Pages

Wednesday, 9 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం రెండవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఏవం గతేऽథ సుద్యుమ్నే మనుర్వైవస్వతః సుతే
పుత్రకామస్తపస్తేపే యమునాయాం శతం సమాః

పది మంది కుమారులకంటే మొదలు కలిగిన అమ్మాయి (అబ్బాయి). ఒకే వ్యక్తి అబ్బాయీ అమ్మాయి అవ్వడానికి కారణం, చంద్ర సూర్య వంశానికి ఒకడే మూల పురుషుడు. పురూరవుడు సుద్యుమ్నుడు స్త్రీగా (ఇలా గా) ఉన్నప్పుడు పుట్టాడు.కాబట్టి పురూరవుడు చంద్రవంశం (బుధుడు చంద్రుడి కొడుకు). పురూరవుడు రాజు అవడం వలన అది చంద్ర వంశం. ఒక మనువు వలనే రెండు వంశాలు. అలాగే ఈ మనువుకు తరువాత పుట్టిన ఇక్ష్వాకు వలన సూర్య వంశం.
అలా సుద్యుమ్నుడు వెళ్ళిపోతే మనువు ఇంక తన వంశానికి పుత్రులు లేరని (పురూరవుడు తన వంశం వాడుకాడు) యమునా తీరములో పుత్రుని కొరకు వందేళ్ళు తపస్సు చేసాడు.

తతోऽయజన్మనుర్దేవమపత్యార్థం హరిం ప్రభుమ్
ఇక్ష్వాకుపూర్వజాన్పుత్రాన్లేభే స్వసదృశాన్దశ

సంతానం కోసం శ్రీమన్నారాయణున్ని పూజించాడు. అప్పుడు ఇక్ష్వాకాదులు పుట్టారు.ఇక్ష్వాకు మొదటివాడు

పృషధ్రస్తు మనోః పుత్రో గోపాలో గురుణా కృతః
పాలయామాస గా యత్తో రాత్ర్యాం వీరాసనవ్రతః

పృష్ద్రసుడు రెండవ వాడు. ఇతను గురువుగారి వద్దకు వచ్చి సేవ చేస్తున్నాడు. గురువుగారు ఆయన ఆవులకు రక్షగా ఉండమని చెప్పారు.

ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూలో నిశి వర్షతి
శయానా గావ ఉత్థాయ భీతాస్తా బభ్రముర్వ్రజే

ఆయన గోసేవను చేస్తుంటే ఒక సారి బాగా వర్షం పడింది. ఆ వర్షములో ఒక పెద్ద పులి గోశాలలో ప్రవేశించ్ది. గోవులన్నీ బెదిరాయి

ఏకాం జగ్రాహ బలవాన్సా చుక్రోశ భయాతురా
తస్యాస్తు క్రన్దితం శ్రుత్వా పృషధ్రోऽనుససార హ

అతను ఒక బాణం తీసుకుని కొట్ట్టాడు. అపుడు ఆవు చనిపోయింది

ఖడ్గమాదాయ తరసా ప్రలీనోడుగణే నిశి
అజానన్నచ్ఛినోద్బభ్రోః శిరః శార్దూలశఙ్కయా

వ్యాఘ్రోऽపి వృక్ణశ్రవణో నిస్త్రింశాగ్రాహతస్తతః
నిశ్చక్రామ భృశం భీతో రక్తం పథి సముత్సృజన్

మన్యమానో హతం వ్యాఘ్రం పృషధ్రః పరవీరహా
అద్రాక్షీత్స్వహతాం బభ్రుం వ్యుష్టాయాం నిశి దుఃఖితః

పెద్దపులి చనిపోయింది అని అనుకున్నాడు కానీ చనిపోయింది ఆవు. పెద్దపులి చెవి మాత్రం తెగింది అని తెలుసుకున్నాడు.

తం శశాప కులాచార్యః కృతాగసమకామతః
న క్షత్రబన్ధుః శూద్రస్త్వం కర్మణా భవితామునా

అది చూసిన కులాచారుడు గోహత్య చేసావు కాబట్టి నీ క్షత్రియత్వం నశించి శూద్రత్వం వస్తుంది అని శపించాడు.

ఏవం శప్తస్తు గురుణా ప్రత్యగృహ్ణాత్కృతాఞ్జలిః
అధారయద్వ్రతం వీర ఊర్ధ్వరేతా మునిప్రియమ్

ఇతను శాపాన్ని పొంది, శూద్రున్ని అయ్యాను అని అరణ్యములోనే జితేంద్రియుడై పరమాత్మను స్మరిస్తూ వానప్రస్థాశ్రమములో ఉండి

వాసుదేవే భగవతి సర్వాత్మని పరేऽమలే
ఏకాన్తిత్వం గతో భక్త్యా సర్వభూతసుహృత్సమః

పరమ ఏకాంతి అయ్యాడు.

విముక్తసఙ్గః శాన్తాత్మా సంయతాక్షోऽపరిగ్రహః
యదృచ్ఛయోపపన్నేన కల్పయన్వృత్తిమాత్మనః

సంగము లేని వాడు, ప్రశాంతాత్మ, ఇంద్రియ నిగ్రహం కలవాడు, దానం తీసుకోని వాడు

ఆత్మన్యాత్మానమాధాయ జ్ఞానతృప్తః సమాహితః
విచచార మహీమేతాం జడాన్ధబధిరాకృతిః

ఇంచుమించు అజగర వ్రతములో పిచ్చివాడిలా మూగవాడిలా గుడ్డివాడిలా చెవిటివాడిలా ఆచరించాడు

ఏవం వృత్తో వనం గత్వా దృష్ట్వా దావాగ్నిముత్థితమ్
తేనోపయుక్తకరణో బ్రహ్మ ప్రాప పరం మునిః

ఆ అరణ్యములో ఈ వ్రతాన్ని అవలంబించి ఆ అరణ్యాన్ని కార్చిచ్చు కాల్చి వేస్తే అందులోనే పడి పరమాత్మను . ఇలా శాపాన్ని పొంది కూడా శాపాన్ని వరముగా చేసుకున్నాడు.

కవిః కనీయాన్విషయేషు నిఃస్పృహో విసృజ్య రాజ్యం సహ బన్ధుభిర్వనమ్
నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం వివేశ కైశోరవయాః పరం గతః

తరువాత ఇంకో కుమారుడు కవి. కవి కూడా సాంసారిక విషయాల యందు ప్రేమ లేక రాజ్యాన్ని వదిలిపెట్టీ హృదయములో పరమాత్మను స్థాపింపచేసుకుని కిశోర వయసులో (ఎనిమిది సంవత్సరాల వయసులో) అరణ్యానికి వెళ్ళాడు

కరూషాన్మానవాదాసన్కారూషాః క్షత్రజాతయః
ఉత్తరాపథగోప్తారో బ్రహ్మణ్యా ధర్మవత్సలాః

తరువాత వాడు కరూషుడు. ఇతని నుండి వచ్చిన రాజులు కారూషులు. వీరంతా భారతదేశం యొక్క ఉత్తర ప్రాంతాన్ని పరిపాలించారు బ్రాహ్మణుల యందు ధర్మం యందు ప్రీతి కలవారు

ధృష్టాద్ధార్ష్టమభూత్క్షత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ
నృగస్య వంశః సుమతిర్భూతజ్యోతిస్తతో వసుః

ఇంకో కుమారుడు దృష్టుడి నుండి పుట్టిన వారందరూ క్షత్రియులైనా బ్రాహ్మణత్వాన్ని పొందారు. నృగుడికి సుమతి భూత జ్యోతి, వసు

వసోః ప్రతీకస్తత్పుత్ర ఓఘవానోఘవత్పితా
కన్యా చౌఘవతీ నామ సుదర్శన ఉవాహ తామ్

చిత్రసేనో నరిష్యన్తాదృక్షస్తస్య సుతోऽభవత్
తస్య మీఢ్వాంస్తతః పూర్ణ ఇన్ద్రసేనస్తు తత్సుతః

నరిష్యంతుని పుత్రుడు చిత్రసేనుడు

వీతిహోత్రస్త్విన్ద్రసేనాత్తస్య సత్యశ్రవా అభూత్
ఉరుశ్రవాః సుతస్తస్య దేవదత్తస్తతోऽభవత్

తతోऽగ్నివేశ్యో భగవానగ్నిః స్వయమభూత్సుతః
కానీన ఇతి విఖ్యాతో జాతూకర్ణ్యో మహానృషిః

అగ్నివేశ్యుడు తన ఆరాధనతో అగ్నిహోత్రున్నే పుత్రునిగా పొందగలిగాడు. అగ్నివేశునికి కుమారుడు కానీనుడు. ఇతను తన వంశాన్ని బ్రాహ్మణ వంశముగా మార్చేసాడు తన ఆరాధనతో. అప్పటి నుండి బ్రహ్మకులాన్ని అగ్నివేశ్య కులం అనిపేరు వచ్చింది. ఇతనికే జాతూ కర్ణుడు, కన్యా గర్భ సంభూతుడు ఉన్నాడు

తతో బ్రహ్మకులం జాతమాగ్నివేశ్యాయనం నృప
నరిష్యన్తాన్వయః ప్రోక్తో దిష్టవంశమతః శృణు

ఇది నరిష్యంతుని వంశం.

నాభాగో దిష్టపుత్రోऽన్యః కర్మణా వైశ్యతాం గతః
భలన్దనః సుతస్తస్య వత్సప్రీతిర్భలన్దనాత్

తరువాతి వాడు దిష్టుడు. నాభాగుడు దిష్టి పుత్రుడు. ఇతను తానాచరించిన కర్మతో వైశ్యుడయ్యాడు. అతని పుత్రులు బలంధనుడు, అతనికి వస్త ప్రీతి, వత్సప్రీతికి ప్రాంశు

వత్సప్రీతేః సుతః ప్రాంశుస్తత్సుతం ప్రమతిం విదుః
ఖనిత్రః ప్రమతేస్తస్మాచ్చాక్షుషోऽథ వివింశతిః

ప్రాంశుకు ప్రమతి,ప్రమతికి ఖనిత్రుడు, అతనికి చాక్షుషుడు, అతనికి వివింశతుడు

వివింశతేః సుతో రమ్భః ఖనీనేత్రోऽస్య ధార్మికః
కరన్ధమో మహారాజ తస్యాసీదాత్మజో నృప

వివింశతికి రంభుడు, రంభుడికి ఖనీనేత్రుడు, అతనికి కరంధముడు, అతనికి

తస్యావీక్షిత్సుతో యస్య మరుత్తశ్చక్రవర్త్యభూత్
సంవర్తోऽయాజయద్యం వై మహాయోగ్యఙ్గిరఃసుతః

అవీక్షితూడు, అతనికి మరుత్తు అనే చక్రవర్తి. చక్రవర్తి అయి అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలలో యజ్ఞ్యం చేయించాడు. ఇతను యజ్ఞ్యం చేయించినట్లు ప్రపంచములో ఎవరూ యజ్ఞ్యం చేయించలేదు.

మరుత్తస్య యథా యజ్ఞో న తథాన్యోऽస్తి కశ్చన
సర్వం హిరణ్మయం త్వాసీద్యత్కిఞ్చిచ్చాస్య శోభనమ్

ఆ యజ్ఞ్యములో వాడినదంతా బంగారమే, ఇంకో వస్తువు వాడలేదు.

అమాద్యదిన్ద్రః సోమేన దక్షిణాభిర్ద్విజాతయః
మరుతః పరివేష్టారో విశ్వేదేవాః సభాసదః

ఈ మరుత్తుడు నిరంతరం యజ్ఞ్యం చేస్తూ ఉంటే నిరంతరం సోమరసం తాగీ తాగీ ఇంద్రునికి మత్తు వచ్చింది. ఆ దక్షిణలు తీసుకుని బ్రాహ్మణులు గర్వించారు "మాకు ధనం వచ్చింది"

మరుత్తస్య దమః పుత్రస్తస్యాసీద్రాజ్యవర్ధనః
సుధృతిస్తత్సుతో జజ్ఞే సౌధృతేయో నరః సుతః

మరుత్తు వెంట విశ్వేదేవతలు సభలో ఉండి అతన్ని కాపాడుతూ ఉండేవారు. వీరంతా అతని పుత్రులు.

తత్సుతః కేవలస్తస్మాద్ధున్ధుమాన్వేగవాంస్తతః
బుధస్తస్యాభవద్యస్య తృణబిన్దుర్మహీపతిః

తం భేజేऽలమ్బుషా దేవీ భజనీయగుణాలయమ్
వరాప్సరా యతః పుత్రాః కన్యా చేలవిలాభవత్

ఆ క్రమములో ఈ వంశమువాడైన తృణబిందువనే రాజుని ఆలంభుషా అనే అప్సర కన్య వరించింది. వారి నుంచి ఒక ఇడవిడ అనే కూతురు కలిగింది

యస్యాముత్పాదయామాస విశ్రవా ధనదం సుతమ్
ప్రాదాయ విద్యాం పరమామృషిర్యోగేశ్వరః పితుః

ఇడవిడను విశ్వవసుడు పెళ్ళాడాడు (బ్రహ్మ - పులస్త్యుడు - విశ్వవసుడు) ఈ అమ్మాయికి కుబేరుడు పుత్రునిగా కలిగాడు. అందుకే ఐడబిడ అని పేరు.
ఇతను ధనపతి ఎందుకయ్యాడంటే పరమాత్మ వలన యోగ విద్యను నేర్చుకుని స్వామిని ఆ విద్యతో మెప్పించినందు వలన అయ్యాడు.

విశాలః శూన్యబన్ధుశ్చ ధూమ్రకేతుశ్చ తత్సుతాః
విశాలో వంశకృద్రాజా వైశాలీం నిర్మమే పురీమ్

విశాలః శూన్యబన్ధుశ్చ ధూమ్రకేతుశ్చ  ఇతని పుత్రుడు. విశాలుడు ఇతని వంశాన్ని కాపాడాడు. విశాలా పురిని నిర్మించాడు. విశాలానే బదరీ అంటారు.

హేమచన్ద్రః సుతస్తస్య ధూమ్రాక్షస్తస్య చాత్మజః
తత్పుత్రాత్సంయమాదాసీత్కృశాశ్వః సహదేవజః

విశాలుని కుమారుడు హేమచంద్రుడు.

కృశాశ్వాత్సోమదత్తోऽభూద్యోऽశ్వమేధైరిడస్పతిమ్
ఇష్ట్వా పురుషమాపాగ్ర్యాం గతిం యోగేశ్వరాశ్రితామ్

ఆ వరుసలో కృశాశ్వ పుత్రుడు సోమదత్తుడు. ఇతను అశ్వమేధ యాగముతో పరమాత్మను ఆరాధించి ఉత్తమపదాన్ని పొందాడు.

సౌమదత్తిస్తు సుమతిస్తత్పుత్రో జనమేజయః
ఏతే వైశాలభూపాలాస్తృణబిన్దోర్యశోధరాః

సౌమదత్తుని కుమారుడు సుమతి, అతని కుమారుడు జనమేజయుడు. వీరంతా విశాల వంశములోని రాజులు. అతని వంశాన్ని కాపాడినవారు