Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తస్యాం విదర్భోऽజనయత్పుత్రౌ నామ్నా కుశక్రథౌ
తృతీయం రోమపాదం చ విదర్భకులనన్దనమ్

విదర్భుడనే రాజు కుశుడూ క్రథుడూ రోమపాదుడనే ముగ్గురు కుమారులను కన్నాడు

రోమపాదసుతో బభ్రుర్బభ్రోః కృతిరజాయత
ఉశికస్తత్సుతస్తస్మాచ్చేదిశ్చైద్యాదయో నృపాః

ఆ రోమపాదుడే దశరధుని స్నేహితుడు. అతని కొడుకు బభ్రు, అతనికి కృతికుడు, ఉశికుడు, దాని వలన చేదీ (శిశుపాలుడు ఈ వంశం వాడే)
మొదలైనవారు పుట్టారు
అంధకుడు అనే రాజుకు ఆహుకుడు ఆహుకి అనే ఇద్దరు పిల్లలు. ఆహుకుడికి దేవకుడూ ఉగ్రసేనుడు అని ఇద్దరు. దేవకుడికి నలుగురు బిడ్డలు.దేవకుడికే ఏడుగురు అమ్మాయిలు పుట్టారు. అందులో దేవకిని వసుదేవుడు వివాహమాడాడు. కంసుడు అనే ఒక కుమారుడు. ఉగ్రసేనుడి కొడుకు కంసుడు, దేవకుడి కొడుకు దేవకి. వీరిద్దరూ ఒక్క తండ్రి పిల్లలు కారు కానీ అక్క చెల్లెల్లు అన్నదమ్ములు. వసుదేవునికి మిగతా భార్యలు కూడా ఉన్నారు. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెల్లు ఉన్నారు. కుంతీ అనే రాజుకి శూరుడు (వసుదేవుని తండ్రి) తన కుమార్తెలలో పృధా అనే కుమార్తెను కుంతికి దత్తతు ఇచ్చాడు పిల్లలు లేరని. దత్తతు చేసుకున్న పేరు కుంతి. ఆమె దుర్వాసుని వలన విద్య పొంది, ఆ విద్యతో సంతానాన్ని ఏ దేవత వల్లనంటే ఆ దేవతతో పొందవచ్చని తెలిసి, పరీక్షకని. సూర్యున్ని ప్రార్థించి, ఆమెకు అయోనిజ గానే ఆమె కర్ణము నుంచి కర్ణున్ని ప్రసాదించాడు సూర్యుడు. ఆయనను నదీ జలములో వదిలేసింది. శ్రుతదేవ కుంతి యొక్క అక్క చెల్లెరలో ఒకరు, ఆమె కరూష దేశపు రాజు దృడవర్మ పెళ్ళాడి, దాని వలన దంత వక్తృడు పుట్టాడు. రాజాధిదేవి అని ఒక ఆమెకు చేది రాజైన శిశుపాలుడు జన్మించాడు. వసుదేవుడు దేవకిని కాకుండా రోహిణీ మొదలైన భార్యలు ఉన్నారు. నందా ఉపనందా సురక మొదలైన వారు మధిర అనే ఆవిడ పిల్లలు. వసుదేవుడు దేవకిని వివాహమాడగా వారికి ఎనిమిది మంది పుడితే అందులో ఎనిమిదవ వాడైన శ్రీకృష్ణుడే మీ తాతలను కాపాడాడు. అందులో సుభద్ర అనే ఒక చెల్లెలు ఉంది. ఆమెనే మీ తాతగారైన అర్జనుడు పెళ్ళాడాడు. స్వామి కృష్ణుడు తన చిరునవ్వులతో చేష్టలతో పవిత్రం చేసాడు లోకాలన్నీ. కృష్ణ భగవానుని ముఖం చూసిన వారెవ్వరూ తృప్తి పొందేవారు కారు. నందవ్రజములో ఉన్న కృష్ణుడు చాలా లీలలు చేసాడు. ఆయన ఉద్ధవునకు చివరలో ఉద్ధవ గీతను చెప్పి అవతారాన్ని చాలించాడు.
మహా పురాణానికి ఉన్న పది లక్షణాలలో ఆశ్రయం ఒకటి. మనసు ఏదో ఒకదాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనసుకు ఉండే ఆశ్రయాన్ని బట్టి సుఖ దుఃఖములు కలుగుతాయి. ఈ జన్మలో మన మనసు దేన్ని ఆశ్రయిస్తే దానికి తగిన జన్మ మనకు వస్తుంది. ఆ

క్రథస్య కున్తిః పుత్రోऽభూద్వృష్ణిస్తస్యాథ నిర్వృతిః
తతో దశార్హో నామ్నాభూత్తస్య వ్యోమః సుతస్తతః

జీమూతో వికృతిస్తస్య యస్య భీమరథః సుతః
తతో నవరథః పుత్రో జాతో దశరథస్తతః

కరమ్భిః శకునేః పుత్రో దేవరాతస్తదాత్మజః
దేవక్షత్రస్తతస్తస్య మధుః కురువశాదనుః

పురుహోత్రస్త్వనోః పుత్రస్తస్యాయుః సాత్వతస్తతః
భజమానో భజిర్దివ్యో వృష్ణిర్దేవావృధోऽన్ధకః

అనువు యొక్క పుత్రుడు పురుహోత్రుడు. ఇతనికి ఆయుః, అతనికి సాత్వతుడు. 

సాత్వతస్య సుతాః సప్త మహాభోజశ్చ మారిష
భజమానస్య నిమ్లోచిః కిఙ్కణో ధృష్టిరేవ చ

ఈ ఏడుగురూ మహాభోజులు. 

ఏకస్యామాత్మజాః పత్న్యామన్యస్యాం చ త్రయః సుతాః
శతాజిచ్చ సహస్రాజిదయుతాజిదితి ప్రభో

శతజిత్ - నూరుగురిని గెలిచేవాడు, సహస్ర జిత్,అయుత జిత్ వీరి కొడుకులు

బభ్రుర్దేవావృధసుతస్తయోః శ్లోకౌ పఠన్త్యమూ
యథైవ శృణుమో దూరాత్సమ్పశ్యామస్తథాన్తికాత్

ఆపదలో ఉన్న వారు బభ్రు అని గట్టిగా పిలిస్తే చాలు ఆపదలు తొలగిపోతాయి. దూరం నుంచి విన్నా దగ్గర నుంచి చూచినా. మానవులలో ఉత్తముడు, దేవతలతో సమానుడు బభ్రు

బభ్రుః శ్రేష్ఠో మనుష్యాణాం దేవైర్దేవావృధః సమః
పురుషాః పఞ్చషష్టిశ్చ షట్సహస్రాణి చాష్ట చ

6,073 మంది ఈ బభ్రువు యొక్క ప్రభావం వలన అమృతత్వాన్ని (మోక్షాన్ని) పొందారు. 

యేऽమృతత్వమనుప్రాప్తా బభ్రోర్దేవావృధాదపి
మహాభోజోऽతిధర్మాత్మా భోజా ఆసంస్తదన్వయే

ఈ మహా భోజ వంశము వాడే కంసుడు.

వృష్ణేః సుమిత్రః పుత్రోऽభూద్యుధాజిచ్చ పరన్తప
శినిస్తస్యానమిత్రశ్చ నిఘ్నోऽభూదనమిత్రతః

ఇది వృష్ణి వంశం. 

సత్రాజితః ప్రసేనశ్చ నిఘ్నస్యాథాసతుః సుతౌ
అనమిత్రసుతో యోऽన్యః శినిస్తస్య చ సత్యకః

సత్రాజిత్తూ ప్రసేనుడు నిఘ్ని పుత్రుడు. సత్యకుని కుమారుడు సాత్యకి (వసుదేవుని తమ్ముని కొడుకు) 

యుయుధానః సాత్యకిర్వై జయస్తస్య కుణిస్తతః
యుగన్ధరోऽనమిత్రస్య వృష్ణిః పుత్రోऽపరస్తతః

అనమిత్రునికి యుగంధరుడు. 

శ్వఫల్కశ్చిత్రరథశ్చ గాన్దిన్యాం చ శ్వఫల్కతః
అక్రూరప్రముఖా ఆసన్పుత్రా ద్వాదశ విశ్రుతాః

వృష్ణికి శ్వఫల్కుడు కుమారుడు. ఇతనికి గాంధిని యందు కలిగిన కుమారుడే అకౄరుడు కుమారుడు.  మొత్తం వారు పన్నెండు మంది. 

ఆసఙ్గః సారమేయశ్చ మృదురో మృదువిద్గిరిః
ధర్మవృద్ధః సుకర్మా చ క్షేత్రోపేక్షోऽరిమర్దనః

శత్రుఘ్నో గన్ధమాదశ్చ ప్రతిబాహుశ్చ ద్వాదశ
తేషాం స్వసా సుచారాఖ్యా ద్వావక్రూరసుతావపి

ఈ పన్నెండు మందీ అకౄరుని సోదరులు.అకౄరునికి ఇద్దరు సోదరులు.

దేవవానుపదేవశ్చ తథా చిత్రరథాత్మజాః
పృథుర్విదూరథాద్యాశ్చ బహవో వృష్ణినన్దనాః

దేవవాన్ ఉపదేవులు ఇద్దరూ 

కుకురో భజమానశ్చ శుచిః కమ్బలబర్హిషః
కుకురస్య సుతో వహ్నిర్విలోమా తనయస్తతః

కపోతరోమా తస్యానుః సఖా యస్య చ తుమ్బురుః
అన్ధకాద్దున్దుభిస్తస్మాదవిద్యోతః పునర్వసుః

తస్యాహుకశ్చాహుకీ చ కన్యా చైవాహుకాత్మజౌ
దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజాః

పునర్వసుని కుమారుడు ఆహుకుడు. కన్య పేరు ఆహుకి. ఆహుకునికి ఇద్దరు కుమారులు. దేవకుడూ ఉగ్రసేనుడు. దేవకునికి నలుగురు కుమారులు

దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః
తేషాం స్వసారః సప్తాసన్ధృతదేవాదయో నృప

వీరికి (దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః) చెల్లెల్లు ఏడుగురు. వారిలో దేవకి ఒకరు. ఈ ఏడుగురినీ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు

శాన్తిదేవోపదేవా చ శ్రీదేవా దేవరక్షితా
సహదేవా దేవకీ చ వసుదేవ ఉవాహ తాః

కంసః సునామా న్యగ్రోధః కఙ్కః శఙ్కుః సుహూస్తథా
రాష్ట్రపాలోऽథ ధృష్టిశ్చ తుష్టిమానౌగ్రసేనయః

ఈ తొమ్మిది మందీ ఉగ్రసేనుడి కుమారులు 

కంసా కంసవతీ కఙ్కా శూరభూ రాష్ట్రపాలికా
ఉగ్రసేనదుహితరో వసుదేవానుజస్త్రియః

శూరో విదూరథాదాసీద్భజమానస్తు తత్సుతః
శినిస్తస్మాత్స్వయం భోజో హృదికస్తత్సుతో మతః

విదూరథుని నుండి శూరుడు పుట్టాడు. 

దేవమీఢః శతధనుః కృతవర్మేతి తత్సుతాః
దేవమీఢస్య శూరస్య మారిషా నామ పత్న్యభూత్

శూరుని భార్య పేరు మారిష. శూరసేనుడికి మారిష యందు పది మంది కుమారులు కలిగారు

తస్యాం స జనయామాస దశ పుత్రానకల్మషాన్
వసుదేవం దేవభాగం దేవశ్రవసమానకమ్

వసుదేవుడు వీరికి పుత్రులలో ఒకరు. వసుదేవుడు పుట్టగానే దేవతలు దుందుభులు మోగించారు. అందుకే వసుదేవునికి ఆనక దుంద్భుభి అని పేరు. దేవతలు పుష్పాలను వర్షించారు. 

సృఞ్జయం శ్యామకం కఙ్కం శమీకం వత్సకం వృకమ్
దేవదున్దుభయో నేదురానకా యస్య జన్మని

వసుదేవం హరేః స్థానం వదన్త్యానకదున్దుభిమ్
పృథా చ శ్రుతదేవా చ శ్రుతకీర్తిః శ్రుతశ్రవాః

ఈ వసుదేవుడు హరికి స్థానం కాబట్టి అతన్ని ఆనక దుందుభి అంటారు. 

రాజాధిదేవీ చైతేషాం భగిన్యః పఞ్చ కన్యకాః
కున్తేః సఖ్యుః పితా శూరో హ్యపుత్రస్య పృథామదాత్

పృథా చ శ్రుతదేవా చ శ్రుతకీర్తిః శ్రుతశ్రవాః రాజాధిదేవీ  అనే వారు ఈయనకు చెల్లెలు. తన మిత్రుడైన కుంతిభోజునికి శూరుడు తన పుత్రికను దత్తత ఇచ్చాడు

సాప దుర్వాససో విద్యాం దేవహూతీం ప్రతోషితాత్
తస్యా వీర్యపరీక్షార్థమాజుహావ రవిం శుచిః

(పృధ) కుంతీ దేవి దుర్వాసున్ని సంతోషింపచేసి ఆయన నుంచి దేవహూతి (దేవతలను ఆహవనించే మంత్రం) 

తదైవోపాగతం దేవం వీక్ష్య విస్మితమానసా
ప్రత్యయార్థం ప్రయుక్తా మే యాహి దేవ క్షమస్వ మే

ఆ మంత్రం గొపతనం తెలుసుకుందామని కుంతి సూర్యభగవానున్ని ఆహ్వానించింది. సూర్యుడు రాగానే "పరీక్షకని పిలిచాను కానీ నాకేమీ వద్దు, నన్ను క్షమించి మీరు వెళ్ళండి" అంది

అమోఘం దేవసన్దర్శమాదధే త్వయి చాత్మజమ్
యోనిర్యథా న దుష్యేత కర్తాహం తే సుమధ్యమే

అపుడు సూర్యుడు నాలాంటి వాని దర్శనం వ్యర్థం కారాదు. దుర్వాసుడు మంత్రాలతో నన్ను బంధించాడు. నేను వచ్చిన పని చేయకుండా వెళ్ళలేను.  దుర్వాసుడు నీకు ఈ మంత్రాన్ని ఏ ఉద్దేశ్యముతో ఇచ్చాడో అది చేయకుండా వెళ్ళలేను. నీకు అబ్బాయిని ఇచ్చే వెళతాను గానీ కన్యాత్వం చెడకుండా కాపాడతాను. అని చెప్పి ఒక పిల్లవాడిని ఇచ్చి వెళ్ళాడు. 

ఇతి తస్యాం స ఆధాయ గర్భం సూర్యో దివం గతః
సద్యః కుమారః సఞ్జజ్ఞే ద్వితీయ ఇవ భాస్కరః

వెంటనే రెండవ సూర్యుని వంటి తేజస్సుతో ఒక కుమారుడు కలిగాడు. 

తం సాత్యజన్నదీతోయే కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతీ
ప్రపితామహస్తామువాహ పాణ్డుర్వై సత్యవిక్రమః

మహా కష్టం కలిగించే లోకానికి భయపడి కుంతి ఆ పిల్లవాడిని నదీ జలములో వదిలిపెట్టింది. మీ ముత్తాతగారు ఆమెను వివాహం చేసుకున్నాడు

శ్రుతదేవాం తు కారూషో వృద్ధశర్మా సమగ్రహీత్
యస్యామభూద్దన్తవక్ర ఋషిశప్తో దితేః సుతః

శ్రుతదేవి అని ఇంకో చెల్లి కరూషుని వలన్ పొందిన పుత్రుడే దంతవక్తృడు. ఇతనే సనకాదుల వలన శాపం పొందిన ద్వార పాలకులలో ఒకడు. 

కైకేయో ధృష్టకేతుశ్చ శ్రుతకీర్తిమవిన్దత
సన్తర్దనాదయస్తస్యాం పఞ్చాసన్కైకయాః సుతాః

కైకైయ మహారజు దృష్టకేతువు శ్రుతకీర్తిని వివాహం చేసుకోగా సంతర్దనాదులు పుట్టారు. 

రాజాధిదేవ్యామావన్త్యౌ జయసేనోऽజనిష్ట హ
దమఘోషశ్చేదిరాజః శ్రుతశ్రవసమగ్రహీత్

జయసేనుడు రాజాధిదేవిన్ పెళ్ళి చేసుకున్నాడు. శిశుపాలుడు దమఘోషుని కుమారుడు, శ్రుతశ్రవ వలన పుట్టాడు.

శిశుపాలః సుతస్తస్యాః కథితస్తస్య సమ్భవః
దేవభాగస్య కంసాయాం చిత్రకేతుబృహద్బలౌ

దేవభాగునికి చిత్రకేతుడూ బృహద్బలులు. 

కంసవత్యాం దేవశ్రవసః సువీర ఇషుమాంస్తథా
బకః కఙ్కాత్తు కఙ్కాయాం సత్యజిత్పురుజిత్తథా

సృఞ్జయో రాష్ట్రపాల్యాం చ వృషదుర్మర్షణాదికాన్
హరికేశహిరణ్యాక్షౌ శూరభూమ్యాం చ శ్యామకః

శ్యామకునికి శూరభూమి యందు హరికేశహిరణ్యాక్షులు పుట్టారు. 

మిశ్రకేశ్యామప్సరసి వృకాదీన్వత్సకస్తథా
తక్షపుష్కరశాలాదీన్దుర్వాక్ష్యాం వృక ఆదధే

సుమిత్రార్జునపాలాదీన్సమీకాత్తు సుదామనీ
ఆనకః కర్ణికాయాం వై ఋతధామాజయావపి

శమీకుని వలన సుదామిని సుమిత్రార్జునపాలాదులను  పొందింది. 

పౌరవీ రోహిణీ భద్రా మదిరా రోచనా ఇలా
దేవకీప్రముఖాశ్చాసన్పత్న్య ఆనకదున్దుభేః

వసుదేవుడికి ఆ ఏడ్గురే కాక వీరందరూ భార్యలు

బలం గదం సారణం చ దుర్మదం విపులం ధ్రువమ్
వసుదేవస్తు రోహిణ్యాం కృతాదీనుదపాదయత్

రోహిణి యందు వసుదేవునికి బలం గదం సారణం చ దుర్మదం విపులం ధ్రువమ్ అనే వారు పుట్టారు

సుభద్రో భద్రబాహుశ్చ దుర్మదో భద్ర ఏవ చ
పౌరవ్యాస్తనయా హ్యేతే భూతాద్యా ద్వాదశాభవన్

పన్నెండు మంది, వీరందరూ పౌరవీ తనయులు. 

నన్దోపనన్దకృతక శూరాద్యా మదిరాత్మజాః
కౌశల్యా కేశినం త్వేకమసూత కులనన్దనమ్

వీరందరూ మదిరా పుత్రులు.

రోచనాయామతో జాతా హస్తహేమాఙ్గదాదయః
ఇలాయామురువల్కాదీన్యదుముఖ్యానజీజనత్

విపృష్ఠో ధృతదేవాయామేక ఆనకదున్దుభేః
శాన్తిదేవాత్మజా రాజన్ప్రశమప్రసితాదయః

ధృతదేవ యందు విపృష్ఠున్ని పొందాడు వసుదేవుడు

రాజన్యకల్పవర్షాద్యా ఉపదేవాసుతా దశ
వసుహంససువంశాద్యాః శ్రీదేవాయాస్తు షట్సుతాః

ఉపదేవ సుతులు పది మంది. శ్రీదేవ యందు ఆరుగురు కుమారులు 

దేవరక్షితయా లబ్ధా నవ చాత్ర గదాదయః
వసుదేవః సుతానష్టావాదధే సహదేవయా

దేవరక్షిత వలన తొమ్మిది మంది,సహదేవ వలన ఎనిమిది మంది. 

ప్రవరశ్రుతముఖ్యాంశ్చ సాక్షాద్ధర్మో వసూనివ
వసుదేవస్తు దేవక్యామష్ట పుత్రానజీజనత్

ధర్మునిలాగ దేవకి యందు వసుదేవుడు ఎనిమిది మందిని కన్నాడు. అందులో ఎనిమిదవ వాడు శ్రీమన్నారాయణుడు. చివరి అమ్మాయి సుభద్ర. మీ తండ్రిగారి తల్లి. 

కీర్తిమన్తం సుషేణం చ భద్రసేనముదారధీః
ఋజుం సమ్మర్దనం భద్రం సఙ్కర్షణమహీశ్వరమ్

అష్టమస్తు తయోరాసీత్స్వయమేవ హరిః కిల
సుభద్రా చ మహాభాగా తవ రాజన్పితామహీ

యదా యదా హి ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః
తదా తు భగవానీశ ఆత్మానం సృజతే హరిః

ఈ లోకములో ధర్మానికి క్షయమూ అధర్మానికి వృద్ధీ ఎపుడు జరుగుతుందో పరమాత్మ తనను తాను సృష్టించుకుంటాడు

న హ్యస్య జన్మనో హేతుః కర్మణో వా మహీపతే
ఆత్మమాయాం వినేశస్య పరస్య ద్రష్టురాత్మనః

అతను పుట్టడానికి మన లాగా ఇతరములు కారణం కావు. ఆయన సంకల్పమే ఆయన పుట్టడానికి కారణం. ఆత్మమాయ తప్ప అతను పుట్టడానికి వేరే కారణం లేదు

యన్మాయాచేష్టితం పుంసః స్థిత్యుత్పత్త్యప్యయాయ హి
అనుగ్రహస్తన్నివృత్తేరాత్మలాభాయ చేష్యతే

ఆయన యొక్క చేష్టలే జగత్తు యొక్క సృష్టీ స్థితీ సంహారం. పరమాత్మ లభించాలంటే అతని అనుగ్రహం కావాలి. మనకు మోక్షం లభించాలంటే జగత్తు యందు విరక్తి ఉండాలి. ప్రకృతి పోవడం అతని అనుగ్రహం, మనకు జన్మ రావడం అతని నిగ్రహం. 

అక్షౌహిణీనాం పతిభిరసురైర్నృపలాఞ్ఛనైః
భువ ఆక్రమ్యమాణాయా అభారాయ కృతోద్యమః

పద్దెనిమిది అక్షౌహిణీల సేనాపతులు, రాజులు దుర్మార్గులు, పూర్వ జన్మలో రాక్షసులే ఇపుడు పుట్టగా వారిని సంహరించడానికి స్వామి వచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామమే ప్రధానం, తరువాత జరాసంధుని వధ (17*23 = 400 అక్షౌహినీల సైన్యం, పద్దెనిమిదవ సారి తానే పారిపోయాడు. ). భూమిని ఆక్రమించిన వారిని సంహరించి భూభారాన్ని తొలగించాడు

కర్మాణ్యపరిమేయాణి మనసాపి సురేశ్వరైః
సహసఙ్కర్షణశ్చక్రే భగవాన్మధుసూదనః

దేవతాధిపతులు మనసుతో కూడా ఇలా ఉండవచ్చు అని ఊహకి అందని గొప్ప కార్యాలను బలరామునితో కలిసి చేసాడు

కలౌ జనిష్యమాణానాం దుఃఖశోకతమోనుదమ్
అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం వ్యతనోద్యశః

కేవలం రాక్షసులను చంపడానికే కాదు. కలియుగములో ఉన్న ప్రజల దుఃఖ శోకాలను పోగొట్టడానికి వచ్చాడు స్వామి. భక్తులను అనుగ్రహించడానికి పరమ పావమైన కీర్తిని విస్తరించాడు. 

యస్మిన్సత్కర్ణపీయుషే యశస్తీర్థవరే సకృత్
శ్రోత్రాఞ్జలిరుపస్పృశ్య ధునుతే కర్మవాసనామ్

మనము  అపవిత్రతను పోగొట్టుకోవడానికి నదీ జలముతో ఆచమనం చేస్తాము. కలియుగములో మానవులు తాము చేసిన కర్మ వాసనల అపవిత్రతను పోగొట్టడానికి పరమాత్మ కథ అనే తీర్థాన్ని చెవులనే దోసిటితో ఆచమనం చేయాలి. దాని వలన మానవుడు కర్మ వాసనను తొలగించుకుంటాడు. పూర్వము చేసుకున్న పధ్నాలుగు జన్మల పాపాన్నీ, ఇప్పటి పాపాన్నీ, రాబోయే వాటి పాపాన్ని అంతటినీ పోగొడతుంది కృష్ణ కథ

భోజవృష్ణ్యన్ధకమధు శూరసేనదశార్హకైః
శ్లాఘనీయేహితః శశ్వత్కురుసృఞ్జయపాణ్డుభిః

ఈ ఆరుగురు (తాతలు) వీరందరి చేతా మాటి మాటికీ (శశ్వత్) పొగడబడే పనులు చేసాడు. 

స్నిగ్ధస్మితేక్షితోదారైర్వాక్యైర్విక్రమలీలయా
నృలోకం రమయామాస మూర్త్యా సర్వాఙ్గరమ్యయా

ఆయన ఏమి చేస్తాడు? ఆయన ఏమీ చేయకుండా అలా ఉన్నా చాలు. పాపాలూ అవే పోతాయి, దుష్ట శిక్షణా జరిగిపోతుంది, రక్షణా జరిగిపోతుంది.  ఆయన నవ్వులో స్నిగ్ధం (స్నేహం) ఉంటుంది. జీవుల మీద పరమాత్మకు ఉన్న స్నేహం ఆ నావులో కనపడుతుంది.  ఆ చిరునవ్వు పరమాత్మ కంటిలో కనపడుతుంది. నవ్వు తొణకిసలాడే చూపు పరమాత్మది. ఆ చూపులతో బాటు ఉదారమైన మాటలు. వీటితో బాటు వయ్యారమైన నడక (అడుగులు - వి - అంటే పదం. విక్రమం అంటే అడుగులు వేయడం).
మానవ లోకాన్ని రమింపచేసాడు స్వామి. శరీరం ఎంత అందముగా ఉన్నా మనుషులకు ఏదో ఒక అవయములో ఏదో ఒక వంక ఉంటుంది. కానీ స్వామి సర్వాంగ రమ్యయః. కేశము నుండి పాదం వరకూ ఏ భాగములోనూ వంక పెట్టడానికీ లేదు. కృష్ణావతారములో మొదటి పన్నెండు సంవత్సరాలలో కిరీటం పెట్టుకోలేదు. 

యస్యాననం మకరకుణ్డలచారుకర్ణ భ్రాజత్కపోలసుభగం సవిలాసహాసమ్
నిత్యోత్సవం న తతృపుర్దృశిభిః పిబన్త్యో నార్యో నరాశ్చ ముదితాః కుపితా నిమేశ్చ

మకర కుండలములతో శోభించే చెంపలూ. వయ్యారం వలికించే నవ్వు. దంతముల కాంతీ మకర కుండలముల కాంతీ కలిపి ఉంటాయి. ఆయనను చూస్తే నిత్యోత్సవమే ఎప్పుడూ. ఎన్ని ఏళ్ళు చూసినా ఆనందాన్నే కలిగిస్తాడు. కన్నులతో తాగుతున్న వారు స్వామిని రోజూ చూస్తున్నా తృపి పొందలేదు, స్త్రీలూ పురుషులు కూడా. నరులూ నారీమణులు నిమిని తిట్టుకుంటూ తృప్తి పొందలేదు. 

జాతో గతః పితృగృహాద్వ్రజమేధితార్థో హత్వా రిపూన్సుతశతాని కృతోరుదారః
ఉత్పాద్య తేషు పురుషః క్రతుభిః సమీజే ఆత్మానమాత్మనిగమం ప్రథయన్జనేషు

పుట్టినవాడు తండ్రి గృహము నుండి బయలు దేరి ప్రయోజనాన్ని వృద్ధి పొందింపదలచి వ్రేపల్లెకు వెళ్ళాడు. వివాహం చేసుకుని వందల పుత్రులను కని, వారితో యజ్ఞ్యములు చేయించి తనను తాను పూజించుకున్నాడు. ప్రజలకు తన యొక్క గొప్పతనం మీద నమ్మకం కలిగించడానికి యజ్ఞ్యాలు చేయించాడు. 

పృథ్వ్యాః స వై గురుభరం క్షపయన్కురూణామన్తఃసముత్థకలినా యుధి భూపచమ్వః
దృష్ట్యా విధూయ విజయే జయముద్విఘోష్య ప్రోచ్యోద్ధవాయ చ పరం సమగాత్స్వధామ

యుద్ధములో రాజుల సైన్యాన్నీ భూమి యొక్క గొప్ప భారాన్ని చూపుతో తొలగించాడు. తాను తన చూపుతో భారాన్ని తొలగించి అర్జనుని యొక్క జయాన్ని ప్రకటించాడు. కృష్ణావతార పరమ ముఖ్యమైన ఉద్దేశ్యములో ఉద్దవునికి గీత బోధించడం ముఖ్యం. ఆయనే తరువాతి కృష్ణావతారానికి ప్రతినిధి.