Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఆరవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
విరూపః కేతుమాన్ఛమ్భురమ్బరీషసుతాస్త్రయః
విరూపాత్పృషదశ్వోऽభూత్తత్పుత్రస్తు రథీతరః

ఈ ముగ్గురూ అంబరీషునికి పుత్రులు. వారి కుమారులు వృషదశ్వుడు, అతని కుమ్మారుడు రధీతరుడు

రథీతరస్యాప్రజస్య భార్యాయాం తన్తవేऽర్థితః
అఙ్గిరా జనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్

రధీతరునికి సంతానం కలిగే అవకాశం లేదు. రాజపురోహితుని ద్వారా సంతానం పొందారు. ఆయన అంగీరసుడు. వారికి పుట్టిన వారు బ్రాహ్మణులయ్యారు.

ఏతే క్షేత్రప్రసూతా వై పునస్త్వాఙ్గిరసాః స్మృతాః
రథీతరాణాం ప్రవరాః క్షేత్రోపేతా ద్విజాతయః

వారందరూ ఆంగీరసులు అయ్యారు, క్షత్రియులుగా ఉండి తరువాత బ్రాహ్మణులుగా అయ్యారు

క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతః సుతః
తస్య పుత్రశతజ్యేష్ఠా వికుక్షినిమిదణ్డకాః

మనువు ఒక సారి గట్టిగా తుమ్మితే ఇక్ష్వాకు అనే రాజు పుట్టాడు. ఆకు అంటే నాసిక. ఇక్షు అంటే చెరుకు. రసం బాగా వచ్చే నాసిక అని అర్థం. ఆ రోజులలో స్త్రీ చేతనే సంతానం పుట్టాలి అన్న నియమం లేదు. సంకల్పమాత్రముతో రూపాన్ని కూర్చే ప్రభావం వారి తపస్సులో ఉండేది.  అతనికి నూరుమంది కుమారులు. వికుక్షి నిమి దండకులు (దండకారణ్యం)ముఖ్యులు. 

తేషాం పురస్తాదభవన్నార్యావర్తే నృపా నృప
పఞ్చవింశతిః పశ్చాచ్చ త్రయో మధ్యేऽపరేऽన్యతః

25 మంది మధ్యలో ముగ్గురూ  వీరు ఆర్యా వర్తములో రాజులుగా ఉన్నారు. 

స ఏకదాష్టకాశ్రాద్ధే ఇక్ష్వాకుః సుతమాదిశత్
మాంసమానీయతాం మేధ్యం వికుక్షే గచ్ఛ మా చిరమ్

వికుక్షి ఇక్ష్వాకు పుత్రుడు. తన తండ్రి గారి శ్రార్ద్ధం రోజున కొడుకుని పంపాడు

తథేతి స వనం గత్వా మృగాన్హత్వా క్రియార్హణాన్
శ్రాన్తో బుభుక్షితో వీరః శశం చాదదపస్మృతిః

తాను మృగాన్ని తీసుకు రావడానికి వెళ్ళి ఆకలేసి స్నానం అనుష్ఠానం చేసుకుని ఉన్న కుందేళ్ళలో ఒక కుందేలుని తిని మిగతా 12 కుందేళ్ళను చూపాడు. అది గురువుకు చూపగా గురువుగారు ఇది ఎంగిలి అయ్యింది, పనికిరాదు అని చెప్పాడు

శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురుః
చోదితః ప్రోక్షణాయాహ దుష్టమేతదకర్మకమ్

ఇది దుష్టమైంది, పనికి రాదు అని చెప్తే 

జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణాభిహితం నృపః
దేశాన్నిఃసారయామాస సుతం త్యక్తవిధిం రుషా

ఒక వస్తువును ఎవరికోసం అని నిర్దేశించామో అందులోంచి ఎంత చిన్నభాగం తీసుకున్నా దాచిపెట్టినా అది ఎంగిలే. ఇది తెలుసుకున్న రాజు రాజ్య బహిష్కారం చేసాడు. 

స తు విప్రేణ సంవాదం జ్ఞాపకేన సమాచరన్
త్యక్త్వా కలేవరం యోగీ స తేనావాప యత్పరమ్

ఆ వికుక్షి ఎలాగూ వెళ్ళగొట్టబడ్డాడు కాబట్టి ఒక బ్రాహ్మణోత్తమున్ని ఆశ్రయించి ఆయన ద్వారా అన్ని విషయాలనూ తెలుసుకుని పరమాత్మ ధ్యానముతో మోక్షాన్ని పొందాడు.

పితర్యుపరతేऽభ్యేత్య వికుక్షిః పృథివీమిమామ్
శాసదీజే హరిం యజ్ఞైః శశాద ఇతి విశ్రుతః

రాజ్యం వదిలి ఇక్ష్వాకు వెళ్ళిపోయిన తరువాత ఈ వికుక్షే మళ్ళీ వచ్చి రాజ్యపాలన చేసాడు. చాలా కాలం బయట ఉన్నా అతనికి వచ్చిన మచ్చ మాత్రం పోలేదు. కుందేలుని తిన్న వాడు (శశాద) అన్న పేరు వచ్చింది

పురఞ్జయస్తస్య సుత ఇన్ద్రవాహ ఇతీరితః
కకుత్స్థ ఇతి చాప్యుక్తః శృణు నామాని కర్మభిః

ఇతని కుమారుడు పురంజయుడు. ఇతనికి ఇంద్రవాహుడు అని పేరు. ఇతన్నే కకుత్సుడు అని పేరు. దేవతలను బాధిస్తున్న రాక్షసులను సంహరించమని పరమాత్మను ప్రార్థిస్తే భూలోకములో ఒక రాజుని చూపాడు. ఆ రాజు నాకొక మంచి వాహనం కావాలి అన్నాడు. అపుడు పరమాత్మ ఇంద్రున్నే వాహనముగా ఉండమని అన్నాడు. ఇంద్రుడు కోడిగా మారితే కోడి నూపురం (కకుత్ అంటారు) మీద కూర్చుని యుద్ధం చేసాడు

కృతాన్త ఆసీత్సమరో దేవానాం సహ దానవైః
పార్ష్ణిగ్రాహో వృతో వీరో దేవైర్దైత్యపరాజితైః

ఈ పురంజయున్ని పరమాత్మ తన అంశతో నింపాడు. పరమాత్మ అంశ ఆవరించి ఉన్నది కాబట్టి దైత్యుల నగరాన్ని చుట్టుముట్టి యుద్ధం చేసిన వారిని యమలోకానికి పంపాడు

వచనాద్దేవదేవస్య విష్ణోర్విశ్వాత్మనః ప్రభోః
వాహనత్వే వృతస్తస్య బభూవేన్ద్రో మహావృషః

స సన్నద్ధో ధనుర్దివ్యమాదాయ విశిఖాన్ఛితాన్
స్తూయమానస్తమారుహ్య యుయుత్సుః కకుది స్థితః

తేజసాప్యాయితో విష్ణోః పురుషస్య మహాత్మనః
ప్రతీచ్యాం దిశి దైత్యానాం న్యరుణత్త్రిదశైః పురమ్

తైస్తస్య చాభూత్ప్రధనం తుములం లోమహర్షణమ్
యమాయ భల్లైరనయద్దైత్యానభియయుర్మృధే

తస్యేషుపాతాభిముఖం యుగాన్తాగ్నిమివోల్బణమ్
విసృజ్య దుద్రువుర్దైత్యా హన్యమానాః స్వమాలయమ్

జిత్వా పరం ధనం సర్వం సస్త్రీకం వజ్రపాణయే
ప్రత్యయచ్ఛత్స రాజర్షిరితి నామభిరాహృతః

అలా గెలిచి మొత్తం రాజ్యాన్ని ఇంద్రునికి ఇచ్చాడు

పురఞ్జయస్య పుత్రోऽభూదనేనాస్తత్సుతః పృథుః
విశ్వగన్ధిస్తతశ్చన్ద్రో యువనాశ్వస్తు తత్సుతః

అతని కుమారుడు అనేనుడూ పృధువు విశ్వగంధుడు చంద్రుడూ యువనాశ్వడూ వరుస క్రమములో

శ్రావస్తస్తత్సుతో యేన శ్రావస్తీ నిర్మమే పురీ
బృహదశ్వస్తు శ్రావస్తిస్తతః కువలయాశ్వకః

శ్రావత్తుడు వారి కుమారుడు, శ్రావస్తి అన్న నగరం నిర్మించాడు, వారి కుమారుడు బృహదశ్వుడు, వారి కుమారుడు కువలయాశ్వకుడు

యః ప్రియార్థముతఙ్కస్య ధున్ధునామాసురం బలీ
సుతానామేకవింశత్యా సహస్రైరహనద్వృతః

ఈయన దుంధు అన్న రాక్షసున్ని వారి సైన్యం పుత్రులతో కలిసి సంహరించాడు, అందుకే అతని పేరు దుందుమారః అనే పేరు వచ్చింది

ధున్ధుమార ఇతి ఖ్యాతస్తత్సుతాస్తే చ జజ్వలుః
ధున్ధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవావశేషితాః

వేల మంది అతని పుత్రులలో దుంధు రాక్షసుని ముఖం నుండి వచ్చిన అగ్నిలో అందరూ కాలి ముగ్గురు మిగిలారు. 
దృఢాశ్వః కపిలాశ్వశ్చ భద్రాశ్వ 

దృఢాశ్వః కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇతి భారత
దృఢాశ్వపుత్రో హర్యశ్వో నికుమ్భస్తత్సుతః స్మృతః

బహులాశ్వో నికుమ్భస్య కృశాశ్వోऽథాస్య సేనజిత్
యువనాశ్వోऽభవత్తస్య సోऽనపత్యో వనం గతః

యువనాశ్వనునికి సంతానం లేక వనానికి వెళ్ళాడు

భార్యాశతేన నిర్విణ్ణ ఋషయోऽస్య కృపాలవః
ఇష్టిం స్మ వర్తయాం చక్రురైన్ద్రీం తే సుసమాహితాః

నూరు మంది భార్యలతో ఋషులను కలిసి ఒక యజ్ఞ్యాన్ని ఆచరించవలసినదిగా ప్రార్తించగా 

రాజా తద్యజ్ఞసదనం ప్రవిష్టో నిశి తర్షితః
దృష్ట్వా శయానాన్విప్రాంస్తాన్పపౌ మన్త్రజలం స్వయమ్

ప్రాజాపత్య మంత్రముతో ఒక కలశములో తీర్థం అభిమంత్రించి ఉంచారు. యజ్ఞ్యం మొదలుపెట్టారు

ఉత్థితాస్తే నిశమ్యాథ వ్యుదకం కలశం ప్రభో
పప్రచ్ఛుః కస్య కర్మేదం పీతం పుంసవనం జలమ్

ఒక అర్థ రాత్రి ఆయనకు దప్పిక వేసి ఆ నీరు తాగేసాడు

రాజ్ఞా పీతం విదిత్వా వై ఈశ్వరప్రహితేన తే
ఈశ్వరాయ నమశ్చక్రురహో దైవబలం బలమ్

ఆ విషయం తెలుసుకున్న ఋషులు అతనికి పుత్రుడు కలుగుతారు, ఐన నిన్ను బతికిస్తాము అని చెప్పారు. అతని కుక్షిని భేదించుకుని కొడుకు పుడితే 

తతః కాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణమ్
యువనాశ్వస్య తనయశ్చక్రవర్తీ జజాన హ

కం ధాస్యతి కుమారోऽయం స్తన్యే రోరూయతే భృశమ్
మాం ధాతా వత్స మా రోదీరితీన్ద్రో దేశినీమదాత్

అతన్ని ఋషులు మంత్రముతో బతికించారు. ఐతే పుట్టినవారికి పాలు ఎవరు ఇవ్వాలి. ఎవరి పాలు తాగుతాడు అని అందరూ అడగగా, ఇంద్రుడు తన బొటన వేలు పెట్టి నన్ను తాగుతాడు (మాంధాత) అని చెప్పాడు. ఈయన యువనాశ్వుని కుమారుడు

న మమార పితా తస్య విప్రదేవప్రసాదతః
యువనాశ్వోऽథ తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్

తన ప్రభావం వలన తండ్రి కూడా బతికే ఉన్నాడు. కుమారుడు పుట్టాడు కాబట్టి యువనాశ్వుడు అదే అరణ్యములో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు

త్రసద్దస్యురితీన్ద్రోऽఙ్గ విదధే నామ యస్య వై
యస్మాత్త్రసన్తి హ్యుద్విగ్నా దస్యవో రావణాదయః

మాంధాతకు త్రసద్దస్యుడని బిరుదు ఇచ్చారు. రావణాది మహావీరులు కూడా మాంధాత పేరు చెబితే వణికి పోయేవారు. శత్రువులందరూ భయపడ్డారు.

యౌవనాశ్వోऽథ మాన్ధాతా చక్రవర్త్యవనీం ప్రభుః
సప్తద్వీపవతీమేకః శశాసాచ్యుతతేజసా

ఈయన చక్రవర్తి ఐ భూమిని కాపాడాడు. పరమాత్మ కృపతో ఈయన మొత్తం భూమండలాన్ని పరిపాలించాడు

ఈజే చ యజ్ఞం క్రతుభిరాత్మవిద్భూరిదక్షిణైః
సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీన్ద్రియమ్

గొప్ప దక్షిణాలు ఇస్తూ సర్వ దేవమయుడైన శ్రీమన్నరాయణున్ని పెట్టుకుని యజ్ఞ్యం చేసాడు. 

ద్రవ్యం మన్త్రో విధిర్యజ్ఞో యజమానస్తథర్త్విజః
ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకమ్

ఇవన్నీ ఎవరి స్వరూపమో

యావత్సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతితిష్ఠతి
తత్సర్వం యౌవనాశ్వస్య మాన్ధాతుః క్షేత్రముచ్యతే

ఎంత వరకూ సూర్యుడు ఉదయిస్తాడో ఎంతభాగం అస్తమిస్తాడో ఆ మొత్తం భూమండలాన్ని పరిపాలించాడు. 

శశబిన్దోర్దుహితరి బిన్దుమత్యామధాన్నృపః
పురుకుత్సమమ్బరీషం ముచుకున్దం చ యోగినమ్
తేషాం స్వసారః పఞ్చాశత్సౌభరిం వవ్రిరే పతిమ్

ఈ మాంధాతుడు ముగ్గురు పుట్టారు. పురుకుత్సం అమ్బరీషం ముచుకున్దం. ఈ మాంధాత యొక్క పుత్రికలు యాభై మంది. వీరందరూ ఒక సౌభరి అన్న మహర్షిని వరించారు. సౌభరి మహా తేజస్సు కలిగి ఉండి ఒక సరస్సులో పదివేల ఏళ్ళు తపస్సు చేసి సరస్సు పైకి వచ్చి స్నానాదులు ముగించుకుని సంధ్యావందనం చేస్తూ అర్ఘ్య జలం చేతిలోకి తీసుకొనగా ఆ చేతిలో రెండు చేప పిల్లలు పడి, ఆయన చూస్తుండగా రెండూ నాలుగూ ఆరు ఎనిమిది చేపలయ్యాయి. అది చూసి నేను కూడా వంశ వృద్ధి చేయాలి అనుకున్నాడు. ఆయన మాంధాత దగ్గరకు వెళ్ళాడు. ఆయన పుత్రికలను అడిగాడు. అప్పుడు రాజు మా వంశములో అమ్మాయి స్వయం వరం చేస్తాము. మీరు వెళ్ళండి వారికి మీరు నచ్చితే వరిస్తారు. అప్పుడు మహర్షి "ఎముకల గూడుగా ఉన్న నన్ను ఏ అమ్మాయి వరించదనుకున్నావు కదా. నా తపశ్శక్తి చూడు, నన్ను చూసి మన్మధుడే వరిస్తాడు." అని చెప్పి అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేలోపే ఆయన మన్మధున్ని మించిన అందగాడయ్యాడు. యాభైమందితో అదే సరస్సు అడుగున దివ్యభవనాలు నిర్మించి ఆనందముగా ఉన్నాడు. తరువాత మాంధాత మహారాజు ఇతన్ని చూడటానికి వస్తే ఆయనకు గతం గుర్తుకు వచ్చి సంసారం వదిలి వనానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మన మనసును మనం నమ్మలేము. అది అవకాశం కోసం నక్కలాగ వేటగానిలాగ ఎదురుచూస్తూ ఉంటుంది. 

యమునాన్తర్జలే మగ్నస్తప్యమానః పరం తపః
నిర్వృతిం మీనరాజస్య దృష్ట్వా మైథునధర్మిణః

జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామయాచత
సోऽప్యాహ గృహ్యతాం బ్రహ్మన్కామం కన్యా స్వయంవరే

స విచిన్త్యాప్రియం స్త్రీణాం జరఠోऽహమసన్మతః
వలీపలిత ఏజత్క ఇత్యహం ప్రత్యుదాహృతః

సాధయిష్యే తథాత్మానం సురస్త్రీణామభీప్సితమ్
కిం పునర్మనుజేన్ద్రాణామితి వ్యవసితః ప్రభుః

మునిః ప్రవేశితః క్షత్రా కన్యాన్తఃపురమృద్ధిమత్
వృతః స రాజకన్యాభిరేకం పఞ్చాశతా వరః

తాసాం కలిరభూద్భూయాంస్తదర్థేऽపోహ్య సౌహృదమ్
మమానురూపో నాయం వ ఇతి తద్గతచేతసామ్

స బహ్వృచస్తాభిరపారణీయ తపఃశ్రియానర్ఘ్యపరిచ్ఛదేషు
గృహేషు నానోపవనామలామ్భః సరఃసు సౌగన్ధికకాననేషు

మహార్హశయ్యాసనవస్త్రభూషణ స్నానానులేపాభ్యవహారమాల్యకైః
స్వలఙ్కృతస్త్రీపురుషేషు నిత్యదా రేమేऽనుగాయద్ద్విజభృఙ్గవన్దిషు

ఇవన్నీ ఋషి ఇచ్చిన భోగాలు

యద్గార్హస్థ్యం తు సంవీక్ష్య సప్తద్వీపవతీపతిః
విస్మితః స్తమ్భమజహాత్సార్వభౌమశ్రియాన్వితమ్

సప్త ద్వీప అధిపతి ఐన మాంధాత కూడా సౌభరి యొక్క భోగాన్ని చూచి ఆశ్చర్యపోయాడు

ఏవం గృహేష్వభిరతో విషయాన్వివిధైః సుఖైః
సేవమానో న చాతుష్యదాజ్యస్తోకైరివానలః

ఇన్ని భోగాలు పొందినా నేతి బిందువులతో మంట చల్లారనట్లుగా తృప్తి పొందలేదు

స కదాచిదుపాసీన ఆత్మాపహ్నవమాత్మనః
దదర్శ బహ్వృచాచార్యో మీనసఙ్గసముత్థితమ్

ఆ చెపల వలే నాకీ గతి పట్టింది

అహో ఇమం పశ్యత మే వినాశం తపస్వినః సచ్చరితవ్రతస్య
అన్తర్జలే వారిచరప్రసఙ్గాత్ప్రచ్యావితం బ్రహ్మ చిరం ధృతం యత్

తపస్సులో ఎపుడూ ఒకడే ఉండాలి. (అందుకే నదిలో స్నానం చేసేప్పుడు కన్ను మూసుకుని స్నానం చేయాలి. విశ్వామిత్రుడు స్నానం చేస్తూ ఉంటే అక్కడ మేనక వచ్చింది. నదిలో స్నానం చేసేప్పుడు కన్ను మూసుకుని స్నానం చేయాలి. వచ్చిన వారిని చూడరాదు. నేత్రే నిమీల్య స్నాతవ్యం. అలాగే నోరు మూసుకుని స్నానం చేయాలి, ఎవరినీ తాకకుండా స్నానం చేయాలి. ). మన మనస్సు మహా చంచలం. 

సఙ్గం త్యజేత మిథునవ్రతీనాం ముముక్షుః
సర్వాత్మనా న విసృజేద్బహిరిన్ద్రియాణి
ఏకశ్చరన్రహసి చిత్తమనన్త ఈశే
యుఞ్జీత తద్వ్రతిషు సాధుషు చేత్ప్రసఙ్గః

ఏకస్తపస్వ్యహమథామ్భసి మత్స్యసఙ్గాత్
పఞ్చాశదాసముత పఞ్చసహస్రసర్గః
నాన్తం వ్రజామ్యుభయకృత్యమనోరథానాం
మాయాగుణైర్హృతమతిర్విషయేऽర్థభావః

ఒంటిగానే తిరగాలి రహస్యముగా తిరగాలి, బయటకు రాదలచుకుంటే మనసును పరమాత్మ యందు లగ్నం చేసుకునే రావాలి. మాట్లాడాలంటే పక్కవాడు ముని ఐతేనే మాట్లాడాలి. ఎవరూ లేరనుకుని ఒక్కడినే ఉన్నాననుకుని సరస్సులో స్నానం చేసాను. రెండు చేపలను చూసి నేను యాభై చేపల వలలో పడి ఐదే వేల మంది పిల్లలను కన్నాను. ఇలా ఏమి చేయాలో అర్థం కాకుండా అయ్యింది. విషయముల యందు అర్థ భావముతో పరమాత్మ మాయా గుణముతో మోహించబడ్డాను.

ఏవం వసన్గృహే కాలం విరక్తో న్యాసమాస్థితః
వనం జగామానుయయుస్తత్పత్న్యః పతిదేవతాః

ఇలా అనుకుని అన్నీ వదిలి అరణ్యానికి బయలు దేరారు. యాభై మంది భార్యలు వెంట వచ్చారు. 

తత్ర తప్త్వా తపస్తీక్ష్ణమాత్మదర్శనమాత్మవాన్
సహైవాగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని

శరీరాన్ని కృశింప్చేసే తపస్సు చేసి, అగ్నితో బాటు ఆత్మను పరమాత్మ యందు లగ్నం చేసాడు

తాః స్వపత్యుర్మహారాజ నిరీక్ష్యాధ్యాత్మికీం గతిమ్
అన్వీయుస్తత్ప్రభావేణ అగ్నిం శాన్తమివార్చిషః

పరమాత్మలో చేరిన భర్తను చూసి వారు కూడా వారి ప్రభావముతో వారి శరీరాన్ని యోగాగ్నిలో విడిచిపెట్టారు.