Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఏడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
మాన్ధాతుః పుత్రప్రవరో యోऽమ్బరీషః ప్రకీర్తితః
పితామహేన ప్రవృతో యౌవనాశ్వస్తు తత్సుతః
హారీతస్తస్య పుత్రోऽభూన్మాన్ధాతృప్రవరా ఇమే

మాంధాత కుమారుడు యౌవనాశ్వుడు. హారీతుడు అతని కుమారుదు, ఉరగములు తమ చెల్లెలైన నర్మదున్ని పురుకుత్సునికిచ్చి వివాహంచేసారు

నర్మదా భ్రాతృభిర్దత్తా పురుకుత్సాయ యోరగైః
తయా రసాతలం నీతో భుజగేన్ద్రప్రయుక్తయా

ఆమె నాగ లోక కన్య కాబట్టి అతన్ని రసాతలమునకు తీసుకుని వెళ్ళారు

గన్ధర్వానవధీత్తత్ర వధ్యాన్వై విష్ణుశక్తిధృక్
నాగాల్లబ్ధవరః సర్పాదభయం స్మరతామిదమ్

ఈయన పరమాత్మ అంశను పొందినవాడు కాబట్టి వచ్చిన గంధర్వులను సంహరించి నాగములను నుంచి వరమును పొందారు. ఎవరీతే ఈ పురుకుత్సుని పేరు తలుస్తారో వారికి సర్ప భయం ఉండదు. 

త్రసద్దస్యుః పౌరుకుత్సో యోऽనరణ్యస్య దేహకృత్
హర్యశ్వస్తత్సుతస్తస్మాత్ప్రారుణోऽథ త్రిబన్ధనః

ఇతని కుమారుడు అనరణ్యుడు, అతని కుమారుడు హర్యత్సుడు, వారి కుమారుడు వరుణుడు, వారికుమారుడు త్రిబందనుడు,

తస్య సత్యవ్రతః పుత్రస్త్రిశఙ్కురితి విశ్రుతః
ప్రాప్తశ్చాణ్డాలతాం శాపాద్గురోః కౌశికతేజసా

ఇతనికే సత్యవ్రతుడని త్రిశంఖుడనీ పేరు. ఇతను శరీరముతోనే స్వర్గానికి వెళ్ళాలని కోరాడు. అది వశిష్టున్ని అడిగితే అది జరగని పని అన్నాడు. 

సశరీరో గతః స్వర్గమద్యాపి దివి దృశ్యతే
పాతితోऽవాక్శిరా దేవైస్తేనైవ స్తమ్భితో బలాత్

గురు పుత్రులను అడిగాడు. నాన్నగారు కాదంటే మమ్ము అడిగావా అన్నారు. ఐతే ఇంకొకరిని ఆశ్రయిస్తా అని అంటే నీవు గుర్వంతరం చెందుతావా అని చండాలుడివి కమ్మని శపించాడు

త్రైశఙ్కవో హరిశ్చన్ద్రో విశ్వామిత్రవసిష్ఠయోః
యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికమ్

అప్పుడు ఇతను విశ్వామిత్రున్ని ఆశ్రయించి స్వర్గాన్ని పొందాడు. ఇంద్రుడు అతన్ని అక్కడి నుంచి కిందిపడేసాడు. ఆయన కిందా పైనా కాకుండా మధ్యలో ఆగాడు. ఇతని కుమారుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రునికి సంతానంలేదు. వరుణుడికి మొక్కుకున్నాడు ఆ కొడుకుతో యజ్ఞ్యం చేస్తా అని. కొడుకు పుట్టగా ఎంత కాలానికి ఆయన యజ్ఞ్యం చేయలేదు. పుట్టగానే చేస్తా అన్నవాడు, పళ్ళు వచ్చాక చేస్తానని, ఉపనయనం చేసాక చేస్తా అని తప్పించుకుంటూ వచ్చాడు. నారదుడు ఈ విషయం అతని కొడుకుకి చెప్పాడు "మీ త్రండి నిన్ను యజ్ఞ్యములో వధిస్తాడు " అని చెప్పగా ఆ కొడుకు పారిపోయాడు. వరుణుడు హరిశ్చంద్రున్ని పట్టుకున్నాడు. దాని వలన జలోదర వ్యాధి వచ్చింది. తండ్రికి ఈ వ్యాధి వచ్చిందని తెలుసుకుని కొడుకు తండ్రిని చూడటానికి వెళ్తే ఇంద్రుడు ఆపాడు. మళ్ళి వెళ్ళబోతూ ఉంటే నారదుడు వచ్చి ఆపి, ఎవరినైనా ఇంకొకరి పుత్రున్ని తీసుకుని వెళ్ళు, నీ బదులు యజ్ఞ్యములో బలి ఇవ్వడానికి అన్నాడు. అప్పుడు ఆయన రుచీకుని కుమారుడైన సునశ్యేపున్ని తీసుకుని వెళ్ళాడు. ఆ సునశ్యేపుడు విశ్వామిత్రున్ని ప్రార్థిస్తే విశ్వామిత్రుడు వరుణ మంత్రాన్ని చెబుతాడు. ఆ మంత్రాన్ని స్తంభానికి కట్టేసినప్పుడు జపించమని చెబుతాడు. ఈ రీతిలో అదే మంత్రాన్ని రహస్యముగా స్తోత్రం చేస్తే ఇందుర్డూ వరుణుడూ ఇతన్ని కాపాడి కరుణించి వెళ్ళిపోతాడు. ఈ హరిశ్చంద్రునికోసం వశిష్ట విశ్వామిత్రులు పదివేల సంవత్సరాలు రెండు పక్షుల రూపములో ఉండి కోట్లాడుకున్నారు

సోऽనపత్యో విషణ్ణాత్మా నారదస్యోపదేశతః
వరుణం శరణం యాతః పుత్రో మే జాయతాం ప్రభో

యది వీరో మహారాజ తేనైవ త్వాం యజే ఇతి
తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః

జాతః సుతో హ్యనేనాఙ్గ మాం యజస్వేతి సోऽబ్రవీత్
యదా పశుర్నిర్దశః స్యాదథ మేధ్యో భవేదితి

నిర్దశే చ స ఆగత్య యజస్వేత్యాహ సోऽబ్రవీత్
దన్తాః పశోర్యజ్జాయేరన్నథ మేధ్యో భవేదితి

దన్తా జాతా యజస్వేతి స ప్రత్యాహాథ సోऽబ్రవీత్
యదా పతన్త్యస్య దన్తా అథ మేధ్యో భవేదితి

పశోర్నిపతితా దన్తా యజస్వేత్యాహ సోऽబ్రవీత్
యదా పశోః పునర్దన్తా జాయన్తేऽథ పశుః శుచిః

పునర్జాతా యజస్వేతి స ప్రత్యాహాథ సోऽబ్రవీత్
సాన్నాహికో యదా రాజన్రాజన్యోऽథ పశుః శుచిః

ఇతి పుత్రానురాగేణ స్నేహయన్త్రితచేతసా
కాలం వఞ్చయతా తం తముక్తో దేవస్తమైక్షత

రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితమ్
ప్రాణప్రేప్సుర్ధనుష్పాణిరరణ్యం ప్రత్యపద్యత

పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాతమహోదరమ్
రోహితో గ్రామమేయాయ తమిన్ద్రః ప్రత్యషేధత

భూమేః పర్యటనం పుణ్యం తీర్థక్షేత్రనిషేవణైః
రోహితాయాదిశచ్ఛక్రః సోऽప్యరణ్యేऽవసత్సమామ్

ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పఞ్చమే తథా
అభ్యేత్యాభ్యేత్య స్థవిరో విప్రో భూత్వాహ వృత్రహా

షష్ఠం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీమ్
ఉపవ్రజన్నజీగర్తాదక్రీణాన్మధ్యమం సుతమ్

శునఃశేఫం పశుం పిత్రే ప్రదాయ సమవన్దత
తతః పురుషమేధేన హరిశ్చన్ద్రో మహాయశాః

సునశ్యేపున్ని యజ్ఞ్య పశువుగా ఇస్తే వరుణుడు దయ చూపి హరిశ్చంద్రుని రోగాన్ని తగ్గిస్తే. దేవ వరుణాదులతో గొప్ప యజ్ఞ్యం చేసాడు

ముక్తోదరోऽయజద్దేవాన్వరుణాదీన్మహత్కథః
విశ్వామిత్రోऽభవత్తస్మిన్హోతా చాధ్వర్యురాత్మవాన్

అందులో విశ్వామిత్రుడు అధ్వర్యువుగా ఉన్నాడు

జమదగ్నిరభూద్బ్రహ్మా వసిష్ఠోऽయాస్యః సామగః
తస్మై తుష్టో దదావిన్ద్రః శాతకౌమ్భమయం రథమ్

జమదగ్ని బ్రహ్మ అయ్యాడు. వశిష్టుడు ఉద్గాత అయ్యాడు. 
ఇంద్రుడు ఆ యజ్ఞ్యాన్ని చూచి సంతోషించి బంగారు రథాన్ని కానుకగా ఇచ్చాడు.

శునఃశేఫస్య మాహాత్మ్యముపరిష్టాత్ప్రచక్ష్యతే
సత్యం సారం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతేః

శునఃశ్యెపుని సంగతి ఆ వంశం వచ్చినపుడు చెబుతాను. ఆ శిష్యుని సత్య వాక్పరిపాలన చూసిన విశ్వామిత్రుడు ఉత్తమ జ్ఞ్యానాన్ని ఉత్తమ గతినీ ప్రసాదించాడు

విశ్వామిత్రో భృశం ప్రీతో దదావవిహతాం గతిమ్
మనః పృథివ్యాం తామద్భిస్తేజసాపోऽనిలేన తత్

ఖే వాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని
తస్మిన్జ్ఞానకలాం ధ్యాత్వా తయాజ్ఞానం వినిర్దహన్

మనసును భూమిలో భూమిని జలములో జలాన్ని అగ్నిలో అగ్నిని వాయువులో వాయువును ఆకాశములో ఆకాశాన్ని అహంకారములో అహంకారాన్ని మహత్ తత్వములో మహత్ తత్వాన్ని  ప్రకృతిలో ప్రకృతిని జీవాత్మలో జీవాత్మను పరమాత్మలో లీనం చేసాడు

హిత్వా తాం స్వేన భావేన నిర్వాణసుఖసంవిదా
అనిర్దేశ్యాప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్తబన్ధనః

ఇలా పరమాత్మను సకల బంధములనూ చేదించించుకుని పరమాత్మను చేరాడు