Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ముప్పయ్యవ అధ్యాయం


       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ముప్పయ్యవ అధ్యాయం

శ్రీరాజోవాచ
తతో మహాభాగవత ఉద్ధవే నిర్గతే వనమ్
ద్వారవత్యాం కిమకరోద్భగవాన్భూతభావనః

ఇలా ఉద్ధవుడు అరణ్యానికి వెళ్ళిన తరువాత ద్వారకలో కృష్ణుడు ఏమి చేసాడు

బ్రహ్మశాపోపసంసృష్టే స్వకులే యాదవర్షభః
ప్రేయసీం సర్వనేత్రాణాం తనుం స కథమత్యజత్

బ్రహ్మ శాపముతో యాదవులందరూ తొలగిపోయిన తరువాత సకల లోక నేత్రములకు ప్రియమును కలిగించే తన దివ్యమంగళ తనువును స్వామి ఎలా విడిచిపెట్టాడు

ప్రత్యాక్రష్టుం నయనమబలా యత్ర లగ్నం న శేకుః
కర్ణావిష్టం న సరతి తతో యత్సతామాత్మలగ్నమ్
యచ్ఛ్రీర్వాచాం జనయతి రతిం కిం ను మానం కవీనాం
దృష్ట్వా జిష్ణోర్యుధి రథగతం యచ్చ తత్సామ్యమీయుః

స్త్రీలు తమ నేత్రాలను ఎక్కడనుంచి వెనక్కు తిప్పుకోలేకపోయారో
చెవులలో పడి ఆత్మలో లగ్నమైన ఎలాంటి మహాపురుషున్ని విడిచిపెట్టలేకపోతున్నారో
వినేవారికి వాక్కులకూ శోభను కలిస్తుందో, కవులందరికీ ఏది ప్రమాణమో,
కురుపాండవ సంగ్రామములో అర్జనునికి సారధిగా ఉన్నాడు. యుద్ధములో మరణించేవారందరికీ మోక్షం కలిగించడానికి, తనను చూస్తూ మరణించేటుల్గా చేసి వారికి మోక్షాన్ని ఇచ్చాడు

శ్రీ ఋషిరువాచ
దివి భువ్యన్తరిక్షే చ మహోత్పాతాన్సముత్థితాన్
దృష్ట్వాసీనాన్సుధర్మాయాం కృష్ణః ప్రాహ యదూనిదమ్

ఇలా భూలోకములో స్వర్గలోకములో ఉత్పాతాలను చూచి సుధర్మలో కృష్ణుడి కూర్చుని తన చుట్టూ ఉన్న యాదవులతో ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
ఏతే ఘోరా మహోత్పాతా ద్వార్వత్యాం యమకేతవః
ముహూర్తమపి న స్థేయమత్ర నో యదుపుఙ్గవాః

ఈ ఉత్పాతాలన్నీ మృత్యువును సూచిస్తున్నాయి. మీరందరూ ఇక్కడ ఒక ముహూర్తకాలం కూడ ఉండరాదు

స్త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ శఙ్ఖోద్ధారం వ్రజన్త్వితః
వయం ప్రభాసం యాస్యామో యత్ర ప్రత్యక్సరస్వతీ

శంకోద్ధార ప్రదేశానికి స్త్రీలూ బాలురూ వృద్ధులూ వెళ్తారు
మనమందరూ ప్రభాస తీర్థానికి వెళదాము, సరస్వతి అక్కడ ఉంటుంది.
కృష్ణ పరమాత్మ ఎక్కడకు వెళ్ళి పాంచజన్యుని చంపి శంఖాన్ని తీసుకు వచ్చాడో అది శంకోద్ధారం

తత్రాభిషిచ్య శుచయ ఉపోష్య సుసమాహితాః
దేవతాః పూజయిష్యామః స్నపనాలేపనార్హణైః

ప్రభాసానికి వెళ్ళి ధూప దీప స్నానాలతో దేవతలను పూజించి

బ్రాహ్మణాంస్తు మహాభాగాన్కృతస్వస్త్యయనా వయమ్
గోభూహిరణ్యవాసోభిర్గజాశ్వరథవేశ్మభిః

బ్రాహ్మణులకు గోవులూ భూములూ హిరణ్యాలూ అశ్వములూ ఇల్లూ ఇచ్చి వారిని పూజిద్దాము

విధిరేష హ్యరిష్టఘ్నో మఙ్గలాయనముత్తమమ్
దేవద్విజగవాం పూజా భూతేషు పరమో భవః

అరిష్టం కలుగబోతున్నపుడు గోవులనూ దేవతలనూ బ్రాహ్మణులనూ పూజించుట, దానాదులతో వారికి తృప్తిని కలిగించుటే మార్గం.
దేవ ద్విజ గోపూజ ప్రణులకు ఉత్తం వృద్ధిని ఇస్తుంది

ఇతి సర్వే సమాకర్ణ్య యదువృద్ధా మధుద్విషః
తథేతి నౌభిరుత్తీర్య ప్రభాసం ప్రయయూ రథైః

స్వామి చెప్పిన దాన్ని విని అందరూ పడవలు తీసుకుని ప్రభాసానికి బయలుదేరారు

తస్మిన్భగవతాదిష్టం యదుదేవేన యాదవాః
చక్రుః పరమయా భక్త్యా సర్వశ్రేయోపబృంహితమ్

పరమాత్మ చెప్పినట్లుగా అన్ని శ్రేయస్సులనూ ఇచ్చే ఆ పూజను వారు చేసి

తతస్తస్మిన్మహాపానం పపుర్మైరేయకం మధు
దిష్టవిభ్రంశితధియో యద్ద్రవైర్భ్రశ్యతే మతిః

అందరికీ దానాదులు చేసి, బ్రాహ్మణులు వెళ్ళిపోయిన తరువాత,
అందరూ కలసి యదేచ్చగా మద్యపానం చేసారు
ఈ ద్రవముతో వారి బుద్ధి కాస్తా పాడయ్యింది. దానికి తోడు వీరి బుద్ధిని దైవం కూడా పోగొట్టింది

మహాపానాభిమత్తానాం వీరాణాం దృప్తచేతసామ్
కృష్ణమాయావిమూఢానాం సఙ్ఘర్షః సుమహానభూత్

మహాపానముతో మదం కలిగి బాగా గర్వించి, కృష్ణ మాయతో విమూఢులై పరస్పరం ఘర్షించుకుని

యుయుధుః క్రోధసంరబ్ధా వేలాయామాతతాయినః
ధనుర్భిరసిభిర్భల్లైర్గదాభిస్తోమరర్ష్టిభిః

కోపముతో పరస్పరం మహాఘోరముగా శత్రువులులా యుద్ధం చేసారు
ధనువులు ఖడ్గాలు పల్లములూ గదలు తోమరాలు ఏది దొరికితే అది

పతత్పతాకై రథకుఞ్జరాదిభిః ఖరోష్ట్రగోభిర్మహిషైర్నరైరపి
మిథః సమేత్యాశ్వతరైః సుదుర్మదా న్యహన్శరైర్దద్భిరివ ద్విపా వనే

రథములతో ఏనుగులతో, ఒకరొకరు కలసి, ఏనుగులు దంతములతో ఒకదాన్ని ఎలా కలసి కొట్టుకుంటాయో అలా కొట్టుకున్నారు

ప్రద్యుమ్నసామ్బౌ యుధి రూఢమత్సరావ్
అక్రూరభోజావనిరుద్ధసాత్యకీ
సుభద్రసఙ్గ్రామజితౌ సుదారుణౌ
గదౌ సుమిత్రాసురథౌ సమీయతుః

ప్రద్యుమ్న సాంబులు, అకౄర భోజులు, అనిరుద్ధ సాత్యకీ,

అన్యే చ యే వై నిశఠోల్ముకాదయః సహస్రజిచ్ఛతజిద్భానుముఖ్యాః
అన్యోన్యమాసాద్య మదాన్ధకారితా జఘ్నుర్ముకున్దేన విమోహితా భృశమ్

కొందరు దివిటీలతో, ఇలా కృష్ణుని కుమారులందరూ మదముతో ఒకరితో ఒకరు కలహించుకున్నారు, పరమాత్మచేత మోహించబడి

దాశార్హవృష్ణ్యన్ధకభోజసాత్వతా
మధ్వర్బుదా మాథురశూరసేనాః
విసర్జనాః కుకురాః కున్తయశ్చ
మిథస్తు జఘ్నుః సువిసృజ్య సౌహృదమ్

స్నేహాన్నీ ప్రీతినీ విడిచిపెట్టి కొడుకులు తండ్రులతో, అన్నలు తమ్ములతో మేనల్లులు మేనమామలతో
మనవళ్ళు తాతలతో పినతండ్రులూ, మేనమామలూ మిత్రులూ సుహృత్తులూ జ్ఞ్యాతులూ  బంధువ్లూ, ఇలా ఏదీ చూడక పరమ మూఢులై కొట్టుకున్నారు

పుత్రా అయుధ్యన్పితృభిర్భ్రాతృభిశ్చ
స్వస్రీయదౌహిత్రపితృవ్యమాతులైః
మిత్రాణి మిత్రైః సుహృదః సుహృద్భిర్
జ్ఞాతీంస్త్వహన్జ్ఞాతయ ఏవ మూఢాః

శరేషు హీయమాషు భజ్యమానేసు ధన్వసు
శస్త్రేషు క్షీయమానేషు ముష్టిభిర్జహ్రురేరకాః

శరాలు ఐపోయాయి , ధనువులు విరిగిపోయాయి
అపుడు ముష్ఠి యుద్ధం చేసారు,
ముసలం ఒడ్డుకు వచ్చి తుంగగా పెరిగింది. ఆ తుంగలే వజ్రాయుధాలయ్యాయి. వజ్రాలలా పని చేసాయి

తా వజ్రకల్పా హ్యభవన్పరిఘా ముష్టినా భృతాః
జఘ్నుర్ద్విషస్తైః కృష్ణేన వార్యమాణాస్తు తం చ తే

కృష్ణుడు కొట్టుకోవద్దని వారిస్తూ ఉన్నాడు

ప్రత్యనీకం మన్యమానా బలభద్రం చ మోహితాః
హన్తుం కృతధియో రాజన్నాపన్నా ఆతతాయినః

ఐనా కృష్ణున్నే శత్రువుగా భావించి బలరామ కృష్ణుల మీదకే వచ్చారు

అథ తావపి సఙ్క్రుద్ధావుద్యమ్య కురునన్దన
ఏరకాముష్టిపరిఘౌ చరన్తౌ జఘ్నతుర్యుధి

కృష్ణున్నే చంపడానికి వస్తే వారిద్దరూ కూడా ఆయుధాలు తీసుకుని కొందరిని హతమార్చారు

బ్రహ్మశాపోపసృష్టానాం కృష్ణమాయావృతాత్మనామ్
స్పర్ధాక్రోధః క్షయం నిన్యే వైణవోऽగ్నిర్యథా వనమ్

బ్రాహ్మణ శాపముతో కృష్ణుని వలన మోహముచే, ఈ వైరము వెదురుబొంగులో పుట్టిన అగ్ని కాల్చినట్లుగా ఈ వైరం అందరినీ క్షీణింపచేసింది

ఏవం నష్టేషు సర్వేషు కులేషు స్వేషు కేశవః
అవతారితో భువో భార ఇతి మేనేऽవశేషితః

తనవారందరూ నశించిన తరువాత బరువు తగ్గింది అనుకున్నాడు

రామః సముద్రవేలాయాం యోగమాస్థాయ పౌరుషమ్
తత్యాజ లోకం మానుష్యం సంయోజ్యాత్మానమాత్మని

బలరాముడు, సముద్రములోకి ప్రవేశించి యోగాన్ని తీసుకుని ఆత్మను ఆత్మలో లీనం చేసి తన శరీరాన్ని విడిచిపెట్టాడు

రామనిర్యాణమాలోక్య భగవాన్దేవకీసుతః
నిషసాద ధరోపస్థే తుష్ణీమాసాద్య పిప్పలమ్

ఇలా బలరాముని నిర్యాణాన్ని చూచిన దేవకీ సుతుడు, ఒక పిప్పళ వృక్షాన్ని ఆనుకుని స్వామి భూమి మీదనే వెనక్కు ఒరిగినట్లు ఉన్నాడు

బిభ్రచ్చతుర్భుజం రూపం భ్రాయిష్ణు ప్రభయా స్వయా
దిశో వితిమిరాః కుర్వన్విధూమ ఇవ పావకః

నాలుగు భుజాల రూపాన్ని ధరించి, తన కాంతితో అంతటా ప్రకాశిస్తూ
అన్ని దిక్కుల చీకట్లూ తొలగిస్తూ

శ్రీవత్సాఙ్కం ఘనశ్యామం తప్తహాటకవర్చసమ్
కౌశేయామ్బరయుగ్మేన పరివీతం సుమఙ్గలమ్

సున్దరస్మితవక్త్రాబ్జం నీలకున్తలమణ్డితమ్
పుణ్డరీకాభిరామాక్షం స్ఫురన్మకరకుణ్డలమ్

శ్రీవత్సమూ మొదలైన్వాటితో

కటిసూత్రబ్రహ్మసూత్ర కిరీటకటకాఙ్గదైః
హారనూపురముద్రాభిః కౌస్తుభేన విరాజితమ్

వనమాలాపరీతాఙ్గం మూర్తిమద్భిర్నిజాయుధైః
కృత్వోరౌ దక్షిణే పాదమాసీనం పఙ్కజారుణమ్

అనేక ఆభరణాలతో, ఆకారాలు దాల్చిన ఆయుధాలతో,
కుడి తొడ మీద పద్మం లాంటి ఎడమపాదాన్ని ఉంచాడు

ముషలావశేషాయఃఖణ్డ కృతేషుర్లుబ్ధకో జరా
మృగాస్యాకారం తచ్చరణం వివ్యాధ మృగశఙ్కయా

ఆ చెట్టు వెనక్కు ఒరిగి కూర్చున్నాడు
ఆ పాదం పద్మములా ఎర్రగా ఉంటే దాన్ని చూచి లేడి యొక్క తల లాగ భావించి
ఏ రోకలి యొక్క ఇనుప ముక్క బాణముగా మారి చేప మింగితే, ఆ చేప నుంచి ఆ బాణాన్ని తీసుకున్న వేటగాడు, స్వామి చరణాన్ని బాణముతో కొట్టాడు.

చతుర్భుజం తం పురుషం దృష్ట్వా స కృతకిల్బిషః
భీతః పపాత శిరసా పాదయోరసురద్విషః

పరిగెత్తుకు రాగానే చతుర్భుజుడైన స్వామిని చూచి "అయ్యో తప్పు చేసానే " అని భయపడి స్వామి పాదాల మీద పడ్డాడు

అజానతా కృతమిదం పాపేన మధుసూదన
క్షన్తుమర్హసి పాపస్య ఉత్తమఃశ్లోక మేऽనఘ

తెలియక ఇంత పాపం చేసాను
నా పాపాన్ని క్షమించు మహానుభావా

యస్యానుస్మరణం నృణామజ్ఞానధ్వాన్తనాశనమ్
వదన్తి తస్య తే విష్ణో మయాసాధు కృతం ప్రభో

నీ స్మరణ అన్ని అజ్ఞ్యానాలనూ పోగొడుతుంది
అలాంటి నీకు ఈ చెడు పని చేసాను

తన్మాశు జహి వైకుణ్ఠ పాప్మానం మృగలుబ్ధకమ్
యథా పునరహం త్వేవం న కుర్యాం సదతిక్రమమ్

స్వామీ మళ్ళీ ఇలాంటి అపచారం సాధు జనులకు చేయకుండా ఉండేలా నన్ను సంహరించు

యస్యాత్మయోగరచితం న విదుర్విరిఞ్చో
రుద్రాదయోऽస్య తనయాః పతయో గిరాం యే
త్వన్మాయయా పిహితదృష్టయ ఏతదఞ్జః
కిం తస్య తే వయమసద్గతయో గృణీమః

బ్రహ్మాదులు కూడా నీ ఆత్మ యోగాన్ని తెలియరు
రుద్రాదులూ ఆయన పుత్రులూ వాగ్పతులూ, నిన్ను తెలియలేరు
బ్రహ్మాదులు నీ మాయతో కనులు మూసుకు పోయి ఉన్నపుడు అలాంటిది దుష్టబుద్ధులమైన మేమెంత
మేమేమి మాట్లాడగలము

శ్రీభగవానువాచ
మా భైర్జరే త్వముత్తిష్ఠ కామ ఏష కృతో హి మే
యాహి త్వం మదనుజ్ఞాతః స్వర్గం సుకృతినాం పదమ్

భయపడకు, లే.
ఇది నా సంకల్పమే. నీవు కొట్టలేదు
పుణ్యాత్ములు వెళ్ళే స్వర్గానికి వెళ్ళు , నేను ఆజ్ఞ్యాపిస్తున్నాను

ఇత్యాదిష్టో భగవతా కృష్ణేనేచ్ఛాశరీరిణా
త్రిః పరిక్రమ్య తం నత్వా విమానేన దివం యయౌ

ఇలా సంకల్పముతో శరీరం తెచ్చుకున్న స్వామితో ఆజ్ఞ్యాపించబడి, ఆయన చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి, వచ్చిన దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు

దారుకః కృష్ణపదవీమన్విచ్ఛన్నధిగమ్య తామ్
వాయుం తులసికామోదమాఘ్రాయాభిముఖం యయౌ

ఇంతలో ఈ కోట్లాటను చూచిన కృష్ణ సారధి వెతుక్కుంటూ వచ్చి స్వామిని చూచాడు
తులసితో నిండిన గాలి వాసన వలన అక్కడకు వచ్చాడు దారుకుడు

తం తత్ర తిగ్మద్యుభిరాయుధైర్వృతం
హ్యశ్వత్థమూలే కృతకేతనం పతిమ్
స్నేహప్లుతాత్మా నిపపాత పాదయో
రథాదవప్లుత్య సబాష్పలోచనః

అశ్వద్ధ మూలములో ఉన్న స్వామిని చూచి
కళ్ళ వెంబడి నీరు రాగా స్నేహముతో రథం మీద నుండి దూకి
కాళ్ళ మీద పడ్డాడు

అపశ్యతస్త్వచ్చరణామ్బుజం ప్రభో దృష్టిః ప్రణష్టా తమసి ప్రవిష్టా
దిశో న జానే న లభే చ శాన్తిం యథా నిశాయాముడుపే ప్రణష్టే

మీ పాద పద్మాలు చూడకుంటే మా కళ్ళు పోయి చీకటిలో పడి దిక్కు తెలియక ఉన్నాము
శాతిని పొందలేము. చంద్రుడు లేని రాత్రిలో ఏమీ కనపడనట్లుగా నీవు లేకపోతే మేము ఏదీ చూడలేము

ఇతి బ్రువతి సూతే వై రథో గరుడలాఞ్ఛనః
ఖముత్పపాత రాజేన్ద్ర సాశ్వధ్వజ ఉదీక్షతః

ఇలా సారధి చెబుతూ ఉండగా గరుడ రథం అందరూ చూస్తుండగానే ఎగిరి వెళ్ళిపోయింది

తమన్వగచ్ఛన్దివ్యాని విష్ణుప్రహరణాని చ
తేనాతివిస్మితాత్మానం సూతమాహ జనార్దనః

ఆ రథం వెంటనే పరమాత్మ యొక్క శంఖమూ గదా చక్రమూ శాంఖమూ వెళ్ళిపోయాయి
అవి అన్నీ చూస్తూ పరమాశ్చర్యం పొందుతున్న సారధితో ఇలా అన్నాడు

గచ్ఛ ద్వారవతీం సూత జ్ఞాతీనాం నిధనం మిథః
సఙ్కర్షణస్య నిర్యాణం బన్ధుభ్యో బ్రూహి మద్దశామ్

నీవు ద్వారకకు వెళ్ళు, జ్ఞ్యాతులందరూ పోయారు
బలరాముని నిధనం అయ్యింది అని చెప్పు

ద్వారకాయాం చ న స్థేయం భవద్భిశ్చ స్వబన్ధుభిః
మయా త్యక్తాం యదుపురీం సముద్రః ప్లావయిష్యతి

నేను విడిచిన ద్వారకాపురిని సముద్రం ముంచివేస్తుంది

స్వం స్వం పరిగ్రహం సర్వే ఆదాయ పితరౌ చ నః
అర్జునేనావితాః సర్వ ఇన్ద్రప్రస్థం గమిష్యథ

అందరూ వారి వారిని తీసుకుని మా తల్లి తండ్రులనూ తీసుకుని
అర్జనుడితో కాపాడబడుతూ ఇంద్రప్రస్థానికి వెళ్ళండి

త్వం తు మద్ధర్మమాస్థాయ జ్ఞాననిష్ఠ ఉపేక్షకః
మన్మాయారచితామేతాం విజ్ఞయోపశమం వ్రజ

నీవు నా ధర్మాన్ని అనుసరించి జ్ఞ్యానం కలవాడవై
ఇదంతా నా మాయ వలన ఏర్పడింది అని తెలుసుకుని శాంతిని పొందు

ఇత్యుక్తస్తం పరిక్రమ్య నమస్కృత్య పునః పునః
తత్పాదౌ శీర్ష్ణ్యుపాధాయ దుర్మనాః ప్రయయౌ పురీమ్

ఇలా చెబితే సారధి నమస్కరించి, మాటి మాటికీ నమస్కరించి
స్వామి పాదాలను శిరస్సున ఉంచుకుని, దుఃఖిస్తూ ద్వారకా పురానికి వెళ్ళాడు.

                                                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు