Pages

Sunday, 11 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై రెండవ అధ్యాయం

       

 ఓం నమో భగవతే వాసుదేవాయ 

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై రెండవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
ఇత్థం సోऽనగ్రహీతోऽన్గ కృష్ణేనేక్ష్వాకు

 నన్దనః
తం పరిక్రమ్య సన్నమ్య నిశ్చక్రామ గుహాముఖాత్

ఇలా ఈ మహానుభావుడు కృష్ణ పరమాత్మ అనుజ్ఞ్యను పొంది, ఆయనకు ప్రదక్షిణం చేసి బయటకు వెళ్ళాడు

సంవీక్ష్య క్షుల్లకాన్మర్త్యాన్పశూన్వీరుద్వనస్పతీన్
మత్వా కలియుగం ప్రాప్తం జగామ దిశముత్తరామ్

బయటకు వెళ్ళ్ళగానే పర్వతాలూ మనుషులూ అన్నీ చిన్నవిగా కనపడ్డాయి. అది చూసి కలియుగం రాబోతోంది అని తెలుసుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళాడు

తపఃశ్రద్ధాయుతో ధీరో నిఃసఙ్గో ముక్తసంశయః
సమాధాయ మనః కృష్ణే ప్రావిశద్గన్ధమాదనమ్

తపస్సుతో అన్ని సంగములనూ వదలిపెట్టి అన్ని సందేహాలూ విడిచిపెట్టి కృష్ణ పరమాత్మ మీద మనసు పెట్టి గంధమాధన పర్వతానికి వెళ్ళాడు 

బదర్యాశ్రమమాసాద్య నరనారాయణాలయమ్
సర్వద్వన్ద్వసహః శాన్తస్తపసారాధయద్ధరిమ్

బదరికాశ్రమానికి వెళ్ళి నర నారాయణులను శ్రద్ధగా తపసుతో పరమాత్మను ఆరాధించాడు

భగవాన్పునరావ్రజ్య పురీం యవనవేష్టితామ్
హత్వా మ్లేచ్ఛబలం నిన్యే తదీయం ద్వారకాం ధనమ్

కృష్ణుడు తన పని ఐన తరువాత ద్వారకా నగరానికి వచ్చాడు
యవనుడు మరణించిన తరువాత స్వామి వాడి సైన్యాన్ని హతమార్చి వారి ధనాన్ని తీసుకుని రాజుకు అప్పగించాడు

నీయమానే ధనే గోభిర్నృభిశ్చాచ్యుతచోదితైః
ఆజగామ జరాసన్ధస్త్రయోవింశత్యనీకపః

ఇలా సంహరించి ఆ ధనాన్ని తీసుకుని వెళుతుంటే 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని వచ్చాడు

విలోక్య వేగరభసం రిపుసైన్యస్య మాధవౌ
మనుష్యచేష్టామాపన్నౌ రాజన్దుద్రువతుర్ద్రుతమ్

ఇలా పారిపోవడమే బాగుందని అనుకున్నాడేమో, ఈ సారి కృష్ణుడు పారిపోయాడు. దానితో జరాసంధుడు పద్దెనిమిది సార్లు కృష్ణున్ని గెలిచాను అని ప్రకటించుకున్నాడు

విహాయ విత్తం ప్రచురమభీతౌ భీరుభీతవత్
పద్భ్యాం పలాశాభ్యాం చేలతుర్బహుయోజనమ్

చాలా యోజనాల దూరం పారిపోయారు వీరు

పలాయమానౌ తౌ దృష్ట్వా మాగధః ప్రహసన్బలీ
అన్వధావద్రథానీకైరీశయోరప్రమాణవిత్

వారి వెనక నవ్వుకుంటూ వెళ్ళి రథాన్ని తీసుకుని వారిని వెంబడించాడు

ప్రద్రుత్య దూరం సంశ్రాన్తౌ తుఙ్గమారుహతాం గిరిమ్
ప్రవర్షణాఖ్యం భగవాన్నిత్యదా యత్ర వర్షతి

ఇలా వీరిద్దరూ చాలా దూరం ప్రయాణించి ప్రవర్షణం అన్న పర్వతాన్ని అధిరోహించారు.అకడ నిరంతరం వర్షం వస్తూనే ఉంటుంది.

గిరౌ నిలీనావాజ్ఞాయ నాధిగమ్య పదం నృప
దదాహ గిరిమేధోభిః సమన్తాదగ్నిముత్సృజన్

పర్వతం ఎక్కారు కానీ దిగలేదు. జరాసంధుడు అది తెలుసుకున్నాడు. వీరెలాగూ దొరకరు కాబట్టి పర్వతానికి చుట్టూ ఉన్న వనానికి నిప్పు పెడదాము అనుకుని, చుట్టూ నిప్పు పెట్టి పర్వతాన్ని తగులబెట్టాడు

తత ఉత్పత్య తరసా దహ్యమానతటాదుభౌ
దశైకయోజనాత్తుఙ్గాన్నిపేతతురధో భువి

అలా తగుల బెడితే వారిద్దరూ అక్కడ నుంచి కిందకు దిగి ద్వారకకు వచ్చి అక్కడ ఉన్న సైన్యాన్ని సంహరించారు

అలక్ష్యమాణౌ రిపుణా సానుగేన యదూత్తమౌ
స్వపురం పునరాయాతౌ సముద్రపరిఖాం నృప

సోऽపి దగ్ధావితి మృషా మన్వానో బలకేశవౌ
బలమాకృష్య సుమహన్మగధాన్మాగధో యయౌ

జరాసంధుడు వీరు కాలిపోయారనుకుని వెనుదిరిగి వెళ్ళాడు

ఆనర్తాధిపతిః శ్రీమాన్రైవతో రైవతీం సుతామ్
బ్రహ్మణా చోదితః ప్రాదాద్బలాయేతి పురోదితమ్

రైవతుడు రేవతిని ఇచ్చి వివాహం చేసాడని విన్నాము. ఎలా జరిగింది ఆ వివాహం.

భగవానపి గోవిన్ద ఉపయేమే కురూద్వహ
వైదర్భీం భీష్మకసుతాం శ్రియో మాత్రాం స్వయంవరే


ప్రమథ్య తరసా రాజ్ఞః శాల్వాదీంశ్చైద్యపక్షగాన్
పశ్యతాం సర్వలోకానాం తార్క్ష్యపుత్రః సుధామివ

శ్రీరాజోవాచ
భగవాన్భీష్మకసుతాం రుక్మిణీం రుచిరాననామ్
రాక్షసేన విధానేన ఉపయేమ ఇతి శ్రుతమ్

భగవన్శ్రోతుమిచ్ఛామి కృష్ణస్యామితతేజసః
యథా మాగధశాల్వాదీన్జిత్వా కన్యాముపాహరత్


కృష్ణుడు కూడా రుక్మిణిని స్వయంవరములో రాజులందరినీ ఓడించి బలముగా అపహరించుకుని వచ్చి వివాహం చేసుకున్నాడని విన్నాము. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినట్లుగా రుక్మిణిని కృష్ణుడు అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడని విన్నాము.
పరమాత్మ యొక్క ఈ వివాహ ప్రక్రియను విన గోరుతున్నాము.

బ్రహ్మన్కృష్ణకథాః పుణ్యా మాధ్వీర్లోకమలాపహాః
కో ను తృప్యేత శృణ్వానః శ్రుతజ్ఞో నిత్యనూతనాః

కృష్ణ కథలు తేనె కంటే తీయగా ఉంటాయి.  తేనె కొద్ది రోగాలనే పోగొట్టి కొద్ది రోగాలను సృష్టిస్తాయి, కానీ ఈ కథలు లోకానికి ఉన్న మలాన్ని పోగొడతాయి. వినడం తెలిసిన వాడెవడైనా (వినవలసిన దాన్ని తెలిసిన వాడెవడైనా) నిత్య నూతనముగా ఉండే కృష్ణ పరమాత్మ కథలను చాలు అని అంటాడా.

శ్రీబాదరాయణిరువాచ
రాజాసీద్భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్
తస్య పన్చాభవన్పుత్రాః కన్యైకా చ వరాననా

విదర్భాధిపతికి ఐదుగురు పుత్రులూ ఒక అమ్మాయి. (పంచభూతాలూ బుద్ధి)

రుక్మ్యగ్రజో రుక్మరథో రుక్మబాహురనన్తరః
రుక్మకేశో రుక్మమాలీ రుక్మిణ్యేషా స్వసా సతీ

ఇవి వారి పేర్లు. రుక్మి రుక్మరథ  రుక్మ బాహు రుక్మ కేశ రుక్మ మాలి. రుక్మ అంటే బంగారం. (బంగారం అంటే వ్యామోహం)
రుక్మి - అంటే పూర్తి వ్యామోహం
రుక్మ రథః - వీడిని నడిపించేది వ్యామోహం
రుక్మ బాహుః - వ్యామోహముతో పని చేసేవాడు (బాహు అంటే కర్మలు)
రుక్మ కేశః - ఇకడ కేశము అంటే పిచ్చి, అంటే వ్యామోహమే పిచ్చిగా కలవాడు
రుక్మ మాలి - వ్యామోహమే  అలంకారముగా భావించేవాడు
రుక్మిణి - భగవత్ వ్యామోహమే ఆభరణముగా కలది

సోపశ్రుత్య ముకున్దస్య రూపవీర్యగుణశ్రియః
గృహాగతైర్గీయమానాస్తం మేనే సదృశం పతిమ్

నారద మహర్షి కృష్ణ పరమాత్మ సౌందర్యం పరాక్రమం సౌందర్యం శౌర్యం బలం గురించి చెప్పగా నాకు తగిన భర్త కృష్ణుడే అని నిర్ణయించుకుంది.

తాం బుద్ధిలక్షణౌదార్య రూపశీలగుణాశ్రయామ్
కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్వోఢుం మనో దధే

స్వామి కూడా ఎమె నాకు తగిన భార్యా అని నిశ్చయించుకున్నాడు ఆమె బుద్ధీ లక్షణం ఔదార్యం రూపం గుణం శీలాన్ని చూచి

బన్ధూనామిచ్ఛతాం దాతుం కృష్ణాయ భగినీం నృప
తతో నివార్య కృష్ణద్విడ్రుక్మీ చైద్యమమన్యత

తక్కిన వారు కూడా రుక్మిణిని కృష్ణునికే ఇవ్వాలని అనుకున్నారు. కానీ అతనంటే పడని అన్న రుక్మి శిశుపాలునికే ఇచ్చి చేస్తా అని అనుకున్నాడు

తదవేత్యాసితాపాఙ్గీ వైదర్భీ దుర్మనా భృశమ్
విచిన్త్యాప్తం ద్విజం కఞ్చిత్కృష్ణాయ ప్రాహిణోద్ద్రుతమ్

ఇంతవరకూ వచ్చిన తరువాత రుక్మిణి ఈ విషయం తెలుసుకున్నది. స్వామికి సందేశం పంప నిశ్చయించి ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి పంపింది

ద్వారకాం స సమభ్యేత్య ప్రతీహారైః ప్రవేశితః
అపశ్యదాద్యం పురుషమాసీనం కాఞ్చనాసనే

బంగారు సింహాసనం మీద కూర్చున్న స్వామిని ఈ బ్రాహ్మణోత్తముడు చూచాడు

దృష్ట్వా బ్రహ్మణ్యదేవస్తమవరుహ్య నిజాసనాత్
ఉపవేశ్యార్హయాం చక్రే యథాత్మానం దివౌకసః

ఈయన రావడం చూచిన కృష్ణ పరమాత్మ లేచి వచ్చి ఉన్నతాసనం మీద ఆ బ్రాహ్మణోత్తమున్ని కూర్చోబెట్టి పాద ప్రక్షాళనాదులన్నీ చేసి

తం భుక్తవన్తం విశ్రాన్తముపగమ్య సతాం గతిః
పాణినాభిమృశన్పాదావవ్యగ్రస్తమపృచ్ఛత

చక్కని భోజనం పెట్టి విశ్రమింపచేసి, ఇవన్నీ ఐన తరువాత  పాదాలను చేతితో ఎత్తుతూ బ్రాహ్మణోత్తమునితో ఇలా అన్నాడు

కచ్చిద్ద్విజవరశ్రేష్ఠ ధర్మస్తే వృద్ధసమ్మతః
వర్తతే నాతికృచ్ఛ్రేణ సన్తుష్టమనసః సదా

బ్రాహ్మణోత్తమా నీవు పెద్దలు చెప్పిన ధర్మాన్నే ఆచరిస్తున్నావా
దొరికిన దానితో సంతృప్తి పొందుతున్నావా లేదా. అసంతుష్టా ద్విజా నష్టః.

సన్తుష్టో యర్హి వర్తేత బ్రాహ్మణో యేన కేనచిత్
అహీయమానః స్వద్ధర్మాత్స హ్యస్యాఖిలకామధుక్

బ్రాహ్మణుడు పరమాత్మ చేత లభించిన దానితోనే తృప్తి చెందాలి. తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా తన ధర్మాన్ని ఆచరించినందు వలన వచ్చిన దానితో తృప్తి పొందాలి. ఆ తృప్తే అతనికి అన్ని కోరికలనూ తీరుస్తుంది.

అసన్తుష్టోऽసకృల్లోకానాప్నోత్యపి సురేశ్వరః
అకిఞ్చనోऽపి సన్తుష్టః శేతే సర్వాఙ్గవిజ్వరః

తృప్తి లేని వాడు అన్ని లోకాలనూ పొందినా ఇంద్రుని వలె నిద్ర లేకుండా ఉంటాడు. తృప్తి గలవాడు కటిక నేల మీదైనా హాయిగా నిదురపోతాడు

విప్రాన్స్వలాభసన్తుష్టాన్సాధూన్భూతసుహృత్తమాన్
నిరహఙ్కారిణః శాన్తాన్నమస్యే శిరసాసకృత్

తనకు లభించిన దానితో సంతోషించే సజ్జనులైన అన్ని ప్రాణులకూ ఉపకారం కోరే అహంకార రహితులైన శాత చిత్తులైన బ్రాహ్మణులకు నిత్యం తల వంచి నమస్కరిస్తాను.

కచ్చిద్వః కుశలం బ్రహ్మన్రాజతో యస్య హి ప్రజాః
సుఖం వసన్తి విషయే పాల్యమానాః స మే ప్రియః

మీరు ఉన్న చోట బాగున్నారా , క్షేమముగా ఉన్నారా. ప్రజలందరూ తమ తమ జీవనాలను హాయిగా గడపడానికి కావలసినవన్నీ కూర్చిన రాజు నాకు ప్రియుడు.

యతస్త్వమాగతో దుర్గం నిస్తీర్యేహ యదిచ్ఛయా
సర్వం నో బ్రూహ్యగుహ్యం చేత్కిం కార్యం కరవామ తే

మీరు మీ ఇంటినీ రాజ్యాన్ని వదలిపెట్టి ఏమి కావాలని కోరి ఇక్కడకు వచ్చారో రహస్యం కాకుంటే మేము వినదగినవాడిని అనుకుంటే చెప్పండి.

ఏవం సమ్పృష్టసమ్ప్రశ్నో బ్రాహ్మణః పరమేష్ఠినా
లీలాగృహీతదేహేన తస్మై సర్వమవర్ణయత్

ఇలా అడిగితే రుక్మిణిని నీకిచ్చి వివాహం చేయాలని తండ్రీ బంధువులూ అనుకుంటే, అన్న మాత్రం శిశుపాలునికిచ్చి వివాహం చేయగోరితే, ఆమెకు ఏమీ తోచక  నన్ను నీ దగ్గరకు సందేశముతో పంపింది.

ఆమె సందేశాన్ని చెబుతున్నాడు

శ్రీరుక్మిణ్యువాచ
శ్రుత్వా గుణాన్భువనసున్దర శృణ్వతాం తే
నిర్విశ్య కర్ణవివరైర్హరతోऽఙ్గతాపమ్
రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం
త్వయ్యచ్యుతావిశతి చిత్తమపత్రపం మే

చెవుల రంధ్రములోంచి చొరబడి ఇతరులు వర్ణించే నీ ముఖం గురించి వినినందు వలన నా శరీరిక మానసిక తాపములు తొలగిపోతున్నాయి. కనులున్నందుకు లాభం నీ రూపం చూడడమే.
సిగ్గు విడిచి నా మనసు నీ యందే ప్రవేశిస్తూ ఉన్నది.

కా త్వా ముకున్ద మహతీ కులశీలరూప
విద్యావయోద్రవిణధామభిరాత్మతుల్యమ్
ధీరా పతిం కులవతీ న వృణీత కన్యా
కాలే నృసింహ నరలోకమనోऽభిరామమ్

అసలు నిన్ను ఏ రాజ కన్య వరించదు. రాజ కన్య వరించడానికి ఏమేమి కావాలో అవి నీ దగ్గర ఉన్నాయి. కుల శీల రూప విద్య వయో ద్రవిణ ధామ (ఈ ఏడింటినీ సప్త ఆవరణలు, పరమాత్మను జీవాత్మ చేరాలంటే సప్తావరణలు దాటి వెళ్ళాలి)
ఇలాంటి వాటి సమానమైన నిన్ను ఏ కులవతి వరించదు. నీవు మనుష్య లోక మనసునే హరించేవాడవు. అందరి మనసుకూ నీవు అభిరాముడవే

తన్మే భవాన్ఖలు వృతః పతిరఙ్గ జాయామ్
ఆత్మార్పితశ్చ భవతోऽత్ర విభో విధేహి
మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాద్
గోమాయువన్మృగపతేర్బలిమమ్బుజాక్ష

కాబట్టి నేను కూడా నిన్ను భర్తగా వరించాఉ, నన్ను నీవు భార్యగా చేసుకో. వీరుడు పొందే భాగాన్ని పిరిక్వాడైన శిశుపాలుడు పొందకూడదు. సింహం పొందే భాగాన్ని నక్క పొందరానట్లుగా

పూర్తేష్టదత్తనియమవ్రతదేవవిప్ర
గుర్వర్చనాదిభిరలం భగవాన్పరేశః
ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం
గృహ్ణాతు మే న దమఘోషసుతాదయోऽన్యే

పూర్త ఇష్ట నియమ దత్తములు వ్రతములు దేవ విప్ర గురు పూజలతో పరమాత్మ ఐన భగవంతుడు నా చేత త్రికరణ శుద్ధిగా ఆచరించబడి ఉంటే ఆ ఆరాధనతో నీవు ప్రీతి చెందితే నా పాణిగ్రహణం చేయి.
శిశుపాలాదులు కాదు నా పాణి గ్రహణం చేయవలసింది. అది నీవే చేయాలి. నేను అంతటి పుణ్యం చేసి ఉన్నానో లేదో.

శ్వో భావిని త్వమజితోద్వహనే విదర్భాన్
గుప్తః సమేత్య పృతనాపతిభిః పరీతః
నిర్మథ్య చైద్యమగధేన్ద్రబలం ప్రసహ్య
మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కామ్

స్వామీ రేపే నా కళ్యాణం నిశ్చయమైనది. నీవు సైన్యముతో ఇక్కడకు వచ్చి శిశుపాల జరాసంధ బలాన్ని ఓడించి బలవంతముగా రాక్షస వివాహముతో నన్ను వివాహం చేసుకో. నీ బలమే నీవు నాకిచ్చే శుల్కం.

అన్తఃపురాన్తరచరీమనిహత్య బన్ధూన్
త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయమ్
పూర్వేద్యురస్తి మహతీ కులదేవయాత్రా
యస్యాం బహిర్నవవధూర్గిరిజాముపేయాత్

దానికి ఉపాయం నేను చెబుతాను. ప్రాతః కాలమే నేను మా కులదేవి ఐన అంబికను పూజించడానికి వెళతాను. వివాహానికి పూర్వం అక్కడకు వెళ్ళి పూజించాలి. అక్కడకు నీవు రావలసింది

యస్యాఙ్ఘ్రిపఙ్కజరజఃస్నపనం మహాన్తో
వాఞ్ఛన్త్యుమాపతిరివాత్మతమోऽపహత్యై
యర్హ్యమ్బుజాక్ష న లభేయ భవత్ప్రసాదం
జహ్యామసూన్వ్రతకృశాన్శతజన్మభిః స్యాత్

స్వామి ఏ మహానుభావుని యొక్క పాద పరాగాన్ని పవిత్రం చేయడానికి శంకరుని వలే శిరసా ధరిస్తారో, ధరించాలని అనుకుంటారో అటువంటి నీ పాద పరాగాన్ని నా శిరస్సున ధరించకుటే నేను ప్రాణాలతో ఉండజాలను.

బ్రాహ్మణ ఉవాచ
ఇత్యేతే గుహ్యసన్దేశా యదుదేవ మయాహృతాః
విమృశ్య కర్తుం యచ్చాత్ర క్రియతాం తదనన్తరమ్

                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు