Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదహారవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
పిత్రోపశిక్షితో రామస్తథేతి కురునన్దన
సంవత్సరం తీర్థయాత్రాం చరిత్వాశ్రమమావ్రజత్

ఇలా తండ్రి చెబితే అలాగే అని సంవత్సర కాలం తిరిగి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

కదాచిద్రేణుకా యాతా గఙ్గాయాం పద్మమాలినమ్
గన్ధర్వరాజం క్రీడన్తమప్సరోభిరపశ్యత

 రేణుకా దేవి (జమదగ్ని భార్య)  నదిలో స్నానం చేసి తీర్థం తీసుకు రావడానికి వెళ్ళగా ఆ గంగా నదీ పైభాగములో పద్మమాలీ అనే గంధర్వుడు అక్కడ విహరిస్తూ ఉన్నారు

విలోకయన్తీ క్రీడన్తముదకార్థం నదీం గతా
హోమవేలాం న సస్మార కిఞ్చిచ్చిత్రరథస్పృహా

ఒక్క క్షణ కాలం ఆ గంధర్వ రాజు బాగున్నాడే అనుకుంది 

కాలాత్యయం తం విలోక్య మునేః శాపవిశఙ్కితా
ఆగత్య కలశం తస్థౌ పురోధాయ కృతాఞ్జలిః

వ్యభిచారం మునిర్జ్ఞాత్వా పత్న్యాః ప్రకుపితోऽబ్రవీత్
ఘ్నతైనాం పుత్రకాః పాపామిత్యుక్తాస్తే న చక్రిరే

రామః సఞ్చోదితః పిత్రా భ్రాత్న్మాత్రా సహావధీత్
ప్రభావజ్ఞో మునేః సమ్యక్సమాధేస్తపసశ్చ సః

వరేణ చ్ఛన్దయామాస ప్రీతః సత్యవతీసుతః
వవ్రే హతానాం రామోऽపి జీవితం చాస్మృతిం వధే

ఉత్తస్థుస్తే కుశలినో నిద్రాపాయ ఇవాఞ్జసా
పితుర్విద్వాంస్తపోవీర్యం రామశ్చక్రే సుహృద్వధమ్

యేऽర్జునస్య సుతా రాజన్స్మరన్తః స్వపితుర్వధమ్
రామవీర్యపరాభూతా లేభిరే శర్మ న క్వచిత్

ఆలస్యానికి కారణం అప్పటికే జమదగ్ని మహర్షికి తెలిసిపోయింది. రేనుకా అమ్మవారు కూడా భయపడి తొందరగా ఆశ్రమానికి రాగా. నీకు వ్యభిచార దోషం వచ్చింది అని మీ తల్లిని వధించమని చెప్పగా ఏడుగురు పుత్రులూ నిరాకరించారు. పరశురామునితో వారందరినీ చంపమని చెప్పగా పరశురాముడు అలాగే చేసాడు. జమదగ్ని సంతోషించి ఏమి వరం కావాలి అని అడుగగా వారందరినీ బతికించమని అడుగుతాడు. అప్పుడు జమదగ్ని తండ్రి మాట జవదాటరాదని చెప్పాడు మిగతావారికి. పరశురామునికి నా గురించి తెలుసు, నేను మళ్ళీ తిరిగి బతికించగలను అని తెలుసు. తల్లి మీద మీకన్నా పరశురామునికే ఎక్కువ ప్రేమ.  

ఏకదాశ్రమతో రామే సభ్రాతరి వనం గతే
వైరం సిషాధయిషవో లబ్ధచ్ఛిద్రా ఉపాగమన్

దృష్ట్వాగ్న్యాగార ఆసీనమావేశితధియం మునిమ్
భగవత్యుత్తమశ్లోకే జఘ్నుస్తే పాపనిశ్చయాః

యాచ్యమానాః కృపణయా రామమాత్రాతిదారుణాః
ప్రసహ్య శిర ఉత్కృత్య నిన్యుస్తే క్షత్రబన్ధవః

రేణుకా దుఃఖశోకార్తా నిఘ్నన్త్యాత్మానమాత్మనా
రామ రామేతి తాతేతి విచుక్రోశోచ్చకైః సతీ

కార్తవీర్యార్జుని పుత్రులు పరశురాముని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జమదగ్నిని చంపడానికి పరశురాముడూ అతని సోదరులూ లేని సమయములో వెళ్ళారు. అగ్ని శాలలో ఉన్న ఆ మహర్షిని రేణుకా దేవి వారిస్తున్నా వినకుండా సంహరించారు. అపుడు రేణుకాదేవి రామా రామా అని అరవగా తండ్రి చనిపోయిన విషయం తెలుసుకున్న పరశురాముడు

తదుపశ్రుత్య దూరస్థా హా రామేత్యార్తవత్స్వనమ్
త్వరయాశ్రమమాసాద్య దదృశుః పితరం హతమ్

తే దుఃఖరోషామర్షార్తి శోకవేగవిమోహితాః
హా తాత సాధో ధర్మిష్ఠ త్యక్త్వాస్మాన్స్వర్గతో భవాన్

తండ్రి దేహాన్ని అన్నలకు అప్పగించి. క్షత్రియులు నిజముగా వీరులా, ఇంత దుర్మార్గులా. నేను భూలోకములో క్షత్రియులు లేకుండా చేస్తానని,  

విలప్యైవం పితుర్దేహం నిధాయ భ్రాతృషు స్వయమ్
ప్రగృహ్య పరశుం రామః క్షత్రాన్తాయ మనో దధే

గత్వా మాహిష్మతీం రామో బ్రహ్మఘ్నవిహతశ్రియమ్
తేషాం స శీర్షభీ రాజన్మధ్యే చక్రే మహాగిరిమ్

అక్కడికి వెళ్ళి క్షత్రియుడు కనపడితే చంపాడు. క్షత్రియుల శిరస్సులతో పెద్ద పర్వతాన్ని తయారు చేసాడు. ఆ రక్తముతో ఐదు నదులను ప్రవహింపచేసాడు

తద్రక్తేన నదీం ఘోరామబ్రహ్మణ్యభయావహామ్
హేతుం కృత్వా పితృవధం క్షత్రేऽమఙ్గలకారిణి

త్రిఃసప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః
సమన్తపఞ్చకే చక్రే శోణితోదాన్హ్రదాన్నవ

లోకమునకు అంగంగళం కలిగిస్తోన్న క్షత్రియ వంశాన్ని ఇరవై ఒక్కసారి భూమండలం తిరిగి క్షత్రియులు లేకుండా చేసాడు. అలా చేసి వచ్చి తన తండ్రికి రక్త తర్పణం ఇచ్చాడు. ఆ పాపం పోవడానికి పరమాత్మను ఉద్దేశ్యించి యజ్ఞ్యం చేసి అలా చేసిన బ్రాహ్మణులకు అన్ని దిక్కులనూ  ఇచ్చేసి, మధ్య భాగాన్ని కశ్యపునికీ ఇచ్చి యజ్ఞ్యం పూర్తి చేసి అవభృత స్నానం చేసి మబ్బులు తొలగిన సూర్యునిలా ప్రకాశించాడు

పితుః కాయేన సన్ధాయ శిర ఆదాయ బర్హిషి
సర్వదేవమయం దేవమాత్మానమయజన్మఖైః

దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశమ్
అధ్వర్యవే ప్రతీచీం వై ఉద్గాత్రే ఉత్తరాం దిశమ్

అన్యేభ్యోऽవాన్తరదిశః కశ్యపాయ చ మధ్యతః
ఆర్యావర్తముపద్రష్ట్రే సదస్యేభ్యస్తతః పరమ్

తతశ్చావభృథస్నాన విధూతాశేషకిల్బిషః
సరస్వత్యాం మహానద్యాం రేజే వ్యబ్భ్ర ఇవాంశుమాన్

స్వదేహం జమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞానలక్షణమ్
ఋషీణాం మణ్డలే సోऽభూత్సప్తమో రామపూజితః

జామదగ్న్యోऽపి భగవాన్రామః కమలలోచనః
ఆగామిన్యన్తరే రాజన్వర్తయిష్యతి వై బృహత్

పరశురామునిచేత పూజించబడిన జమదగ్ని దివ్య దేహాన్ని పొంది సప్తఋషి లోకానికి వెళ్ళాడు. ఈయన కూడా ఇంకో మన్వతరములో  పరశురాముడు సప్తృషులలో ఒకడు అవుతాడు. ఈయనే వ్యాసుడు అవుతాడు. 

ఆస్తేऽద్యాపి మహేన్ద్రాద్రౌ న్యస్తదణ్డః ప్రశాన్తధీః
ఉపగీయమానచరితః సిద్ధగన్ధర్వచారణైః

ఈ పరశురాముడు ఇప్పటికీ మహేంద్రగిరిలో ప్రశాంతముగా ఉన్నాడు. పరశురాముడు చిరంజీవి. 

ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్హరిరీశ్వరః
అవతీర్య పరం భారం భువోऽహన్బహుశో నృపాన్

ఇలా పరమాత్మ శ్రీమన్నారాయణుడు బృగువంశములో అవతరించి భూభారాన్ని తగ్గిస్తాడు. 

గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః
తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసమ్

ఈ గాధి యొక్క పుత్రుడు విశ్వామిత్రుడు. క్షతిర్యుడై ఉండికూడా బ్రహ్మ తేజస్సును పొందాడు 

విశ్వామిత్రస్య చైవాసన్పుత్రా ఏకశతం నృప
మధ్యమస్తు మధుచ్ఛన్దా మధుచ్ఛన్దస ఏవ తే

ఇతనికి 101 మంది కుమారులు. 

పుత్రం కృత్వా శునఃశేఫం దేవరాతం చ భార్గవమ్
ఆజీగర్తం సుతానాహ జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతామ్

ఈయనే సునశ్యేపున్ని, తన మేనల్లున్ని కుమారునిగా స్వీకరించాడు. 

యో వై హరిశ్చన్ద్రమఖే విక్రీతః పురుషః పశుః
స్తుత్వా దేవాన్ప్రజేశాదీన్ముముచే పాశబన్ధనాత్

యో రాతో దేవయజనే దేవైర్గాధిషు తాపసః
దేవరాత ఇతి ఖ్యాతః శునఃశేఫస్తు భార్గవః

యే మధుచ్ఛన్దసో జ్యేష్ఠాః కుశలం మేనిరే న తత్
అశపత్తాన్మునిః క్రుద్ధో మ్లేచ్ఛా భవత దుర్జనాః

అలా స్వీకరించి ఇతను మీ అందరి కన్నా పెద్దవాడిగా అంగీకరించండి. మీలో ఒకడు తమ ప్రాణాలివ్వండి ఇతని కోసం. అని అడీగడు. వారందరూ తండ్రిని పరిహసించాడు. అప్పుడుకొడుకులందరినీ శపించి సునశ్యేపునికి ఇంద్ర వరుణ మంత్రాలు రహస్యముగా జపించమని చెప్పాడు. అలా జపించి సునశ్యేపుడు రక్షించబడ్డాడు. అందుకు రుచీకుని కొడుకైన సునశ్యేపుడిని దేవరాతుడంటారు. తన మాట వినని తన కొడుకులను మ్లేచ్చులు (చండాలురు) కండీ అని శపించాడు. 

స హోవాచ మధుచ్ఛన్దాః సార్ధం పఞ్చాశతా తతః
యన్నో భవాన్సఞ్జానీతే తస్మింస్తిష్ఠామహే వయమ్


జ్యేష్ఠం మన్త్రదృశం చక్రుస్త్వామన్వఞ్చో వయం స్మ హి
విశ్వామిత్రః సుతానాహ వీరవన్తో భవిష్యథ
యే మానం మేऽనుగృహ్ణన్తో వీరవన్తమకర్త మామ్

ఏష వః కుశికా వీరో దేవరాతస్తమన్విత
అన్యే చాష్టకహారీత జయక్రతుమదాదయః

ఏవం కౌశికగోత్రం తు విశ్వామిత్రైః పృథగ్విధమ్
ప్రవరాన్తరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితమ్

మేమంతా ఆ వంశములోని వారమే. విశ్వామిత్రుని మాటను యాభై మంది విన్నారు, యాభై మంది వినలేదు. విన్నవారిని మీరు పరాక్రమవంతులు తపోవంతులు వీరులూ కండి అనీ వరమిచ్చాడు. దేవరాతుడు (సునశ్యేపుడు)భృగువంశం వాడైనా విశ్వామిత్రుడు కొడుకుగా స్వీకరించాడు కాబట్టి కౌశికవంశం వాడయాడు. కీ కౌశిక గోత్రం విశ్వామిత్రుని చేత వేరు వేరుగా చేయబడింది. ఇంకో ప్రవర వచ్చి చేరింది భార్గవ వంశం వచ్చి చేరడం వలన.