Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవైనాలుగవ అధ్యాయం

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవైనాలుగవ అధ్యాయం

అర్తం ఎంతటి అనర్థాన్ని కలిగిస్తుందో అన్న విషయాన్ని బిక్షువు చాలా స్పష్టముగా చెప్పి, దాన్ని యుక్తమైన ధర్మకార్యములకూ దానమునకూ స్వానుభవమునకూ, ఈ మూడిటినుంచీ అర్థాన్ని దూరముగా ఉంచితే జరుగబోయే అనర్థమేమో చెప్పి, మనకు బుద్ధితో కూడిన మనసు అనర్థాలను చింతించుటే అనర్థాలకు కారణం తప్ప, దైవం కాలం వస్తువూ జనులూ గ్రహాలూ కాదు అని వివరించాడు

శ్రీభగవానువాచ

అథ తే సమ్ప్రవక్ష్యామి సాఙ్ఖ్యం పూర్వైర్వినిశ్చితమ్
యద్విజ్ఞాయ పుమాన్సద్యో జహ్యాద్వైకల్పికం భ్రమమ్

ఇపుడు నీకు సాంఖ్యాన్ని చెబుతాను. అది తెలుసుకుంటే అది మనకు ఉండే భ్రమ తొలగిపోతుంది.

ఆసీజ్జ్ఞానమథో అర్థ ఏకమేవావికల్పితమ్
యదా వివేకనిపుణా ఆదౌ కృతయుగేऽయుగే

జ్ఞ్యానమూ అర్థమూ రెండూ ఒకటే, వాటిలో ఎటువంటి తేడా లేదు. కృత యుగములో వివేకముతో నైపుణ్యం పొందినవారు ,

తన్మాయాఫలరూపేణ కేవలం నిర్వికల్పితమ్
వాఙ్మనోऽగోచరం సత్యం ద్విధా సమభవద్బృహత్

ఈ మాయా ఫలరూపముతో కేవలం నిర్వికల్పముగా ఉండే, వాక్కుకూ మనసుకూ అందని సత్యం రెండు రకాలుగా ఉంటుంది.

తయోరేకతరో హ్యర్థః ప్రకృతిః సోభయాత్మికా
జ్ఞానం త్వన్యతమో భావః పురుషః సోऽభిధీయతే

అందులో ఒకటి ప్రకృతి. రెండవది జ్ఞ్యానం. జ్ఞ్యానం అంటే పురుషుడు. ప్రకృతీ పురుషుడు. దీఎనే అర్థమూ  జ్ఞ్యానము అంటున్నారు. అర్థమంటే ప్రకృతి, జ్ఞ్యానం అంటే పురుషుడు.

తమో రజః సత్త్వమితి ప్రకృతేరభవన్గుణాః
మయా ప్రక్షోభ్యమాణాయాః పురుషానుమతేన చ

ప్రకృతికి మూడు గుణాలు , సత్వ రజో తమో గుణాలు.

తేభ్యః సమభవత్సూత్రం మహాన్సూత్రేణ సంయుతః
తతో వికుర్వతో జాతో యోऽహఙ్కారో విమోహనః

అలాంటి ప్రకృతిని నేను క్షోభింపచేస్తాను. దాన్ని పురుషుడు కూడా ఆమోదిస్తాడు. ప్రకృతిని నేను క్షోభించిన తరువాత దాని నుండి సూత్రాత్మ (చతుర్ముఖ  బ్రహ్మ) ఉద్భవిస్తుందు. ఈ సూత్రాన్నే మహత్ తత్వం అంటాము. ప్రకృతినుండి పుట్టిన ఈ సూత్రం నుంచి అహంకార తత్వం పుట్టింది.
ఈ అహంకారమే మనను మోహింపచేస్తుంది.

వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రివృత్
తన్మాత్రేన్ద్రియమనసాం కారణం చిదచిన్మయః

ఈ అహంకారం మూడు రకాలు. సాత్విక రాజసిక తామసిక అహంకారం.
తన్మాత్రం ఇంద్రియములు మనసు. మనసు సాత్విక, ఇంద్రియములు రాజసిక, తన్మాత్రలు తామస అహంకారం నుండీ పుట్టాయి

అర్థస్తన్మాత్రికాజ్జజ్ఞే తామసాదిన్ద్రియాణి చ
తైజసాద్దేవతా ఆసన్నేకాదశ చ వైకృతాత్

ఈ అర్థం తామస అహంకారం నుండే పుట్టింది. ఇంద్రియములు రాజస అహంకారం నుండి పుడతాయి,
సాత్విక అహంకారం నుండి పదకొండు ఇంద్రియాలకు పదకొండు ఇంద్రియ అదిష్ఠాన దేవతలు కలుగుతారు.

మయా సఞ్చోదితా భావాః సర్వే సంహత్యకారిణః
అణ్డముత్పాదయామాసుర్మమాయతనముత్తమమ్

ఇలా తన్మాత్రలూ జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియములూ పంచభూతములు. వీటిని కలిపితే బ్రహ్మాండం అవుతుంది.
అండం అంటే అది నా నివాసనం (ఆయతనం)
మనసూ జ్ఞ్యానేంద్రియములూ కర్మేంద్రియములూ పంచ భూతములూ పంచ తన్మాత్రలు. ఇవన్నీ కలిపి అండోత్పాదనకు కారణమయ్యింది. ఆ అండమే నా ఆయతనం.

తస్మిన్నహం సమభవమణ్డే సలిలసంస్థితౌ
మమ నాభ్యామభూత్పద్మం విశ్వాఖ్యం తత్ర చాత్మభూః

ఆ బ్రహ్మాండములో, నీటిలో నేను పుడతాను. నా నాభినుండి పద్మం ఉధ్భవించింది. ఆ పద్మమే పధ్నాలుగు భువనాలకు ప్రతీక. ప్రపంచమే పద్మం రూపములో వచ్చింది. ఆ పద్మములో బ్రహ్మ పుట్టాడు.

సోऽసృజత్తపసా యుక్తో రజసా మదనుగ్రహాత్
లోకాన్సపాలాన్విశ్వాత్మా భూర్భువః స్వరితి త్రిధా

ఆయన నా అనుగ్రహముతో తపస్సు చేసి, రజో గుణాన్ని స్వీకరించి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు
అన్ని లోకములనూ లోక పాలకులనూ, భూః భువ@ సువః అనే లోకాలను సృష్టించాడు

దేవానామోక ఆసీత్స్వర్భూతానాం చ భువః పదమ్
మర్త్యాదీనాం చ భూర్లోకః సిద్ధానాం త్రితయాత్పరమ్

దేవతలకు స్వర్గమూ , మానవులకు భూలోకము, ఇతర భూతములకు భువర్లోకము.
ఈ మూడిటికంటే పరమైనది ఐన జనో తపో లోకములో సిద్ధులు ఉంటారు

అధోऽసురాణాం నాగానాం భూమేరోకోऽసృజత్ప్రభుః
త్రిలోక్యాం గతయః సర్వాః కర్మణాం త్రిగుణాత్మనామ్

భూమి కంటే కింద అసురులూ నాగులూ ఉంటారు.
మూడులోకములో ఉండే వారికి ఆచరించే కర్మలు త్రిగుణాత్మకములు. సత్వ రజస్తమో గుణాత్మకముగా ఉంటాయి

యోగస్య తపసశ్చైవ న్యాసస్య గతయోऽమలాః
మహర్జనస్తపః సత్యం భక్తియోగస్య మద్గతిః

ఈ స్వరూపాలలో యోగమూ తపస్సూ న్యాసమూ , ఈ మూడు విధానములూ పరిశుద్ధములు
మహః జనః తపః సత్యం, ఈ నాలుగు భక్తి యోగానికి నా నివాసాన్నీ స్వరూపాన్నీ బోధించేవి

మయా కాలాత్మనా ధాత్రా కర్మయుక్తమిదం జగత్
గుణప్రవాహ ఏతస్మిన్నున్మజ్జతి నిమజ్జతి

ఇలా చెప్పిన లోకాలన్నీ నేనే కాలాత్మకునిగా సృష్టించి నిర్వహిస్తున్నాను
అపుడు ఈ జగత్తు అంతా కర్మ యుతం అవుతుంది. నేనే ఆయా ప్రాణుల చేత ఆయా కర్మలు చేయిస్తూ ఉంటాను.
సత్వ రజ తమ అనే మూడు గుణాల ప్రవాహములో ఒక సారి మునుగుతుంది, ఒక సారి తేలుతుంది. ఇలా సంచరిస్తూ ఉంటుంది

అణుర్బృహత్కృశః స్థూలో యో యో భావః ప్రసిధ్యతి
సర్వోऽప్యుభయసంయుక్తః ప్రకృత్యా పురుషేణ చ

చిన్న పెద్దా, సన్నా లావూ పొడుగూ పొట్టీ అని ఏ ఏ భావాలతో వ్యవహరిస్తారో, వ్యవహారానికి యోగ్యమైన, వ్యవహరించబడే ప్రతీ భావం, ప్రకృతి పురుషులతో కలిసే ఉంటుంది. కేవల ప్రకృతితో కేవల పురుషునితో ఉండదు. ప్రకృతీ పురుషుడూ రెండూ కలిసే ఉంటారు.

యస్తు యస్యాదిరన్తశ్చ స వై మధ్యం చ తస్య సన్
వికారో వ్యవహారార్థో యథా తైజసపార్థివాః

మనం ఆదీ, అంతమూ అని దేన్ని చెప్పుకుంటున్నామో , ఈ ఆదో అది మధ్య, ఆదే అంతమవుతునిద్, అంతమే మధ్యా అవుతుంది. అంతటా నేనే ఉన్నాను కాబట్టి, అంతము మధ్యలోకి రావొచ్చు ఆదీ మధ్యలోకి రావొచ్చు.
మనం ఏ ఏ భావాలను వికారాలను చెప్పుకుంటున్నామో, ఆ రాజస తామస వికారాలన్నీ వ్యవహారాథమే. వికారాలన్నీ వ్యవహారం కోసమే.

యదుపాదాయ పూర్వస్తు భావో వికురుతేऽపరమ్
ఆదిరన్తో యదా యస్య తత్సత్యమభిధీయతే

మొదలు ఉన్నది తరువాత ఉన్నదాన్ని మార్పు చేస్తుంది. బాలుడూ కుమారుడూ యువకుడు అని చెబుతున్నది ఒకే వ్యక్తి గురించి. మొదలు వచ్చేది తరువాత వచ్చేదాన్ని మారుస్తుంది.మొదలు ఉన్నదాన్ని ఆది అంటున్నాము. మారినదాన్ని చివరిది అంటున్నాము. ఈ మార్పుకూ ఆ మార్పుకూ తటస్థముగా ఉన్నదన్ని మధ్య అంటున్నాము.

ప్రకృతిర్యస్యోపాదానమాధారః పురుషః పరః
సతోऽభివ్యఞ్జకః కాలో బ్రహ్మ తత్త్రితయం త్వహమ్

ఇలాంటి వికారానికీ ప్రవాహానికీ ప్రకృతే ఉపాదానం. మూల కారణం ప్రకృతి. ప్రకృతికి ఆధారం పురుషుడు. కాలం ఉన్నదాన్ని తెలియజేస్తుంది. పిల్లవాడూ యువకుడూ వృద్ధుడూ బాలుడు అని వ్యవహరించడానికి కాలమే కారణం. ఏది ఉన్నదో దాన్ని తెలిపేది కాలం.
ఇలా ప్రకృతీ పురుషుడూ కాలం అనే మూడూ నేనే. ప్రకృతీ పురుషుడూ కాలం లేదా ప్రకృతీ పురుషుడూ బ్రహ్మా, ఇది నేనే

సర్గః ప్రవర్తతే తావత్పౌర్వాపర్యేణ నిత్యశః
మహాన్గుణవిసర్గార్థః స్థిత్యన్తో యావదీక్షణమ్

ఇలా ఒకటి ముందు ఒకటి వెనక అనే భేధముతో ప్రతీ క్షణమూ సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఈ దేహము ప్రతీ క్షణమూ మారుతూ ఉంటుంది. నిత్యమూ సృష్టి జరుగుతూనే ఉంటుంది.
మహత్ తత్వం గానీ ప్రకృతి తత్వం గానీ, గుణములను సృష్టి చేస్తుంది. మన సంకల్పం ఎంత వరకు ఉంటుందో దాన్నే స్థితి అంటాము. మొదటిది సృష్టి, తరువాతది స్థితి (ఉనికి)

విరాణ్మయాసాద్యమానో లోకకల్పవికల్పకః
పఞ్చత్వాయ విశేషాయ కల్పతే భువనైః సహ

ఇలా నేనే వీటిని పూంచబడేవే. సృష్టీ స్థితీ ఆది మధ్య స్వరూపమూ వికారం అవస్థలూ, ఇవన్నీ నా చేత ప్పంచబడేవి. లోకములో ఉండే అన్ని రకముల వికల్పములూ నా చేత చేయబడేవే.
అన్ని లోకములతో కలసి జీవుల ఉనికి కొరకు నివాసం కొరకు, స్వస్వరూప ఆవిర్భావం కొరకు , గుణముల యొక్క సృష్టి కోసం అన్ని లోకాలతో ఇది ఏర్పడుతుంది.

అన్నే ప్రలీయతే మర్త్యమన్నం ధానాసు లీయతే
ధానా భూమౌ ప్రలీయన్తే భూమిర్గన్ధే ప్రలీయతే

మరణ శీలమైన ప్రతీ వస్తువూ అన్నములో ఉంటుంది (మనం వచ్చేది కూడా అన్నం నుండే).
అన్నములో అన్నీ లీనమవుతాయి, అన్నం ధాన్యములో, ధాన్యము భూమిలో, భూమి గంధములో,

అప్సు ప్రలీయతే గన్ధ ఆపశ్చ స్వగుణే రసే
లీయతే జ్యోతిషి రసో జ్యోతీ రూపే ప్రలీయతే

గంధము జలములో, జలము తేజస్సులో తేజస్సు రసములో, రసము వాయువులో, వాయువు స్పర్శలో, స్పర్శ ఆకాశములో, ఆకాశము శబ్దములో, శబ్దము ఇంద్రియములో

రూపం వాయౌ స చ స్పర్శే లీయతే సోऽపి చామ్బరే
అమ్బరం శబ్దతన్మాత్ర ఇన్ద్రియాణి స్వయోనిషు

యోనిర్వైకారికే సౌమ్య లీయతే మనసీశ్వరే
శబ్దో భూతాదిమప్యేతి భూతాదిర్మహతి ప్రభుః

ఇలా ఆయా ఇంద్రియాలు ఏ ఇంద్రియం దేనినుండి వచ్చిందో దానిలో ఆ ఇంద్రియం లీనమవుతుంది.
త్వగ్ ఇంద్రియం వాయువులో
ఘ్రాణం భూమిలో
రసనేంద్రియం జలములో
శ్రోత్రేంద్రియం ఆకాశములో

స లీయతే మహాన్స్వేషు గుణేసు గుణవత్తమః
తేऽవ్యక్తే సమ్ప్రలీయన్తే తత్కాలే లీయతేऽవ్యయే

మనస్తత్వం అనేది సాత్విక అహంకారములో
సాత్విక అహంకారం మనసులో , మనసు మహత్ తత్వములో
మహత్ తత్వం ప్రకృతి తత్వములో
శబ్దము భూతాది (తామస అహంకారములో)
తామస అహంకారం మత్తులో
మహత్తు తమ తమ గుణాలలో (ప్రకృతిలో)
ప్రకృతి అవ్యక్త్యములో
అవ్యక్తము కాలములో
కాలము జీవునిలో
జీవుడు పరమాత్మలో లీనమవుతాడు

కాలో మాయామయే జీవే జీవ ఆత్మని మయ్యజే
ఆత్మా కేవల ఆత్మస్థో వికల్పాపాయలక్షణః

ఒక్క ఆత్మ మాత్రం ఆత్మలోనే ఉంటుండి. ఈ వికారాలేమీ ఆత్మకు ఉండవు

ఏవమన్వీక్షమాణస్య కథం వైకల్పికో భ్రమః
మనసో హృది తిష్ఠేత వ్యోమ్నీవార్కోదయే తమః

ఇంత స్పష్టముగా ఉంటే ఇందులో మనకు శ్రమ కలుగడానికి, వికల్పం ఏర్పడడానికి కారణం ఎక్కడ కనపడుతోంది.
సూర్యుడు ఆకాశములో ఉదయిస్తున్నాడు అన్నట్లుగా మనసు హృదయములో ఆవిర్భవిస్తుంది.

ఏష సాఙ్ఖ్యవిధిః ప్రోక్తః సంశయగ్రన్థిభేదనః
ప్రతిలోమానులోమాభ్యాం పరావరదృశ మయా

దీనినే సాంఖ్య విధి. ఇది అన్ని సంశయాలు అనే చిక్కు ముడులను తొలగిస్తుంది.
ఏది ముందు, ఏది కారనం ఏది కార్యం దేనినుండి ఏది వచ్చి, ఏది పూర్వం ఏది అపరం ఏది ఆది ఏది అంతం అనే అన్ని రకాల ప్రశ్నలకూ సమాధానం చెబుతుంది సాంఖ్యం.
పరమాత్మ నుండి కాలం, కాలం నుండి ప్రకృతి,ప్రకృతినుండి మహత్, మహత్ నుండి అహంకారం, మనసూ ఇంద్రియములూ పంచభూతములు జ్ఞ్యానేంద్రియములూ కర్మేంద్రియములూ భువన కోశమూ, ఇలా చెప్పవచ్చు.
లేదా భువన కోశం నుండి మొదలుపెట్టి వెనక్కు పరమాత్మ వరకూ వెళ్ళవచ్చు. పరమాత్మ నుండి జగత్తుదాకా రావచ్చు, జగత్తునుండి పరమాత్మ వరకూ కూడా రవచ్చు.


                                                సర్వం శ్రీకృష్ణార్పణమస్తు