Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం

           ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం

గుణానామసమ్మిశ్రాణాం పుమాన్యేన యథా భవేత్
తన్మే పురుషవర్యేదముపధారయ శంసతః

కలియకుండా ఉండే గుణములతో పురుషుడు ఏర్పడతాడా, కలిసి ఉండే గుణాలతో పురుషుడు ఏర్పడతాడా. ఏర్పడితే ఎలా దేనితో ఏర్పడతాడు. దాన్ని నాకు వివరించండి

శ్రీభగవానువాచ
శమో దమస్తితిక్షేక్షా తపః సత్యం దయా స్మృతిః
తుష్టిస్త్యాగోऽస్పృహా శ్రద్ధా హ్రీర్దయాదిః స్వనిర్వృతిః

స్వనిర్వృతిః - తనకు తాను తృప్తి

కామ ఈహా మదస్తృష్ణా స్తమ్భ ఆశీర్భిదా సుఖమ్
మదోత్సాహో యశఃప్రీతిర్హాస్యం వీర్యం బలోద్యమః

క్రోధో లోభోऽనృతం హింసా యాచ్ఞా దమ్భః క్లమః కలిః
శోకమోహౌ విషాదార్తీ నిద్రాశా భీరనుద్యమః

క్లమం - అలసట
కలి - కలహం
అనుద్యమ - ఏ ప్రయత్నం చేయకుండుట

సత్త్వస్య రజసశ్చైతాస్తమసశ్చానుపూర్వశః
వృత్తయో వర్ణితప్రాయాః సన్నిపాతమథో శృణు

ఇపుడు పైన చెప్పిన గుణాలు మూడుభాగాలు చేసుకుని, మొదటి మూడవ భాగం సాత్విక గుణం
రెండవ భాగవం రాజసికం మూడవ భాగం తామసికం
శమ దమ తితీక్షా తపః సత్యం దయా స్మృతిః తుష్టి త్యాగం అస్పృహా శ్రద్ధా హ్రీ దయ స్వనిర్వృతిః - సత్వం
కామ ఈహా మదము తృష్ణా దమ్భ ఆశీర్భిదా సుఖమ్ మదోత్సాహో యశఃప్రీతిర్హాస్యం వీర్యం బలోద్యమః - రాజసం
క్రోధో లోభోऽనృతం హింసా యాచ్ఞా దమ్భః క్లమః కలిః శోకమోహౌ విషాదార్తీ నిద్రాశా భీరనుద్యమః - ఇవి తామసం

ఈ గుణాల గురించి ముందే మనం వివరించి ఉన్నాము.

సన్నిపాతస్త్వహమితి మమేత్యుద్ధవ యా మతిః
వ్యవహారః సన్నిపాతో మనోమాత్రేన్ద్రియాసుభిః

వాటి సన్నిపాతం (కలయికను) వినుము. ఇలా దేనికవి విడిగా ఉన్న స్వరూపాలకు నేనూ నాది అన్న భావన కలయికతో ఏర్పడుతుంది. రజస్తమస్సుల కలయికతో సత్వ రజస్సుల కలయికతో ఏర్పడతాయి
మనసుతో తన్మాత్రములతో ఇంద్రియములతో ప్రాణములతో ఆ స్వరూపం ఏర్పడుతుంది.

ధర్మే చార్థే చ కామే చ యదాసౌ పరినిష్ఠితః
గుణానాం సన్నికర్షోऽయం శ్రద్ధారతిధనావహః

ధర్మార్థ కామాలలో గుణముల సంబంధం శ్రద్ధనూ ప్రీతినీ ధనమునూ కలిగిస్తుంది

ప్రవృత్తిలక్షణే నిష్ఠా పుమాన్యర్హి గృహాశ్రమే
స్వధర్మే చాను తిష్ఠేత గుణానాం సమితిర్హి సా

ఫలమును ఆశించి చేసేదీ (ప్రవృత్తి లక్షణం) ఫలమును వదులుకొని చేసేది అని రెండుగా ఉంటాయి.
ఎవరైనా సరే ఎన్నిటి కలయికలు ఉన్నా, ఎన్ని సంకర్షణలు ఉన్నా వారి స్వధర్మాన్ని వదలరాదు. ఏ గుణములు దేనివో అవి దానితో కలసి మనలో చేరినపుడు మన ప్రవృత్తి సక్రమముగా ఉంటుంది. గుణములలో చాంచల్యము మనలో కూడా చాంచల్యం కలిగిస్తే అది స్వరూపానికి హాని కలిగిస్తుంది.

పురుషం సత్త్వసంయుక్తమనుమీయాచ్ఛమాదిభిః
కామాదిభీ రజోయుక్తం క్రోధాద్యైస్తమసా యుతమ్

మచి వారూ చెడ్డవారు అని వారిలో ఉన్న గుణాలబట్టే గుర్తుపట్టాలి.సాత్విక గుణాలు ఉన్నవారు సాత్వికులు. శమాది గుణములతో సాత్వికుడని, కామాది గుణాలు ఉంటే రాజసుడు అని, క్రోధాదులు ఉంటే తామసుడు అని తెలుసుకోవాలి.

యదా భజతి మాం భక్త్యా నిరపేక్షః స్వకర్మభిః
తం సత్త్వప్రకృతిం విద్యాత్పురుషం స్త్రియమేవ వా

ఈ మూడూ కాక ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఏ గుణాలతో సంబంధం లేదు. భక్తితో నన్ను సేవించేవాడు నాలుగవ రకముకు చెందినవాడు. స్త్రీ ఐనా పురుషుడైనా అటువంటి వాడు సత్వ ప్రకృతి గలవాడు

యదా ఆశిష ఆశాస్య మాం భజేత స్వకర్మభిః
తం రజఃప్రకృతిం విద్యాథింసామాశాస్య తామసమ్

తన కర్మలతో కోరికలు కోరి పూజ చేసేవాడు రజో గుణం కలవాడు. కోరికలు లేకుండా ధర్మం అని పని చేసేవాడు సాత్వికుడు. హింసా ఫలం కోరి చేసేవాడు తామసుడు.

సత్త్వం రజస్తమ ఇతి గుణా జీవస్య నైవ మే
చిత్తజా యైస్తు భూతానాం సజ్జమానో నిబధ్యతే

జీవుడికి ఈ మూడు గుణాలు లేవు. నాకూ లేవు. కానీ జీవుడికి ప్రకృతి సంబంధం వలననే వస్తాయి. ఇవి మనసులో పుట్టేవే. దీని వలననే భూతములు అనీ చిక్కుకుంటాయి.

యదేతరౌ జయేత్సత్త్వం భాస్వరం విశదం శివమ్
తదా సుఖేన యుజ్యేత ధర్మజ్ఞానాదిభిః పుమాన్

సత్వము రజస్తమస్సులను గెలిస్తే, తేజోమయం పరిశుద్ధం మంగళ కరము అయి సుఖముగా ఉంటుంది. సుఖం అంటే ధర్మ జ్ఞ్యానాలతో కలసి ఉండడం.

యదా జయేత్తమః సత్త్వం రజః సఙ్గం భిదా చలమ్
తదా దుఃఖేన యుజ్యేత కర్మణా యశసా శ్రియా

తమాస్సే సత్వ రజస్సులను గెలిస్తే భేధ బుద్ధితో చంచలమైన సంగమును తీసుకున్నవాడు దుఃఖం కలిగించే కర్మతో ప్రవర్స్తిస్తాడు. సంపదా కీర్తీ ఉంటాయి కానీ దాన్ని మించిన దుఃఖం ఉంటుంది.

యదా జయేద్రజః సత్త్వం తమో మూఢం లయం జడమ్
యుజ్యేత శోకమోహాభ్యాం నిద్రయా హింసయాశయా

ఎపుడైతే తమస్సు వీటిని గెలుస్తుందో వాడు శోక మోహముతో ఉంటాడు. నిద్రా హింస ఆశలతో ఉంటాడు

యదా చిత్తం ప్రసీదేత ఇన్ద్రియాణాం చ నిర్వృతిః
దేహేऽభయం మనోऽసఙ్గం తత్సత్త్వం విద్ధి మత్పదమ్

మొత్తం ఇవి త్రిగుణాత్మకములు. చిత్తం ప్రసన్నముగా ఉండి, ఇంద్రియములకు తృప్తి ఏర్పడి శరీరములో భయం లేకుండా మనసు ఎక్కడా సంగం లేకుండా ఉంటే అది సత్వముగా తెలుసుకో

వికుర్వన్క్రియయా చాధీరనివృత్తిశ్చ చేతసామ్
గాత్రాస్వాస్థ్యం మనో భ్రాన్తం రజ ఏతైర్నిశామయ

పనితో వికారమును పొందుతూ, ధైర్యం లేకుండా తృప్తి లేకుండా, శరీరం మాత్రం బాగుండి, మనస్సు భ్రమిస్తూ ఉంటే అది రజో గుణ సంబంధముగా తెలుసుకో

సీదచ్చిత్తం విలీయేత చేతసో గ్రహణేऽక్షమమ్
మనో నష్టం తమో గ్లానిస్తమస్తదుపధారయ

ఎపుడూ నిందా క్రాంతమైన చిత్తం, మనసును తన వశములో లేకుండా ఉండి, అజ్ఞ్యానమూ , అంధకారమూ, అలసటను తమో గుణముగా తెలుసుకో

ఏధమానే గుణే సత్త్వే దేవానాం బలమేధతే
అసురాణాం చ రజసి తమస్యుద్ధవ రక్షసామ్

సత్వ గుణం పెరిగినపుడు దేవతలకు బలం పెరుగుతుంది, రజో గుణం పెరిగితే అసురులకూ, తమో గుణం పెరిగితే రాక్షసులకూ బలం పెరుగుతుంది

సత్త్వాజ్జాగరణం విద్యాద్రజసా స్వప్నమాదిశేత్
ప్రస్వాపం తమసా జన్తోస్తురీయం త్రిషు సన్తతమ్

సత్వ గుణం ఉన్నవారు ఎక్కువగా మేలుకొని ఉంటారు
రజో గుణం ఉన్నవారు ఎక్కువగా కలలు కంటారు
తమో గుణం ఉన్నవారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు
నాలుగవదానికి ఈ మూడిటితో సంగం కలగదు

ఉపర్యుపరి గచ్ఛన్తి సత్త్వేన బ్రాహ్మణా జనాః
తమసాధోऽధ ఆముఖ్యాద్రజసాన్తరచారిణః

సత్వ గుణముతో ఉన్నవారు ఊర్ధ్వ లోకాలకు వెళతారు
రజో గుణముతో ఉన్నవారు మధ్యములో ఉంటారు
తమో గుణము ఉన్నవారు అధో లోకానికి వెళతారు

సత్త్వే ప్రలీనాః స్వర్యాన్తి నరలోకం రజోలయాః
తమోలయాస్తు నిరయం యాన్తి మామేవ నిర్గుణాః

సత్వ గుణం ఉన్నవారు స్వర్గానికీ తమో గుణం ఉన్నవారు నరకానికి వెళతారు
ఏ గుణం లేని వారు నన్ను చేరతారు

మదర్పణం నిష్ఫలం వా సాత్త్వికం నిజకర్మ తత్
రాజసం ఫలసఙ్కల్పం హింసాప్రాయాది తామసమ్

ఫలం ఆశించకుండా పని చేసేవారు సాత్విక కర్మ చేసినవారు
ఫలం కోరి చేస్తే అది రాజసికం
హింస తామసికం

కైవల్యం సాత్త్వికం జ్ఞానం రజో వైకల్పికం చ యత్
ప్రాకృతం తామసం జ్ఞానం మన్నిష్ఠం నిర్గుణం స్మృతమ్

కైవల్య జ్ఞ్యానం సాత్వికం, వైకల్పిక జ్ఞ్యానం రాజసికం
ప్రాకృతి జ్ఞ్యానం తామసం, నా గురించిన జ్ఞ్యానం నిర్గుణం

వనం తు సాత్త్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే
తామసం ద్యూతసదనం మన్నికేతం తు నిర్గుణమ్

వనములో ఉండుట సాత్వికం
గ్రామవాసం రాజసం
జ్యూదం ఆడే ప్రాంతములో నివాసం తామసం
నా ఆలయం నిర్గుణం

సాత్త్వికః కారకోऽసఙ్గీ రాగాన్ధో రాజసః స్మృతః
తామసః స్మృతివిభ్రష్టో నిర్గుణో మదపాశ్రయః

సాత్వికుడు దేనితో సంబధం లేకుండా ఉంటాడు
ప్రేమతో గుడ్డివాడైన వాడు రాజసుడు
తామసుడు అన్నీ మరచిపోయేవాడు.
పరమాత్మను ఆశ్రయించి ఉండుట నిర్గుణం

సాత్త్విక్యాధ్యాత్మికీ శ్రద్ధా కర్మశ్రద్ధా తు రాజసీ
తామస్యధర్మే యా శ్రద్ధా మత్సేవాయాం తు నిర్గుణా

ఆధ్యాత్మిక శ్రద్ధ సత్వగుణం
కర్మల యందు శ్రద్ధ రజోగుణం
అధర్మం యందు శ్రద్ధ తామసం
నా సేవ నిర్గుణం

పథ్యం పూతమనాయస్తమాహార్యం సాత్త్వికం స్మృతమ్
రాజసం చేన్ద్రియప్రేష్ఠం తామసం చార్తిదాశుచి

పవిత్రమైనది, ఆయాసం లేనటువంటిదీ, నలుగురికీ ఉపయోగం కలిగించేది సాత్వికం, ప్రశాంతముగా ఉండేది సాత్వికము
ఇంద్రియములకు ఇంపు అయ్యే వేషం రాజసం (తళుకులు)

సాత్త్వికం సుఖమాత్మోత్థం విషయోత్థం తు రాజసమ్
తామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయమ్

నిరతరం ఆర్తిని కలిగించే అవస్థ తామసం
ఆత్మ జ్ఞ్యానం వలన కలిగేది సాత్వికం
విషయములని అనుభవించుట వలన కలిగేది రాజసికం
మోహముతో దైన్యముతో వచ్చేది తామసం
నన్ను ఆశ్రయిస్తే అది నిర్గుణం

ద్రవ్యం దేశః ఫలం కాలో జ్ఞానం కర్మ చ కారకః
శ్రద్ధావస్థాకృతిర్నిష్ఠా త్రైగుణ్యః సర్వ ఏవ హి

ద్రవ్యమూ దేశమూ ఫలం కాలం జ్ఞ్యానం కర్మా, కారకం శ్రద్ధా అవస్థ, ఆకృతి నిష్ఠా, ఇవన్నీ గుణత్రయముతో కలసి ఉండేవే.

సర్వే గుణమయా భావాః పురుషావ్యక్తధిష్ఠితాః
దృష్టం శ్రుతం అనుధ్యాతం బుద్ధ్యా వా పురుషర్షభ

పురుషుడిలో అవ్యక్తములో ఉండే భావాలన్నీ గుణమయములే. చూచినా విన్నా బుద్ధితో ధ్యానించినా అదే సంసారం. చూచినా విన్నా బుద్ధితో ధ్యానించినా అదే సంసారం. ఒక సారి చూచినా విన్నా సంసారములో పడుతున్నట్లే.  చూడకూడని వాటిని చూడకుండా వినకూడని వాటిని వినకుండా అనకూడని వాటిని అనకుండా ఉంటే సంసారం తగ్గినట్లే.

ఏతాః సంసృతయః పుంసో గుణకర్మనిబన్ధనాః
యేనేమే నిర్జితాః సౌమ్య గుణా జీవేన చిత్తజాః
భక్తియోగేన మన్నిష్ఠో మద్భావాయ ప్రపద్యతే

ఇలా చిత్తములో ఏర్పడిన గుణములను భక్తి యోగముతో ఎవరు గెలుస్తారో వాడు నాకు దగ్గర అవుతాడు

తస్మాద్దేహమిమం లబ్ధ్వా జ్ఞానవిజ్ఞానసమ్భవమ్
గుణసఙ్గం వినిర్ధూయ మాం భజన్తు విచక్షణాః

కాబట్టి, జ్ఞ్యానమునకూ విజ్ఞ్యానమునకూ ఆలవాలం ఐన మానవ శరీరాన్ని పొంది, గుణముల యొక్క సంగాన్ని తోసిపారేసి నన్ను భజించాలి వివేకమున్నవారు.

నిఃసఙ్గో మాం భజేద్విద్వానప్రమత్తో జితేన్ద్రియః
రజస్తమశ్చాభిజయేత్సత్త్వసంసేవయా మునిః

సంసారం యందు సంగతి లేకుండా జ్ఞ్యానం కలిగి పొరబడకుండా ఇంద్రియ జయం కలిగి నన్ను భజించాలి.
సత్వమును సేవిస్తూ రజస్తమస్సులను గెలవాలి.

సత్త్వం చాభిజయేద్యుక్తో నైరపేక్ష్యేణ శాన్తధీః
సమ్పద్యతే గుణైర్ముక్తో జీవో జీవం విహాయ మామ్

తరువాత సత్వాన్ని కూడా వదలాలి. నైరపేక్షముతో సత్వాన్ని గెలవాలి. నిర్గుణుడవు కావాలి.
ఇలా గుణముల నుండి విడుదల ఐన జీవుడు ప్రకృతి సంబంధాన్ని వదలి నన్ను చేరతాడు

జీవో జీవవినిర్ముక్తో గుణైశ్చాశయసమ్భవైః
మయైవ బ్రహ్మణా పూర్ణో న బహిర్నాన్తరశ్చరేత్

మనసులో పుట్టే గుణములతోటి, జీవత్వముతో  విడువబడిన జీవుడు నాతోటే  పరిపూర్ణమవుతాడు. వాడు లోపలా బయటా విచారించడు. ప్రకృతిని దాటుతాడు. ప్రకృతికి అవతల ఉంటాడు.

                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు