Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదిహేనవ అధ్యాయం


శ్రీబాదరాయణిరువాచ
ఐలస్య చోర్వశీగర్భాత్షడాసన్నాత్మజా నృప
ఆయుః శ్రుతాయుః సత్యాయూ రయోऽథ విజయో జయః

ఈ పురూరవ ఊర్వశులకు ఆరుగురు కుమారులు కలిగారు - ఆయుః శ్రుతాయుః సత్యాయూ రయోऽథ విజయో జయః

శ్రుతాయోర్వసుమాన్పుత్రః సత్యాయోశ్చ శ్రుతఞ్జయః
రయస్య సుత ఏకశ్చ జయస్య తనయోऽమితః

శ్రుతాయుకు వసుమంతుడు. 

భీమస్తు విజయస్యాథ కాఞ్చనో హోత్రకస్తతః
తస్య జహ్నుః సుతో గఙ్గాం గణ్డూషీకృత్య యోऽపిబత్
జహ్నోస్తు పురుస్తస్యాథ బలాకశ్చాత్మజోऽజకః

హోత్రకునికే జహ్నువు పుట్టాడు. ఈయనే జహ్ను మహర్షి. ఈయనే భగీరధుడు గంగను తీసుకు వస్తుండగా ఆయన ఆశ్రమాన్ని ముంచితే మొత్తం గంగను ఆచమనం చేసి భగీరధుడు ప్రార్థిస్తే చెవిలోంచి వదిలిపెట్టాడు
జహ్నువు పుత్రుడు పూరువు.

తతః కుశః కుశస్యాపి కుశామ్బుస్తనయో వసుః
కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్కుశామ్బుజః

కుశనాభునికి నలుగురు కుమారులు. అందులో గాధి ఒకరు. ఈ గాధి విశ్వామిత్రుని తండ్రి.

తస్య సత్యవతీం కన్యామృచీకోऽయాచత ద్విజః
వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్

ఈ గాధి యొక్క పుత్రిక సత్యవతి. విశ్వామిత్రుని సోదరి. ఈమె సౌందర్యం చూసి రుచీకుడు గాధిని తన కుమార్తెనిచ్చి వివాహం చేయమన్నాడు. 

ఏకతః శ్యామకర్ణానాం హయానాం చన్ద్రవర్చసామ్
సహస్రం దీయతాం శుల్కం కన్యాయాః కుశికా వయమ్

అప్పుడు గాధి కన్యాశుల్కం అడిగాడు.చంద్రుడిలా తెల్లగా ఉండి చెవి మాత్రం నల్లగా ఉన్న వేయి గుర్రాలను ఇవ్వమంటే ఆయన వరుణునికోసం తపస్సు చేసాడు. రుచీకుని తపస్సుకు మెచ్చిన వరుణుడు ఆ గుర్రాలను ఇచ్చాడు. అవి తీసుకుని వెళ్ళి గాధికిచ్చి ఆయన పుత్రికను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నాక సంతానం కోసం యజ్ఞ్యం మొదలుపెట్టాడు. ఆ సంగతి తెలిసి అతని అత్తగారు తనకు కూడా సంతానం కొరకు యజ్ఞ్యం చేయిచమని అడగడముతో రెండు కలశాలలో మంత్ర జలాన్ని వేసి యజ్ఞ్యం పూర్తి అయ్యాక అత్తగారి జలాన్ని అత్తగారికి ఇచ్చాడు. భార్యది భార్యకు ఇచ్చి తను తపస్సుకు వెళ్ళాడు. తల్లి బిడ్డ దగ్గర "మీ భర్త మీకిచ్చిన పాత్ర నాకివ్వు. దానిలో మంచి సంతానముంటుంది. " అని అడుగగా అలాగే అని కూతురు ఇచ్చింది. అది తెలుసుకున్న రుచీకుడు. క్షత్రియుడు పుట్టాలని నీ కూతురుకూ ఉత్తమ బ్రాహ్మణుడు పుట్టాలని నా భార్యకు ఇచ్చాను అన్నాడు. అపుడు ఆమె క్షమించమని అడుగగా, సరె నీ మనుమడు అలాంటి వాడు అవుతాడు అని చెప్పగా జమదగ్ని పుట్టాడు. జమదగ్ని కొడుకు పరశురాముడు పుట్టాడు

ఇత్యుక్తస్తన్మతం జ్ఞాత్వా గతః స వరుణాన్తికమ్
ఆనీయ దత్త్వా తానశ్వానుపయేమే వరాననామ్

స ఋషిః ప్రార్థితః పత్న్యా శ్వశ్ర్వా చాపత్యకామ్యయా
శ్రపయిత్వోభయైర్మన్త్రైశ్చరుం స్నాతుం గతో మునిః

తావత్సత్యవతీ మాత్రా స్వచరుం యాచితా సతీ
శ్రేష్ఠం మత్వా తయాయచ్ఛన్మాత్రే మాతురదత్స్వయమ్

తద్విదిత్వా మునిః ప్రాహ పత్నీం కష్టమకారషీః
ఘోరో దణ్డధరః పుత్రో భ్రాతా తే బ్రహ్మవిత్తమః

ప్రసాదితః సత్యవత్యా మైవం భూరితి భార్గవః
అథ తర్హి భవేత్పౌత్రోజమదగ్నిస్తతోऽభవత్

జమదగ్ని కొడుకు పరశురాముడు

సా చాభూత్సుమహత్పుణ్యా కౌశికీ లోకపావనీ
రేణోః సుతాం రేణుకాం వై జమదగ్నిరువాహ యామ్

సత్యవతి సంతానం కలిగాక ఒక నదిగా మారిపోయింది, అదే కౌశికీ నది. ఈ జమదగ్ని రేణు పుత్రిక ఐన రేణుకను వివాహం చేసుకున్నాడు. అష్ట పుత్రులు పుట్టారు. వీరందరిలో చివరివాడు రాముడు

తస్యాం వై భార్గవఋషేః సుతా వసుమదాదయః
యవీయాన్జజ్ఞ ఏతేషాం రామ ఇత్యభివిశ్రుతః

యమాహుర్వాసుదేవాంశం హైహయానాం కులాన్తకమ్
త్రిఃసప్తకృత్వో య ఇమాం చక్రే నిఃక్షత్రియాం మహీమ్

ఈయన వాసుదేవ అంశ.

దృప్తం క్షత్రం భువో భారమబ్రహ్మణ్యమనీనశత్
రజస్తమోవృతమహన్ఫల్గున్యపి కృతేऽంహసి

ఈయన మొత్తం భూమండలాన్ని ఇరవై ఒక్క సార్లు తిరిగి దుష్ట క్షత్రియులను సంహరించి భూభారాన్ని తొలగించాడు

శ్రీరాజోవాచ
కిం తదంహో భగవతో రాజన్యైరజితాత్మభిః
కృతం యేన కులం నష్టం క్షత్రియాణామభీక్ష్ణశః

అంత తప్పు రాజులేమి చేసారు అని పరీక్షిత్తు అడిగాడు

శ్రీబాదరాయణిరువాచ
హైహయానామధిపతిరర్జునః క్షత్రియర్షభః
దత్తం నారాయణాంశాంశమారాధ్య పరికర్మభిః

హైహైయ వంశానికి అర్జనుడు అధిపతి. ఇతను కృతవీర్యుని కొడుకు. ఈయన పరమాత్మ అవతారమైన దత్తాత్రేయున్ని ఆరాధించి వేయి చేతులని పొందాడు, యుద్ధములో తన ఎదుట ఎవరూ నిలువలేనంత పరాక్రమం పొందాడు. అలా పొంది  మరణించే మార్గమేమిటని అడిగాడు. నీలాంటి వాడితోనే చావాలని అడిగాడు. వేయి బాహువులనూ ఐశ్వర్యాన్నీ అణిమాది సిద్ధులనూ ఎక్కడపడితే అక్కడ వాయువులా తిరిగే శక్తి పొంది మదము బాగా పెరిగి తన ప్రియురాళ్ళతో కలిసి రేవా నదీ తీరములో విహరిస్తూ ఉన్నాడు. ఇదే నదీ తీరములో స్నానం చేద్దామని దిగితే నీరు పైకి రాలేదు. కార్తవీర్యార్జనుడు తన ప్రియురాలి స్నానానికి అడ్డు అవుతోంది అని వేయి బాహువులనూ అడ్డుపెట్టాడు. అప్పుడు జరిగిన యుద్ధములో రావణుడు ఓడి చెరసాలకు వెళ్ళాడు 

బాహూన్దశశతం లేభే దుర్ధర్షత్వమరాతిషు
అవ్యాహతేన్ద్రియౌజః శ్రీ తేజోవీర్యయశోబలమ్

యోగేశ్వరత్వమైశ్వర్యం గుణా యత్రాణిమాదయః
చచారావ్యాహతగతిర్లోకేషు పవనో యథా

స్త్రీరత్నైరావృతః క్రీడన్రేవామ్భసి మదోత్కటః
వైజయన్తీం స్రజం బిభ్రద్రురోధ సరితం భుజైః

విప్లావితం స్వశిబిరం ప్రతిస్రోతఃసరిజ్జలైః
నామృష్యత్తస్య తద్వీర్యం వీరమానీ దశాననః

గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్బిషః
మాహిష్మత్యాం సన్నిరుద్ధో ముక్తో యేన కపిర్యథా

స ఏకదా తు మృగయాం విచరన్విజనే వనే
యదృచ్ఛయాశ్రమపదం జమదగ్నేరుపావిశత్

తస్మై స నరదేవాయ మునిరర్హణమాహరత్
ససైన్యామాత్యవాహాయ హవిష్మత్యా తపోధనః

స వై రత్నం తు తద్దృష్ట్వా ఆత్మైశ్వర్యాతిశాయనమ్
తన్నాద్రియతాగ్నిహోత్ర్యాం సాభిలాషః సహైహయః

హవిర్ధానీమృషేర్దర్పాన్నరాన్హర్తుమచోదయత్
తే చ మాహిష్మతీం నిన్యుః సవత్సాం క్రన్దతీం బలాత్

ఇతను వేటకోసం అరణ్యానికి బయలుదేరి వెళ్ళినపుడు జమదగని ఆశ్రమం కనపడింది. సైన్యాన్ని ఆపి ఋషికి నమస్కరించి వెళ్ళబోతూ ఉండగా నా విందు ఆరగించి వెళ్ళు అని చెప్పాడు.ఇంతమందికి నీవు పెట్టలేవనగా, పర్వాలేదు రమ్మని చెప్పాడు.ఆ సైన్యముతో  కలిసి కార్త్వీర్యార్జనునికి విందు చేసాడు. ఆయన దగ్గర ఒక ఆవు ఉంది. ఆ ఆవు వారికి కావలసినదంతా ఇచ్చింది. ఆ ఆవు మీద ఆశపడ్డాడు కార్తవీర్యార్జనుడు. ఆ గోవు హవిర్ధాని అని చెప్పాడు జమగదగ్ని. అది వినకుండా బలవంతముగా ఆ గోవును తీసుకుని వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జనుడు. ఇలా రాజు వెళ్ళిపోయిన తరువాత పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. 

అథ రాజని నిర్యాతే రామ ఆశ్రమ ఆగతః
శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం చుక్రోధాహిరివాహతః

ఘోరమాదాయ పరశుం సతూణం వర్మ కార్ముకమ్
అన్వధావత దుర్మర్షో మృగేన్ద్ర ఇవ యూథపమ్

తమాపతన్తం భృగువర్యమోజసా ధనుర్ధరం బాణపరశ్వధాయుధమ్
ఐణేయచర్మామ్బరమర్కధామభిర్యుతం జటాభిర్దదృశే పురీం విశన్

అచోదయద్ధస్తిరథాశ్వపత్తిభిర్గదాసిబాణర్ష్టిశతఘ్నిశక్తిభిః
అక్షౌహిణీః సప్తదశాతిభీషణాస్తా రామ ఏకో భగవానసూదయత్

జరిగినది విని మన ఆవును వారెవరో ఎలా తీసుకు వెళతారు అని తను మాహిష్మతీ నగరానికి యుద్ధానికి వెళ్ళాడు. ధనుర్భాణములూ గొడ్డలీ తీసుకు వెళ్ళాడు, కవచమూ డాలూ ఖడ్గమూ పట్టుకు వచ్చాడు. ఆయన్ని చూసి బ్రాహ్మణుడు ఇలా వస్తున్నాడేమిటని ముందు ద్వారాలు మూసేసి సైన్యాన్నిపంపారు ఆయన మీదకు. అంత పెద్ద సైన్యాన్ని పరశురాముడు తన యొక్క అణిమాది సిద్ధులతో గండ్రగొడ్డలితో నరికేసాడు. పదిహేను అక్షుహినీల సైన్యాన్ని రాముడొక్కడే సంహరించాడు

యతో యతోऽసౌ ప్రహరత్పరశ్వధో మనోऽనిలౌజాః పరచక్రసూదనః
తతశ్తతస్ఛిన్నభుజోరుకన్ధరా నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః

మనో వేగముతో వస్తున్నాడు, పరకారమముతో ఉన్నాడు, రథాలూ గుర్రాలూ ఏనుగులూ సైన్యమూ సారధులూ వారి మెడలూ చేతులూ కాళ్ళూ తెగి పడి మహా బీబత్సం అవ్వగా

దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః
వివృక్ణవర్మధ్వజచాపవిగ్రహం నిపాతితం హైహయ ఆపతద్రుషా

కార్తవీర్యార్జనుడు స్వయముగా వచ్చాడు. ఐద్వందల ధనస్సులను వేయి చేతులలో పట్టుకుని వచ్చహాడు.

అథార్జునః పఞ్చశతేషు బాహుభిర్ధనుఃషు బాణాన్యుగపత్స సన్దధే
రామాయ రామోऽస్త్రభృతాం సమగ్రణీస్తాన్యేకధన్వేషుభిరాచ్ఛినత్సమమ్

ఐదువందల ధనువులతో ఆయన వేసిన బాణాలను పరశురాముడు ఒక్క ధనువ్తోనే నిర్వీర్యం చేసాడు.

పునః స్వహస్తైరచలాన్మృధేऽఙ్ఘ్రిపానుత్క్షిప్య వేగాదభిధావతో యుధి
భుజాన్కుఠారేణ కఠోరనేమినా చిచ్ఛేద రామః ప్రసభం త్వహేరివ

దానికి తోడు పర్వతాలనూ వృక్షాలనూ లేపి మొత్తం సైన్యాన్నీ, కార్తవీర్యార్జనుని బాహువులనూ గొడ్డలితో చెట్టుకొమ్మలు నరికినట్లు నరికేసి తరువాత శిరస్సు కూడా సంహరించాడు. అగ్ని హోత్రునికి ఆహుతి ఇచ్చినట్లుగా. జరిగినది తండ్రికి చెప్పగా నీవు చాలా పాపం చేసావు. రాజ్యాన్ని పాలించే సర్వదేవమయుడైన రాజుని చంపరాదు. బ్రాహ్మణులకు ఓర్పు ఎక్కువ అని అందరూ మనని పూజిస్తున్నారు

కృత్తబాహోః శిరస్తస్య గిరేః శృఙ్గమివాహరత్
హతే పితరి తత్పుత్రా అయుతం దుద్రువుర్భయాత్

అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరహా
సముపేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్

స్వకర్మ తత్కృతం రామః పిత్రే భ్రాతృభ్య ఏవ చ
వర్ణయామాస తచ్ఛ్రుత్వాజమదగ్నిరభాషత

రామ రామ మహాబాహో భవాన్పాపమకారషీత్
అవధీన్నరదేవం యత్సర్వదేవమయం వృథా

వయం హి బ్రాహ్మణాస్తాత క్షమయార్హణతాం గతాః
యయా లోకగురుర్దేవః పారమేష్ఠ్యమగాత్పదమ్

క్షమయా రోచతే లక్ష్మీర్బ్రాహ్మీ సౌరీ యథా ప్రభా
క్షమిణామాశు భగవాంస్తుష్యతే హరిరీశ్వరః

రాజ్ఞో మూర్ధాభిషిక్తస్య వధో బ్రహ్మవధాద్గురుః
తీర్థసంసేవయా చాంహో జహ్యఙ్గాచ్యుతచేతనః

నీవు క్షమని విడిచిపెట్టావు. ఈ క్షమతోటే బ్రహ్మ సకల లోకములకూ సృష్టికర్త అయ్యాడు. ఓపికతో వెయ్యేళ్ళు వెతికి వెయ్యేళ్ళు తపస్సు చేయగలిగాడు కాబట్టి ఆయనకు పారమేష్ఠ్యం లభించింది. ఓపిక ఉన్న వారిమీదే పరమాత్మ సంతోషిస్తాడు. ఓర్పు లేని వారిని చూచి సంతోషించడు. పట్టభిషేకం ఐన రాజుని చంపుట బ్రహ్మ హత్య కన్నా పాపం.నీవిపుడు తీర్థ యాత్రలు చేయాలి. పాపం పొగొట్టుకోవాలి, పరమాత్మనే స్మరిస్తూ నీ మనసులో ఉన్న కోపాన్ని పోగొట్టుకోవాలి