Pages

Wednesday, 9 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం మూడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ఠః సమ్బభూవ హ
యో వా అఙ్గిరసాం సత్రే ద్వితీయమహరూచివాన్

ఇక్ష్వాకు పుత్రుడు శర్యాతి. ఆంగిరసులు హోమం చేస్తూ ఒక సూక్తం మరచిపోయాఉ. పదహారు ఋక్కుల సూక్తం చదివారు తరువాత పన్నెండు ఋక్కుల సూక్తం చదవాలి. అది మరచిపోతే శర్యాతి వారికి అందించాడు

సుకన్యా నామ తస్యాసీత్కన్యా కమలలోచనా
తయా సార్ధం వనగతో హ్యగమచ్చ్యవనాశ్రమమ్

శర్యాతి యొక్క పుత్రిక సుకన్య. ఆమెకు యుక్త వయసు వచ్చాక శర్యాతి మంత్రులనూ సామంతులనూ కుటుంభాన్ని తీసుకుని వేటకు బయలుదేరి మధువనానికి వెళ్ళాడు

సా సఖీభిః పరివృతా విచిన్వన్త్యఙ్ఘ్రిపాన్వనే
వల్మీకరన్ధ్రే దదృశే ఖద్యోతే ఇవ జ్యోతిషీ

కొంత సేపటికి అందరికీ మల మూత్రాలు రావడం మానేసాయి. అది చ్యవన మహర్షి ఆశ్రమం అని తెలుసుకున్నాడు. ఇలా జరిగిందంటే ఎవరో తప్పు చేసారు. ఎవరు చేసారో దాచకుండా చెప్పండి అన్నడు. అపుడు సుకన్య వచ్చి "నేను చెలికత్తెలతో కలిసి తిర్గుతూ ఉండగా ఒక పుట్టలో రెండు దీపాలు కనపడ్డాయి, వాటిని ఒక దర్భతో పొడిచాను. అందులోంచి రక్తం వచ్చింది. 

తే దైవచోదితా బాలా జ్యోతిషీ కణ్టకేన వై
అవిధ్యన్ముగ్ధభావేన సుస్రావాసృక్తతో బహిః

శకృన్మూత్రనిరోధోऽభూత్సైనికానాం చ తత్క్షణాత్
రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్విస్మితోऽబ్రవీత్

ఆయనే చ్యవనుడని తెలుసుకుని ఆయనను క్షమాపణ అడుగుదామని వెళ్ళాడు. ఆయన "ఇపుడు నేను గుడ్డివాన్ని అయ్యాను కాబట్టి నాకు ఒక తోడు కావాలి, ఎవరి వలన నేను గుడ్డివాడిని అయ్యానో వారే నాకు తోడుగా ఉండాలి" అన్నాడు

అప్యభద్రం న యుష్మాభిర్భార్గవస్య విచేష్టితమ్
వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమదూషణమ్

సుకన్యా ప్రాహ పితరం భీతా కిఞ్చిత్కృతం మయా
ద్వే జ్యోతిషీ అజానన్త్యా నిర్భిన్నే కణ్టకేన వై

దుహితుస్తద్వచః శ్రుత్వా శర్యాతిర్జాతసాధ్వసః
మునిం ప్రసాదయామాస వల్మీకాన్తర్హితం శనైః

ఇలా కొంతకాలం గడిచిన తరువాత అక్కడికి ఒక సందర్భములో అశ్వనీదేవతలు వచ్చి చ్యవన మహర్షిని దర్షించి ప్రార్థిస్తే 

తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదాద్దుహితరం మునేః
కృచ్ఛ్రాన్ముక్తస్తమామన్త్ర్య పురం ప్రాయాత్సమాహితః

సుకన్యా చ్యవనం ప్రాప్య పతిం పరమకోపనమ్
ప్రీణయామాస చిత్తజ్ఞా అప్రమత్తానువృత్తిభిః

కస్యచిత్త్వథ కాలస్య నాసత్యావాశ్రమాగతౌ
తౌ పూజయిత్వా ప్రోవాచ వయో మే దత్తమీశ్వరౌ

ఆడవారు ఇష్టపడే సౌందర్యాన్ని యవ్వనాన్ని నాకు ప్రసాదించండి. దానికి ఫలితముగా మీకు నేను యజ్ఞ్యములో భాగం కల్పిస్తాను (ప్రాచీన కాలములో వైద్యులు పంక్తి బాహ్యులు)

గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామప్యసోమపోః
క్రియతాం మే వయోరూపం ప్రమదానాం యదీప్సితమ్

బాఢమిత్యూచతుర్విప్రమభినన్ద్య భిషక్తమౌ
నిమజ్జతాం భవానస్మిన్హ్రదే సిద్ధవినిర్మితే

అశ్వనీ దేవతలు ఆయనను తీసుకుని వెళ్ళి ఒక సరస్సులో మునిగారు, మునిగి లేవగానే, ముగ్గురూ ఒక్కతీరుగానే ఉన్నారు. తమతో సమానముగా చ్యవనున్ని చేసారు. 

ఇత్యుక్తో జరయా గ్రస్త దేహో ధమనిసన్తతః
హ్రదం ప్రవేశితోऽశ్విభ్యాం వలీపలితవిగ్రహః

పురుషాస్త్రయ ఉత్తస్థురపీవ్యా వనితాప్రియాః
పద్మస్రజః కుణ్డలినస్తుల్యరూపాః సువాససః

తాన్నిరీక్ష్య వరారోహా సరూపాన్సూర్యవర్చసః
అజానతీ పతిం సాధ్వీ అశ్వినౌ శరణం యయౌ

ముగ్గురిలో నీ భర్తను ఎంచుకోమని అడిగారు. అపుడు ఆ యువతి "నేను నా భర్త సౌందర్యాన్ని కోరలేదు. ఆయన కోరుకున్నాడు. మీరు మీ మాయా జాలాన్ని ఆపి నా భర్తను నాకివ్వండి. ఆయన యథారూపములోనే నేను ఆయన్ను ప్రేమిస్తాను" అని రహస్యముగా స్తోత్రం చేసింది. రహస్యముగా స్తోత్రం చేస్తే దేవతలు ప్రీతి చెందుతారు. దేవాః రహస్య ప్రియ. 

దర్శయిత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ
ఋషిమామన్త్ర్య యయతుర్విమానేన త్రివిష్టపమ్

ఆమె పాతివ్రత్యానికి వారు సంతోషించి చ్యవనునికి చిరంజీవిత్వాన్నిచ్చారు అందాన్ని ఇచ్చారు. 

యక్ష్యమాణోऽథ శర్యాతిశ్చ్యవనస్యాశ్రమం గతః
దదర్శ దుహితుః పార్శ్వే పురుషం సూర్యవర్చసమ్

కొంతకాలానికి రాజు కుటుంబముతో తన కూతురు ఎలా ఉందో చూడడానికి వెళ్ళాడు. యువకుడిగా ఉన్న చ్యవనున్ని చూచి సందేహించి దూషించబోయాడు.

రాజా దుహితరం ప్రాహ కృతపాదాభివన్దనామ్
ఆశిషశ్చాప్రయుఞ్జానో నాతిప్రీతిమనా ఇవ

చికీర్షితం తే కిమిదం పతిస్త్వయా ప్రలమ్భితో లోకనమస్కృతో మునిః
యత్త్వం జరాగ్రస్తమసత్యసమ్మతం విహాయ జారం భజసేऽముమధ్వగమ్

కథం మతిస్తేऽవగతాన్యథా సతాం కులప్రసూతే కులదూషణం త్విదమ్
బిభర్షి జారం యదపత్రపా కులం పితుశ్చ భర్తుశ్చ నయస్యధస్తమః

ఏవం బ్రువాణం పితరం స్మయమానా శుచిస్మితా
ఉవాచ తాత జామాతా తవైష భృగునన్దనః

శశంస పిత్రే తత్సర్వం వయోరూపాభిలమ్భనమ్
విస్మితః పరమప్రీతస్తనయాం పరిషస్వజే

సోమేన యాజయన్వీరం గ్రహం సోమస్య చాగ్రహీత్
అసోమపోరప్యశ్వినోశ్చ్యవనః స్వేన తేజసా

అపుడు సుకన్య జరిగిన విషయం చెప్పింది. అప్పుడు చ్యవనుడు రాజుతో యజ్ఞ్యం చేయించాడు (అశ్వనీ దేవతలకు ఈయన బాకీ ఉన్నాడు). చ్యవనుడు అశ్వనీ దేవతలకు భాగం ఇవ్వబోయాడు. నేను భాగం లేదంటే నీవు భాగం ఇస్తావా అని ఇంద్రుడు కొట్టడానికి వజ్రాయుధం తీయబోయాడు.

హన్తుం తమాదదే వజ్రం సద్యో మన్యురమర్షితః
సవజ్రం స్తమ్భయామాస భుజమిన్ద్రస్య భార్గవః

వజ్రాయుధముతో కలిసి ఉన్న అతని బాహువులు స్తంభించాలని చ్యవనుడు మంత్రం చదివాడు. వజ్రాయుధం ప్రయోగించకముందే బాహువుతో సహా స్తంభింపచేసాడు. వజ్రాయుధానికి వ్యర్థం కాకూడదని వ్యర్థం ఉంది. అది నిలబెట్టడానికి ఇంద్రుడు ప్రయోగించేలోపే ఆయన బాహువును స్తంభింపచేసాడు.

అన్వజానంస్తతః సర్వే గ్రహం సోమస్య చాశ్వినోః
భిషజావితి యత్పూర్వం సోమాహుత్యా బహిష్కృతౌ

అప్పుడు బ్రహ్మగారు చెప్పగా హవిస్సు అగ్నిలో ఇచ్చి ఇంద్రుని బాహువును మళ్ళీ మామూలు చేసాడు. ఇంద్రుడు కూడా వేరే మార్గం లేక అశ్వనీ దేవతలకు యజ్ఞ్యములో భాగం కల్పించాడు. 

ఉత్తానబర్హిరానర్తో భూరిషేణ ఇతి త్రయః
శర్యాతేరభవన్పుత్రా ఆనర్తాద్రేవతోऽభవత్

ఇది శర్యాతి పుత్రిక కథ, ఆ శర్యాతికి ముగ్గురు కొడుకులు. ఉత్తానబర్హిరానర్తో భూరిషేణ. ఆనర్తుని కుమారుడు రేవతుడు. ఈయనే సముద్ర మధ్యములో ద్వారక పట్టణాన్ని (కుశస్థలీ) నిర్మించాడు.

సోऽన్తఃసముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీమ్
ఆస్థితోऽభుఙ్క్త విషయానానర్తాదీనరిన్దమ

ఈయనకు నూర్గురు కుమారుడు. అందులో పెద్దవాడు కకుద్మి. కకుద్మికి రేవతి అని ఒక అమ్మాయి. 

తస్య పుత్రశతం జజ్ఞే కకుద్మిజ్యేష్ఠముత్తమమ్
కకుద్మీ రేవతీం కన్యాం స్వామాదాయ విభుం గతః

ఆమెకు పెళ్ళి చేయాలనుకొని ఆమెను తీసుకుని బ్రహ్మ లోకానికి వెళ్ళాడు.

పుత్ర్యా వరం పరిప్రష్టుం బ్రహ్మలోకమపావృతమ్
ఆవర్తమానే గాన్ధర్వే స్థితోऽలబ్ధక్షణః క్షణమ్

వెళ్ళే సమయానికి బ్రహ్మలోకములో గంధర్వ అప్సరసలు నాట్యం చేస్తుంటే దానికి భంగం చేయకూడదని అది అయ్యాక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన అమ్మాయికి భర్త కొరకి వెతుకుతున్నానని చెప్పాడు. 

తదన్త ఆద్యమానమ్య స్వాభిప్రాయం న్యవేదయత్
తచ్ఛ్రుత్వా భగవాన్బ్రహ్మా ప్రహస్య తమువాచ హ

అహో రాజన్నిరుద్ధాస్తే కాలేన హృది యే కృతాః
తత్పుత్రపౌత్రనప్త్ణాం గోత్రాణి చ న శృణ్మహే

అది విన్న బ్రహ్మ నీవెవరిని అనుకున్నావో చెప్పు అన్నాడు. ఆయన చెప్పగా బ్రహ్మగారు నవ్వు, నీవిప్పుడు చెప్పిన పేరు ఉన్న వారికి వెయ్యో వంశం నడుస్తోంది భూలోకములో. 

కాలోऽభియాతస్త్రిణవ చతుర్యుగవికల్పితః
తద్గచ్ఛ దేవదేవాంశో బలదేవో మహాబలః

బ్రహ్మలోకములో క్షణం అంటే కిందిలోకాలలో కొన్ని యుగాలు అయ్యాయి. ఐనా అడిగావు కాబట్టి, ప్రస్తుతం పరమాత్మ అంశలో బలరామ కృష్ణులు ఉన్నారు. అందులో పెద్దవాడు ఐన బలరాముడు పెళ్ళికి సిద్ధముగా ఉన్నాడు. 

కన్యారత్నమిదం రాజన్నరరత్నాయ దేహి భోః
భువో భారావతారాయ భగవాన్భూతభావనః

మీ అమ్మాయిని అతనికిచ్చి వివాహం చేయవలసినదని చెప్పాడు. కకుద్మి బలరామునికిచ్చి పెళ్ళి చేసాడు. రేవతీ బలరాముల వివాహములోనే ఒక ఆచారం ముడిపడి ఉంది. బలరాముడు రేవతిని చూచాడు. బలరాముడు ఆ అమ్మాయికి మోకాళ్ళ కిందకి కూడా రాలేదు. (యుగాలు గడిచిన కొద్దీ మనుషులు పొట్టి అవుతారు). రోకలి తెచ్చి నెత్తిన పెట్టి యమునా జలాన్ని మంత్రించి ఆ కానితో ఆ అమ్మాయి తల మీద కొట్టగానే తనంత పొడుగయ్యింది. ఆ కానికి మట్టి అంటుతుందేమో అని దానిని యమునా జలముతో కడిగి, గంగా జలముతో శుద్ధి చేసి "భూలోకములో ఇప్పటినుంచీ కన్య శుద్ధికీ అందరూ ఇలాగే చేయాలి" అని చెప్పాడు. 

అవతీర్ణో నిజాంశేన పుణ్యశ్రవణకీర్తనః
ఇత్యాదిష్టోऽభివన్ద్యాజం నృపః స్వపురమాగతః
త్యక్తం పుణ్యజనత్రాసాద్భ్రాతృభిర్దిక్ష్వవస్థితైః

సుతాం దత్త్వానవద్యాఙ్గీం బలాయ బలశాలినే
బదర్యాఖ్యం గతో రాజా తప్తుం నారాయణాశ్రమమ్

ఇలా ఆమెనిచ్చి పెళ్ళి చేసి తను తనవారు నిర్మించిన బదరీ నగరానికి వెళ్ళి నారాయణాశ్రమములో తపస్సు చేస్తూ కూర్చున్నాడు.