది శ్రీమన్నార్యణ
చలత్ గుహు: అంటే విశ్వరూపుడు (సకల లోకాలను కడుపులో దాచుకున్నవాడు)
యిమం హంతుం - శరణం (ఈ శరీరాం నుంచి విడుదల చేస్తాను)
అభ్యయాత్ - ప్రపద్యే
స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థః - తన ప్రతిజ్ఞ్యని కాదని నా ప్రతిజ్ఞ్య నెరవేర్చుటకు. మనం ఏమి చేసినా ఆయన కొరకే... అందుకే ఇది శ్రీమతే నారాయణాయ

శితవిశిఖహతో విశీర్ణదంశః క్షతజపరిప్లుత ఆతతాయినో మే
ప్రసభమభిససార మద్వధార్థం స భవతు మే భగవాన్గతిర్ముకున్దః

నాచే ప్రయోగించబడిన వాడి అయిన బాణములతో గాయలు కలిగిన వాడు, చీలిపొఇన కవచం కలవాడై, శరీరం రక్తంతో తడిసిపోయి, శత్రువుగా ఉండి (ఆతతాయి - ఇక్కడ ఆతతాయి అంటే సృష్టి స్థితి లయ కారకుడని వ్యంగ్యార్థం)
ఇక్కడ ముకుంద అంటే మోక్షం ఇచ్చేవాడు
నన్ను చంపడానికి వేగంగా చంపడానికి వచ్చినవాడే నాకు రక్షకుడగుగాక
స్థిరచిత్తుని స్థితి ఇది. బీష్ముడు ధర్మాత్ముడు, కృష్ణుని భక్తుడు. ఈ బీష్ముడు కృష్ణ భగవానునికి భక్తుడై తన చేత బాల్యమ్నుండి పెంచబడినవాడైన అర్జునుడు ఎదురుగా యుధ్ధంలో ఉండగా దేనికీ చలించకుండా ఉన్నాడు.

విజయరథకుటుమ్బ ఆత్తతోత్రే ధృతహయరశ్మిని తచ్ఛ్రియేక్షణీయే
భగవతి రతిరస్తు మే ముమూర్షోర్యమిహ నిరీక్ష్య హతా గతాః స్వరూపమ్

నా మనసు కూడా ఆ పరమాత్మ యందే లగ్నమయి ఉండాలి. ఎలాంటి ఆకారంతో ధ్యానం చెయాలి? పరమాత్మ యొక్క భక్త పరాకాష్ట ఏ ఆకారంతో బాగా వ్యక్తమయిందో ఆ ఆకారన్ని ధ్యానించాలి. - విజయ రథం ఇతని కుటుంబం (కుటుంబం అంటే రక్షణ), ఒక చేత్తో కొరడా, ఇంకో చేత్తో పగ్గాలు పట్టుకున్నాడు. అవి పట్టుకుని రధాన్ని నడపడానికి సిధ్ధమయిన పరమాత్మ శోభతో చూడదగి ఉన్నటువంటి పరమాత్మ యందు మరణించాలనుకుంటున్న (మరణాన్ని కోరుతున్న) నాకు కోరిక, రక్తి, ప్రీతి ఉండని. ఏ మహానుభావున్ని చూచి చనిపొయినవాళ్ళందరూ స్వారూప్యాన్ని పొందారు నకు కూడా అలాంటి స్థితి లభించని

లలితగతివిలాసవల్గుహాస ప్రణయనిరీక్షణకల్పితోరుమానాః
కృతమనుకృతవత్య ఉన్మదాన్ధాః ప్రకృతిమగన్కిల యస్య గోపవధ్వః

కృష్ణపరమాత్మ ఏమిచేస్తే గోపికలూ అవే చేసారు (రాసక్రీడలో కృష్ణ విరహాన్ని తట్టుకోలేక గోపికలు కృష్ణలీలలను తాదాత్మ్యంతో అభిన్యైంచారు). ఇలాంటి వాటితో అధికగౌరవాన్ని పొందినవారు. నడక దరహాసం చూపులు ఇలాంటివాటితో చాల అభిమానాన్ని పెంచుకున్నారు (కల్పితోరుమానాః)
పరమాత్మ అంతర్ధానమైతే వాటిని తాము అభినయించి (కృతమనుకృతవత్య) గుడ్డివారిలాగ కృష్ణుని ప్రేమలోపిచ్చివారై దేశ కాలాల్లో కృష్ణుడూ తప్ప మరేదీ గుర్తులేక (ఉన్మదాన్ధాః )ఉన్న అలాంటి గోపికలు ఏ పరమాత్మను అనుకరించి అనుసరించి ధ్యానించి అభిమానించి అర్పించుకొని పరమాత్మని చేరిన గోపికలు ఎవరి వల్ల మోక్షం పొందారో అటువంటి పరమాత్మ నాకు మోక్షమిచ్చుగాక

మునిగణనృపవర్యసఙ్కులేऽన్తః సదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్
అర్హణముపపేద ఈక్షణీయో మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా

రాజసూయ యాగంలో ఏ మహనుభావుడు అగ్రపూజ పొందాడో  (అగ్రపూజ పొందమన్న బీష్ముని ప్రార్థనను మన్నించి ) ఆ మహానుభావుని యందు నా మనసు ఉండుగాక. రాజసూయానికి మునిగణాలందరికీ వచ్చారు. అలాగే రాజులు కూడా వచ్చారు. సభామధ్యమున వచ్చిన వారందరికీ కన్నుల పందువచేసిన స్వామి యందు నా మనసు నిలుచు గాక.

రజసూయాన్ని విజయ సారధ్యాన్ని గోపికల భక్తినీ తలుచుకున్నాడు. కృష్ణవతారంలో అద్భుతమైన ఘట్టాలను తలుచుకున్నాడు. కృష్ణావతారంలో ఉన్న పది అద్భుతదృష్యాలను పది ఉపనిషత్తులని అంటారు. పార్ధసారధ్యం బృహధారకమని పేరు.

తమిమమహమజం శరీరభాజాం హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానామ్
ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోऽస్మి విధూతభేదమోహః
   
ఇది చాందోగ్యమని పేరు. సూర్యుడు ఒకడే ఉండి చూసే వారికి వేరువేరుగా కనపడినా ఏకత్వం దెబ్బతినదు. ఈ కృష్ణుడు కూడా అంతే. పరమాత్మ కూడా ఎన్ని జీవరాశులున్నాయో అన్ని జీవుల్లోనూ వారి హృదయాల్లో ఉంటాడు. ఆ జీవుల శరీరాలన్ని పరమాత్మ సంకల్పంతో కల్పించబడినవే.
ఒక్కొక్క కంటికి ఒకే సూర్యుడు పలువిధాలుగా కనపడుతున్నట్లుగా పరమాత్మ కూడా ఒక్కొక్కడిలో ఒక్కొక్కడిగా కనపడుతున్న పరమాత్మను నేను పట్టుకున్నాను.

అజం (పుట్టుకలేని వాడు అయి ఉండి) శరీరభాజాం హృది హృది ధిష్ఠితం - జీవులయొక్క ఒక్కొక్కరి హృదయంలో ఉంటాడు. ఆ శరీరాలన్నీ పరమాత్మ సంకల్పంచేత కల్పించబడినవి (ఆత్మకల్పితానామ్)
ప్రతిదృశమివ నైకధార్కమేకం - ప్రతి ఒక్క కన్నుకు ఒక్కొక్క సూర్యుడు భాసించినట్లుగా.
సమధిగతోऽస్మి  - అటువంటి స్వామిని నేను పట్టుకున్నాను ఎందుకంటే విధూతభేదమోహః - భేదమనే భావం పోయింది. ఇందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ ఒక్కడే అన్న విషయాన్ని పట్టుకున్నాను. పరమాత్మయొక్క ఏకత్వాన్ని సర్వభూత అంతర్యామిత్వాన్ని చూడగలిగాను


సూత ఉవాచ
కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః
ఆత్మన్యాత్మానమావేశ్య సోऽన్తఃశ్వాస ఉపారమత్

ఈ రీతిలో మనసుతోటి వాక్కుతోటి చూపుతోటి ఇంద్రియ వృత్తులతోటి ఆ పరమాత్మ యందు ఆత్మను ఆత్మలో ఉంచి శ్వాసను లోపలనుంచి విరమింపచేసుకున్నాడు

సమ్పద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే
సర్వే బభూవుస్తే తూష్ణీం వయాంసీవ దినాత్యయే

కళారహితమయిన పరమాత్మ సాయుజ్యముని పొందాడని తెలుసుకున్న ధర్మరాజు మొదలైన వాళ్ళందరు మౌనంగా వహించారు. సూర్యాస్తమం కాగానే పక్షులు గూళ్ళకు చేరి మౌనం దాల్చినట్లుగా (సూర్యుడు బీష్ముడు పక్షులు పాండవులు)

తత్ర దున్దుభయో నేదుర్దేవమానవవాదితాః
శశంసుః సాధవో రాజ్ఞాం ఖాత్పేతుః పుష్పవృష్టయః

బీష్ముడు పుట్టినప్పుడు దుందుభులు మోగాయి ప్రతిజ్య్ణ చేసినప్పుడు మోగాయి. ఆలగే ఇప్పుడు కూడా దుందుభులు మోగాయి. పరమాత్మలో జేరినప్పుడు దేవతలూ మనవులూ దుందుభులు మ్రోగించారు. ఆకశం నుండి పుష్ప వృష్టి కురిసింది

తస్య నిర్హరణాదీని సమ్పరేతస్య భార్గవ
యుధిష్ఠిరః కారయిత్వా ముహూర్తం దుఃఖితోऽభవత్

దహన సంస్కారాలన్నీ అయిన తరువాత ముహూర్తకాలం దు:ఖం అనుభవించి తరువాత కార్యాలని ధర్మరాజు చేసాడు

తుష్టువుర్మునయో హృష్టాః కృష్ణం తద్గుహ్యనామభిః
తతస్తే కృష్ణహృదయాః స్వాశ్రమాన్ప్రయయుః పునః

రహస్యనామాలతో బీష్ముడు చేసిన స్తోత్రాన్ని విని పరమాత్మ ఇల స్తోత్రం చెయ్యలి అని తెల్సుకున్న వారు పరమాతను స్తోత్రం చేసారు. పరోక్ష ప్రియా: దేవతా: అని ఊక్తి. దేవతలు పరోక్షంగా స్తోత్రం చేస్తే ప్రీతి పొందుతారు. ఋషులందరు బీష్మునికి మోక్షం ప్రసాదించిన కృష్ణున్ని గుహ్యనామాలతో స్తోత్రం చేసారు

తతో యుధిష్ఠిరో గత్వా సహకృష్ణో గజాహ్వయమ్
పితరం సాన్త్వయామాస గాన్ధారీం చ తపస్వినీమ్

కృష్ణున్ని స్తోత్రం చేసి అందరు వారి వారి స్వస్థానాలకు వెళ్ళారు
ధర్మరాజు కృష్ణునితో కలిసి హస్తినాపురం వెళ్ళి  బీష్ముడు దృతరాష్ట్ర గాంధారులను ఓదార్చాడు

పిత్రా చానుమతో రాజా వాసుదేవానుమోదితః
చకార రాజ్యం ధర్మేణ పితృపైతామహం విభుః

బీష్ముణి ఉపదేశం వలన కృష్ణ దృతరాష్ట్ర అనుమతి తీసుకుని రాజ్యాన్ని ధర్మబద్దం గా పరిపాలించాడు