Pages

Wednesday, 9 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
బలిరేవం గృహపతిః కులాచార్యేణ భాషితః
తూష్ణీం భూత్వా క్షణం రాజన్నువాచావహితో గురుమ్

ఇలా కులాచార్యుడు చెప్పగా ఒక క్షణ కాలం ఆగి ఆలోచించి గురువుగారితో అన్నారు

శ్రీబలిరువాచ
సత్యం భగవతా ప్రోక్తం ధర్మోऽయం గృహమేధినామ్
అర్థం కామం యశో వృత్తిం యో న బాధేత కర్హిచిత్

మీరు చెప్పినది నిజమే. గృహస్థారమం ఆచరించే వారికి ఇది ధర్మమే. అర్థమునూ కామమునూ కీర్తినీ బతుకు తెరువూ బాధించకుండా ఉండడం ధర్మమే.వచ్చిన వాడు బ్రాహ్మణుడు. వచ్చిన బ్రాహ్మణున్ని నా రాజ్యం కాపాడుకోవడానికి ఎలా తిరస్కరిస్తాను. ప్రహ్లాదుని మనవడిని ఐన నేను ఎలా వంచన చేయగలను

స చాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజమ్
ప్రతిశ్రుత్య దదామీతి ప్రాహ్రాదిః కితవో యథా

న హ్యసత్యాత్పరోऽధర్మ ఇతి హోవాచ భూరియమ్
సర్వం సోఢుమలం మన్యే ఋతేऽలీకపరం నరమ్

నాహం బిభేమి నిరయాన్నాధన్యాదసుఖార్ణవాత్
న స్థానచ్యవనాన్మృత్యోర్యథా విప్రప్రలమ్భనాత్


ప్రపంచములో అబద్దాన్ని మించిన అధర్మం లేదు. ఎలాంటి పాపం చేసిన వాడినైనా భరిస్తాను గానీ అబద్దం ఆడిన వాడిని భరించలేను అని భూమే అంది. నేను నరకానికీ దారిద్ర్యానికీ దుఃఖానికీ స్థానభ్రంశానికీ మృత్యువుకూ దేనికీ భయపడను. బ్రాహ్మణున్ని మోసగించడం అంటే భయం నాకు

యద్యద్ధాస్యతి లోకేऽస్మిన్సమ్పరేతం ధనాదికమ్
తస్య త్యాగే నిమిత్తం కిం విప్రస్తుష్యేన్న తేన చేత్

లోకములో ఇతను దేన్ని దేన్ని విడిచిపెడతాడో దానం చేస్తాడో, తాను విడిచిన దానితో బ్రాహ్మణుడు సంతోషించకుంటే ఆ దానానికి ప్రయోజనం ఏమిటి.బ్రాహ్మణుని తృప్తి పరచని దానం ఎందుకు.

శ్రేయః కుర్వన్తి భూతానాం సాధవో దుస్త్యజాసుభిః
దధ్యఙ్శిబిప్రభృతయః కో వికల్పో ధరాదిషు

మీరు చెప్పారు గానీ ఉదాహరణలూ దుష్టాంతాలూ వేరేగా ఉన్నాయి. సాధువుల తీరు వేరేగా ఉంది. శిబి ధధీచి మొదలైన వారు తమ ప్రాణాలను విడిచిపెట్టి కూడా లోకానికి శ్రేయస్సు చేకూరుస్తున్నారు

యైరియం బుభుజే బ్రహ్మన్దైత్యేన్ద్రైరనివర్తిభిః
తేషాం కాలోऽగ్రసీల్లోకాన్న యశోऽధిగతం భువి

ప్రాణాలూ శరీరాలే ఇచ్చినపుడు భూమి ఇవ్వడములో వికల్పమేముంది. రాజ్యం ఇవ్వడం ప్రాణం ఇవ్వడం కన్నా గొప్ప కాదు కదా. ప్రపంచములో ఇంతవరకూ యుద్ధములో వెను తిరిగి చూడకుండా మరణాన్ని పొందిన దైత్యులు అందరూ యుద్ధం చేసి ఎదురొడ్డి ప్రాణాలు పణముగా పొందిన రాజ్యాలూ సంపదలూ ఉన్నాయా? ఆ పొందిన రాజులైనా ఉన్నారా? అలాంటి వారు లోకాలను కాలమే గ్రహించింది. రాజ్యమూ ప్రాణమూ దక్కించుకున్నవారికి కీర్తి మిగలలేదు. ఆ ప్రాణము దాచుకోకుండా వదిలినవారికి కాలము కీర్తిని మిగిల్చింది. 

సులభా యుధి విప్రర్షే హ్యనివృత్తాస్తనుత్యజః
న తథా తీర్థ ఆయాతే శ్రద్ధయా యే ధనత్యజః

లోకములో యుద్ధన్ములో వెను తిరగకుండా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం చాలా మందికి వస్తుంది. అది సులభం. కానీ సత్పాత్రకు ధనం విడిచిపెట్టడం చాలా కష్టం. అంతటి ఉత్తమ పాత్ర లభించినపుడు శ్రద్ధతో ధనం విడ్చేవారు దొరకరు. 

మనస్వినః కారుణికస్య శోభనం యదర్థికామోపనయేన దుర్గతిః
కుతః పునర్బ్రహ్మవిదాం భవాదృశాం తతో వటోరస్య దదామి వాఞ్ఛితమ్

బుద్ధిమంతులు దయకలవారికి, యాచకుల కోరిక తీర్చి దుర్గతి పొందడం కూడా వారికి శోభనమే. నీలాంటి బ్రహ్మ జ్ఞ్యానుల శిష్యున్ని ఐన నేను ఇలాంటి బ్రహ్మచారి అడిగిన దాన్ని ఇవ్వడం కంటే నేను కోరదగినది ఏమున్నది. 

యజన్తి యజ్ఞం క్రతుభిర్యమాదృతా భవన్త ఆమ్నాయవిధానకోవిదాః
స ఏవ విష్ణుర్వరదోऽస్తు వా పరో దాస్యామ్యముష్మై క్షితిమీప్సితాం మునే

వేద వేదాంతములలో నిపుణులైన మీరు దేన్ని కోరి యజ్ఞ్యం చేస్తున్నారు. ఎవరికోసం యజ్ఞ్యం చేస్తున్నారు.ఆయనే ఎదురుగా వచ్చి యాచిస్తే ఇంకేమి కావాలి. ఈ మహావిష్ణువు కోరిన రీతిలో భూమిని ఇస్తాను. 

యద్యప్యసావధర్మేణ మాం బధ్నీయాదనాగసమ్
తథాప్యేనం న హింసిష్యే భీతం బ్రహ్మతనుం రిపుమ్

ఒక వేళ ఈ మహావిష్ణువు తప్పు చేయని నన్ను బంధించినా నేను శిక్షించను. ఈయన బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చాడు. భయపడితేనే ఎవరైనా వేషం వేసుకుని వస్తారు. అలాంటి వారిని శిక్షించను.

ఏష వా ఉత్తమశ్లోకో న జిహాసతి యద్యశః
హత్వా మైనాం హరేద్యుద్ధే శయీత నిహతో మయా

నిజముగా యుద్ధానికే వస్తే ఎవరు ఎవరిని ఓడిస్తారో వేరే సంగతి. యుద్ధానికి భయపడి వస్తే నేనేమీ చేయను. శత్రువుగా వస్తే భయపడినట్లే కదా. విష్ణువుగా వస్తే యజ్ఞ్యానలన్నీ ఆయనవే కదా

శ్రీశుక ఉవాచ
ఏవమశ్రద్ధితం శిష్యమనాదేశకరం గురుః
శశాప దైవప్రహితః సత్యసన్ధం మనస్వినమ్

ఎంత గొప్పవాడైనా గురువు గారి మాటను లెక్క చేయకపోవడముచేత దైవం చేత ప్రేరేపించబడి సత్య సంధుడైన పౌరుషం గల బలి చక్రవర్తిని శపించాడు.

దృఢం పణ్డితమాన్యజ్ఞః స్తబ్ధోऽస్యస్మదుపేక్షయా
మచ్ఛాసనాతిగో యస్త్వమచిరాద్భ్రశ్యసే శ్రియః

నా మాటను కాదని నిన్ను నీవు పండితుడవని అనుకుంటున్నావు. నీకేమీ తెలియదు.నా మాట కాదని నన్ను ఉపేక్షించి నా ఆజ్ఞ్యను ధిక్కరించావు కాబట్టి నీవు త్వరలోనే రాజ్య భ్రష్టుడవు అవుతావు 

ఏవం శప్తః స్వగురుణా సత్యాన్న చలితో మహాన్
వామనాయ దదావేనామర్చిత్వోదకపూర్వకమ్

శాపం పెట్టినా సరే మహానుభావుడైన బలి చక్రవర్తి తన మాట నుండి చలించక వామనున్ని పూజించి జలముతో అడిగినదాన్ని ఇచ్చాడు

విన్ధ్యావలిస్తదాగత్య పత్నీ జాలకమాలినీ
ఆనిన్యే కలశం హైమమవనేజన్యపాం భృతమ్

నీటితో నిండిన పాదములను కడిగే కలశం అతని భార్య వింధ్యావలి తీసుకుని వచ్చింది. దానానికోసం బలి చక్రవర్తి పరమాత్మ పాదాలను కడిగి ఆయన పాద తీర్థాన్ని శిరస్సు మీద ఉంచుకున్నాడు

యజమానః స్వయం తస్య శ్రీమత్పాదయుగం ముదా
అవనిజ్యావహన్మూర్ధ్ని తదపో విశ్వపావనీః

తదాసురేన్ద్రం దివి దేవతాగణా గన్ధర్వవిద్యాధరసిద్ధచారణాః
తత్కర్మ సర్వేऽపి గృణన్త ఆర్జవం ప్రసూనవర్షైర్వవృషుర్ముదాన్వితాః

ఈ బలి చక్రవర్తిని స్వర్గములో ఉన్న దేవతలూ విద్యాధరులూ చారణులు దుందుభులు మోగించారు పుష్పవర్షం కురిపించారు. అతని కర్మను స్తోత్రం చేసారు. గానం చేసారు

నేదుర్ముహుర్దున్దుభయః సహస్రశో గన్ధర్వకిమ్పూరుషకిన్నరా జగుః
మనస్వినానేన కృతం సుదుష్కరం విద్వానదాద్యద్రిపవే జగత్త్రయమ్

బలి చక్రవర్తి జ్ఞ్యాన సంపన్నుడు , ఎవరూ చేయలేని గొప్ప పని చేసాడు. శత్రువు అని తెలిసి కూడా మూడు లోకాలూ దానమిచ్చాడు

తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేరనన్తస్య గుణత్రయాత్మకమ్
భూః ఖం దిశో ద్యౌర్వివరాః పయోధయస్తిర్యఙ్నృదేవా ఋషయో యదాసత

ఎపుడైతే బలి చక్రవర్తి జల ధార వామనుని చేతిలో పడిందో ఆయన శరీరం అత్యాశ్చర్యకరమైన రీతిలో పెరిగింది. ఇది గుణత్రయాత్మకం. ఇది విశ్వరూపం. భూమీ ఆకాశం దిక్కులూ స్వర్గమూ పాతాళది లోకాలూ పశుపక్షాది జీవాలూ ఋషులూ అందరూ ఆయనలోనే ఉన్నారు

కాయే బలిస్తస్య మహావిభూతేః సహర్త్విగాచార్యసదస్య ఏతత్
దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే భూతేన్ద్రియార్థాశయజీవయుక్తమ్

గుణాత్మకుడైన పరమాత్మ యందు త్రిగుణమూల్తో ఉన్న విశ్వాన్ని చూచాడు. పంచభూతములూ జ్ఞ్యానేంద్రియములు కర్మేంద్రియములూ తన్మాత్రలూ జీవుడు, ఇరవై నాలుగు తత్వాలతో కూడి ఉన్న పరమాత్మ శరీరాన్ని దర్శించాడు. 

రసామచష్టాఙ్ఘ్రితలేऽథ పాదయోర్మహీం మహీధ్రాన్పురుషస్య జఙ్ఘయోః
పతత్త్రిణో జానుని విశ్వమూర్తేరూర్వోర్గణం మారుతమిన్ద్రసేనః

పాదములలో భూమిని చూచాడు. అరికాళ్ళలో రసాతలాన్ని పాదములలో భూమిని జంఘములలో పర్వతములనీ మోకాళ్ళలో పక్షులను ఊరువులలో మరుత్ గణాన్నీ చూచాడు. ఆయన వక్త్రములో సంధ్యనీ, జఘనములో ప్రజాపతినీ, నాభిలో నభమునూ, కడుపులో ఏడు సముద్రములను వక్షస్థములో నక్షత్ర మాలను హృదయములో ధర్మాన్నీ స్తనములలో ఋతమునూ సత్యమునూ మనసులో చంద్రున్నీ, వక్షస్థలములో పద్మహస్థ ఐన అమ్మవారి కంఠములో సామములనూ, ఇంద్రాది దేవతలను భుజములయందు చెవులలో దిక్కులను, శిరస్సున స్వర్గమ్నూ కేశముల యందు మేఘములనూ నాసికలో వాయువ్నూ నేత్రములో సూర్యున్ని నోటిలో అగ్నినీ 

సన్ధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్ప్రజాపతీన్జఘనే ఆత్మముఖ్యాన్
నాభ్యాం నభః కుక్షిషు సప్తసిన్ధూనురుక్రమస్యోరసి చర్క్షమాలామ్

హృద్యఙ్గ ధర్మం స్తనయోర్మురారేరృతం చ సత్యం చ మనస్యథేన్దుమ్
శ్రియం చ వక్షస్యరవిన్దహస్తాం కణ్ఠే చ సామాని సమస్తరేఫాన్

ఇన్ద్రప్రధానానమరాన్భుజేషు తత్కర్ణయోః కకుభో ద్యౌశ్చ మూర్ధ్ని
కేశేషు మేఘాన్ఛ్వసనం నాసికాయామక్ష్ణోశ్చ సూర్యం వదనే చ వహ్నిమ్

వాణ్యాం చ ఛన్దాంసి రసే జలేశం భ్రువోర్నిషేధం చ విధిం చ పక్ష్మసు
అహశ్చ రాత్రిం చ పరస్య పుంసో మన్యుం లలాటేऽధర ఏవ లోభమ్

వాక్కులో ఏడు చందస్సులనూ రసన యందు వరుణున్నీ కనుబొమ్మలలో నిషేధ కార్యములనూ కనురెప్పలలో విధినీ అహోరాత్రములను రెప్పలలో కోపాన్ని లలాటములో కింది పెదవిలో లోభాన్ని స్పర్శలో కామమునూ రేతస్సులో జలమునూ వీపులో అధర్మాన్ని 

స్పర్శే చ కామం నృప రేతసామ్భః పృష్ఠే త్వధర్మం క్రమణేషు యజ్ఞమ్
ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం తనూరుహేష్వోషధిజాతయశ్చ

ఫాలములలో యజ్ఞ్యమునూ నీడలో మృత్యువునూ నవ్వులో మాయనూ, రోమములో అన్ని ఔషధులనూ

నదీశ్చ నాడీషు శిలా నఖేషు బుద్ధావజం దేవగణానృషీంశ్చ
ప్రాణేషు గాత్రే స్థిరజఙ్గమాని సర్వాణి భూతాని దదర్శ వీరః

నదులను నడులలో, పర్వతాలనూ రాళ్ళనూ గోళ్ళలో, బుద్ధి యందు బ్రహ్మనూ ప్రాణము యందు దేవగణములను, ఇతర శరీరములలో స్థిర జంగమాలనూ ఇతర సకల చరాచర జగత్తునూ పరమాత్మ యొక్క శరీరములో చూచాడు

సర్వాత్మనీదం భువనం నిరీక్ష్య సర్వేऽసురాః కశ్మలమాపురఙ్గ
సుదర్శనం చక్రమసహ్యతేజో ధనుశ్చ శార్ఙ్గం స్తనయిత్నుఘోషమ్

ఇలా పరమాత్మ యందు ఈ ప్రపంచాన్ని చూచి రాక్షసుల  యందు దుఃఖాన్ని పొందారు. స్వామి మేఘములా ధ్వైంచే శంఖమూ చక్రమూ శాంఖమూ మహా వేగము కల కౌమోదకీ గదా

పర్జన్యఘోషో జలజః పాఞ్చజన్యః కౌమోదకీ విష్ణుగదా తరస్వినీ
విద్యాధరోऽసిః శతచన్ద్రయుక్తస్తూణోత్తమావక్షయసాయకౌ చ

విద్యాధరులు ఆయన ఖడ్గం, ఉత్తమ అమ్ముల పొదులు, ఎన్నటికీ తరగని బాణాలు

సునన్దముఖ్యా ఉపతస్థురీశం పార్షదముఖ్యాః సహలోకపాలాః
స్ఫురత్కిరీటాఙ్గదమీనకుణ్డలః శ్రీవత్సరత్నోత్తమమేఖలామ్బరైః

సునందాదులు స్తోత్రం చేస్తూ ఉండగా లోకపాలకు స్తుతి చేయగా, అన్ని ఆభరణాలూ వనమాలతో పరమాత్మ ప్రకాశించాడు

మధువ్రతస్రగ్వనమాలయావృతో రరాజ రాజన్భగవానురుక్రమః
క్షితిం పదైకేన బలేర్విచక్రమే నభః శరీరేణ దిశశ్చ బాహుభిః

ఊక పాదముతో భూమిని ఆక్రమించాడు. ఆకాశాన్ని శరీరముతో బాహువులతో దిక్కులనూ, రెండవ పాదముతో స్వర్గాన్ని ఆక్రమించాడు. బలి చక్రవర్తిది అంటూ ఏదీ మిగలలేదు. ఆ పరమాత్మ పాదం ఆకాశముతో ఆగిపోలేదు

పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం న వై తృతీయాయ తదీయమణ్వపి
ఉరుక్రమస్యాఙ్ఘ్రిరుపర్యుపర్యథో మహర్జనాభ్యాం తపసః పరం గతః

అలా పెరిగి ఆయన కాలం సత్యలోకం కూడా దాటిపోయింది