Pages

Monday, 21 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

         
ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏవంవిధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్య తే
అతద్వీర్యవిదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః

ఇలాంటి చాలా  పనులను చూసి పరమాత్మ ప్రభావం తెలియని వారు కాబట్టి, అందరూ ఒక చోట కూర్చుని "పిల్లవాడు ఇన్ని అద్భుత చేష్టితములు ఎలా చేస్తున్నాడు. ఈయన ఏ గొప్పవాడో అయి ఉంటాడు. అంతటి వాడు ఇలాంటి మనలో ఎందుకు పుట్టాడు"

బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై
కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితమ్

యః సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా
కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ

పిల్లవాడి వయసు ఇపుడు ఏడేళ్ళు. పద్మాన్ని ఏనుగు ధరించినట్లు 

తోకేనామీలితాక్షేణ పూతనాయా మహౌజసః
పీతః స్తనః సహ ప్రాణైః కాలేనేవ వయస్తనోః

కనులు తెరవని కడు చిన్ని పాపడై పూతన చనుబాలు తాగాడు (అపుడు పది రోజుల లోపు పిల్లవాడు)

హిన్వతోऽధః శయానస్య మాస్యస్య చరణావుదక్
అనోऽపతద్విపర్యస్తం రుదతః ప్రపదాహతమ్

ఏకహాయన ఆసీనో హ్రియమాణో విహాయసా
దైత్యేన యస్తృణావర్తమహన్కణ్ఠగ్రహాతురమ్

బండి కింద మూడు నెలల పిల్లవాడు పడుకుంటే పాదాలు జాపి , ఆ బండి కూడా బోల్తా పడింది. సుడిగాలి తీసుకు పోతే వాన్ని కూడా చంపేసాడు

క్వచిద్ధైయఙ్గవస్తైన్యే మాత్రా బద్ధ ఉదూఖలే
గచ్ఛన్నర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయత్

మరీ పిల్లవాడిగా ఉన్నపుడు పెరుగూపాలూ ఒంపేస్తే తల్లి కట్టేస్తే చేతులతో రోలు లాక్కు పోయి చెట్లను పడగొట్టాడు

వనే సఞ్చారయన్వత్సాన్సరామో బాలకైర్వృతః
హన్తుకామం బకం దోర్భ్యాం ముఖతోऽరిమపాటయత్

వత్సారురున్ని అడవిలో తిరుగుతూ, వెలగచెట్టు రూపములో ఉన్న కపిథ్థాసురున్ని, గార్దభ రూపములో ఉన్న ధేనుకాసురున్నీ బంధువులతో కలిపి చంపాడు. తాల వనం అందరూ వెళ్ళేట్లు చేసాడు

వత్సేషు వత్సరూపేణ ప్రవిశన్తం జిఘాంసయా
హత్వా న్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా

హత్వా రాసభదైతేయం తద్బన్ధూంశ్చ బలాన్వితః
చక్రే తాలవనం క్షేమం పరిపక్వఫలాన్వితమ్

ప్రలమ్బం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలినా
అమోచయద్వ్రజపశూన్గోపాంశ్చారణ్యవహ్నితః

గోపాలబాలురకు రాక్షస బాధను తొలగించాడు

ఆశీవిషతమాహీన్ద్రం దమిత్వా విమదం హ్రదాత్
ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేऽసౌ నిర్విషోదకామ్

కాళీయ హ్రదములో విష సర్పాన్ని దూరముగ పంపి యమునా జలాన్ని పవిత్రం చేసాడు.

దుస్త్యజశ్చానురాగోऽస్మిన్సర్వేషాం నో వ్రజౌకసామ్
నన్ద తే తనయేऽస్మాసు తస్యాప్యౌత్పత్తికః కథమ్

ప్రపంచములో పిల్లవాడు అందముగా ఉన్నా ముద్దు చేసినా, అందరికీ అందముగా ఉండడు, అందరూ ముద్దు చేయరు. ఎలాంటి వాడైనా కొందరు విసుక్కుంటారు. కానీ కృష్ణున్ని వ్రేపల్లెలో ఉన్నవారందరూ, పశువులూ, చెట్లూ పుట్టలూ కూడా ప్రేమిస్తున్నాయి. వెళ్ళకూడదని అనుకుంటూనే కృష్ణుడి వద్దకు వెళతారు.

క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణమ్
తతో నో జాయతే శఙ్కా వ్రజనాథ తవాత్మజే

ఎంత కష్టపడ్డా ఇతని అనురాగాన్ని విడువలేకున్నాము. నీ కొడుకుగా పుట్టడం మనలో పుట్టడం, వ్రేపల్లెలో పుట్టడం ఎలా జరిగింది. ఏడేళ్ళ పిల్లవాడు పర్వతాన్ని ఎలా లేపాడు. ఇది అనుమానించదగా విషయమే. ఇతను మన పిల్లవాడు కాడు. ఇతను చాలా చాలా గొప్పవాడు

శ్రీనన్ద ఉవాచ
శ్రూయతాం మే వచో గోపా వ్యేతు శఙ్కా చ వోऽర్భకే
ఏనమ్కుమారముద్దిశ్య గర్గో మే యదువాచ హ

వర్ణాస్త్రయః కిలాస్యాసన్గృహ్ణతోऽనుయుగం తనూః
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః

ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః
వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాః సమ్ప్రచక్షతే

గర్గుడు కృష్ణునికి నామకరణం చేస్తూ అన్న మాటలు చెబుతాను. ఈయన ఒక్కో యుగములో ఒక్కో రంగుతో పుడతాడట. ఇపుడు తమో గుణం అధికముగా ఉండుటచే నల్ల రంగులో పుట్టాడు. అంతకు ముందు తెలుపు ఎరుపు రంగులలో పుట్టాడట. పూర్వ జన్మలో ఈయన వసుదేవుని కుమారుడట. అందుకే ఈయనను వాసుదేవుడు అంటారట.

బహూని సన్తి నామాని రూపాణి చ సుతస్య తే
గుణ కర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః

ఇతనికి చాలా పేర్లూ రూపాలూ ఉన్నాయట. అవి ఇతరులకు తెలియదు అని చెప్పాడు.

ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనన్దనః
అనేన సర్వదుర్గాణి యూయమఞ్జస్తరిష్యథ

ఇతను మనకు గొప్ప శ్రేయస్సు అందిస్తాడు. ఎన్నో కష్టసాధ్యమైన ఆపదలను సులహ్బముగా దాటుతామనీ,

పురానేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః
అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్సమేధితాః

పూర్వకాలములో దుర్జనులను సంహరించి సజ్జనులను కాపాడాడు.

య ఏతస్మిన్మహాభాగే ప్రీతిం కుర్వన్తి మానవాః
నారయోऽభిభవన్త్యేతాన్విష్ణుపక్షానివాసురాః

ఈయనను ఎవరు ప్రేమిస్తారు వారిని శత్రువులు బాధించరూ ఆపదలు రావు, విష్ణు పక్షం వారిని రాక్షసులు బాధించలేనట్లుగా

తస్మాన్నన్ద కుమారోऽయం నారాయణసమో గుణైః
శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః

నీ కుమారుడే ఐనా నారాయణుడంతటి వాడు. శ్రీ కీర్తీ ప్రభావములో నారాయణుడంతటి వాడు.ఇతను ఏమి చేసినా ఆశ్చర్యపడవలసిన పని లేదు అని చెప్పి గర్గుడు ఇంటికి వెళ్ళాడు

ఇత్యద్ధా మాం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే
మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణమ్

అప్పటి నుంచీ నేను ఈయనను నారాయణుడనే అనుకుంటున్నాను. ప్రతీ పనినీ కష్టపడకుండా సులభముగా చేసే నారాయణుడే.

ఇతి నన్దవచః శ్రుత్వా గర్గగీతం తం వ్రజౌకసః
ముదితా నన్దమానర్చుః కృష్ణం చ గతవిస్మయాః

ఇలా అంటూ, గర్గుడు  మాటలు స్మరించుకుని అందరికీ చెప్పి, అది విన్న గోపాలకులు వారు చూసినా విన్న పనులు తలచుకున్నారు

దేవే వర్షతి యజ్ఞవిప్లవరుషా వజ్రాస్మవర్షానిలైః
సీదత్పాలపశుస్త్రియాత్మశరణం దృష్ట్వానుకమ్ప్యుత్స్మయన్
ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచ్ఛిలీన్ధ్రం యథా
బిభ్రద్గోష్ఠమపాన్మహేన్ద్రమదభిత్ప్రీయాన్న ఇన్ద్రో గవామ్

ఇంద్రుడు రాళ్ళతో నీళ్ళతో వ్రేపల్లెలో ప్రళయం సృష్టిస్తే, పరమాత్మను గోపాలురూ స్త్రీలూ గోవులూ శరణు వేడితే, ఆ స్వామి, దయ కలవాడై చిరునవ్వు నవ్వి, ఒక చేత్తో పుట్టగొడుగు ఎత్తినట్లుగా పర్వతాన్ని ఎత్త్తి వ్రేపల్లెను కాపాడి మహేంద్ర గర్వాన్ని అణచి, గోవిందుడయ్యాడు.

                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు