Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదహేడవ అధ్యాయం


శ్రీబాదరాయణిరువాచ
యః పురూరవసః పుత్ర ఆయుస్తస్యాభవన్సుతాః
నహుషః క్షత్రవృద్ధశ్చ రజీ రాభశ్చ వీర్యవాన్

పురూరవ మొదటి పుత్రుడైన ఆయువుకు నహుషః క్షత్రవృద్ధశ్చ రజీ రాభ అనే పుత్రులు 

అనేనా ఇతి రాజేన్ద్ర శృణు క్షత్రవృధోऽన్వయమ్
క్షత్రవృద్ధసుతస్యాసన్సుహోత్రస్యాత్మజాస్త్రయః

క్షత్రవృద్ధనకు సుహోత్రుడు. అతనికి ముగ్గురు కుమార్లు. 

కాశ్యః కుశో గృత్సమద ఇతి గృత్సమదాదభూత్
శునకః శౌనకో యస్య బహ్వృచప్రవరో మునిః

ఆ వరుసలో వచ్చిన శునకుడు, శుకనుని కుమారుడు శౌనకుడు. ఈయన వేదాలను వ్యాప్తి చేయించాడు

కాశ్యస్య కాశిస్తత్పుత్రో రాష్ట్రో దీర్ఘతమఃపితా
ధన్వన్తరిర్దీర్ఘతమస ఆయుర్వేదప్రవర్తకః

కశ్యని కుమారుడు కాశి. అతని కుమారుడు ధన్వంతరీ. ఆయుర్వేదాన్ని ప్రచారం చేసాడు. ఇతను పరమాత్మ అంశ

యజ్ఞభుగ్వాసుదేవాంశః స్మృతమాత్రార్తినాశనః
తత్పుత్రః కేతుమానస్య జజ్ఞే భీమరథస్తతః

రోగాలు వచ్చిన వారు ఇతని పేరు స్మరిస్తే రోగాలు పోతాయి

దివోదాసో ద్యుమాంస్తస్మాత్ప్రతర్దన ఇతి స్మృతః
స ఏవ శత్రుజిద్వత్స ఋతధ్వజ ఇతీరితః
తథా కువలయాశ్వేతి ప్రోక్తోऽలర్కాదయస్తతః

ఇది వారి వంశము. 

షష్టిం వర్షసహస్రాణి షష్టిం వర్షశతాని చ
నాలర్కాదపరో రాజన్బుభుజే మేదినీం యువా

అలర్కుడు ఎంత గొప్పవాడంటే అరవైవేల అరవై వందలు పరిపాలించాడు (66000). ఏ వంశములోనూ ఇంత దీర్ఘకాలం పరిపాలించినవారు లేరు. అతనికి సునీధుడూ మొదలైన వారు.

అలర్కాత్సన్తతిస్తస్మాత్సునీథోऽథ నికేతనః
ధర్మకేతుః సుతస్తస్మాత్సత్యకేతురజాయత

ధృష్టకేతుస్తతస్తస్మాత్సుకుమారః క్షితీశ్వరః
వీతిహోత్రోऽస్య భర్గోऽతో భార్గభూమిరభూన్నృప

ఇతీమే కాశయో భూపాః క్షత్రవృద్ధాన్వయాయినః
రాభస్య రభసః పుత్రో గమ్భీరశ్చాక్రియస్తతః

తద్గోత్రం బ్రహ్మవిజ్జజ్ఞే శృణు వంశమనేనసః
శుద్ధస్తతః శుచిస్తస్మాచ్చిత్రకృద్ధర్మసారథిః

వీరి వంశములోనే పరమాత్మ అవతరించాడు

తతః శాన్తరజో జజ్ఞే కృతకృత్యః స ఆత్మవాన్
రజేః పఞ్చశతాన్యాసన్పుత్రాణామమితౌజసామ్

రజి అనే ఇంకో కుమారున్ని ఇంద్రుడు శరణు వేడాడు రాక్షసుల నుండి కాపాడమని

దేవైరభ్యర్థితో దైత్యాన్హత్వేన్ద్రాయాదదాద్దివమ్
ఇన్ద్రస్తస్మై పునర్దత్త్వా గృహీత్వా చరణౌ రజేః

స్వర్గం నీదే అన్నాడు. అప్పుడు అతను గెలవగా ఇంద్రుడు నేను నీకు కుమారుడి వంటి వాన్ని అనగా స్వర్గాన్ని ఇచ్చివేసాడు 

ఆత్మానమర్పయామాస ప్రహ్రాదాద్యరిశఙ్కితః
పితర్యుపరతే పుత్రా యాచమానాయ నో దదుః

తండ్రిపోయినతరువాత ఈ విషయం ఎవరో చెప్పగా విన్న రజి కొడుకులు స్వర్గాన్ని అడిగారు ఇంద్రున్ని

త్రివిష్టపం మహేన్ద్రాయ యజ్ఞభాగాన్సమాదదుః
గురుణా హూయమానేऽగ్నౌ బలభిత్తనయాన్రజేః

అప్పుడు ఇంద్రుడు ఇవ్వకపోతే ఆ రాజులందరూ ఇంద్రుడి హవిస్సుని తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఇంద్రుడు బలహీనుడయ్యాడు. . ఇంద్రుడు అలా యజ్ఞ్యం చేస్తున్న ఆరుగురు కుమారులనూ వధించాడు

అవధీద్భ్రంశితాన్మార్గాన్న కశ్చిదవశేషితః
కుశాత్ప్రతిః క్షాత్రవృద్ధాత్సఞ్జయస్తత్సుతో జయః

ఒక్కడినీ వదలలేదు ఎందుకంటే వారందరూ మార్గభ్రష్టులు కాబట్టి

తతః కృతః కృతస్యాపి జజ్ఞే హర్యబలో నృపః
సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతః

సఙ్కృతిస్తస్య చ జయః క్షత్రధర్మా మహారథః
క్షత్రవృద్ధాన్వయా భూపా ఇమే శృణ్వథ నాహుషాన్

ఇది క్షత్ర వృద్ధ వంశము.