Pages

Monday, 21 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పయ్యవ అధ్యాయం (రాస పంచాధ్యాయి - 2)


ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పయ్యవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అన్తర్హితే భగవతి సహసైవ వ్రజాఙ్గనాః
అతప్యంస్తమచక్షాణాః కరిణ్య ఇవ యూథపమ్

ఆడ ఏనుగులు తమ మగ ఏనుగులను చూడకుంటే ఎలా పరితపిస్తాయో వీరు కృష్ణుడు అంతర్దానమయ్యేసరికి అలా పరితపిస్తున్నారు

గత్యానురాగస్మితవిభ్రమేక్షితైర్మనోరమాలాపవిహారవిభ్రమైః
ఆక్షిప్తచిత్తాః ప్రమదా రమాపతేస్తాస్తా విచేష్టా జగృహుస్తదాత్మికాః

పరమాత్మ యొక్క గమనములూ ప్రేమా చిరునవ్వూ విలాసములూ చూపులూ మాటలూ రకరకాల విలాసాలు అనుభవించిన గోపికలు, మనస్సంతా స్వామీ, స్వామి చేతలే నిండి ఉండగా పరమాత్మ చేసిన చేతలే చేసారు

గతిస్మితప్రేక్షణభాషణాదిషు ప్రియాః ప్రియస్య ప్రతిరూఢమూర్తయః
అసావహం త్విత్యబలాస్తదాత్మికా న్యవేదిషుః కృష్ణవిహారవిభ్రమాః

నడకా చిరునవ్వూ చూపూ మాట్లాడడం, అన్నీ మనసు నిండా నిండి,  కృష్ణుని విహారములనూ చేష్టలనూ అనుకరించారు

గాయన్త్య ఉచ్చైరముమేవ సంహతా విచిక్యురున్మత్తకవద్వనాద్వనమ్
పప్రచ్ఛురాకాశవదన్తరం బహిర్భూతేషు సన్తం పురుషం వనస్పతీన్

 అందరూ కలసి ఆ పరమాత్మనే గానం చేస్తూ ఉన్నారు. వెతికారు పరమాత్మ ఎక్కడున్నాడో. లోపల వున్న స్వామిని బయట వెతికారు

దృష్టో వః కచ్చిదశ్వత్థ ప్లక్ష న్యగ్రోధ నో మనః
నన్దసూనుర్గతో హృత్వా ప్రేమహాసావలోకనైః

లోపలా వెలుపలా అంతటా దాగి ఉన్న పరమాత్మను చెట్లలో వెతుకుతూ ఉన్నారు. రాగి చెట్టా జువ్వి చెట్టా మర్రి చెట్టా మా కృష్ణున్ని చూచావా

కచ్చిత్కురబకాశోక నాగపున్నాగచమ్పకాః
రామానుజో మానినీనామితో దర్పహరస్మితః

నందగోపాలుని పుత్రుడు మా మనసుని హరించాడు. మీ దగ్గర దాక్కున్నాడా. రామానుజుడు (బలరాముని తమ్ముడు) మా స్త్రీల యొక్క దర్పాన్నీ చిరునవ్వునూ హరించి మీ చాటున దాక్కున్నాడా.

కచ్చిత్తులసి కల్యాణి గోవిన్దచరణప్రియే
సహ త్వాలికులైర్బిభ్రద్దృష్టస్తేऽతిప్రియోऽచ్యుతః

నీకు చాలా ఇష్టం కదా స్వామి పాదాలు.మాతో ఉంటే తట్టుకోలేక దాచుకున్నావా.

మాలత్యదర్శి వః కచ్చిన్మల్లికే జాతియూథికే
ప్రీతిం వో జనయన్యాతః కరస్పర్శేన మాధవః

నీలో సౌగంధ్యాన్ని చూచి తుమ్మెదలు వస్తాయి. వాటిని చూచి స్వామికూడా ఒక తుమ్మెదలా వచ్చాడా

చూతప్రియాలపనసాసనకోవిదార జమ్బ్వర్కబిల్వబకులామ్రకదమ్బనీపాః
యేऽన్యే పరార్థభవకా యమునోపకూలాః శంసన్తు కృష్ణపదవీం రహితాత్మనాం నః

మా అందరికీ తన కర స్పర్శ ఆనందాన్ని కలిగించి వెళ్ళిపోయాడు. ఆ తోటలో ఉన్న ప్రతీ చెట్టునీ  పేరు పేరునా పిలుస్తూ ఉన్నారు. వారి మనసంతా

కిం తే కృతం క్షితి తపో బత కేశవాఙ్ఘ్రి
స్పర్శోత్సవోత్పులకితాఙ్గనహైర్విభాసి
అప్యఙ్ఘ్రిసమ్భవ ఉరుక్రమవిక్రమాద్వా
ఆహో వరాహవపుషః పరిరమ్భణేన

అమ్మా భూమి, నీవేమి ప్య్ణ్యం చేసావో మాకు చెప్పు.స్వామి నీ మీదా తన పాదాలు మోపుతున్నాడు.పరమాత్మ పాదాలు పడి పులకింతలు లాగ మొలకెత్తిన భూమీ, నీవేమి పుణ్యంచేసావో చెప్పు.త్రివిక్రముని పాద స్పర్శతో పులకించావు.అది చాలదంటే వరాహ రూపములో వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. ఇన్ని రూపాలు మార్చి వచ్చాడు నీకోసం. నీవు చేసిన పుణ్యం చెబితే అది మేము చేస్తాము

అప్యేణపత్న్యుపగతః ప్రియయేహ గాత్రైస్
తన్వన్దృశాం సఖి సునిర్వృతిమచ్యుతో వః
కాన్తాఙ్గసఙ్గకుచకుఙ్కుమరఞ్జితాయాః
కున్దస్రజః కులపతేరిహ వాతి గన్ధః

తన ప్రియుడైన మగలేడి నేత్రాలను చూస్తున్న ఆడ లేడిని పిలిచి "రకరకాల వృఖ్షముల సుగంధ వాయువు వీస్తూ ఉన్నది

బాహుం ప్రియాంస ఉపధాయ గృహీతపద్మో
రామానుజస్తులసికాలికులైర్మదాన్ధైః
అన్వీయమాన ఇహ వస్తరవః ప్రణామం
కిం వాభినన్దతి చరన్ప్రణయావలోకైః

ఇలా ఒక్కో చెట్టునూ పుట్టనూ అడుగుతూ వెళుతున్నారు.
అలా వెళుతూ ఉంటే స్వామి కూడా అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ గోపిక తన ప్రియుని భుజం పట్టుకుని ఈ ప్రాంతములో నడిచి ఉంది. తులసి యొక్క సౌగంధ్యముతో ఇక్కడ తుమ్మెదలు బాగా తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడే స్వామి ఉన్నాడు. మల్లె పూలు కూడా ఉన్నాయి. అంటే అమ్మాయి ఉంది.తులసి ఉందంటే స్వామి ఉన్నాడు. ఈ చెట్టు చాటుకు వచ్చాడా చెప్పు.
చెట్లు రాత్రి పూట కొమ్మలన్నీ పైకి ఉంటాయి. ఇక్కడ చెట్లన్నీ వంగి ఉన్నాయి. అంటే స్వామి ఇక్కడకు రాగా స్వామికి దండం పెట్టాయి. స్వామి ఇక్కడ తన ప్రియురాలితో కలసి ఉన్నాడు. ఆ విషయాన్ని వివరించు

పృచ్ఛతేమా లతా బాహూనప్యాశ్లిష్టా వనస్పతేః
నూనం తత్కరజస్పృష్టా బిభ్రత్యుత్పులకాన్యహో

ఈ తీగను చూస్తే పూలు బాగా పూసి ఉంది. ఈ పొదను కృష్ణుడు కౌగిలించుకున్నాడేమో , అందుకే ఇది బాగా పూసింది

ఇత్యున్మత్తవచో గోప్యః కృష్ణాన్వేషణకాతరాః
లీలా భగవతస్తాస్తా హ్యనుచక్రుస్తదాత్మికాః

ఇలా పిచ్చిగా పరమాత్మను వెతుకుతూ పరమాత్మ లీలలను అనుకరించారు. ఒక గోపికను పూతనగా చేసుకుని ఇంకో గోపిక కృష్ణునిగా స్తన్య పానం చేసింది.

కస్యాచిత్పూతనాయన్త్యాః కృష్ణాయన్త్యపిబత్స్తనమ్
తోకయిత్వా రుదత్యన్యా పదాహన్శకటాయతీమ్

ఒక గోపికను బండిలాగ అనుకుని ఇంకో గోపిక తన్నిది, ఒక గోపిక తృణావర్తునిగా, ఇంకో గోపిక ఒక గోపికను రోటికి గట్టుకుని లాగుకుని పోతోంది.

దైత్యాయిత్వా జహారాన్యామేకో కృష్ణార్భభావనామ్
రిఙ్గయామాస కాప్యఙ్ఘ్రీ కర్షన్తీ ఘోషనిఃస్వనైః

కృష్ణరామాయితే ద్వే తు గోపాయన్త్యశ్చ కాశ్చన
వత్సాయతీం హన్తి చాన్యా తత్రైకా తు బకాయతీమ్

ఒక గోపిక కృష్ణునిగా కొందరు బలరామునిగా కొందరు గోపికలుగా వత్సాసురుడు బకాసురుడు ధేనుకాసురుడిగా
ఒకరు వేణువు ఊదుతున్నారు, ఒకరు అదిగో కృష్ణుడంటున్నారు, అందరూ పరిగెత్తుతున్నారు

ఆహూయ దూరగా యద్వత్కృష్ణస్తమనువర్తతీమ్
వేణుం క్వణన్తీం క్రీడన్తీమన్యాః శంసన్తి సాధ్వితి

కస్యాఞ్చిత్స్వభుజం న్యస్య చలన్త్యాహాపరా నను
కృష్ణోऽహం పశ్యత గతిం లలితామితి తన్మనాః

మా భైష్ట వాతవర్షాభ్యాం తత్త్రాణం విహితం మయ
ఇత్యుక్త్వైకేన హస్తేన యతన్త్యున్నిదధేऽమ్బరమ్

ఆరుహ్యైకా పదాక్రమ్య శిరస్యాహాపరాం నృప
దుష్టాహే గచ్ఛ జాతోऽహం ఖలానామ్నను దణ్డకృత్

తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణమ్
చక్షూంష్యాశ్వపిదధ్వం వో విధాస్యే క్షేమమఞ్జసా

ఒక గోపిక గోవర్ధనం ఎత్తుతున్నట్లుగా, ఇంకో గోపిక కాళీయునిగా, ఇంకో గోపిక కృష్ణునిలా తొక్కుతుంది, ఇంకొకరు దావాగ్ని పానం చేస్తున్నట్లు నటించారు, కొందరు దాగుడు మూతలతో ఎత్తుకుని పోతున్నారు

బద్ధాన్యయా స్రజా కాచిత్తన్వీ తత్ర ఉలూఖలే
బధ్నామి భాణ్డభేత్తారం హైయఙ్గవముషం త్వితి
భీతా సుదృక్పిధాయాస్యం భేజే భీతివిడమ్బనమ్

ఏవం కృష్ణం పృచ్ఛమానా వ్ర్ణ్దావనలతాస్తరూన్
వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః

పరమాత్మను అనుకరిస్తూ అనుసరిస్తూ ఎక్కడా పరమాత్మ దొరకక ,ఇలా కష్టపడి జాగ్రత్తగా వెతుకుతూ ఉంటే ఒక చోట కృష్ణ పరమాత్మ అడుగుజాడలు కనపడ్డాయి

పదాని వ్యక్తమేతాని నన్దసూనోర్మహాత్మనః
లక్ష్యన్తే హి ధ్వజామ్భోజ వజ్రాఙ్కుశయవాదిభిః

పరమాత్మ గుర్తులున్న అడుగుజాడలు చూసారు

తైస్తైః పదైస్తత్పదవీమన్విచ్ఛన్త్యోऽగ్రతోऽబలాః
వధ్వాః పదైః సుపృక్తాని విలోక్యార్తాః సమబ్రువన్

ముందర రెండు కాళ్ళు వెనకాల రెండు కాళ్ళు (ఒక గోపికవి ) ఉన్నాయి

కస్యాః పదాని చైతాని యాతాయా నన్దసూనునా
అంసన్యస్తప్రకోష్ఠాయాః కరేణోః కరిణా యథా

కృష్ణుని పాదాలు లోతుకు దిగి ఉన్నాయి. వెనక ఉన్న పాదాలు లోతుకు ఉన్నాయి. అంటే బరువంతా కృష్ణుని మీద వేసి ఆమె నడచింది.

అనయారాధితో నూనం భగవాన్హరిరీశ్వరః
యన్నో విహాయ గోవిన్దః ప్రీతో యామనయద్రహః

పరమాత్మను ఈమె నిజముగా ఆరాధించినదే. మమ్ము వదిలి కృష్ణపరమాత్మ ఈమె వెంట ఉన్నాడు

ధన్యా అహో అమీ ఆల్యో గోవిన్దాఙ్ఘ్ర్యబ్జరేణవః
యాన్బ్రహ్మేశౌ రమా దేవీ దధుర్మూర్ధ్న్యఘనుత్తయే

బ్రహ్మా రుద్రుడూ లక్ష్మీ దేవి ఏ పాద పరాగాన్ని తమ పాపాలు పోవడానికి ధరిస్తారో అటువంటి పరమాత్మ పాద ధూళిని ఈ తుమ్మెదలూ, ఈ పొదలూ ధరిస్తున్నాయి. నిజముగా అవి ధన్యులు.

తస్యా అమూని నః క్షోభం కుర్వన్త్యుచ్చైః పదాని యత్
యైకాపహృత్య గోపీనామ్రహో భున్క్తేऽచ్యుతాధరమ్
న లక్ష్యన్తే పదాన్యత్ర తస్యా నూనం తృణాఙ్కురైః
 ఖిద్యత్సుజాతాఙ్ఘ్రితలామున్నిన్యే ప్రేయసీం ప్రియః

ఒక పాదం కాస్త ఎత్తుగా పైకి ఎత్తినట్లు కనపడుతున్నాయి. ముందరి పాదాలు ఎత్తుగా ఉన్నాయి. వెనక పాదాలు కనపడట్లేదు. ముని కాళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. అంటే స్వామి యొక్క అధరపానం చేసింది.
ఎంతో అదృష్టవంతురాలు. ఆమె పాదాలు సగం వెనక భాగం కనపడట్లేదు

ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూమ్
గోప్యః పశ్యత కృష్ణస్య భారాక్రాన్తస్య కామినః
అత్రావరోపితా కాన్తా పుష్పహేతోర్మహాత్మనా

కాస్త చెమట కూడా కనపడుతోంది. ఇక్కడ గోపికను స్వామి ఆలింగనం చేసుకున్నాడు.
ఇక్కడి దాకా రెండు పాదాలే ఉంటే, ఇక్కడినుంచీ నాలుగు పాదాలు కనపడుతున్నాయి.అంటే ఆ గోపికకు పూలు  పెట్టడానికి దింపాడు.

అత్ర ప్రసూనావచయః ప్రియార్థే ప్రేయసా కృతః
ప్రపదాక్రమణ ఏతే పశ్యతాసకలే పదే

ప్రియురాలికోసం కృష్ణుడు ఇక్కడ పూలు తెంపాడు. పైన పూలు ఉంటే అందాలని ముందరికాళ్ళ మీద నించున్నాడు

కేశప్రసాధనం త్వత్ర కామిన్యాః కామినా కృతమ్
తాని చూడయతా కాన్తాముపవిష్టమిహ ధ్రువమ్

గోపికకు దువ్వి చక్కగా పూలుపెట్టినట్లూ, వారిద్దరూ ఇక్కడ కూర్చున్నట్లు కనపడుతోంది

రేమే తయా చాత్మరత ఆత్మారామోऽప్యఖణ్డితః
కామినాం దర్శయన్దైన్యం స్త్రీణాం చైవ దురాత్మతామ్

లోకములో కాముకులు ఎలాంటి బాధనూ అసూయనూ

ఇత్యేవం దర్శయన్త్యస్తాశ్చేరుర్గోప్యో విచేతసః
యాం గోపీమనయత్కృష్ణో విహాయాన్యాః స్త్రియో వనే

కలిగి ఉంటారో చూపడానికి, ఇక్కడా ఆ గోపికతో స్వామి రమించినట్లు కనపడుతోంది

సా చ మేనే తదాత్మానం వరిష్ఠం సర్వయోషితామ్
హిత్వా గోపీః కామయానా మామసౌ భజతే ప్రియః

ఇలా మనసు కాస్తా కోల్పోయి. ఎంతో మందిని విడిచి ఒక్క గోపికను మాత్రమే తీసుకు వెళ్ళాడు.

తతో గత్వా వనోద్దేశం దృప్తా కేశవమబ్రవీత్
న పారయేऽహం చలితుం నయ మాం యత్ర తే మనః

ఏ గోపికను తీసుకు వెళ్ళాడో ఆ గోపిక కూడా నేను చాలా అదృష్టవంతురాలను అనుకున్నది. ఆమే కృష్ణునితో ఇలా అన్నది - నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి,నేను నడువలేను, నన్ను ఎత్తుకు తీసుకుపో అనగా, భుజాలెక్కి

ఏవముక్తః ప్రియామాహ స్కన్ధ ఆరుహ్యతామితి
తతశ్చాన్తర్దధే కృష్ణః సా వధూరన్వతప్యత

కూర్చో అన్నాడు. అలా అనగా ఎక్కడానికి ఆమె వెనక్కు వెళ్ళగా కృష్ణుడు అంతర్ధానమయ్యాడు

హా నాథ రమణ ప్రేష్ఠ క్వాసి క్వాసి మహాభుజ
దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిమ్

అప్పుడు ఆ గోపిక బాధతో ఏడుస్తోంది. నేను నీ దాసిని నన్ను వదలి వెళ్ళకు. ఆ గోపికను ఈ గోపికలు  కలుసుకున్నారు.

శ్రీశుక ఉవాచ
అన్విచ్ఛన్త్యో భగవతో మార్గం గోప్యోऽవిదూరితః
దదృశుః ప్రియవిశ్లేషాన్మోహితాం దుఃఖితాం సఖీమ్

ఆ గోపిక తక్కిన గోపికలకు కృష్ణుడు  తనతో ఎలా వ్యవహరించినదీ, ఎలా ఇపుడు మాయమయ్యినదీ చెప్పి, తాను గర్వించినందుకే ఇపుడు మాయం అయ్యాడని గ్రహించింది.

తయా కథితమాకర్ణ్య మానప్రాప్తిం చ మాధవాత్
అవమానం చ దౌరాత్మ్యాద్విస్మయం పరమం యయుః

తతోऽవిశన్వనం చన్ద్ర జ్యోత్స్నా యావద్విభావ్యతే
తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతుః స్త్రియః

ఎంతవరకూ చంద్రుని వెన్నెల వస్తుందో అంతవరూ వారు వెతుకుతూనే ఉన్నారు. చంద్రాస్తమయం దాకా వెతికారు. ఇంక చీకటి రావడముతో వెతకడం మానేసారు.

తన్మనస్కాస్తదలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః
తద్గుణానేవ గాయన్త్యో నాత్మగారాణి సస్మరుః

అతని యందే మనసు ఉంచి అతని పాటలే పాడుతూ అతని చేష్టలే చేస్తూ అతని  గుణాలే కీరిస్తూ అతనిలాగే వ్యవహరిస్తూ ఉన్నారు. తమ ఇళ్ళను తలచుకోలేదు

పునః పులినమాగత్య కాలిన్ద్యాః కృష్ణభావనాః
సమవేతా జగుః కృష్ణం తదాగమనకాఙ్క్షితాః

మళ్ళీ అదే కాళింది నదీ హ్రదానికి వచ్చి స్వామి ఎపుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు.


                                          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు