Pages

Thursday, 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదిహేనవ అధ్యాయం

       
      ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీభగవానువాచ
జితేన్ద్రియస్య యుక్తస్య జితశ్వాసస్య యోగినః
మయి ధారయతశ్చేత ఉపతిష్ఠన్తి సిద్ధయః

పరమాత్మ యందు మాత్రమే మనసు లగ్నం చేయడం అలవాటైతే, ఇంద్రియ జయం కలిగి, శ్వాసను గెలిస్తే, ప్రపంచములో ఉన్న ఇతర శక్తులు ఆ మనసును తమ వైపు లాగుకోవడానికి ప్రయత్నిస్తాయి. కోరకున్నా కొన్ని సిద్ధులు వచ్చి చేరతాయి. భగవంతున్ని మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటే అనుకోకుండా చాలా సిద్ధులు వచ్చి చేరతాయి.

ఇంద్రియనిగ్రహం ప్రాణనిగ్రహం గలిగి నాయందే మనసు ఉంచిన సిద్ధుడికి చాలా సిద్ధులు వచ్చి చేరుతాయి

శ్రీద్ధవ ఉవాచ
కయా ధారణయా కా స్విత్కథం వా సిద్ధిరచ్యుత
కతి వా సిద్ధయో బ్రూహి యోగినాం సిద్ధిదో భవాన్

అసలు ధారణ అంటే ఏమిటి, సిద్ధి అంటే ఏమిటి, ఎన్ని సిద్ధులు ఉన్నాయి. యోగులకు సిద్ధులను నీవే కదా ఇస్తావు. వాటి వివరాలు నాకు చెప్పు.

శ్రీభగవానువాచ
సిద్ధయోऽష్టాదశ ప్రోక్తా ధారణా యోగపారగైః
తాసామష్టౌ మత్ప్రధానా దశైవ గుణహేతవః

ధారణా యోగం తెలుసుకున్న వారు చెప్పినవి పద్దెనిమిది సిద్ధులు. ఇందులో ఎనిమిది మాత్రం నా ప్రాధాన్యం గలవి. మిగిలిన పది ప్రకృతి సంబంధం గలవి.

అణిమా మహిమా మూర్తేర్లఘిమా ప్రాప్తిరిన్ద్రియైః
ప్రాకామ్యం శ్రుతదృష్టేషు శక్తిప్రేరణమీశితా

అణిమా మహిమా మూర్తి లఘిమా ప్రాప్తీ ప్రాకామ్యం ( విన్న దానిలో చూచిన దానిలో ),  శక్తిప్రేరణం ఈశితా
అనుకున్న దాన్ని పొందగలుగుట, గుణముల యందు ఆసక్తి లేకుండా ఉండుట, మనసును తన వశములో చేసుకొనుట, తాను చూసిన దాన్నీ విన్న దాన్ని పొందగలుగుట

గుణేష్వసఙ్గో వశితా యత్కామస్తదవస్యతి
ఏతా మే సిద్ధయః సౌమ్య అష్టావౌత్పత్తికా మతాః

వశితా, దేన్ని కోరితే దాన్ని పొందుట. ఈ ఎనిమిదీ నా సిద్ధులు. ఇవి సహజముగా వచ్చే సిద్ధులు.

అనూర్మిమత్త్వం దేహేऽస్మిన్దూరశ్రవణదర్శనమ్
మనోజవః కామరూపం పరకాయప్రవేశనమ్

శరీరములో ఉండవలసిన ఊర్ములు (అశనమూ పిపాస శొక మోహము జరా రోగం)  లేకుండా పోవుట (ఉదాహరణకు సనకాదులూ నారదుడు), దూరముగా ఉన్నదాన్ని వినగలుగుటా చూడగలుగుట, మనోవేగముతో వెళ్ళగలుగుట, పరకాయ ప్రవేశం, అనుకున్న చోటికి వెళ్ళగలుగుట,

స్వచ్ఛన్దమృత్యుర్దేవానాం సహక్రీడానుదర్శనమ్
యథాసఙ్కల్పసంసిద్ధిరాజ్ఞాప్రతిహతా గతిః

దేవతల క్రీడలను ఇక్కడ నుంచే చూడగలుగుట, అనుకున్నది అనుకున్నట్లు సిద్ధించుట, తన ఆజ్ఞ్యను ఎవరూ కాదనకుండా ఉండగలుగుట,

త్రికాలజ్ఞత్వమద్వన్ద్వం పరచిత్తాద్యభిజ్ఞతా
అగ్న్యర్కామ్బువిషాదీనాం ప్రతిష్టమ్భోऽపరాజయః

త్రికాలజ్ఞ్యం, శీతోష్ణాలు బాధించకుండా ఉండగలుగుట, ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలియుట, అగ్ని స్తంభం, జల స్తంభం,వాయు స్తంభ, విషాదుల స్తంభం, దేనితోనూ ఓడిపోకుండా ఉండగలుగుట

ఏతాశ్చోద్దేశతః ప్రోక్తా యోగధారణసిద్ధయః
యయా ధారణయా యా స్యాద్యథా వా స్యాన్నిబోధ మే

ఇవన్నీ యోగ ధారణ వలన వచ్చే సిద్ధులు. ఏ ధారణ చేస్తే ఏ సిద్ధి కలుగుతుందో చెబుతాను విను.

భూతసూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయేన్మనః
అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ

పరమాత్మ భూత సూక్ష్మాత్మ. అటువంటి నాయందు అదే రీతిలో తన్మాత్రాత్మకమైన మనసును ధ్యానం చేస్తే అణిమ సిద్ధిస్తుందు. సూక్ష్మావస్థలో ఉన్న భగవానున్ని సూక్ష్మావస్థలో ఉన్న మనసుతో ధ్యానం చేస్తే "అణిమ" (సూక్షం) అవుతాము.
నన్ను వదలిపెట్టి భూత తన్మాత్రలను ఉపాసన చేస్తే అణిమా సిద్ధి కలుగుతుంది

మహత్తత్త్వాత్మని మయి యథాసంస్థం మనో దధత్
మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్పృథక్

మహత్ స్వరూపములో మనసు ఉంచితే మహిమ సిద్ధి లభిస్తుంది.

పరమాణుమయే చిత్తం భూతానాం మయి రఞ్జయన్
కాలసూక్ష్మార్థతాం యోగీ లఘిమానమవాప్నుయాత్

నేను పరమాణు మయున్ని కాబట్టి, అటువంటి నా యందు మనసు లగ్నం చేస్తే, కాలం యొక్క సూక్ష్మార్థత్వాన్ని ధ్యానం చేసినందు వలన లఘిమ అవుతాడు,.

ధారయన్మయ్యహంతత్త్వే మనో వైకారికేऽఖిలమ్
సర్వేన్ద్రియాణామాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః

సాత్వికమైన అహం తత్వములో మనసు లగ్నం చేస్తే, సకల ఇంద్రియ ఆత్మత్వం యొక్క ప్రాప్తి లభిస్తుంది.

మహత్యాత్మని యః సూత్రే ధారయేన్మయి మానసమ్
ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విన్దతేऽవ్యక్తజన్మనః

సూత్రాత్మలో మనసును ధ్యానం చేస్తే ప్రాకామ్యం (అనుకున్నవి పొందుట) పారమేష్ఠ్యం వస్తుంది

విష్ణౌ త్ర్యధీశ్వరే చిత్తం ధారయేత్కాలవిగ్రహే
స ఈశిత్వమవాప్నోతి క్షేత్రజ్ఞక్షేత్రచోదనామ్

కాల స్వరూపుడైన పరమాత్మ యందు మనసు ఉంచితే జగత్తు యొక్క శాసకత్వాన్ని పొందుతాడు. క్షేత్ర క్షేత్రజ్ఞ్య చోదనాన్ని పొందుతాడు.

నారాయణే తురీయాఖ్యే భగవచ్ఛబ్దశబ్దితే
మనో మయ్యాదధద్యోగీ మద్ధర్మా వశితామియాత్

పరమాత్మగా భగవంతునిగా నారాయణునిగా తురీయావస్థను ధ్యానం చేస్తే అన్నిటినీ తన వశములో ఉంచుకునే స్థిత్ని పొందుతాడు


నిర్గుణే బ్రహ్మణి మయి ధారయన్విశదం మనః
పరమానన్దమాప్నోతి యత్ర కామోऽవసీయతే

నిర్గుణమైన పరబ్రహ్మ యందు మనసు ఉంచితే అన్ని కోరికలూ నశించే పరమానందాన్ని  పొందుతాడు

శ్వేతద్వీపపతౌ చిత్తం శుద్ధే ధర్మమయే మయి
ధారయఞ్ఛ్వేతతాం యాతి షడూర్మిరహితో నరః

శ్వేత ద్వీపనులో ఉండే పరిశుద్ధుడూ ధర్మ మయుడూ ఐన పరమాత్మను ధారణ చేస్తే తాను కూడా శ్వేతత్వాన్ని పొందుతాడు. అక్కడ ఆరు ఊరుములూ ఉండవు. అక్కడ ఉందే ఋషులకు ఆకారమే ఉండదు. వారికి ఇంద్రియాలే ఉండవు. అపుడు వారికి ఆకలీ దప్పీ శోకమూ మోహమూ జరా రోగమూ ఉండదు. శ్వేతద్వీపానికి నారాయణుడు వెళుతుంటే, వెనక నారదుడు వస్తూ ఉంటే నారదున్ని బయట ఉంచి స్వామి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఉన్నవారికి ఆకారం లేదు. వారికి విఘాతం కలుగుతుంది అని స్వామే నారదున్ని బయట ఉంచాడు.

మయ్యాకాశాత్మని ప్రాణే మనసా ఘోషముద్వహన్
తత్రోపలబ్ధా భూతానాం హంసో వాచః శృణోత్యసౌ

ఆకాశ రూపుడైన నాయందు ప్రాణ ఘోషను ఉంచి ధ్యానం చేస్తే ఆకాశములో ఉన్న ప్రతీ ప్రాణి సంబాషణనూ అర్థం చేసుకోగలడు.

చక్షుస్త్వష్టరి సంయోజ్య త్వష్టారమపి చక్షుషి
మాం తత్ర మనసా ధ్యాయన్విశ్వం పశ్యతి దూరతః

చక్షు ఇంద్రియాన్ని త్వష్టలోనూ, ఆ త్వష్టను చక్షువులోనూ, ఆ చక్షువు ఉన్న నన్ను ధ్యానం చేస్తే దూరదర్శనం వస్తుంది. ఉన్న చోటున ఉండి ప్రపంచాన్ని చూడవచ్చు. కన్నును సూర్యుడిలోనూ, మళ్ళీ సూయున్న్ని చక్షు ఇంద్రియములో పెట్టి, ఆ సూయునిలో దహరాకాశములో నేత్రములో, ఏకరూపముతో ఉన్న పరమాత్మను ధ్యానం చేస్తే జగత్తు అంతా కనపడుతుంది.

మనో మయి సుసంయోజ్య దేహం తదనువాయునా
మద్ధారణానుభావేన తత్రాత్మా యత్ర వై మనః

మనసును నా యందు ఉంచి దానితోనే, వాయువుతో దేహాన్ని మనసును అనుసరించి ప్రేరేపించి, మనసును నా యందే ధారణ ఉంచి దాన్ని అనుసరిస్తే, ఎక్కడ మనసు ఉంటుందో అక్కడకు ఆత్మను కూడా పంపగలిగితే ఆ మనసును తాను తీసుకుని ఏ రూపం కావాలి అని మనసుతో భావిస్తే ఆ రూపం పొందగలుగుతారు,

యదా మన ఉపాదాయ యద్యద్రూపం బుభూషతి
తత్తద్భవేన్మనోరూపం మద్యోగబలమాశ్రయః

నాయోగ బలాన్ని ఆశ్రయించి ఆయా రూపాన్ని పొందుతాడు

పరకాయం విశన్సిద్ధ ఆత్మానం తత్ర భావయేత్
పిణ్డం హిత్వా విశేత్ప్రాణో వాయుభూతః షడఙ్ఘ్రివత్

పరకాయం అంటే, ఏ స్వరూపాన్ని కావాలనుకుంటున్నామో ఆత్మను అక్కడ ధ్యానం చేసి, ఈ మాంస పిండాన్ని (శరీరాన్ని) వదలి, వాయు స్వరూపన్ని పొంది, తుమ్మెదలగా, ఇంకో మాంస పిండాన్ని ఆశ్రయించాలి. ఇలా  ఎన్ని శరీరాలైనా మారవచ్చు

పార్ష్ణ్యాపీడ్య గుదం ప్రాణం హృదురఃకణ్ఠమూర్ధసు
ఆరోప్య బ్రహ్మరన్ధ్రేణ బ్రహ్మ నీత్వోత్సృజేత్తనుమ్

మడిమతో మూలాధారాన్ని నొక్కిపెట్టి హృత్ ఉరమూ కంఠమూ మూర్ధ యందు ప్రాణ వాయువు నిలిపి, బ్రహ్మ రంధ్రముతో ప్రాణ వాయువును తీసుకుని శరీరాన్ని విడిచిపెట్టవచ్చు.

విహరిష్యన్సురాక్రీడే మత్స్థం సత్త్వం విభావయేత్
విమానేనోపతిష్ఠన్తి సత్త్వవృత్తీః సురస్త్రియః

ఒక వేళ అలా బయటకు వెళ్ళినపుడు నా దగ్గరకు రావాలి అనుకోకుండా విహరించాలి అనుకుంటే, నా యందు ఉన్న మనసును కొంచెం విడిగా ధ్యానం చేస్తే ఎవరు కావాలంటే వారు వస్తారు, అన్ని సాత్విక వృత్తులూ చుట్టూ చేరి సేవిస్తాయి

యథా సఙ్కల్పయేద్బుద్ధ్యా యదా వా మత్పరః పుమాన్
మయి సత్యే మనో యుఞ్జంస్తథా తత్సముపాశ్నుతే

బుద్ధితో ఏది సంకల్పిస్తే అది, లేదా నాయందే మనసు ఉంచితే, సత్యం ఐన నన్ను పొందుతారు

యో వై మద్భావమాపన్న ఈశితుర్వశితుః పుమాన్
కుతశ్చిన్న విహన్యేత తస్య చాజ్ఞా యథా మమ

ఇలాంటి వాడు ధ్యానముతో నా భావన్ని పొంది, నేనే సర్వ నియంతను కాబట్టి, ఇలాంటి నా స్వరూపాన్ని చేరితే వాడికి దేనినుండీ ఎటువంటి విఘాతం కలుగదు. అతని ఆజ్యను ఎవరూ కాదనలేరు. నా ఆజ్ఞ్యను పరిపాలించినట్లుగా అతని ఆజ్ఞ్యను కూడా అందరూ పరిపాలిస్తాడు

మద్భక్త్యా శుద్ధసత్త్వస్య యోగినో ధారణావిదః
తస్య త్రైకాలికీ బుద్ధిర్జన్మమృత్యూపబృంహితా

నా భక్తితో పరిశుద్ధమైన సత్వం గల యోగికి ధారణ బాగా తెలిసిన వాడికి, త్రికాలజ్ఞ్యానం కలుగుతుంది.

అగ్న్యాదిభిర్న హన్యేత మునేర్యోగమయం వపుః
మద్యోగశాన్తచిత్తస్య యాదసాముదకం యథా

ఇలాంటి ముని యొక్క యోగ శరీరాన్ని అగ్న్యాదులు కూడా కాల్చలేవు. నా యోగములో అలసిపోయిన మనసు గలవాడై

మద్విభూతీరభిధ్యాయన్శ్రీవత్సాస్త్రవిభూషితాః
ధ్వజాతపత్రవ్యజనైః స భవేదపరాజితః

నా విభూతులన్నీ ధ్యానం చేస్తూ, నా మణీ శ్రీవత్సం శంఖ చక్ర గదా ఖడ్గాలతో అలంకరించబడిన నా విభూతులను, ద్వజములూ ఆతపత్రమూ వ్యజనములూ, వీటితో కూడా అతను ఓడిపోడూ.

ఉపాసకస్య మామేవం యోగధారణయా మునేః
సిద్ధయః పూర్వకథితా ఉపతిష్ఠన్త్యశేషతః

ఇలా నన్ను యోగ ధారణతో ఉపాసించేవారికి ఎన్నో సిద్ధులు వచ్చి చేరతాయి. సంపూర్ణముగా అన్ని సిద్ధులూ వచ్చి చేరతాయి.

జితేన్ద్రియస్య దాన్తస్య జితశ్వాసాత్మనో మునేః
మద్ధారణాం ధారయతః కా సా సిద్ధిః సుదుర్లభా

ఇంద్రియ ప్రాణ మనో జయం ఉండి నన్నే ధారణ చేసే వారికి లభించని సిద్ధి ఏముంది

అన్తరాయాన్వదన్త్యేతా యుఞ్జతో యోగముత్తమమ్
మయా సమ్పద్యమానస్య కాలక్షపణహేతవః

ఐతే ఇవేవో గొప్ప కార్యములు అని మాత్రం అనుకోకండి. నన్ను ధ్యానించేవారు దీన్ని అంతరాయముగా భావిస్తారు. నా మీద ధారణ ఉంచిన వారికి ఇలా లభించేవన్నీ సిద్ధులు కావు, విఘ్నాలు.
ఇవన్నీ కాలక్షేపం కోసం పనికొచ్చేవి

జన్మౌషధితపోమన్త్రైర్యావతీరిహ సిద్ధయః
యోగేనాప్నోతి తాః సర్వా నాన్యైర్యోగగతిం వ్రజేత్

ఇలా ఎన్ని సిద్ధులు ఉన్నాయో, అన్ని రకముల సిద్ధులూ యోగముతో పొందుతారు. యోగములతో అన్నిటినీ  పొందవచ్చు గానీ వేరేవాటిని యోగముతో పొందలేము

సర్వాసామపి సిద్ధీనాం హేతుః పతిరహం ప్రభుః
అహం యోగస్య సాఙ్ఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినామ్

అన్ని సిద్ధులకూ నేనే హేతువునూ ప్రభ్వునూ పతినీ. యోగమునకూ సాంఖ్యమునకూ ధర్మమునకూ బ్రహ్మవాదులకూ నేనే ఆత్మనూ అంతరమూ బాహ్యమూ.

అహమాత్మాన్తరో బాహ్యోऽనావృతః సర్వదేహినామ్
యథా భూతాని భూతేషు బహిరన్తః స్వయం తథా

ఆవరించబడీ నేనే ఉంటాను, ఆవరణ లేకుండా కూడా నేనే ఉంటాను. అంతర్బహిస్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ప్రాణులలో ప్రాణులు లోపలా బయటా ఉన్నట్లుగా నేను కూడా అన్నిటిలో లోపలా బయటా ఉంటాను. సిద్ధుల చేత మోహించబడితే నా దగ్గరకు తొందరగా రాలేరు

శ్రీద్ధవ ఉవాచ
త్వం బ్రహ్మ పరమం సాక్షాదనాద్యన్తమపావృతమ్
సర్వేషామపి భావానాం త్రాణస్థిత్యప్యయోద్భవః

స్వామీ , నీవే సాక్షాత్ బ్రహ్మవూ, ఆద్యంతములు లేనివాడవు, ఏ దాపరికములూ లేనివాడవు. అన్ని భూతములకూ

ఉచ్చావచేషు భూతేషు దుర్జ్ఞేయమకృతాత్మభిః
ఉపాసతే త్వాం భగవన్యాథాతథ్యేన బ్రాహ్మణాః

అన్ని భావనలకూ నీవే రక్షణమూ స్థితీ ప్రళయమూ, నీవే సృష్టి. హెచ్చు తగ్గులుగా ఉండే అన్ని భూతములలో ఉండే నిన్ను మనో నిగ్రహం లేని వారు తెలియజాలరు. నిన్ను ఉన్నదున్నట్లుగా బ్రహ్మ జ్ఞ్యాన సంపన్నులు మాత్రమే ఉపాసించగలరు

యేషు యేషు చ భూతేషు భక్త్యా త్వాం పరమర్షయః
ఉపాసీనాః ప్రపద్యన్తే సంసిద్ధిం తద్వదస్వ మే

పరమ ఋషులు భక్తితో నిన్ను ఏ ఏ భావనతో ఉపాసిస్తారో ఏ ఏ భావాలతో ఉపాసిస్తే సిద్ధి పొందుతారో నాకు ఆ విధానాన్ని వివరించు

గూఢశ్చరసి భూతాత్మా భూతానాం భూతభావన
న త్వాం పశ్యన్తి భూతాని పశ్యన్తం మోహితాని తే

నీవు ప్రతీ ప్రాణిలో అంతర్యామిగా రహస్యముగా సంచరిస్తావు. నిన్ను ఏ ప్రాణులూ చూడలేవు. నీవు మాత్రం అన్నిటినీ మోహ్సితావూ, అన్నిటినీ చూస్తావు.

యాః కాశ్చ భూమౌ దివి వై రసాయాం విభూతయో దిక్షు మహావిభూతే
తా మహ్యమాఖ్యాహ్యనుభావితాస్తే నమామి తే తీర్థపదాఙ్ఘ్రిపద్మమ్

నీవు మహావిభూతివి. భూమిలో ఆకాశములో రసాతములో నీ ఏ ఏ విభూతులున్నాయో అవి ఎక్కడెక్కడ ఏ రూపములో ఎలా ఉన్నాయి. పరమ పావనమైన నీ పాదపద్మములకు నమస్కారం చేస్తాను. అవి అన్నీ నాకు వివరించండి. (ఇదే భగవత్గీతలో విభూతి యోగం)

                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు