Pages

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
హరితో రోహితసుతశ్చమ్పస్తస్మాద్వినిర్మితా
చమ్పాపురీ సుదేవోऽతో విజయో యస్య చాత్మజః

రోహితుని కుమారుడు హరితుడు. అతని కుమారుడు చంపః. చంపుడు నిర్మించిన నగరం చంపాపురి. అతని కుమారుడు సుదేవుడు, అతని కుమారుడు విజయుడు,

భరుకస్తత్సుతస్తస్మాద్వృకస్తస్యాపి బాహుకః
సోऽరిభిర్హృతభూ రాజా సభార్యో వనమావిశత్

 భరుక, వృకుడు, బాహుకుడు, ఆ వరుసలో. బాహుకుడు శత్రువులచేత రాజ్యం ఆక్రమించబడి భార్యలను తీసుకుని రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళాడు.

వృద్ధం తం పఞ్చతాం ప్రాప్తం మహిష్యనుమరిష్యతీ
ఔర్వేణ జానతాత్మానం ప్రజావన్తం నివారితా

కొంతకాలానికి వృద్ధాప్యం వచ్చి అవమానం సహించలేక మరణించాడు. అతని వెంట భార్యలు కూడా మరణించబోతే బృగువంశములో మహర్షి వారిస్తాడు. అప్పుడు ఆమె గర్భవతి అని చెప్పి

ఆజ్ఞాయాస్యై సపత్నీభిర్గరో దత్తోऽన్ధసా సహ
సహ తేనైవ సఞ్జాతః సగరాఖ్యో మహాయశాః

వారిని తన ఆశ్రమములో ఉంచుకున్నాడు. అప్పుడు సంతానం లేని భార్య ఈమెకు ఆహారములో విషం కలిపి ఇచ్చింది. ఋషి ప్రభావం వలన ఆ కుమారుడు విషముతోటే పెరిగాడు.

సగరశ్చక్రవర్త్యాసీత్సాగరో యత్సుతైః కృతః
యస్తాలజఙ్ఘాన్యవనాఞ్ఛకాన్హైహయబర్బరాన్

కొంతకాలానికి గరముతో పుట్టాడు కాబట్టి ఆ కుమారునికి సగరుడు అని పేరుపెట్టారు. అతనికి సకల శస్త్ర అస్త్ర విద్యలను గురువుగారు నేర్పారు. ధనుర్వేద విద్యను ఆయనే ఇచ్చారు.

నావధీద్గురువాక్యేన చక్రే వికృతవేషిణః
ముణ్డాన్ఛ్మశ్రుధరాన్కాంశ్చిన్ముక్తకేశార్ధముణ్డితాన్

అనన్తర్వాససః కాంశ్చిదబహిర్వాససోऽపరాన్
సోऽశ్వమేధైరయజత సర్వవేదసురాత్మకమ్

ఔర్వోపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరమ్
తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురన్దరః

తరువాత ఇతను శత్రు రాజ్యానికి వెళ్ళి వారందరినీ ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కానీ శత్రువులను ఎవరినీ చంపలేదు గురువు ఆదేశం వలన. వారిని విచిత్ర వేషధారులను చేసాడు.కొందరిని తల మాత్రం గొరిగి మీసం గొరిగి కొందరిని, గడ్డములను గొరిగి కొందరిని, కొందరికి లోపల వస్త్రం కొందరికి వెలుపల వస్త్రం లేకుండా చేసారు. సగరునికి కేశినీ సుమతీ అని భార్యలు. ఒకరికి అరవై వేల మంది కుమారులు. ఇంకొకరికి ఒక కుమారుడు. అతని పేరు అసమంజసుడు. ఇతను సరయూ నదిలో స్నానం చేయడానికి వచ్చిన బాలురందరినీ అందులో ముంచి చంపేసేవాడు. రాజు పుత్రుడు కదా అని కొంత సహించినా, తరువాత వారు సహించలేక రాజు వద్దకు వెళ్ళి నీకు మేము కావాలా మీ కొడుకుకావాలా అని అడిగారు, విషయం చెప్పి. సగరుడు విషయం తెలుసుకున్న తరువాత కొడుకుకు రాజ్య బహిష్కారం విధించాడు. తండ్రి దగ్గర బహిష్కారం ఆజ్ఞ్య రాగానే అతను శిరసా వహించి, ఇందుకోసమే నేను ఈ పని చేసాను, నాకు రాజ్యం మీదా సంపదల మీదా కోరిక లేదు. నేను వద్దు అంటే మీరు వినరు కాబట్టి ఈ పని చేసి మీరు రాజ్య బహిష్కారం చేసేట్లు చేసాను. నేను వెళ్ళేముందు నేను చంపిన వారిని మీకు మళ్ళీ అప్పగిస్తాను అని చెప్పి, యోగ బలముతో వారందరినీ బతికించాడు. అతను అరణ్యాలకు వెళ్ళాడు. అప్పటికే ఈ అసమంజసునికి పెళ్ళై కుమారుడు ఉన్నాడు. అతని పేరు అంశుమంతుడు. సగర చక్రవర్తి కొంత కాలం రాజ్య పరిపాలన చేసి గురువుగారు చెప్పినట్లుగా ఒక అశ్వమేధ యాగం చేసాడు. చివరి రెండు అశ్వమేధ యాగములు చేయుచుండగా ఇంద్రుడు అశ్వమును తీసుకుని వెళ్ళి పాతాళములో దాచి పెట్టాడు. సగరుని అరవై వేల మంది పుత్రులను గుర్రాన్ని తీసుకుని రమ్మని పంపాడు. వారందరూ భూమండలం అంతా వెతికి దొరకలేదు అని వచ్చారు. భూమినీ సముద్రాలనూ తవ్వేసారు. సముద్రాలను పూడిక తీసారు. అందుకే సాగరమని పేరు. ఇలా పాతాళానికి వెళ్ళి కపిల మహర్షి సమాధిలో ఉంటే అక్కడ గుర్రాన్ని చూసారు. కపిలుడు కళ్ళు తెరిచి చూడగా వీరందరూ భస్మమై పోయారు. అంశుమంతుడు వారిని వెతకడానికి తాతగారి అనుమతి తీసుకుని వెళ్ళాడు. అందరికీ అభివాదం చేస్తూ అందరి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. అందరి మన్ననలూ పొంది ప్రశాంతమైన సాత్విక భావముతో పాతాళానికి వెళ్ళి కపిల మహర్షిని స్తోత్రం చేసి అతని అనుమతితో గుర్రాన్ని తీసుకుని వెళ్ళాడు. కపిల మహర్షే అంశుమంతునితో సగర పుత్రులు భస్మమైన విషయం చెప్పి, ప్రాకృత జలముతో వీరికి ముక్తి లభించదనీ, గంగా నదీ జలముతోనే వీరికి ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. కపిలుని ఆజ్య్నతో గుర్రానంతి తీసుకుని విషయాన్ని తాతగారికి చెప్పాడు. తాతగారు విన్నారు గానీ దాని గురించి పెద్ద ప్రయత్నం ఏమీ చేయలేదు. అంశుమంతునికి రాజ్యం అప్పగించి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. అంశుమంతుడు కూడా దిలీపునికి రాజ్యాన్నిచ్చి తాను కూడా తపస్సు చేసాడు కానీ పొందలేకపోయాడు. దిలీపుడు కూడా గంగ కోసంతపమాచరించి విఫలమయ్యాడు. దిలీపుని కొడుకైన భగీరధుడు మాత్రం గంగ కొరకు తపస్సు చేసి గంగను ప్రసన్నం చేసుకున్నాడు. గంగ ప్రత్యక్షమయి "నేను వచ్చినా నన్ను భరించగలవారెవరు" అని అడిగింది. నేను భూమి మీదకొస్తే పాపాత్ములందరూ పాపం పోగొట్టుకుని ఆ పాపాన్ని నాకు అందిస్తారు. నాకంటిన పాపాన్ని ఎవరు తొలగిస్తారు. అని అడుగగా భగీరధుడూ "నీవు దిగులు పడవలదు. పరమాత్మను మనసులో దాచుకున్న వారు స్నానం చేసి ఆ సజ్జనులు నీకంటిన పాపాన్ని పోగొడతారు. నిన్ను శంకరుడు ధరిస్తాడు" అని శంకరుని కొరకు తపస్సు చేసి ఆయన ఆమోదం చెంది మరలా గంగను ప్రార్థిస్తే గంగ ప్రసన్నమై వచ్చింది. అపుడు గంగ "నా వేగాన్ని శంకరుడు ఎలా భరిస్తాడు. ఆయనను కూడా తీసుకుని నేను పాతాళానికి తీసుకు వెళతాను " అని అనుకుంది. అపుడు ఆ విషయం తెలుసుకున్న శంకరుడు తన ఒకానఒక జాటజూటములో గంగను బంధిచగా భగీరధుడు మరలా శంకరున్ని  ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు ఏడు  ధారలను విడిచాడు. మూడు తూర్పునకూ మూడు పశ్చిమానికీ, ఒక ధార భగీరధుని వెంటా వచ్చాయి. అలా భగీరధుడూ గంగను ఎక్కడైతే బూడిద కుప్పలు  ఉన్నాయో అక్కడికి తీసుకు వెళ్ళగా అక్కడ బూడిద కుప్ప మీద గంగ ప్రవహించగానే వారు స్వర్గానికి వెళ్ళారు. శరీరములేకుండానే బూడిద ఐన వారే స్వర్గానికి వెళ్ళినప్పుడు శరీరముతో ఉన్నప్పుడు గంగను సేవిస్తే, స్పృశిస్తే, మునిగినా, తలచినా, ఎంత విశేషం ఉంటుందో. ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. పరమాత్మ పాద పద్మముల నుండి ప్రసరించిన గంగకు ఈ మహిమ పెద్ద ఆశ్చర్యం కాదు.  పరమాత్మ పాద పద్మము నుండి ప్రసరించిన గంగకు ఈ మహిమ పెద్ద వింత కాదు. శ్రద్ధా భక్తితో గంగను స్మరించినా గానం చేసినా అన్ని పాపాలు తొలగి పవిత్రుడవుతాడు. 

సుమత్యాస్తనయా దృప్తాః పితురాదేశకారిణః
హయమన్వేషమాణాస్తే సమన్తాన్న్యఖనన్మహీమ్

ప్రాగుదీచ్యాం దిశి హయం దదృశుః కపిలాన్తికే
ఏష వాజిహరశ్చౌర ఆస్తే మీలితలోచనః

హన్యతాం హన్యతాం పాప ఇతి షష్టిసహస్రిణః
ఉదాయుధా అభియయురున్మిమేష తదా మునిః

స్వశరీరాగ్నినా తావన్మహేన్ద్రహృతచేతసః
మహద్వ్యతిక్రమహతా భస్మసాదభవన్క్షణాత్

న సాధువాదో మునికోపభర్జితా నృపేన్ద్రపుత్రా ఇతి సత్త్వధామని
కథం తమో రోషమయం విభావ్యతే జగత్పవిత్రాత్మని ఖే రజో భువః

యస్యేరితా సాఙ్ఖ్యమయీ దృఢేహ నౌర్యయా ముముక్షుస్తరతే దురత్యయమ్
భవార్ణవం మృత్యుపథం విపశ్చితః పరాత్మభూతస్య కథం పృథఙ్మతిః

యోऽసమఞ్జస ఇత్యుక్తః స కేశిన్యా నృపాత్మజః
తస్య పుత్రోऽంశుమాన్నామ పితామహహితే రతః

అసమఞ్జస ఆత్మానం దర్శయన్నసమఞ్జసమ్
జాతిస్మరః పురా సఙ్గాద్యోగీ యోగాద్విచాలితః

ఆచరన్గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియమ్
సరయ్వాం క్రీడతో బాలాన్ప్రాస్యదుద్వేజయన్జనమ్

ఏవం వృత్తః పరిత్యక్తః పిత్రా స్నేహమపోహ్య వై
యోగైశ్వర్యేణ బాలాంస్తాన్దర్శయిత్వా తతో యయౌ

అయోధ్యావాసినః సర్వే బాలకాన్పునరాగతాన్
దృష్ట్వా విసిస్మిరే రాజన్రాజా చాప్యన్వతప్యత

అంశుమాంశ్చోదితో రాజ్ఞా తురగాన్వేషణే యయౌ
పితృవ్యఖాతానుపథం భస్మాన్తి దదృశే హయమ్

తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యమధోక్షజమ్
అస్తౌత్సమాహితమనాః ప్రాఞ్జలిః ప్రణతో మహాన్

అంశుమానువాచ
న పశ్యతి త్వాం పరమాత్మనోऽజనో న బుధ్యతేऽద్యాపి సమాధియుక్తిభిః
కుతోऽపరే తస్య మనఃశరీరధీ విసర్గసృష్టా వయమప్రకాశాః

యే దేహభాజస్త్రిగుణప్రధానా గుణాన్విపశ్యన్త్యుత వా తమశ్చ
యన్మాయయా మోహితచేతసస్త్వాం విదుః స్వసంస్థం న బహిఃప్రకాశాః

తం త్వాం అహం జ్ఞానఘనం స్వభావ ప్రధ్వస్తమాయాగుణభేదమోహైః
సనన్దనాద్యైర్మునిభిర్విభావ్యం కథం విమూఢః పరిభావయామి

ప్రశాన్త మాయాగుణకర్మలిఙ్గమనామరూపం సదసద్విముక్తమ్
జ్ఞానోపదేశాయ గృహీతదేహం నమామహే త్వాం పురుషం పురాణమ్

త్వన్మాయారచితే లోకే వస్తుబుద్ధ్యా గృహాదిషు
భ్రమన్తి కామలోభేర్ష్యా మోహవిభ్రాన్తచేతసః

అద్య నః సర్వభూతాత్మన్కామకర్మేన్ద్రియాశయః
మోహపాశో దృఢశ్ఛిన్నో భగవంస్తవ దర్శనాత్

శ్రీశుక ఉవాచ
ఇత్థం గీతానుభావస్తం భగవాన్కపిలో మునిః
అంశుమన్తమువాచేదమనుగ్రాహ్య ధియా నృప

శ్రీభగవానువాచ
అశ్వోऽయం నీయతాం వత్స పితామహపశుస్తవ
ఇమే చ పితరో దగ్ధా గఙ్గామ్భోऽర్హన్తి నేతరత్

తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్
సగరస్తేన పశునా యజ్ఞశేషం సమాపయత్

రాజ్యమంశుమతే న్యస్య నిఃస్పృహో ముక్తబన్ధనః
ఔర్వోపదిష్టమార్గేణ లేభే గతిమనుత్తమామ్