Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవం స్కంధం పధ్నాలగవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
అథాతః శ్రూయతాం రాజన్వంశః సోమస్య పావనః
యస్మిన్నైలాదయో భూపాః కీర్త్యన్తే పుణ్యకీర్తయః

ఇపుడు చంద్రవంశం చెబుతున్నాను. ఇక్కడినుంచే ఇలా (సుద్య్మ్నుడి స్త్రీ రూపం) పుత్రుడైన పురూరవుడు వచ్చాడు

సహస్రశిరసః పుంసో నాభిహ్రదసరోరుహాత్
జాతస్యాసీత్సుతో ధాతురత్రిః పితృసమో గుణైః

శ్రీమన్నారాయణుని నాభి పద్మం నుండి బ్రహ్మ, ఆయనకు అత్రి జన్మించాడు. ఆయన తన తండ్రితో సమానమైన తేజస్సు గలవాడు.

తస్య దృగ్భ్యోऽభవత్పుత్రః సోమోऽమృతమయః కిల
విప్రౌషధ్యుడుగణానాం బ్రహ్మణా కల్పితః పతిః

ఆ అత్రి యొక్క నేత్రములనుండి పుట్టినవాడు చంద్రుడు. అతని చూపు అమృతమయం కాబట్టి చంద్రుడు కూడా అమృతమయుడు. విప్ర ఔషధీ నక్షత్రములూ పితృదేవతలకు పతిగా చంద్రున్ని ఏర్పాటు చేసాడు

సోऽయజద్రాజసూయేన విజిత్య భువనత్రయమ్
పత్నీం బృహస్పతేర్దర్పాత్తారాం నామాహరద్బలాత్

ఈ చంద్రుడు మూడు లోకాలనూ తన పరాక్రమముతో గెలిచి రాజసూయ యాగం చేసాడు. అదే సందర్భములో బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు. అతని భార్య సౌందర్యాన్ని చూచి మోహించి ఆయన భార్యను అపహరించాడు

యదా స దేవగురుణా యాచితోऽభీక్ష్ణశో మదాత్
నాత్యజత్తత్కృతే జజ్ఞే సురదానవవిగ్రహః

ఆ భార్య విషయమై పరస్పరం యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రాక్షసులు చంద్రునికి సాయం చేసారు

శుక్రో బృహస్పతేర్ద్వేషాదగ్రహీత్సాసురోడుపమ్
హరో గురుసుతం స్నేహాత్సర్వభూతగణావృతః

అటువైపు శుక్రాచార్యులు, ఇటువైపు ఇంద్రుడు.

సర్వదేవగణోపేతో మహేన్ద్రో గురుమన్వయాత్
సురాసురవినాశోऽభూత్సమరస్తారకామయః

ఇటూ అట్టూ యుద్ధముతో అది మళ్ళీ దేవ దానవ యుద్ధమైంది. ఆ సమయములో

నివేదితోऽథాఙ్గిరసా సోమం నిర్భర్త్స్య విశ్వకృత్
తారాం స్వభర్త్రే ప్రాయచ్ఛదన్తర్వత్నీమవైత్పతిః

ఈ లోక క్ష్యాన్ని చూసి బ్రహ్మగారు సహించక చంద్రున్ని మందలించి తారను బృహస్పతికి ఇచ్చారు.

త్యజ త్యజాశు దుష్ప్రజ్ఞే మత్క్షేత్రాదాహితం పరైః
నాహం త్వాం భస్మసాత్కుర్యాం స్త్రియం సాన్తానికేऽసతి

కానీ అప్పటికే తార గర్భవతి. అది గుర్తించాడు బృహస్పతి. ఆ గర్భాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞ్యాపించగా ఆమె కుమారున్ని ప్రసవించింది.

తత్యాజ వ్రీడితా తారా కుమారం కనకప్రభమ్
స్పృహామాఙ్గిరసశ్చక్రే కుమారే సోమ ఏవ చ

మమాయం న తవేత్యుచ్చైస్తస్మిన్వివదమానయోః
పప్రచ్ఛురృషయో దేవా నైవోచే వ్రీడితా తు సా

ఆ కుమారున్ని చూచి నా కొడుకంటే నా కొడుకని బృహస్పతీ చంద్రులు అనుకుంటూ ఉంటే మళ్ళీ యుద్ధం జరిగింది, ఈ సారికి కొడుకు కోసం.

కుమారో మాతరం ప్రాహ కుపితోऽలీకలజ్జయా
కిం న వచస్యసద్వృత్తే ఆత్మావద్యం వదాశు మే

అపుడు అందరూ కలిసి ఆమెనే అడిగారు, ఇతను ఎవరి కొడుకూ అని. కానీ ఆమె సమాధానం చెప్పలేదు.
మళ్ళీ బ్రహ్మగారు ఆమెను పిలిచి అడిగారు, ఇతను ఎవరి కొడుకూ అని. అపుడు కుమారునికి కోపం వచ్చి "ఇపుడు సిగ్గు పడటం ఎందుకు. మొత్తం వంశానికి చెడ్డపేరు ఎలాగూ వచ్చింది. చెప్పు తండ్రి ఎవరో "  అని అన్నాడు

బ్రహ్మా తాం రహ ఆహూయ సమప్రాక్షీచ్చ సాన్త్వయన్
సోమస్యేత్యాహ శనకైః సోమస్తం తావదగ్రహీత్

బ్రహ్మ రహస్యముగా పిలిచి అడిగితే చంద్రుని కుమారుడూ అని చెప్పింది. ఆమె చెప్పడముతో చంద్రుడు ఆ పిల్లవాడిని తనకుమారుడిని తీసుకున్నాడు

తస్యాత్మయోనిరకృత బుధ ఇత్యభిధాం నృప
బుద్ధ్యా గమ్భీరయా యేన పుత్రేణాపోడురాణ్ముదమ్

పుట్టినప్పుడే నేరమూ జ్ఞ్యానమూ అజ్ఞ్యానమూ సిగ్గూ బిడియం గురించి మాట్లాడగలిగాడు కాబట్టి వీడు బుధుడు (జ్ఞ్యానం కలిగినవాడు) అని బ్రహ్మ గారు నామకరణం చేసారు. ఉత్తమ కుమారుడు దొరికాడని చంద్రుడు సంతోషించాడు.

తతః పురూరవా జజ్ఞే ఇలాయాం య ఉదాహృతః
తస్య రూపగుణౌదార్య శీలద్రవిణవిక్రమాన్

ఆ బుధుడు ఇలా (సుద్యుమ్నుడు) యందు కన్న కుమారుడు పురూరవుడు.

శ్రుత్వోర్వశీన్ద్రభవనే గీయమానాన్సురర్షిణా
తదన్తికముపేయాయ దేవీ స్మరశరార్దితా

ఈ పురూరవుని సౌందర్యా సంపదా భోగం ఐశ్వర్యం యోగ్యతా అన్నీ స్వర్గములో నారదుడు ఇంద్రునికి వివరిస్తుండగా ఊర్వశి విన్నది

మిత్రావరుణయోః శాపాదాపన్నా నరలోకతామ్
నిశమ్య పురుషశ్రేష్ఠం కన్దర్పమివ రూపిణమ్
ధృతిం విష్టభ్య లలనా ఉపతస్థే తదన్తికే

మిత్రా వరుణుల విషయములో చిన్న అపచారం చేస్తే వారు నీవు మానవ లోకమునకు వెళ్ళు అని శపిస్తే ఊర్వశి మానవలోకానికి వచ్చింది

స తాం విలోక్య నృపతిర్హర్షేణోత్ఫుల్లలోచనః
ఉవాచ శ్లక్ష్ణయా వాచా దేవీం హృష్టతనూరుహః

శ్రీరాజోవాచ
స్వాగతం తే వరారోహే ఆస్యతాం కరవామ కిమ్
సంరమస్వ మయా సాకం రతిర్నౌ శాశ్వతీః సమాః

ఊర్వశిని చూచి మోహం చెందిన పురూరవుడు చాలా కాలం కలిసి ఉందామని అడిగాడు 

ఉర్వశ్యువాచ
కస్యాస్త్వయి న సజ్జేత మనో దృష్టిశ్చ సున్దర
యదఙ్గాన్తరమాసాద్య చ్యవతే హ రిరంసయా

నీలాంటి సౌందర్యవంతుడు సంపద కలిగినవాడూ 

ఏతావురణకౌ రాజన్న్యాసౌ రక్షస్వ మానద
సంరంస్యే భవతా సాకం శ్లాఘ్యః స్త్రీణాం వరః స్మృతః

ఘృతం మే వీర భక్ష్యం స్యాన్నేక్షే త్వాన్యత్ర మైథునాత్
వివాససం తత్తథేతి ప్రతిపేదే మహామనాః

ఇలాంటి వాన్ని ఏ యువతి వరించదు? కానీ నాకు రెండు నియమాలు ఉన్నాయి వాటిని పాటించాలి. నా వద్ద రెండు మేకపోతులున్నాయి. నీవు వాటిని కాపాడాలి. రెండవది, నేను ఎంత కాలం నీతో ఉంటానో అంత కాలం నా ఆహారం నెయ్యి మాత్రమే. మూడవది మన ఇద్దరి సమాగమములో తప్ప ఇతర వేళలలో వివస్త్రునిగా చూడకూడదు. ఈ మూటిలో ఏది తప్పినా నేను వెళ్ళిపోతాను. అంది. దానికి పురూరవుడు ఒప్పుకున్నాడు. చాలా కాలం వీరు అన్యోన్యముగా ఉన్నారు

అహో రూపమహో భావో నరలోకవిమోహనమ్
కో న సేవేత మనుజో దేవీం త్వాం స్వయమాగతామ్

తయా స పురుషశ్రేష్ఠో రమయన్త్యా యథార్హతః
రేమే సురవిహారేషు కామం చైత్రరథాదిషు

రమమాణస్తయా దేవ్యా పద్మకిఞ్జల్కగన్ధయా
తన్ముఖామోదముషితో ముముదేऽహర్గణాన్బహూన్

అపశ్యన్నుర్వశీమిన్ద్రో గన్ధర్వాన్సమచోదయత్
ఉర్వశీరహితం మహ్యమాస్థానం నాతిశోభతే

ఊర్వశి లేకపోవడం ఇంద్రుడు చూసి గంధర్వులను ఊర్వశిని తీసుకు రమ్మను చెప్పగా అర్థరాత్రి వారు వచ్చి ఈమె కట్టివేసిన రెండు మేకలను తీసుకుని  వెళ్ళారు. ఆ మేకలు అరవగా ఊర్వశికి మెలకువ వచ్చింది. పురూరవుడు నిదురపోతుంటే అతన్ని నిందించి. 

తే ఉపేత్య మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే
ఉర్వశ్యా ఉరణౌ జహ్రుర్న్యస్తౌ రాజని జాయయా

నిశమ్యాక్రన్దితం దేవీ పుత్రయోర్నీయమానయోః
హతాస్మ్యహం కునాథేన నపుంసా వీరమానినా

నీవు కామలంపటుడవు, నా మేకలను కాపాడలేకపోతున్నావు అనే సరికి అతను అలాగే లేచి ఆ మేకల వెంట వెళ్ళాడు. ఆ మేకలను తీసుకు వచ్చాడు కానీ తొందరలో వస్త్రం వేసుకోవడం మరచిపోయాడు. నియమ భంగం కావడముతో ఊర్వశి వెళ్ళిపోయింది. ఊర్వశికోసం పిచ్చివాడిలాగ భూమండలం అంతా తిరుగుతూ ఉంటే కురుక్షేత్రములో సరస్వతీ నదీ తీరములో ఐదుగురుతో ఉన్న ఆమెను చూచాడు

యద్విశ్రమ్భాదహం నష్టా హృతాపత్యా చ దస్యుభిః
యః శేతే నిశి సన్త్రస్తో యథా నారీ దివా పుమాన్

ఇతి వాక్సాయకైర్బిద్ధః ప్రతోత్త్రైరివ కుఞ్జరః
నిశి నిస్త్రింశమాదాయ వివస్త్రోऽభ్యద్రవద్రుషా

తే విసృజ్యోరణౌ తత్ర వ్యద్యోతన్త స్మ విద్యుతః
ఆదాయ మేషావాయాన్తం నగ్నమైక్షత సా పతిమ్

ఐలోऽపి శయనే జాయామపశ్యన్విమనా ఇవ
తచ్చిత్తో విహ్వలః శోచన్బభ్రామోన్మత్తవన్మహీమ్

స తాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాం చ తత్సఖీః
పఞ్చ ప్రహృష్టవదనః ప్రాహ సూక్తం పురూరవాః

అహో జాయే తిష్ఠ తిష్ఠ ఘోరే న త్యక్తుమర్హసి
మాం త్వమద్యాప్యనిర్వృత్య వచాంసి కృణవావహై

నన్ను నీవు విడిచిపెట్టకు నీవు లేక నేనుండలేను. 

సుదేహోऽయం పతత్యత్ర దేవి దూరం హృతస్త్వయా
ఖాదన్త్యేనం వృకా గృధ్రాస్త్వత్ప్రసాదస్య నాస్పదమ్

నన్ను వదిలి చాలా కాలమైంది. నీవు లేని ఈ శరీరంపడిపోనీ, దీన్ని జంతువులు తిననీ, అన్నాడు. 

ఉర్వశ్యువాచ
మా మృథాః పురుషోऽసి త్వం మా స్మ త్వాద్యుర్వృకా ఇమే
క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యథా

నీవు పురుషుడవు, రాజువు ,ఇలాంటి దైన్యాన్ని పొందరాదు. నీవు మరణించరాదు ఒక సంవత్సరం తరువాత నీకు నేను కనపడతాను. అపుడు నీకు ఇంకో కుమారున్నిస్తాను నా వలన అని వెళ్ళింది. ఆమె గర్భవతి అని తెలుసుకున్నాడు

స్త్రియో హ్యకరుణాః క్రూరా దుర్మర్షాః ప్రియసాహసాః
ఘ్నన్త్యల్పార్థేऽపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత

విధాయాలీకవిశ్రమ్భమజ్ఞేషు త్యక్తసౌహృదాః
నవం నవమభీప్సన్త్యః పుంశ్చల్యః స్వైరవృత్తయః

సంవత్సరాన్తే హి భవానేకరాత్రం మయేశ్వరః
రంస్యత్యపత్యాని చ తే భవిష్యన్త్యపరాణి భోః

తరువాత కుమారుడు కలిగాక సంవత్సరానికి ఒక్క రోజు పురూరవుని వద్దకు వచ్చింది. అపుడు ఊర్వశి చెప్పింది. నేను నీకు కావాలి అనుకుంటే గంధర్వులను ఉద్దేశ్యించి తపస్సు చేయి. వారు నీకు నా లోకాన్ని ప్రసాదిస్తారు.నీవు నన్ను పొందవచ్చు. అప్పుడు ఊర్వశికోసం తపస్సు చేసాడు. ఇవన్నీ చేస్తే ఆ గంధర్వులు ఇతనికి ఒక అగ్నిస్థాలి ఇచ్చారు. ఊర్వశి మీద మోహముతో ఊర్వశినే ఇచ్చారనుకుని అక్కడే ఉన్నాడు. అగ్నిస్థాలిని అక్కడే ఉంచి త్రేతాయుగం మొదలైన తరువాత రాజ్యానికి వెళ్ళి, కొంతకాలం గడిచాక ఊర్వశిగా అతను భ్రమించుతున్న అగ్నిస్థాలిని చూడబోతే అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంది. అది శమీ గర్భం ఉన్న అశ్వద్ధ వృక్షం ఉంది. జమ్మిచెట్టూ జమ్మి చెట్టు మధ్యలో రావి చెట్టు. అప్పుడు జమ్మి చెట్టులో రావి చెట్టులో కొంత భాగం తీసుకుని మధించాడు. రాగి చెట్టు  వలన అగ్ని శమీ వృక్షములో పుడుతుంది. అందుకే శమిని అగ్నిస్థాలీ అన్న పేరు. అతను మధను చేసినపుడు కింద అరణిని ఊర్వశిగా పైనున్న కట్టెను తనగా భావిస్తూ మధనం చేసాడు. అప్సరలోకము కావాలని ఊర్వశిని ధ్యానం చేసాడు. ఆ భావనతో మధనం చేస్తే ఆ మధనం నుంచి అగ్నిహోత్రుడు పుట్టాడు.వేదముల మూడు మంత్రములతో అగ్నిహోత్రున్ని పురూరవునికి పుత్రుడుగా దేవతలు ఏర్పరచారు. నోటితో పుట్టుట వలన (అరణి అధర అరణి ఉత్తర అరణి), మూడింటితో పుట్టుట వలన ఆ అరణిని త్రేతాగ్ని అంటారు. 

అన్తర్వత్నీముపాలక్ష్య దేవీం స ప్రయయౌ పురీమ్
పునస్తత్ర గతోऽబ్దాన్తే ఉర్వశీం వీరమాతరమ్

ఉపలభ్య ముదా యుక్తః సమువాస తయా నిశామ్
అథైనముర్వశీ ప్రాహ కృపణం విరహాతురమ్

గన్ధర్వానుపధావేమాంస్తుభ్యం దాస్యన్తి మామితి
తస్య సంస్తువతస్తుష్టా అగ్నిస్థాలీం దదుర్నృప
ఉర్వశీం మన్యమానస్తాం సోऽబుధ్యత చరన్వనే

స్థాలీం న్యస్య వనే గత్వా గృహానాధ్యాయతో నిశి
త్రేతాయాం సమ్ప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత

స్థాలీస్థానం గతోऽశ్వత్థం శమీగర్భం విలక్ష్య సః
తేన ద్వే అరణీ కృత్వా ఉర్వశీలోకకామ్యయా

ఉర్వశీం మన్త్రతో ధ్యాయన్నధరారణిముత్తరామ్
ఆత్మానముభయోర్మధ్యే యత్తత్ప్రజననం ప్రభుః

తస్య నిర్మన్థనాజ్జాతో జాతవేదా విభావసుః
త్రయ్యా స విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృత్

అందువలన అది త్రివృత్ అయ్యింది

తేనాయజత యజ్ఞేశం భగవన్తమధోక్షజమ్
ఉర్వశీలోకమన్విచ్ఛన్సర్వదేవమయం హరిమ్

ఈ త్రివృత్తుతో (అకార ఉకార మకార) ఉచ్చారణతో ఈయన యజ్ఞ్యం చేసాడు ఊర్వశీ లోకాన్ని కోరి శ్రీమన్నారాయణున్ని ఆరాధించాడు

ఏక ఏవ పురా వేదః ప్రణవః సర్వవాఙ్మయః
దేవో నారాయణో నాన్య ఏకోऽగ్నిర్వర్ణ ఏవ చ

ఈ పురూరవుడు రాకముందు వారకూ వేదం ఒకటిగానే ఉండేది సర్వ వాజ్ఞ్మయం ఓంకారం మాత్రమే కార్యసాధకముగా ఉండేది. ఒక్కడే దేవుడు (నారాయణుడు) ఒకడే వేదం (ఓంకారం)
అదే అగ్ని మూడుగా మారింది పురూరవుని వలన. త్రేతాయుగారంభములో వచ్చింది కాబట్టి త్రేతాగ్ని అయ్యింది

పురూరవస ఏవాసీత్త్రయీ త్రేతాముఖే నృప
అగ్నినా ప్రజయా రాజా లోకం గాన్ధర్వమేయివాన్

ఇలా పురూరవుడు గాంధర్వ లోకానికి వెళ్ళాడు