Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

              ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీబాదరాయణిరువాచ
స ఏవమాశంసిత ఉద్ధవేన భాగవతముఖ్యేన దాశార్హముఖ్యః
సభాజయన్భృత్యవచో ముకున్దస్తమాబభాషే శ్రవణీయవీర్యః

ఉద్ధవుడి చేత అడుగబడిన కృష్ణుడు, ఉద్ధవుని మాటను మన్నించి వినదగిన పరాక్రమం గలిగిన కృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
బార్హస్పత్య స నాస్త్యత్ర సాధుర్వై దుర్జనేరితైః
దురక్తైర్భిన్నమాత్మానం యః సమాధాతుమీశ్వరః

బృహస్పతి శిష్యుడా, నీవు అడిగినది నిజమే, దుర్మార్గులతో పలుకబడిన నింద వాక్యాలు విని "ఇది నా శరీరానికే గానీ ఆత్మకు " అది వివేచించుకునేవారు దుర్లభం.

న తథా తప్యతే విద్ధః పుమాన్బాణైస్తు మర్మగైః
యథా తుదన్తి మర్మస్థా హ్యసతాం పరుషేషవః

ఆయుధములతో కొట్టబడినా అంత బాధ ఉండదు.దుర్మార్గుల యొక్క పరుష వాక్యములు బాధించినట్లుగా మామూలు బాణములు బాధించవు

కథయన్తి మహత్పుణ్యమితిహాసమిహోద్ధవ
తమహం వర్ణయిష్యామి నిబోధ సుసమాహితః

ఈ విషయములో ఒక కథ ఉంది సావధానముగా విను

కేనచిద్భిక్షుణా గీతం పరిభూతేన దుర్జనైః
స్మరతా ధృతియుక్తేన విపాకం నిజకర్మణామ్

దుర్మార్గుల చేత అవమానించబడిన సన్యాసి చెప్పిన మాటలు చెబుతున్నాను
ధరియమూ జ్ఞ్యానమూ ఉన్నా వాడు అన్న మాటలు తలచుకుంటూ కర్మ వశుడైనాడు

అవన్తిషు ద్విజః కశ్చిదాసీదాఢ్యతమః శ్రియా
వార్తావృత్తిః కదర్యస్తు కామీ లుబ్ధోऽతికోపనః

ఒక శ్రీమంతుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు, మహా పిసినారి, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. మహా పిసినారి, కోరిక బాగా ఉన్నవాడు, మహా కోపి

జ్ఞాతయోऽతిథయస్తస్య వాఙ్మాత్రేణాపి నార్చితాః
శూన్యావసథ ఆత్మాపి కాలే కామైరనర్చితః

బంధ్వులను కానీ అన్యులను గానీ కనీసం నోటితో కూడా ఆదరించలేదు. మాటతో కూడా ఎవరినీ మన్నించలేదు
ఎవరూ లేని  ఇంటిలో వాడు అలాగే ఉన్నాడు. తన శరీరానికి కూడా కావలసిన కోరికలను తీర్చుకోలేదు
తానూ తినలేదు, పక్కవారికీ పెట్టలేదు.

దుహ్శీలస్య కదర్యస్య ద్రుహ్యన్తే పుత్రబాన్ధవాః
దారా దుహితరో భృత్యా విషణ్ణా నాచరన్ప్రియమ్

బంధు మిత్రులందరూ అతన్ని దూరముగా ఉంచారు
పుత్రులూ భార్యలూ కూడా బాధపడ్డారు

తస్యైవం యక్షవిత్తస్య చ్యుతస్యోభయలోకతః
ధర్మకామవిహీనస్య చుక్రుధుః పఞ్చభాగినః

ఇలా ఇహమునుంచీ పరమునుంచీ  భ్రష్టుడయ్యాడు
ఐదుగురు భాగస్థులూ కోపించారు
(దేవతలూ పితృ దేవతలూ ఋషులూ భూతములూ అదితులు)

తదవధ్యానవిస్రస్త పుణ్యస్కన్ధస్య భూరిద
అర్థోऽప్యగచ్ఛన్నిధనం బహ్వాయాసపరిశ్రమః

ఎంతో కష్టపడి, ఇబ్బంది పడి సంపాదించిన డబ్బు కూడా అతన్ని వదలి పోయింది
నపుంసకున్ని యువతి వదలిపెట్టినట్లు అనుభవించని వాడిని ఆస్థి కూడా వదిలిపెడుతుంది

జ్ఞాత్యో జగృహుః కిఞ్చిత్కిఞ్చిద్దస్యవ ఉద్ధవ
దైవతః కాలతః కిఞ్చిద్బ్రహ్మబన్ధోర్నృపార్థివాత్

వాడు ఇవ్వకున్నా పాలెవాళ్ళు మొత్తమూ లాక్కున్నారు
కొంత దొంగలు తీసుకున్నారు
కాలవశమై ఇల్లు పోయింది, కొంత ఆస్థి బంధువుల వలనా రాజుల వలనా పోయింది

స ఏవం ద్రవిణే నష్టే ధర్మకామవివర్జితః
ఉపేక్షితశ్చ స్వజనైశ్చిన్తామాప దురత్యయామ్

డబ్బు పోయింది, వాడు ఉన్నపుడు ఎటువంటి ధర్మమూ ఆచరించలేదు కాబట్టి వాడికి డబ్బు పోయిన తరువాత ఎవరూ ఆదరించలేదు

తస్యైవం ధ్యాయతో దీర్ఘం నష్టరాయస్తపస్వినః
ఖిద్యతో బాష్పకణ్ఠస్య నిర్వేదః సుమహానభూత్

అప్పుడు వాడికి వైరాగ్యం పుట్టి, అనవసరముగా నేను ఇంత బాధపడ్డాను

స చాహేదమహో కష్టం వృథాత్మా మేऽనుతాపితః
న ధర్మాయ న కామాయ యస్యార్థాయాస ఈదృశః

ధర్మానికీ కామానికీ పనికారలేదు నా డబ్బు

ప్రాయేణాథాః కదర్యాణాం న సుఖాయ కదాచన
ఇహ చాత్మోపతాపాయ మృతస్య నరకాయ చ

పిసినారులు సంపాదించిన ధనం, ధర్మానికీ కామానికీ సుఖానికీ పనికి రాదు
అలాంటి పిసినారి ధనం వలన ఇహలోకములో మనసుకు బాధ పరలోకములో నరకము వస్తుంది

యశో యశస్వినాం శుద్ధం శ్లాఘ్యా యే గుణినాం గుణాః
లోభః స్వల్పోऽపి తాన్హన్తి శ్విత్రో రూపమివేప్సితమ్

గుణవంతుల గుణములు మాత్రమే శ్లాఘ్యములు.
ఉత్తమ గుణాలన్నిటినీ లోభం నాశం చేస్తుంది. ఎంత పెద్ద సౌందర్యాన్నాఇన కుష్టువ్యాధి పోగొట్టినట్లుగా, ఎన్ని మంచి గుణాలనైనా లోభం హరించి వేస్తుంది. లోభి ధనం ధర్మానికీ కామానికీ సుఖానికీ కాదు.

అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే
నాశోపభోగ ఆయాసస్త్రాసశ్చిన్తా భ్రమో నృణామ్

ధనాన్ని సంపాదిస్తాము, కూడపెట్టి పెంచి కాపాడి ఖర్చు పెడతాము. ఇవేమీ చేసినా చేయకున్నా నాశం మాత్రం తప్పదు
ఆ నాశం భోగం వలనైనా వస్తుంది, అనుభవించకున్నా నశిస్తుంది.
సంపాదించడానికీ కాపాడడానికీ ఖర్చుపెట్టడానికీ అంతటికీ ఆయాసమే. ధనము యొక్క ఏ స్థితిలో ఐనా ఆయాసమూ చింతా నాశమూ భ్రమా తప్పవు.
1) నాశ ఉపభోగం 2) ఆయాసం 3) చింత 4) భ్రమ

స్తేయం హింసానృతం దమ్భః కామః క్రోధః స్మయో మదః
భేదో వైరమవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ

ఈ తొమ్మిదీ మానవుడికి ఉండే వ్యసనాలు
1) దొంగతనమూ 2) హింస 3) అబద్దమూ 4) కపటము 5) కామము 6) క్రోధమూ 7) గర్వము 8) మదమూ 9) భేదబుద్ధి 10) ద్వేషమూ 11) అవిశ్వాసము

పైనాలుగూ వీటితో కలుపుకుంటే పదహేను అయ్యాయి. పంచ దశ అనర్థాలు. ఇవి అర్థముతో వస్తాయి. ఇన్ని అనర్థాలు ఉంటే దానిని అర్థం అని ఎలా అనడము. ఇది అర్థం అనే అనర్థం

ఏతే పఞ్చదశానర్థా హ్యర్థమూలా మతా నృణామ్
తస్మాదనర్థమర్థాఖ్యం శ్రేయోऽర్థీ దూరతస్త్యజేత్

శ్రేయస్సు కావాలి అనుకునేవారు దీన్ని విడిచిపెట్టాలి

భిద్యన్తే భ్రాతరో దారాః పితరః సుహృదస్తథా
ఏకాస్నిగ్ధాః కాకిణినా సద్యః సర్వేऽరయః కృతాః

సోదరులూ భార్యలూ తండ్రులూ మిత్రులూ, ఒక చిలీ గవ్వతో పుత్రులూ మిత్రులూ సుహృత్తులూ అందరూ శత్రువులు అవుతారు

అర్థేనాల్పీయసా హ్యేతే సంరబ్ధా దీప్తమన్యవః
త్యజన్త్యాశు స్పృధో ఘ్నన్తి సహసోత్సృజ్య సౌహృదమ్

కొద్ది డబ్బుతో వీరందరూ కోపించి, కోపాన్ని బాగా పెంచుకుంటారు
స్నేహాన్నీ ప్రీతినీ వదిలిపెడతారు

లబ్ధ్వా జన్మామరప్రార్థ్యం మానుష్యం తద్ద్విజాగ్ర్యతామ్
తదనాదృత్య యే స్వార్థం ఘ్నన్తి యాన్త్యశుభాం గతిమ్

దేవతలు కూడా ప్రార్థించే మానవ జన్మను పొంది, ఆ మానవ జన్మలో బ్రాహ్మణత్వాన్ని పొంది, ఆ బ్రాహ్మణ జన్మలో శ్రేష్టత్వాన్ని పొంది, ఇలా మానుష్యాన్నీ బ్రాహ్మణత్వానీ ఉత్తమత్వాన్నీ ఆలోచించకుండా స్వార్థముతో తననుతాను హత్య చేసుకునేవాడు అశుభాన్ని పొందుతాడు
ఈ మానవ జన్మ మళ్ళీ రాకపోవచ్చు

స్వర్గాపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్
ద్రవిణే కోऽనుషజ్జేత మర్త్యోऽనర్థస్య ధామని

స్వర్గానికి వెళ్ళాలన్నా మోక్షానికి వెళ్ళాలన్నా ఈ మానవ జన్మ, ఈ భూలోకమే సాధనం.
అది పొందీ అనర్థాలకు నిలయమైన డబ్బు కోసం ఎవడు ఆశపడతాడు.

దేవర్షిపితృభూతాని జ్ఞాతీన్బన్ధూంశ్చ భాగినః
అసంవిభజ్య చాత్మానం యక్షవిత్తః పతత్యధః

నీకు పరమాత్మ ధనాన్ని ప్రసాదిస్తే దాన్ని దేవతలకూ ఋషులకూ పితృదేవతలకూ భూతములకూ బంధువులకూ జ్ఞ్యాతులకూ మిగతావారికి విభజించకుండా నీవు మాత్రమే దాచుకుంటే నీవు అధఃపతనమవుతావు

వ్యర్థయార్థేహయా విత్తం ప్రమత్తస్య వయో బలమ్
కుశలా యేన సిధ్యన్తి జరఠః కిం ను సాధయే

ప్రయోజనం లేని డబ్బు మీది ఆశతో సంపాదించిన విత్తం, తన శరీరముతో ఆచరించవలసిన పనులను చేయకుండా ఉండే మదముతో ఉండే వయస్సు, మదించిన బలమూ, ఇలాంటివి ఉన్నవాడు, ఇవన్నీ దేనితో లభిస్తాయో దాన్ని తెలియకుండా వ్యర్థుడు వృద్ధుడై అన్నిటిలో పతనమైపోతాడు. వృద్ధుడికి శరీరమూ బలమూ పని చేయదు. మత్తు ఉన్నవాడికి బలమూ పని చేయదు. వృద్ధాప్యం వస్తే ధనమూ పని చేయదు.

కస్మాత్సఙ్క్లిశ్యతే విద్వాన్వ్యర్థయార్థేహయాసకృత్
కస్యచిన్మాయయా నూనం లోకోऽయం సువిమోహితః

ఒక సారి మోహపడితే అర్థం ఉంది కానీ పండితుడు కూడా ఎందుకూ పనికిరాని డబ్బు గురించి ఎందుకు బాధపడుతున్నాడు
పరమాత్మ మాయతో ఈ లోకం బాగా మోహించబడుతున్నది

కిం ధనైర్ధనదైర్వా కిం కామైర్వా కామదైరుత
మృత్యునా గ్రస్యమానస్య కర్మభిర్వోత జన్మదైః

ధనము ఇచ్చే ధనాన్ని కానీ కోరికలిచ్చే కోరికలతో గానీ, మరణాన్ని మింగే వాడికి జనంలిచ్చే కర్మలెందుకు?
మళ్ళీ పుట్టుకలేకుండా ఉండే పనులు చేయాలి కానీ, మళ్ళీ జన్మలిచ్చే పనులెందుకు. మృత్యువునిచ్చే జన్మ ఎందుకు. మృత్యువు మింగే కర్మలతో ఏమి ప్రయోజనం.

నూనం మే భగవాంస్తుష్టః సర్వదేవమయో హరిః
యేన నీతో దశామేతాం నిర్వేదశ్చాత్మనః ప్లవః

భగవంతుడు నా మీద కృపతో ధనాన్ని మొత్తం పోగొట్టాడు, లేకుంటే నాకు ఇలాంటి జ్ఞ్యానం ఆలోచనా రాదు. ఆత్మ తరించడానికి చక్కని పడవ ఈ వైరాగ్యం.
(మొదలు అన్నీ ఉన్నపుడు నా అంత వాడు లేడు అనుకున్నవాడు, అన్నీ పోయిన తరువా ఇలా అంటున్నాడు)

సోऽహం కాలావశేషేణ శోషయిష్యేऽఙ్గమాత్మనః
అప్రమత్తోऽఖిలస్వార్థే యది స్యాత్సిద్ధ ఆత్మని

మిగిలిన కాలాన్ని ఈ శరీరాన్ని ఇలాగే గడుపుతాను; పొరబాటున కూడా వేరే స్వార్థాలను భావించను. ఈ సంకల్పాన్ని దేవతలందరూ ఆమోదించెదరు గాక

తత్ర మామనుమోదేరన్దేవాస్త్రిభువనేశ్వరాః
ముహూర్తేన బ్రహ్మలోకం ఖట్వాఙ్గః సమసాధయత్

ఖట్వాంగుడు ఒక ముహూర్తములో మోక్షం సాధించాడు. నేను కూడా ఇలాగే చేస్తా అనుకున్నాడు

శ్రీభగవానువాచ
ఇత్యభిప్రేత్య మనసా హ్యావన్త్యో ద్విజసత్తమః
ఉన్ముచ్య హృదయగ్రన్థీన్శాన్తో భిక్షురభూన్మునిః

ఇలా అనుకుని అన్నీ వదలిపెట్టి శాంతుడై బిక్షుకుడై, భూమండలాన్ని మనసును ప్రాణాయామముతో నిగ్రహించుకుని అన్ని గ్రామాలూ సంచరిస్తూ ఎవరూ చూడకుండా బయలు దేరాడు

స చచార మహీమేతాం సంయతాత్మేన్ద్రియానిలః
భిక్షార్థం నగరగ్రామానసఙ్గోऽలక్షితోऽవిశత్

తం వై ప్రవయసం భిక్షుమవధూతమసజ్జనాః
దృష్ట్వా పర్యభవన్భద్ర బహ్వీభిః పరిభూతిభిః

ఏమీ కోరుకోకుండా ఇలా ఉన్న వాడిని చూచినవారు, అంతకు ముందు వాడు ఆచరించిన ఆచారలన్నీ చూచిన చుట్టుపక్కల వార్లంతా రకరకాల అవమానాలు చేసారు.

కేచిత్త్రివేణుం జగృహురేకే పాత్రం కమణ్డలుమ్
పీఠం చైకేऽక్షసూత్రం చ కన్థాం చీరాణి కేచన
ప్రదాయ చ పునస్తాని దర్శితాన్యాదదుర్మునేః

ఒకరు త్రిదండాన్ని తీసుకున్నారు
ఒకరు బిక్షా పాత్రను తీసుకున్నారు
ఒకరు పీఠాన్ని, ఒకరు కమండలాన్ని, ఒకరు జపమాలను, కొందరు ఆసనాన్ని కొందరు చీరవాసాన్ని
ఇస్తున్నారు తీసుకు పోతున్నారు

అన్నం చ భైక్ష్యసమ్పన్నం భుఞ్జానస్య సరిత్తటే
మూత్రయన్తి చ పాపిష్ఠాః ష్ఠీవన్త్యస్య చ మూర్ధని

వాడు అన్నం తింటూ ఉంటే వాడి భోజనములో మూత్రం చేసారు
ఉమ్మ్మి వేసారు
ఐనా వాడేమి మాట్లాడలేదు

యతవాచం వాచయన్తి తాడయన్తి న వక్తి చేత్
తర్జయన్త్యపరే వాగ్భిః స్తేనోऽయమితి వాదినః
బధ్నన్తి రజ్జ్వా తం కేచిద్బధ్యతాం బధ్యతామితి

వాడిని అన్ని రకాల మాటలూ అన్నారు, మాట్లాడకుంటే కొడుతున్నారు
బెదిరిస్తున్నారు. దొంగవేషాలేస్తున్నాడు శిక్షిస్తున్నారు, తాడుతో కట్టేసారు
కొందరు వీడిని కొట్టండి బంధించండి,చంపండీ అంటున్నారు

క్షిపన్త్యేకేऽవజానన్త ఏష ధర్మధ్వజః శఠః
క్షీణవిత్త ఇమాం వృత్తిమగ్రహీత్స్వజనోజ్ఝితః

కొందరు నిందిస్తునారు, కొందరు అవమానిస్తున్నారు
ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు కనపడుతున్న వంచకుడు వీడు అంటున్నారు

అహో ఏష మహాసారో ధృతిమాన్గిరిరాడివ
మౌనేన సాధయత్యర్థం బకవద్దృఢనిశ్చయః

డబ్బంతా పోయింది కాబట్టి వీడు ఈ వృత్తిని తీసుకున్నాడు, తనవారందరూ విడిచిపెట్టారు.
ఆహా మనం ఎంత చేస్తున్నా ఎంత ఓపిక వీడికి అని అవహేళన చేస్తున్నారు.

ఇత్యేకే విహసన్త్యేనమేకే దుర్వాతయన్తి చ
తం బబన్ధుర్నిరురుధుర్యథా క్రీడనకం ద్విజమ్

మనమిన్ని అంటున్నా కొంగలాగ దొంగ జపం చేస్తూ మౌనముతో అన్నీ సాధిస్తున్నాడు

ఏవం స భౌతికం దుఃఖం దైవికం దైహికం చ యత్
భోక్తవ్యమాత్మనో దిష్టం ప్రాప్తం ప్రాప్తమబుధ్యత

ఇలా నవ్వుతున్నారు, నిందిస్తున్నారు, కట్టేస్తున్నారు, కొడుతున్నారు. నిరోధిస్తున్నారు. ఆటలాడుకుంటున్నారు.

భౌతిక దుఃఖమూ, దైవిక దుఃఖము, దైహిక దుఃఖమూ, అన్నిటినీ అనుభవిస్తూ వాడికి భగవంతుడు ఇచ్చాడని భావిస్తూ ఉన్నాడు

పరిభూత ఇమాం గాథామగాయత నరాధమైః
పాతయద్భిః స్వ ధర్మస్థో ధృతిమాస్థాయ సాత్త్వికీమ్

ఇన్ని రకాలుగా అవమానాలు పొందిన అతడు, ధరియాన్ని కూడగట్టుకుని తన జీవిత అనుభవ సారాన్ని ఇలా పాడాడు

ద్విజ ఉవాచ
నాయం జనో మే సుఖదుఃఖహేతుర్న దేవతాత్మా గ్రహకర్మకాలాః
మనః పరం కారణమామనన్తి సంసారచక్రం పరివర్తయేద్యత్

దీన్ని బిక్షు గీతము అంటారు:
నన్ను మీరంత కష్టపెడుతున్నారు.సుఖానికీ దుఃఖానికీ మీరు కారణం కాదు. గ్రహములూ కానీ కర్మ కానీ కాలం కానీ మనసు కానీ కారణం కాదు. సంసార చక్రములో తిప్పుతున్న మనసు కూడా కారణం కాదు

మనో గుణాన్వై సృజతే బలీయస్తతశ్చ కర్మాణి విలక్షణాని
శుక్లాని కృష్ణాన్యథ లోహితాని తేభ్యః సవర్ణాః సృతయో భవన్తి

మనస్సు గుణాలను సృష్టిస్తుంది. ఆ సత్వాది గుణములతో సాత్వికములూ తామసములూ రాజసములు ఐన పనులు చేస్తూ ఉంటాము

అనీహ ఆత్మా మనసా సమీహతా హిరణ్మయో మత్సఖ ఉద్విచష్టే
మనః స్వలిఙ్గం పరిగృహ్య కామాన్జుషన్నిబద్ధో గుణసఙ్గతోऽసౌ

చేయబడిన కర్మలతో సమానమైన జన్మలు వస్తాయి.
ఏ కోరికా లేకుండా ఉన్నవాడు పరమాత్మ. ఈ మనసు తన శరీరాన్ని తీసుకుని ఆయా కామములను అనుభవిస్తుంది; గుణములతో సంగం ఉండుట వలనే మనసు బందించబడుతుంది.

దానం స్వధర్మో నియమో యమశ్చ శ్రుతం చ కర్మాణి చ సద్వ్రతాని
సర్వే మనోనిగ్రహలక్షణాన్తాః పరో హి యోగో మనసః సమాధిః

దానం ధర్మం నియమం యమమూ శాస్త్రం కర్మలూ సద్వ్రతములూ అన్నీ మనమాచరించాలి అనుకునేవన్నీ మనో నిగ్రహముంటేనే కలుగుతాయి. యోగం అంటే మనసును పరమాత్మను ఉంచుటే.

సమాహితం యస్య మనః ప్రశాన్తం దానాదిభిః కిం వద తస్య కృత్యమ్
అసంయతం యస్య మనో వినశ్యద్దానాదిభిశ్చేదపరం కిమేభిః

పరమాత్మ యందు ఉంచిన మనసు ప్రశాంతముగా ఉంటుంది. అపుడు వారికి దానాదుల వలన అవసరం ఉండదు . లేనిచో నిగ్రహం లేని వారు దానాలు చేసినా పనికిరాదు.

మనోవశేऽన్యే హ్యభవన్స్మ దేవా మనశ్చ నాన్యస్య వశం సమేతి
భీష్మో హి దేవః సహసః సహీయాన్యుఞ్జ్యాద్వశే తం స హి దేవదేవః

ఎంత గొప్పదంటే మనసు, దేవతలు కూడా మనసుకు వశం అయ్యారు. మనసు మాత్రం ఎవరికీ వశం కాదు.
ఇంతమందిలో ఒక్క బీష్ముడే దేవదేవుడయ్యాడు. ఎందుచేతనంటే మనసును అదుపులో ఉంచుకున్నాడు. ఎంతటి వాడినైనా వశములో ఉంచుకుని నరకాది ఆపదలు కల్పిస్తుంది మనసు. దాన్ని వశములో ఉంచుకుంటే మంచి పనులు చేయిస్తుంది. అందుచే బీష్ముడు దేవ దేవుడయ్యాడు. మనసును అదుపులో ఉంచుకునేవాడే దేవదేవుడు.

తమ్దుర్జయం శత్రుమసహ్యవేగమరున్తుదం తన్న విజిత్య కేచిత్
కుర్వన్త్యసద్విగ్రహమత్ర మర్త్యైర్మిత్రాణ్యుదాసీనరిపూన్విమూఢాః

మనసు జయించలేని శత్రువు. ఆపలేని వేగం కలది మనసు. మర్మములను బాధిస్తుంది. ఇలాంటి మనసును గెలవకుండా ఎవరూ ఏమీ చేయలేరు.
వీరు మిత్రులనీ వారు శత్రువులనీ వారు ఉదాసీనులనీ అభిప్రాయాలు మూర్ఖులై మనసును జయించలేక అనుకుంటున్నారు

దేహం మనోమాత్రమిమం గృహీత్వా మమాహమిత్యన్ధధియో మనుష్యాః
ఏషోऽహమన్యోऽయమితి భ్రమేణ దురన్తపారే తమసి భ్రమన్తి

దేహం మనోమయము. ఇలాంటి దేహాన్ని అహంకార మమకారాలతో గుడ్డివారైన మానవులు వాడు వేరూ నేను వేరు, అనే భావాలతో అంతులేని అజ్ఞ్యానములో తిరుగుతూ ఉంటారు.

జనస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనశ్చాత్ర హి భౌమయోస్తత్
జిహ్వాం క్వచిత్సన్దశతి స్వదద్భిస్తద్వేదనాయాం కతమాయ కుప్యేత్

(ఇలాంటి వాడు మనం అనుభవించే కష్ట సుఖాలకు ఎవరెవరు కారణం అనుకుంటున్నామో వారు ఎందుకు కారణమో ఇక్కడ చెప్పబడుతుంది)
సుఖ దుఃఖములకు జనకులు కారణం ఐతే - ఈ శరీరం పాంచభౌతికం. ఇది మనం అనుకుంటే వచ్చింది కాదు
మనము మననే అప్పుడప్పుడు మన పళ్ళతో మన నాలుకనే కొరుక్కుంటాము. కొరుక్కుంటే బాధపెడుతుంది. దానికి ఎవరిని తిట్టగలం. సుఖ దుఃఖాలకు జనకుడు కారణం అనుకుంటే దీనికి ఎవరిని తిట్టాలి.

దుఃఖస్య హేతుర్యది దేవతాస్తు కిమాత్మనస్తత్ర వికారయోస్తత్
యదఙ్గమఙ్గేన నిహన్యతే క్వచిత్క్రుధ్యేత కస్మై పురుషః స్వదేహే

దేవతలు బాధపెడుతున్నారు అందామంటే దేవతలు కూడా ఆత్మ వికారమే కదా.
ఒకడు తన శరీరాన్ని తానే నరుక్కుంటునాడు , అదీ దేవతలు చేసినదేనా
దానికి ఎవరిని కోప్పడతావు

ఆత్మా యది స్యాత్సుఖదుఃఖహేతుః కిమన్యతస్తత్ర నిజస్వభావః
న హ్యాత్మనోऽన్యద్యది తన్మృషా స్యాత్క్రుధ్యేత కస్మాన్న సుఖం న దుఃఖమ్

నీ సుఖ దుఃఖాలకు నీవే కారణం అనుకుంటే ఇతరులతో ఏమి పని ఉంది?
ఆత్మ కంటే భిన్నమైనదంతా అబద్దం అంటే సుఖమూ దుఃఖమూ నీవలననే కలుగుతుందా? ఇతరుల వలన కలుగుతుందా.. ఆత్మ కన్నా భిన్నమైనది ఏదీ లేనప్పుడు దుఃఖానికీ సుఖానికీ ఆత్మే కారణమా?

గ్రహా నిమిత్తం సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనోऽజస్య జనస్య తే వై
గ్రహైర్గ్రహస్యైవ వదన్తి పీడాం క్రుధ్యేత కస్మై పురుషస్తతోऽన్యః

లేక గ్రహాలు కారణం అందామా? పుట్టుక లేని ఆత్మను గ్రహాలు ఏమి చేస్తారు. నీవు వారు మిత్రులా శత్రువులా? ఆత్మకు పుట్టుక లేకపోతే శత్రువులూ మిత్రులూ ఎలా ఉంటారు. పుట్టుకలేని ఆత్మకూ దేవతలకూ ఏమిటి సంబంధం.
గ్రహాలే వాటిలో అవి కొట్టుకుంటాయి. మరి వారు నినేమి బాధిస్తారు. గ్రహాల దుఃఖానికి ఎవరు బాధ్యులు.

కర్మాస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనస్తద్ధి జడాజడత్వే
దేహస్త్వచిత్పురుషోऽయం సుపర్ణః క్రుధ్యేత కస్మై న హి కర్మ మూలమ్

ఒక వేళ కర్మలే కారణం అనుకుంటే మనమందరం ఎందుకు,జడమూ అజడం అంటున్నాము.
శరీరం అంటే జ్ఞ్యానం లేనిది. పురుషుడు జ్ఞ్యానమున్నవాడు. మరి కర్మ ఎవరు చేస్తున్నట్లు. జ్ఞ్యానం ఉన్న శరీరమా? జ్ఞ్యానం లేని ఆత్మా?

కాలస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనస్తత్ర తదాత్మకోऽసౌ
నాగ్నేర్హి తాపో న హిమస్య తత్స్యాత్క్రుధ్యేత కస్మై న పరస్య ద్వన్ద్వమ్

ఇది కాదు, కాలం అనుకుంటే, అందరూ కాలాత్మకమే కదా. అందరూ కాలాత్మకమే ఐనపుడు కాలం కారణం ఎలా అవుతుంది.
కాలమే బాధిస్తుంది అంటే అగ్ని కాల్చకూడదు మంచు చల్లగా ఉండకూడదు.

న కేనచిత్క్వాపి కథఞ్చనాస్య ద్వన్ద్వోపరాగః పరతః పరస్య
యథాహమః సంసృతిరూపిణః స్యాదేవం ప్రబుద్ధో న బిభేతి భూతైః

కాబట్టి దేనితో గానీ ఎక్కడా కానీ, ఏ విధముగా గానీ ద్వంద్వ సంబంధం, సుఖమూ దుఃఖమూ లాభం నష్టం శీతం ఉష్ణమూ జయం అపజయమూ అనేది ఎక్కడా ఉండదు.
సంసరించే అహం బుద్ధికే తప్ప, ఎవరికీ బాధలు ఉండవు. దేహాత్మాభిమానమే అన్ని బాధలకూ మూలం
ఈ విషయం తెలుసుకున్నవాడు దేనికీ ఎప్పుడూ ఎవరికీ భయపడడు

ఏతాం స ఆస్థాయ పరాత్మనిష్ఠామధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః
అహం తరిష్యామి దురన్తపారం తమో ముకున్దాఙ్ఘ్రినిషేవయైవ

ఇలా తనకంటే ప్రాచీనులైన ఉత్తములైన జ్ఞ్యానులైన మహర్షులతో బోధించబడిన దీన్ని అవలంబించి పరమాత్మ యొక్క పాద పద్మ సేవతో ఈ సంసారాన్ని దాటుతాను అని నిశ్చయించుకున్నాడు

శ్రీభగవానువాచ
నిర్విద్య నష్టద్రవిణే గతక్లమః ప్రవ్రజ్య గాం పర్యటమాన ఇత్థమ్
నిరాకృతోऽసద్భిరపి స్వధర్మాదకమ్పితోऽమూం మునిరాహ గాథామ్

డబ్బు పోయింది, విరక్తి వచ్చింది, శ్రమా తొలగిపోయింది, భూమి అంతా తిరుగుతూ దుర్మార్గుల చేత నిరాదరించబడుతూ  కూడా, ఇలాంటివన్నీ చూస్తూ ఈ గాధను చెబుతున్నాడు

సుఖదుఃఖప్రదో నాన్యః పురుషస్యాత్మవిభ్రమః
మిత్రోదాసీనరిపవః సంసారస్తమసః కృతః

జీవుడికి సుఖమూ దుఃఖమూ ఎవరో ఇచ్చేది కాదు, ఆత్మ భ్రమే ఇస్తుంది
సంసారం అనేది అజ్ఞ్యానం వలననే లభిస్తుంది
దానిలో ఆత్మ  భ్రమే సుఖమైనా దుఃఖమైనా ఇస్తుంది

తస్మాత్సర్వాత్మనా తాత నిగృహాణ మనో ధియా
మయ్యావేశితయా యుక్త ఏతావాన్యోగసఙ్గ్రహః

అందు చేత అన్ని విధాలా బుద్ధితో మనసును నిగ్రహించి, నాయందు ఉంచిన బుద్ధితో మనసును గెలుచుటే యోగ సంగ్రహం

య ఏతాం భిక్షుణా గీతాం బ్రహ్మనిష్ఠాం సమాహితః
ధారయఞ్ఛ్రావయఞ్ఛృణ్వన్ద్వన్ద్వైర్నైవాభిభూయతే

ఈ బిక్షుకుడు చెప్పిన బ్రహ్మ నిష్ఠను సావధానముతో వినిపిస్తూ వింటూ చదువుతూ ఉన్నవాడు సుఖ ధఃఖాది ద్వంద్వములతో పరిభ్రమించబడడు.


                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు