Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
యతిర్యయాతిః సంయాతిరాయతిర్వియతిః కృతిః
షడిమే నహుషస్యాసన్నిన్ద్రియాణీవ దేహినః

నహుషుని వంశాన్ని చెబుతున్నా. వీరందరూ వారి కుమారులు. 

రాజ్యం నైచ్ఛద్యతిః పిత్రా దత్తం తత్పరిణామవిత్
యత్ర ప్రవిష్టః పురుష ఆత్మానం నావబుధ్యతే

ఇందులో యతి,పరిణామం తెలిసినవాడు కాబట్టి తనకు రాజ్యం వద్దన్నాడు. పొరబాటున రాజ్యములోకి వెళితే తనను కూడా మరచిపోతాడు అని తెలుసుకున్నాడు

పితరి భ్రంశితే స్థానాదిన్ద్రాణ్యా ధర్షణాద్ద్విజైః
ప్రాపితేऽజగరత్వం వై యయాతిరభవన్నృపః

నగుషుడు ఇంద్రుడు వృత్రవధను చేసాక బ్రహ్మ హత్య వలన దాక్కుంటే ఈ నహుషుడే ఇంద్రునిగా ఉన్నాడు  అంతకాలమూ. 

చతసృష్వాదిశద్దిక్షు భ్రాత్న్భ్రాతా యవీయసః
కృతదారో జుగోపోర్వీం కావ్యస్య వృషపర్వణః

బ్రాహ్మణులను అవమానించడం వలన అగస్త్యుని శాపముతో ఈ నగుషుడు అజగరమయ్యాడు.అప్పుడు యయాతి రాజయ్యాడు. ఈ యయాతి శుక్రాచార్యుని పుత్రికనూ వేషపర్వుణి పుత్రికనూ వివాహం చేసుకున్నాడు

శ్రీరాజోవాచ
బ్రహ్మర్షిర్భగవాన్కావ్యః క్షత్రబన్ధుశ్చ నాహుషః
రాజన్యవిప్రయోః కస్మాద్వివాహః ప్రతిలోమకః

యయాతి క్షత్రియుడు కదా బ్రాహ్మణ పుత్రికను స్వీకరించకూడదు కదా అని అడిగాడు పరీక్షిత్తు 

శ్రీశుక ఉవాచ
ఏకదా దానవేన్ద్రస్య శర్మిష్ఠా నామ కన్యకా
సఖీసహస్రసంయుక్తా గురుపుత్ర్యా చ భామినీ

శుక్రాచార్యుని పుత్రిక శర్మిష్ఠ, వృషపర్వుని పుత్రిక దేవయానీ విహరిస్తూ సరసులో విహరిస్తూ స్నానం చేస్తున్నారు. పార్వతీ దేవితో శంకరుడు అటుగా రాగా, ఆయనను చూచి తొందరగా అందరూ వస్త్రాలు కట్టుకున్నారు.అప్పుడు దేవయాని వస్త్రాన్ని శర్మిష్ఠ ధరించింది. అది చూచి దేవయాని కోపించి. యజ్ఞ్యములో దేవతలకిచ్చే హవిస్సును కుక్క ముట్టుకున్నట్లు నా వస్త్రాన్ని నీవు ముట్ట్కుంటావా అని కోప్పడింది. యజ్ఞ్యముతో దేవతలను ఆరాధించే వారమైన మా వస్త్రాన్ని నీవు ముట్టుకుంటావా. మా తండ్రి ఐన రాజుకు ఉత్తమ మార్గాన్ని చూపేది మా నాన్న. మాది భృగువంశం వారు,నీ తండ్రి మా నాన్నకు శిష్యుడు. అని దేవయాని తిట్టింది బాగా. అపుడు శర్మిష్ఠ మీరు భిక్షుకులూ, మా తండ్రి వచ్చేంతవరకూ మీ నాన్న ఎదురు చూస్తూ కూర్చుంటారు అని ఆమెను తిట్టి ఆమె కట్టుకున్న వస్త్రాలు లాగేసి బావిలో ఆమెను పడవేయగా  భగవత్సంకల్పములో యయాతి వేటకి అని వచ్చి దాహం వేసి బావి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమెను చూచి వస్త్రం ఇచ్చి చేయి ఇచ్చి పైకిలేపాడు. నీవు నా చేతిని తీఎసుకున్నావు కాబట్టి నీవే నాకు భర్తగా ఉండు. ఇది దైవ నిర్ణయం అని చెప్పింది. నేను బ్రాహ్మణ పుత్రికనూ నీవు క్షత్రియుడవూ అని సందేహించకూ. నాకు క్షత్రియుడే భర్తగా వస్తాడని బృహస్పతి పుత్రుడైన కచుడు శపించాడు. (కచ దేవయాని) 
(బృహస్పతి కొడుకైన కచుడు మృతసంజీవనీ విద్యనర్థించి దేవయాని తండ్రి అయిన శుక్రాచార్యులవద్దకు వస్తాడు. కచుని సౌందర్యాన్ని చూచి దేవయాని మనసు పడింది. రాక్షసులు అతని మీద కోపముతో కచున్ని చంపేసారు. మృతసంగీవనీ విద్యతో శుక్రాచార్యుల వారు బతికించారు. ఇలా చాలా సార్లు జరిగాక, రాక్షసులు కచున్ని చంపి కాల్చివేసి ఆ బూడిదను మద్యములో కలిపి శుక్రాచార్యులవారికి ఇవ్వగా వారు తాగేసారు. ఆ విషయం తెలుసుకున్న శుక్రాచార్యులను దేవయాని కచున్ని బతికించమంది. శుక్రాచార్యులు దేవయానికి మంత్రం చెప్పి (అప్పుడు కచుడు విన్నాడు, విని నేర్చుకున్నాడు), కడుపులో ఉన్న కచున్ని బయటకు తీయగా తన తండ్రిని బతికించింది. బయటకు వచ్చిన కచుడు ఆ విద్యను అప్పటికే వినడముతో తన పని నెరవేరిందని తాను బయలు దేరతానని చెప్పాడు. అప్పుడు దేవయాని తనను పెళ్ళాడమంది. కచుడు గురుపుత్రికను వివాహమాడరదని చెప్పగా దేవయాని శపించింది, నీ విద్య నీకు పనికి రాదు అని. అపుడు కచుడు కూడా నీవు బ్రాహ్మణత్వాన్ని అవమానించావు కాబట్టి నీకు క్షత్రియుడు భర్తగా దొరుకుతాడు అని  ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. )
కచుని శాపం వలన నాకు బ్రాహ్మణుడు భర్తకాడు. కాబట్టి నీవే భర్తవి అవుతావు అని యయాతికి చెప్పింది దేవయాని. సరే నని ఆ మాట తీసుకుని నీ దగ్గరకు నేను వస్తాను అని చెప్పాడు. అపుడు దేవయాని ఊరులోకి వెళ్ళకుండా ఏడుస్తూ కూర్చుండి. అప్పుడు తండ్రికి ఆ విషయం తెలిసి అక్కడికి వచ్చాడు. ఆ రాజ్యం విడిచిపోదామని చెప్పింది తండ్రితో. అలాగే అని వెళుతూ ఉండగా. రాజు వచ్చి అడ్డుపడ్డాడు. విషయం  తెలుసుకున్న రాజు దేవయాని కోరిక మేరకు శర్మిష్టను దేవయానికి దాసీగా ఉంచాడు ప్రజల క్షేమాన్ని ఆశించి. మనం కోపాలలో చేసే పనులు ఎదుటివారికి అపకారం కాకుండా ఉపకారం చేస్తాయి. దేవయాని చేసిన పని వలన యయాతికి ఇంకో క్షత్రియ కన్యను ఇచ్చినట్లు అయ్యింది. శుక్రాచార్యులవారు దాసీగా పంపిస్తూనే యయాతిని హెచ్చరించాడు. "నీవు శర్మిష్టను నీ శయ్య మీదకు చేర్చుకోకు" అని. సరే అన్నాడు యయాతి. దేవయానికి ఉత్తమమైన సంతానం కలిగింది. శర్మిష్ట ఏకాంతములో రహస్యముగా యయాతిని అర్థించింది సంతానం కోసం. ఆయన అంగీకరించి భార్యగా స్వీకరించాడు. ఇద్దరు దేవయానికి, పురు మొదలైన ముగ్గురు శర్మిష్టకూ పుట్టారు. ఇది తెలుసుకున్న దేవయాని, తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఆమెను శాంతింపచేయడానికి యయాతి కూడా వెళ్ళాడు. "యవ్వనముతో నీవు వివేకం కోల్పోయావు కనుక నీవు వృద్ధుడవు అవుతావు"అని శపించాడు శుక్రాచార్యులు. యయాతి ప్రార్థించగా "నా శాపం మారదు కానీ , నీ వార్థక్యాన్ని ఎవరైనా తీసుకుంటే ఇవ్వు" అన్నాడు. పెద్ద కొడుకైన యదువును అడిగాడు తన వృద్ధాప్యాన్ని తీసుకోమని. అది విన్న యదువు. కొన్ని వేల సంవత్సరాలు అనుభవించిన నీకే తృప్తిలేకపోతే కొత్తగా యవ్వనం వచ్చిన నేను ఎలా వదులుకుంటా అన్నాడు. మిగతా అందరి కొడుకులు కూడా ఒప్పుకోలేదు. వయసులో చిన్నవాడైన పురు అనే కొడుకు మాత్రం ఒప్పుకున్నాడు

దేవయాన్యా పురోద్యానే పుష్పితద్రుమసఙ్కులే
వ్యచరత్కలగీతాలి నలినీపులినేऽబలా

తా జలాశయమాసాద్య కన్యాః కమలలోచనాః
తీరే న్యస్య దుకూలాని విజహ్రుః సిఞ్చతీర్మిథః

వీక్ష్య వ్రజన్తం గిరిశం సహ దేవ్యా వృషస్థితమ్
సహసోత్తీర్య వాసాంసి పర్యధుర్వ్రీడితాః స్త్రియః

శర్మిష్ఠాజానతీ వాసో గురుపుత్ర్యాః సమవ్యయత్
స్వీయం మత్వా ప్రకుపితా దేవయానీదమబ్రవీత్

అహో నిరీక్ష్యతామస్యా దాస్యాః కర్మ హ్యసామ్ప్రతమ్
అస్మద్ధార్యం ధృతవతీ శునీవ హవిరధ్వరే

యైరిదం తపసా సృష్టం ముఖం పుంసః పరస్య యే
ధార్యతే యైరిహ జ్యోతిః శివః పన్థాః ప్రదర్శితః

యాన్వన్దన్త్యుపతిష్ఠన్తే లోకనాథాః సురేశ్వరాః
భగవానపి విశ్వాత్మా పావనః శ్రీనికేతనః

వయం తత్రాపి భృగవః శిష్యోऽస్యా నః పితాసురః
అస్మద్ధార్యం ధృతవతీ శూద్రో వేదమివాసతీ

ఏవం క్షిపన్తీం శర్మిష్ఠా గురుపుత్రీమభాషత
రుషా శ్వసన్త్యురఙ్గీవ ధర్షితా దష్టదచ్ఛదా

ఆత్మవృత్తమవిజ్ఞాయ కత్థసే బహు భిక్షుకి
కిం న ప్రతీక్షసేऽస్మాకం గృహాన్బలిభుజో యథా

ఏవంవిధైః సుపరుషైః క్షిప్త్వాచార్యసుతాం సతీమ్
శర్మిష్ఠా ప్రాక్షిపత్కూపే వాసశ్చాదాయ మన్యునా

తస్యాం గతాయాం స్వగృహం యయాతిర్మృగయాం చరన్
ప్రాప్తో యదృచ్ఛయా కూపే జలార్థీ తాం దదర్శ హ

దత్త్వా స్వముత్తరం వాసస్తస్యై రాజా వివాససే
గృహీత్వా పాణినా పాణిముజ్జహార దయాపరః

తం వీరమాహౌశనసీ ప్రేమనిర్భరయా గిరా
రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురఞ్జయ

హస్తగ్రాహోऽపరో మా భూద్గృహీతాయాస్త్వయా హి మే
ఏష ఈశకృతో వీర సమ్బన్ధో నౌ న పౌరుషః
యదిదం కూపమగ్నాయా భవతో దర్శనం మమ

న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ
కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా

యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః
మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః

గతే రాజని సా ధీరే తత్ర స్మ రుదతీ పితుః
న్యవేదయత్తతః సర్వముక్తం శర్మిష్ఠయా కృతమ్

దుర్మనా భగవాన్కావ్యః పౌరోహిత్యం విగర్హయన్
స్తువన్వృత్తిం చ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్

వృషపర్వా తమాజ్ఞాయ ప్రత్యనీకవివక్షితమ్
గురుం ప్రసాదయన్మూర్ధ్నా పాదయోః పతితః పథి

క్షణార్ధమన్యుర్భగవాన్శిష్యం వ్యాచష్ట భార్గవః
కామోऽస్యాః క్రియతాం రాజన్నైనాం త్యక్తుమిహోత్సహే

తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతమ్
పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను

పిత్రా దత్తా దేవయాన్యై శర్మిష్ఠా సానుగా తదా
స్వానాం తత్సఙ్కటం వీక్ష్య తదర్థస్య చ గౌరవమ్
దేవయానీం పర్యచరత్స్త్రీసహస్రేణ దాసవత్

నాహుషాయ సుతాం దత్త్వా సహ శర్మిష్ఠయోశనా
తమాహ రాజన్ఛర్మిష్ఠామాధాస్తల్పే న కర్హిచిత్

విలోక్యౌశనసీం రాజఞ్ఛర్మిష్ఠా సుప్రజాం క్వచిత్
తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ

రాజపుత్ర్యార్థితోऽపత్యే ధర్మం చావేక్ష్య ధర్మవిత్
స్మరన్ఛుక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యత

యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత
ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ

గర్భసమ్భవమాసుర్యా భర్తుర్విజ్ఞాయ మానినీ
దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధవిమూర్ఛితా

ప్రియామనుగతః కామీ వచోభిరుపమన్త్రయన్
న ప్రసాదయితుం శేకే పాదసంవాహనాదిభిః

శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృతపూరుష
త్వాం జరా విశతాం మన్ద విరూపకరణీ నృణామ్

శ్రీయయాతిరువాచ
అతృప్తోऽస్మ్యద్య కామానాం బ్రహ్మన్దుహితరి స్మ తే
వ్యత్యస్యతాం యథాకామం వయసా యోऽభిధాస్యతి

ఇతి లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత
యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయః

మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహమ్
వయసా భవదీయేన రంస్యే కతిపయాః సమాః

శ్రీయదురువాచ
నోత్సహే జరసా స్థాతుమన్తరా ప్రాప్తయా తవ
అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః

తుర్వసుశ్చోదితః పిత్రా ద్రుహ్యుశ్చానుశ్చ భారత
ప్రత్యాచఖ్యురధర్మజ్ఞా హ్యనిత్యే నిత్యబుద్ధయః

అపృచ్ఛత్తనయం పూరుం వయసోనం గుణాధికమ్
న త్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి

శ్రీపూరురువాచ
కో ను లోకే మనుష్యేన్ద్ర పితురాత్మకృతః పుమాన్
ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విన్దతే పరమ్

తండ్రి చేసిన దానికి ఏది ఇచ్చి ఉపకారం తీర్చుకుంటాము. తండ్రి మనసులో అనుకోగానే చేసినవాడు ఉత్తముడు, చెప్పినది చేసినవాడు మధ్యముడు. 

ఉత్తమశ్చిన్తితం కుర్యాత్ప్రోక్తకారీ తు మధ్యమః
అధమోऽశ్రద్ధయా కుర్యాదకర్తోచ్చరితం పితుః

తండ్రి మాట సరిగా వినని వాడు అధముడు. తండ్రి మాట అసలు వినని వాడు తండ్రి యొక్క మలముతో సమానము అని చెప్పి. సతోషముగా వార్థక్యాన్ని తీసుకున్నాడు.యయాతి ఆ వయసుతో అన్ని కోరికలూ తీర్చుకున్నాడు, యజ్ఞ్యాలు చేసాడు. 

ఇతి ప్రముదితః పూరుః ప్రత్యగృహ్ణాజ్జరాం పితుః
సోऽపి తద్వయసా కామాన్యథావజ్జుజుషే నృప

సప్తద్వీపపతిః సంయక్పితృవత్పాలయన్ప్రజాః
యథోపజోషం విషయాఞ్జుజుషేऽవ్యాహతేన్ద్రియః

దేవయాన్యప్యనుదినం మనోవాగ్దేహవస్తుభిః
ప్రేయసః పరమాం ప్రీతిమువాహ ప్రేయసీ రహః

అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణైః
సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిమ్

యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలిః
నానేవ భాతి నాభాతి స్వప్నమాయామనోరథః

తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయమ్
నారాయణమణీయాంసం నిరాశీరయజత్ప్రభుమ్

ఏవం వర్షసహస్రాణి మనఃషష్ఠైర్మనఃసుఖమ్
విదధానోऽపి నాతృప్యత్సార్వభౌమః కదిన్ద్రియైః

పరమాత్మను శ్రీమన్నారాయణున్ని ధ్యానం చేసి ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకుని కొన్ని వేల సంవత్సరాలు ఇంద్రియ తృప్తికోసం విహరించాడు. కానీ చెడు ఇంద్రియములతో తృప్తి చెందలేదు